Feb 19, 2020

టీడీపీ ప్రజాచైతన్య యాత్రలు 45 రోజులు


టీవీ 24X7 - తేదీ: 19.02.2020 బుధవారం ఉదయం 7.30 గం. నుంచి
అంశాలు :   టీడీపీ ప్రజాచైతన్య యాత్రలు 45 రోజులు -    యాంకర్ :  వెంకటకృష్ణ

ప్రశాంత కిషోర్ కొత్త ఫార్మలా – దేశంలో విభజన ఫార్మలా

పాతూరి నాగభూషణం – బీజేపీ
యాత్ర చేయవలసిన ఛాన్స్ ప్రతిపక్షాలకు ఇచ్చినట్లు కనిపిస్తోంది. 151 మంది ఎమ్మెల్యేలు – నవరత్నాలు – ఆటోవాళ్లు 4.5 లక్షల మంది ఉన్నారు. 1.20 లక్షల మందికి ఇచ్చామన్నారు. 75వేల మందికే ఇచ్చారు. నాయి బ్రాహ్మణులకు ఇవ్వలేదు. అమ్మఒడి అందరికీ చేరలేదు. రాజధాని, కౌన్సిల్, శాండ్ పాలసీ... వంటివి అనవసరమైన విషయాలు. ఇప్పుడు ఇసుక దొరుకుతుంది. కట్టేవాడు లేడు. గతంలో 1200 ఉన్న ట్రాక్టర్ ఇప్పుడు 6 వేలు అవుతుంది. లిక్కర్ రేట్లు పెంచారు. మందుతాగేవారు బయటపడపోవచ్చు. రేషన్ కార్డులు తీసివేశారు. పెన్షన్ తీసివేశారు. దేవాలయ భూములు, హిందూ దేవాలయాలపై దాడులు. ప్రభుత్వ బాధ్యత తీసుకోవాలి. స్వామిజీల ధర్నా. ఇద్దరు స్వామీజీల మధ్య తగాదా. ఇవన్నీ కూడా చంద్రబాబుకు – పదివేల కోట్లు ఖర్చు పెట్టి రాజధానిని మార్చడం మంచి పద్దతి కాదు. చాలా మందికి జీతాలు రావడంలేదు. అభివృద్ధి ఆగిపోయింది. రిజిస్ట్రేషన్లు లేవు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయింది. మరో పక్క సంక్షేమ పథకాల గ్రాఫ్ పెరిగిపోతోంది. ఈ రెండిటి మధ్య గ్యాప్ చాలా వస్తుంది. అప్పు కూడా ఇవ్వరు. రాజధాని ఇంచి కూడా కదలదు. మా ప్రయత్నం మేం చేస్తున్నాం. జగన్మోహన రెడ్డి గారు రియలైజ్ అవుతారు. రాంగ్ స్టెప్ అని వెనక్కి తీసుకుంటారని నమ్మకం ఉంది. ఆయన బిజినెస్ మేన్. ఈ రోజు చంద్రబాబుకు జరిగిన విధంగానే రేపు జగన్ కు జరుగుతుంది. శివుడికి మూడో కన్ను ఉంటుంది. ఆ మూడో కన్నే తృతీయ ఫ్రంట్  బీజేపీ, జనసేన. చెడ్డవారి కోసమే 3వ కన్ను తెరుస్తుంది.
ఇసక మట్టితో వారు మట్టికొట్టుకుపోయారు. గుంటూరు వెళ్లండి. ఇసుక ట్రాక్టర్ ని ఆపి అడగండి. ఆరు వేలు అని చెబుతారు. చిన్నచిన్నవారు ఇల్లు కట్టుకునే పరిస్థితిలేదు. 151 సీట్లు ఇస్తే అధికారపక్షంగా వారు ఫెయిలయ్యారు. ప్రతిపక్షంగా టీడీపీ ఫెయిల్ అయింది. టీడీపీ వారు 5 ఏళ్లు అతి వృష్టి. గ్రాఫిక్స్. పోలవరం ఆలస్యంగా మొదలుపెట్టారు. వీళ్లు అనావృష్టి. అభివృద్ధి లేదు. వాళ్లు 7 లక్షల కోట్లు తెచ్చామన్నారు. వైసీపీ వారు 9 నెలల నుంచి ఏం తెచ్చారు. దేనికి డీపీఆర్ ఇచ్చారు? ఆయన వినతి పత్రం అప్లికేషన్ లాంటిది. రాష్ట్రానికి కేంద్రం చేయడానికి అవకాశం ఉంది.
