Feb 22, 2020

మంత్రి మండలి ఉపసంఘం – సిట్
v గత టీడీపీ  ఐదేళ్ల పాలనలో జరిగిన అవకతవకలు విచారించేందుకు వైసీపీ జగన్ ప్రభుత్వం సిట్ (SIT - స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ –ప్రత్యేక దర్యాప్తు బృందం)ని (జీఓ నెం344. తేది 20.02.2020) నియమించింది.
v   ‘‘రాష్ట్ర విభజన తర్వాత... నవ్యాంధ్ర అభివృద్ధిపై ప్రభావం చూపించేలా తీసుకున్న ప్రధాన విధానాలు, ప్రాజెక్టులు, పథకాలు, ఏర్పాటు చేసిన సంస్థలు (కార్పొరేషన్లు, సొసైటీలు, కంపెనీలు మొదలైనవి), ఇతర కీలకమైన పరిపాలనా నిర్ణయాలపై 2019 జూన్‌ 26వ తేదీన(జీఓ నెం.1411)
 
 మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఈ కమిటీ తన తొలి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
మంత్రి మండలి ఉపసంఘం సభ్యులు
v 1.బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి
v 2.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
v 3.కురసాల కన్నబాబు
v 4.అనిల్ కుమార్ యాదవ్
v 5.మేకపాటి గౌతమ్ రెడ్డి
v 6. మన్మోహన్ సింగ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ

v సీఆర్డీయే పరిధిలో భూముల కేటాయింపుతో సహా పలు ప్రాజెక్టుల్లో విధాన, న్యాయ, ఆర్థిక పరమైన అవకతవకలను, మోసపూరిత లావాదేవీలను గుర్తించింది. దీనిపై నిశితంగా చర్చించిన తర్వాత... ఈ మొత్తం వ్యవహారంపై ఒక ప్రత్యేక ఏజెన్సీతో దర్యాప్తు చేయాలని నిర్ణయించినట్లు ఆ జీవోలో పేర్కొన్నారు.
v  గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ అంశాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని స్పీకర్‌ కూడా ప్రభుత్వాన్ని ఆదేశించారని గుర్తు చేశారు.
v  గత ఐదేళ్ల పాలనలో హద్దులులేని అవినీతి జరిగిందని, 2014 డిసెంబర్‌ 30 రాజధాని ప్రకటనకు ముందు చంద్రబాబు, గత మంత్రులు, శాసనసభ్యులు, బినామీలు, కారు డ్రైవర్లు, ఇంట్లో పనిచేసే వారిపై భూములు కొనుగోలు చేశారని  మంత్రి మండలి ఉపసంఘం నివేదికలో పేర్కొన్నట్లు రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు.

v సిట్‌లో సభ్యులు
1.కొల్లి రఘురామ్‌ రెడ్డి, ఇంటెలిజెన్స్‌ డీఐజీ. (సిట్‌ అధిపతి)
2.బాబూజీ అట్టాడ, విశాఖ ఎస్పీ
3.సీహెచ్‌ వెంకట అప్పలనాయుడు,
4..శ్రీనివాస రెడ్డి, కడప అదనపు ఎస్పీ
5.జయరామరాజు, ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ
6.విజయ భాస్కర్‌- విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ
7.ఎం. గిరిధ ర్‌, ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ
8.కెన్నడీ, ఏలూరు రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌
9. శ్రీనివాసన్‌, ఇన్‌స్పెక్టర్‌ (నెల్లూరు జిల్లా)
10.వి. రాజశేఖరరెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ (గుంటూరు జిల్లా)
సిట్ కు ప్రత్యేక అధికారాలు
v డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్‌ కు ఏ వ్యక్తినైనా/అధికారినైనా పిలిపించి విచారించే అధికారం అప్పగించారు.  
v    వారు లక్ష్యంగా  చేసుకున్న కొందరు వ్యక్తులను విచారించి  ఇరుకున పెట్టేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.
v   ఈ సిట్‌కు ప్రత్యేకంగా పోలీసు స్టేషన్‌హోదా కల్పించడం గమనార్హం. దీని ఉద్దేశం ఏమిటనే అంశంపైనా చర్చ జరుగుతోంది.


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...