అమరావతి విషయంలో కేంద్రం చర్యలు తీసుకుంటుంది. అమరావతి రాజధానిగా ఉండాలని మా పార్టీ తరపున కేంద్రానికి పంపాం. రాజధాని ఎందుకు మారుస్తున్నారో వైసీపీవారు ఇంతవరకు చెప్పలేదు. నిర్మాణానికి మేం డబ్బు ఇచ్చాం. రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అని చెప్పింది కేంద్రం, కానీ మార్చే హక్కు ఉందని చెప్పలేదు. శంకుస్థాపన చంద్రబాబు గారు చేయలేదు. మోడీ గారు చేశారు.
అహంభావం పతనానికి నాంది. ప్రశాంత కిషోర్ పనికిమాలిన వ్యక్తి. ఆయన విధానాలు ఫెయిల్యూర్ కు నాంధి పలుకుతుంది.

శివశంకర్ – జనసేన
ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రభుత్వం పరిపాలనలో తడబడింది. తప్పటడుగులు వేస్తుంది. ప్రభుత్వంపై వ్యతిరేకతని తనకి అనుకూలంగా మలచుకోవడం కోసం ఆయన వెళుతున్నారు. బీజేపీ, జనసేన తృతీయ శక్తిగా బలపడుతున్నాయి. భవిష్యత్ లో తన పార్టీని బలపరుచుకోవడానికి ఆయన జనంలోకి వెళుతున్నారు. త్రిముఖ వ్యూహంతో వెళుతున్నారు. విశాఖలో మేం లాంగ్ మార్చి లక్షలాధి మంది వచ్చారు. కర్నూలులో కూడా జనం వచ్చారు. పవన్ ఎక్కడకు వెళ్లినా జనం వస్తున్నారు. ప్రశాంత కిషోర్ ఒక సామాజిక ఉగ్రవాది. ప్రజల మధ్య ఎలా పొరపొచ్చాలు పెట్టాలి, ఇతర పార్టీలను ఎలా కిల్ చేయాలి వంటి విషయాలలో ఆయన సిద్ధహస్తుడు. ఆయన వద్ద నెగిటివ్ ఓరియంటెడ్ ప్లాన్ ఉంటుంది. భారతదేశంలో రాజకీయ పార్టీలలో వారికి వ్యూహకర్తలు లేరు. బయట నుంచి సలహాదారుడిని తెచ్చుకొని ఎజండా, ఎలా మాట్లాడాలో నిర్ణయించండి అని అడగటం ఎంద దురదృష్టం. దేశంలో రాజకీయాలు క్షీణ దశలో ఉన్నాయి.  ఐటీ రైడ్స్ పై వివరణ ఇవ్వవలసి ఉంది. నీతిమంత రాజకీయాలు మాట్లాడేటప్పుడు వివరణ ఇస్తే తప్పేముంది.
రాజధాని అంశం కోర్టు పరిధిలోకి వెళ్లింది. అందువల్ల మాట్లాడకూడదు. మొదటిసారిగా ఈ అంశంలో కేంద్రాన్ని కూడా పార్టీని చేశారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది. కేంద్రం ఇప్పుడు తన అఫిడవిట్ లో స్పష్టంగా చెబుతుంది.
ప్రశాంత కిషోర్  గాంధీవైపా – గాడ్సే వైపా అని అనడం దుర్మార్గం. దేశ చరిత్ర, జాతీయ ఉద్యమంపై ఆయనకు అవగాహన ఉందా? గాడ్సే ఏ రకంగా లీడర్? గాంధీ – గాడ్సే అని బాబా సాహేబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారు. ఈ దేశ నిర్మాణంలో, పరిణామ దశలో కీలక పాత్ర పోషించిన అంబేద్కర్ గారిని గాంధీ గారితో పోల్చాలి. ప్రశాంత కిషోక్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. హీ ఈస్ ఆఫ్ట్రల్ కన్స ల్టెంట్. డబ్బులిస్తే పని చేసేవాడు. ఆయన సీఎం చేయడం ఏమిటి, పీఎంని చేయడం ఏమిటి? ఆయనే ఒక పార్టీ పెట్టి పీఎం అవమనండి. కన్స ల్టెంట్ రూపంలో ఉన్న సమాజిక ఉగ్రవాది. 2019లో ఎన్నికలకు ముందు ఆయన వ్యూహ రచన అంతా నా వద్ద ఉంది. అందువల్లే ఆ పదం వాడాను. డేంజరస్ థ్రెట్ టు ది ఇండియన్ డెమోక్రసీ.
25 ఎంపీలు ఇస్తే కేంద్ర మెడలు వంచుతానని చెప్పి ఈ రోజు నడం వంచుతున్న వైఎస్ జగన్ గారిని అడగాలి ఈ ప్రశ్న. మోడలు వంచుతానని నడుం వంచుతున్నాడు. ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేసి నడుం వంచుతున్నారు. జనసేనకు స్పష్టత ఉంది. విధానం ఉంది.

విక్రమ్ పూల – సీనియర్ జర్నలిస్ట్
ప్రజా వ్యతిరేకత, పొలిటికల్ మైలేజీ కోసం ఇటువంటి యాత్ర చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్క క్షణం కూడా తీరిక ఉండదు. కార్యకర్తలకు పని పెడతారు. ఆయన ప్రజల్లోకి వెళ్లడాన్ని తప్పు పట్టవలసిన అవసరంలేదు. సమస్యలు తీసుకొని ఆయన జనంలోకి వెళుతున్నారు. జిల్లాలలో నాయకులు, కార్యకర్తలు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి, నాయకులను పరిశీలించడానికి, మార్పుల కోసం ఆయన వెళుతున్నారు. ప్రజా స్పందన చూడాలి.
తెలంగాణలో బ్రహ్మాండమైన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కేటీఆర్ చొరవతీసుకొని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నారు. అక్కడ ప్రతిపక్షాలు నామమాత్రం.  తెలంగాణకు, ఆంధ్రకు సంబంధంలేదు. ఏపీకి వెళ్లిన పెట్టుబడిదారులు తెలంగాణకు తిరిగి వస్తున్నారు. ఏపీలో రాజకీయ అశాంతి వల్ల పెట్టుబడులు పెట్టలేని పరిస్థితి. అక్కడ ప్రజలలో కూడా అశాంతి నెలకొని ఉంది. తెలంగాణలో ప్రశాంతంగా ఉంది. ఎన్నికల సందర్భంలో కాస్త ఉంటుంది. ప్రతిపక్షాలు పూర్తిగా చతికిలపడ్డాయి. వ్యవసాయ ఉత్పత్తులు బ్రాహ్మాండంగా పెరిగాయి. నీరు కూడా బాగా వెళుతుంది. ఏపీలో ఉత్పత్తి ప్రక్రియలేదు. అంతా రాజకీయమే.  ఒకరిని ఒకరు విమర్శించుకోవడమే.  తెలంగాణ ముందుకు దూసుకువెళుతోంది. ప్రశాంత కిషోర్ ఒక సామాజిక ఉగ్రవాది అనడం దురదృష్టకరం.
జనసేన, బీజేపీ కలయిక బేషరతుగా అని కన్నా చెప్పారు. జనసేక ఖండించలేదు. ఆ తరువాత పవన్ గారు అమరావతిని తరలించం అంటేనే కలిసినట్లు చెప్పారు. దానిని బీజేపీ ఖండించలేదు. ఎన్డీఏలోకి వైసీపీ చేరబోతుందని వార్తలు వచ్చాయి. బీజేపీ మాట్లాడలేదు. పవన్ మాత్రం వైసీపీ ఎన్డీఏలో కలిస్తే మేం బయటకు వస్తామని చెప్పారు. అది అప్రస్తుతం. జనసేనలో అస్పష్టత ఉన్నట్లుంది. ఏపీ డీసెంట్రలైజేషన్ బిల్లు కోర్టులో ఉంది.
ప్రశాంత కిషోర్ ని చాలా బ్యాడ్ గా టీడీపీ కూడా చూపుతోంది. బీహార్ లో నితీష్ కుమార్ సీఏఏ, ఎన్ ఆర్సీని మసర్ధించినందున ప్రశాంత కిషోర్ వారి నుంచి విడిపోయాడు. ఆయన యుఎస్ లో సుదీర్గ కాలం పని చేశారు. గుజరాత్ కు వచ్చి 2011లో మోడీతో పని చేశారు. 2014లో సీఏజీ (సిటిజన్స్ ఫర్ ఎకౌంటబుల్ గవర్నెన్స్) అనే సంస్థను పెట్టారు. ఎన్నికల వ్యూహాన్ని రివల్యూషనైజ్ చేశారు. మద్యం, డబ్బు, కులం, మతాన్ని వాడుకోవడం ఈ రోజు కొత్తగా రాలేదు. గాంధీ గారిని, అంబేద్కర్ గారిని ఓన్ చేసుకునే విధంగా సలహాలు ఇచ్చారు. దూరమైన వర్గాలను దగ్గర చేసుకోవడం వంటి అంశాలను కొన్న పార్టీలకు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఫలితాలు చూశాం. జాతీయ అంశాలపై కాకుండా రాష్ట్ర అంశాలపై దృష్టిపెట్టమని చెప్పారు. ఆయన చాలా సైంటిఫిక్ గా చేస్తున్నారు. ఆయన ఆషామాషీ వ్యక్తి కాదు. బీజేపీ మొదటి నుంచి గాంధీని వ్యతిరేకిస్తున్నారు.
గాంధీ-గాడ్సే అనేది డివిజన్ కాదు. ఈ రోజు గాంధీ-గాడ్సే ఆలోచనా విధానంలో ఏది కావాలని  ప్రశాంత కిషోర్ ప్రశ్నిస్తున్నారు. సీఏఏ, ఎన్ ఆర్సీని బలవంతంగా ఈ దేశ ప్రజలమీద రుద్దాలని చూస్తున్న బీజేపీని కట్టడి చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాదిపై ఉంది. అందువల్ల ఆయన ఆ స్లోగన్ ఇచ్చారు. గాంధీ వర్సెస్ గాడ్సే అని కాదు. ఆ ఇద్దరిలో ఎవరి భావజాలం కావాలని వారు చెబుతున్నారు.
ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఒక అవగాహనకు రావలసి ఉంది. చాలా మందికి స్పష్టత లేనందున ప్రశాంత కిషోర్ లాంటి వారి సేవలను వినియోగించుకుంటున్నారు. జనసేనకు ప్రజాధరణ ఉంది. వ్యూహాలు లేవు.

గౌతంరెడ్డి – వైసీపీ
చంద్రబాబు నాయుడు గారి నాటకంలో భాగమే ఈ చైతన్య యాత్ర. తరువాత అచైతన్యంగా బయటకి వస్తాడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రకంగా చవుదెబ్బ తిన్నారో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే దెబ్బ తగులుతుంది. అధికారంలో ఉన్నప్పుడూ, లేనప్పుడూ కూడా ఏదైనా సంఘటన జరిగితే దానిని దారి మళ్లించడానికి ఆయన ఇలాంటివి చేస్తుంటారు. ఈయన నాటకాలు ప్రజలు సంవత్సరాల తరబడి చూస్తున్నారు. మరోకసారి చతికిలబడటం ఖాయం.అంపశయ్య లేదా కాటికి వెళతారా అనేది తేలుతుంది.
అభివృద్ధి, సంక్షేమం ముందుకు తీసుకువెళ్లే క్రమంలో జలసీ వచ్చింది. అభివృద్ధి, సంక్షేమంపై దృష్టిపెట్టకుండా విమర్శలు చేస్తున్నారు. ఈర్య ఎక్కువైంది. జగన్ గారు పెన్షనర్లకు, ఇతరులకు ఎవరికీ అన్యాయం చేయరు. రాయలసీమలో పంటలు బాగా పండాయి. సస్యశ్యామలం అవుతుంది. గత ప్రభుత్వంలో ఇసుక ద్వారా రోజుకు కోటి రూపాయలు మంత్రి సంపాదిస్తున్నారని చెప్పాను. ఎవరూ బయటకు రాలేదు. ఇసుకలో అవినీతి లేదు. టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయండి. జగన్ గారు పారదర్శికంగా ఉన్నారు. సంక్షేమం అయిన తరువాత ఏ జిల్లాలో ఏ అభివృద్ధి చేయాలో ప్లాన్ ఉంది. టీడీపీ ప్రభుత్వంలో వేల కోట్లు పెట్టుబడులు వస్తాయని చెప్పారు. రాలేదు. పరిశ్రమలను ఆహ్వానించే ప్రభుత్వం ఇది. వచ్చి గ్రౌండ్ అయినవి ఏవీ పోలేదు.
శివశంకర్, నాగభూషణం గారు మాట్లాడేదానికి పసలేదు. పార్లమెంటులో రాజధాని రాష్ట్రం పరిధిలోనిదని స్పష్టంగా చెప్పారు. రాజధాని మార్పు విషయంలో బిల్లు పంపితే రాష్ట్రపతి ఆమోదిస్తారు.
ప్రశాంత కిషోర్ చేసిన వ్యూహాలన్నీ గతంలో వామపక్షాలు చేశాయి. ఇప్పడు వారు చతికిలపడ్డారు. అవన్నీ పాత ఫార్మలా. పాతవి ఈయన బయటకు తీస్తున్నారు. గాడ్సేకి గుడికడతామని బీజేపీ ఎంపీలు అన్నారు. గాంధీ గారిని బయటకులాగడం తప్పు. ఆయనకు మహాత్మా అని మనం ఆపాదించాం. సమాజంలో రెడ్లు, కమ్మ, దళితులు ఒక్కొక్కరు ఒక్కో పక్క ఉంటే సత్ సంబంధాలు ఎక్కడ ఉంటాయి. న్యాయం ఎక్కడ జరుగుతుంది. మహాత్మా గాంధీని మరొకరితో పోల్చడం తప్పు. కులాల మధ్య, రౌడీల మధ్య చిచ్చు పెట్టడం – రాజకీయాలకు ఆపాదించుకుంటున్నారు. అది తప్పు. ప్రశాంత కిషోర్ వల్ల తాత్కాలికంగా లాభపడతారు. ఆ తరువాత మనం ముందుకు వెళ్లాలి. అదే పని జగన్ గారు చేస్తున్నారు. ఆయన వ్యూహాలు అందరి వద్ద ఉంటాయి.
ప్రశాంత కిషోర్ కి బీజేపీ వాళ్లు బేండ్ ఏసేస్తారు.
బీజేపీకీ, జనసేనకు చక్కటి స్నేహసంబంధం కుదిరింది. వారు ప్రత్యేక హోదా అడగాలి కదా. మీరు చేయండి. గజమాల వేస్తాం.

గొట్టిపాటి రామకృష్ణ – టీడీపీ
ప్రభుత్వం పాలనను కొంతకాలం చూద్దాం అన్న రీతిలో టీడీపీ ఉంది. పాలనలో అనుభవంలేదు. ఇసుక కొరత వంట సమస్యలు – అన్నిటికన్నా కీలకమైన నిర్ణయం రాజధాని తరలింపు. రద్దు ప్రభుత్వం అన్నాక్యాంటిన్లు, నిరుద్యోగభృతి, పీపీఏల రద్దు – పోలవరం పనులు జరగడంలేదు. –రైతులకు 4వేల కోట్లు ఇవ్వాలి. ధాన్యం తోలుకొని 48 గంటల్లో రైతులకు డబ్బు చెల్లిస్తామన్నారు. ఇవ్వడంలేదు. 6 లక్షల పెన్షన్లు, 18 లక్షల తెల్ల రేషన్ కార్డులు తీసివేశారు. పెన్షన్ కు సంబంధించి వారు చెప్పిందివేరు చేస్తుందివేరు. ఉచితంగా ఇచ్చే ఇసుకను దోపిడీ చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఇసుక విషయంలో అధికారులనే పట్టుకున్నారు. అక్కడ వేయింగ్ మిషన్లు లేవు. వీటన్నటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లవలసిన బాధ్యత ఉంది. మేం లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అవి చెప్పకుండా ఐటి దాడులలో పీఏ వద్ద రూ.రెండు వేల కోట్లు దొరికిపోయాయన్నారు. 2 లక్షలు అని తెలిసిన తరువాత వాళ్లే ఏమీ మాట్లాడటంలేదు. నాలిక్కరుచుకున్నారు.  బొత్స గారు నేనట్ల అన్నానా అని అడుగుతున్నారు. ఈ విషయంపై టీడీపీ, చంద్రబాబు నాయుడు గారు స్పందించవలసిన అవసరం ఏముంది. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలు, ప్రత్యేక హోదాపై ప్రశ్నించని పరిస్థితి, రాజధానిపై పోలీసులతో ఉద్రిక్తత సృష్టించడం – నిన్న సీపీఎం ఎంపీలు వచ్చి అమరావతి ప్రాంతాన్ని చూసి ఇంత అభివృద్ధి జరిగితే ఇక్కడ నుంచి తరలించవలసిన అవసరం ఏమిటని వారు ప్రశ్నించారు.
ఈ 9 నెలల్లో విద్యుత్ మీద 1300 కోట్లు, ఆర్టీసీ మీద 700 కోట్లు... 47వేల కోట్ల రూపాయలు అప్పలు తీసుకువచ్చారు. ప్రజలపై 10వేల కోట్లు భారం వేశారు. పారిశుద్ధ్య కార్మికులకు 12 నుంచి 18వేలు చేస్తామని చెప్పారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంగారు అది కుదరదన్నా వినలేదు. ఈ రోజుకు ఇవ్వలేదు. జీఓ వచ్చి 6 నెలలైంది. డబ్బు ఇవ్వలేదు. ఇటువంటి చాలా ఉన్నాయి. పేదలకు ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్ లాక్కుంటున్నారు. భర్త చనిపోతే ఆ భూమి లాక్కున్నారు. ప్రజలలో అవసరం లేని ఆందోళనను రాజధాని ద్వారా పుట్టించారు. పరిపాలనా రాహిత్యంతో ఇసుక సమస్యను సృష్టించారు. మొండితనం, మూర్ఖత్వంతో ప్రజలలో అసహనాన్ని సృష్టిస్తున్నారు. పెట్టుబడులు మరో సబ్జెక్ట్. కోటి 80 లక్షల పెట్టుబడులు వెనక్కు పోయాయి.
ప్రజావేదికతో మొదలుపెట్టి అన్ని ధ్వంసం చేస్తున్నారు. అమరావతిలో రైతుల సమస్య పట్టించుకోవడంలేదు. పోలీసులతో అణుచుతున్నారు. వారికి రక్షణలేదు. వేలకోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా వస్తే వారికి రక్షణ ఉంటుందని గ్యారంటీ ఏముంది. కియా ఫ్యాక్టరీ యజమానిని వైసీపీ ఎంపీ బెదిరించారు. లలూ గ్రూప్ పోయింది.
అమరావతి విషయంలో కేంద్రం విధానం గురించి న్యాయస్థానం కరెక్ట్ గా ప్రశ్నించింది. లోక్ సభలో సమాధానం ఇచ్చారు. రాజధాని లేదని సీఎం అనడం, అవగాహనా రాహిత్యంతో ఏదో మాట్లాడేశారు. ఆయన గౌరవ ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి. అవగాహణ లేదు, అజ్ఞాని వంటి పదాలు వాడితే నాకు గౌరవం తగ్గుతుంది.  రాజ్యాంగంలో, చట్టంలో రాజధాని అనే పదమే ఉంది. రాజధానులు అని లేదు. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుందనేది ముఖ్యం.  ఇది రైతులు సమస్య కాదు, దేశ భవిష్యత్ సమస్య. మన దేశంలో ఇప్పటి వరకు 14 నుంచి 29 రాష్ట్రాలయ్యాయి. ఒక రాజధానిని 3 రాజధానులు చేయవచ్చని, రాజధానిని మార్చవచ్చు అని మొదటిసారిగా చర్చకు వచ్చింది. చర్చ లేవనెత్తింది జగన్ గారు. దీని విధివిధానాలు, నిబంధనలు వంటి విషయాలలో స్పష్టతలేదు. రేపు ప్రశాంత కిషోర్ లాంటి వారు వచ్చి రాష్ట్రాలు విడిపోయేవిధంగా రెచ్చగొడితే, గందరగోళం సృష్టిస్తే దేశ సమస్య అవుతుంది. కేంద్రం స్పందించాలి. భవిష్యత్ లో ఇటువంటి పరిస్థితి తలెత్తితే.... పార్లమెంటులో చర్చకు పెడతారా? లేదా ఇతరిత్రా చర్చ పెడతారా? అనేది ఒక నిర్ణయానికి రావలసిన అవసరం ఉంది. విభజన చట్టం ఏపీకి ఒక్క దానికే ఉంది.  విజిలెన్స్ కమిషనరేట్ కర్నూలుకు తరలింపు అంశంపై హైకోర్టు మాట్లాడింది.
ప్రశాంత కిషోర్‌కు రావలసిన దాని కంటే ఎక్కువ ప్రచారం వచ్చింది.  రాజకీయ పార్టీకి మనకంటూ వ్యూహం ఉండాలి. మన సిద్దాంతాలు ప్రచారం చేసుకోవాలి. ప్రైవేటు సంభాషణల్లో మాట్లాడేవి ఇక్కడ మాట్లాడలేను. నాయకులతో స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితిలేదు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...