Feb 10, 2020

ఏబీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్ పై డిబేట్

 టీవీ-ఏపీ 24X7 -తేదీ: 10.02.2020 సోమవారం ఉదయం 7.30 గం. నుంచి 8.56 వరకు
అంశాలు :  రాష్ట్ర ఇంటిలిజెన్స్ విభాగ మాజీ అధిపతి ఏబీ వెంకటేశ్వర రావు సస్పెండ్

గురుమూర్తి – టీడీపీ
           ఏబీ వెంకటేశ్వర రావు ఇంటిలిజెన్స్ చీఫ్ గా పని చేశారు. ఆ సమయంలో జగన్ గారు పదేపదే ఆయనపై ఫిర్యాదులు చేశారు. ఆయన వచ్చిన తరువాత వీఆర్ లో పెట్టారు. పోలీస్ శాఖలో పరికరాల కొనుగోలులో అవినీతి జరిగిందని చెబుతున్నారు. ఏ శాఖలోనైనా కొనుగోలుకు కమిటీలు ఉంటాయి. ఈ విషయంలో కూడా కమిటీ నిర్ణయం తీసుకున్నతరువాతే కొనుగోలు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత వీఆర్ లో పెట్టారు. ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఇది కక్ష సాధింపు చర్యేకదా. 200 మందిని వీఆర్ లో పెట్టారు.  జగన్ గారు వచ్చిన తరువాత కక్షతో వ్యవహరిస్తున్నారు. వీఆర్ మూడు నెలలు దాటితే జీతం ఇవ్వం అని, 6 నెలలు దాటితే అసాధారణ సెలవుగా ప్రకటిస్తామని ప్రభుత్వం చెబుతోంది. చిన్న చిన్న ఉద్యోగులు ఏవిధంగా బతుకుతారు. జగన్ గారు వచ్చిన తరువాత ఒక కుల కమ్మపై కక్షసాధింపుగా వ్యవహరిస్తున్నారు. అమరావతి విషయంలో గానీ మరే విషయంలో నైనా. గుంటూరు డీఎస్పీని సస్పెండ్ చేశారు. కృష్ణ కిషోర్ పట్ల కూడా కక్షసాధింపుగా వ్యవహరిస్తున్నారు. ఆయన ట్రిబ్యునల్ కు వెళ్లినప్పుడు అక్షింతలు వేసిన విషయం తెలిసిందే. ఆయన పాద యాత్ర చేసినప్పుడు ఎక్కడా చిన్న గొడవ కూడా జరుగకుండా రక్షణ కల్పించింది పోలీసులే కదా. కోడి కత్తి  సంఘటన కూడా ఎయిర్ పోర్ట్ లో జరిగింది.
అధికారులపై ఇంత పక్షపాతం. ఎల్పీ సుబ్రహ్మణ్యం గారిని ఎందుకు అలా వ్యవహరించారు. గ్రామాల్లో ప్రతిపక్షం వారు కేసులు పెడుతూ ఉంటే, పోలీసు అధికారులు అధికారం పక్షం వారిని పిలిపించి వారిపై కేసులు పెడుతున్నారు. అధికారులను అడిగితే పైనుంచి ఆదేశాలు అలా ఉన్నాయని చెబుతున్నారు. ఇది మంచి పద్దతి కాదు. కోర్టులు అక్షింతలు వేసినా పట్టించుకోవడంలేదు. ఎవరైనా తప్పు చేస్తే చర్యలు తీసుకోవలిందే. జగన్ గారి కక్షకు నిదర్శనం ప్రజావేదిక కూల్చడం.  గ్రామాల్లో ఎస్పీ, బీసీ, ఎస్టీ సర్పంచ్ లు పనులు చేయించారు. ఉపాధి హామీకి సంబంధించి పనులకు  2018-19లో కేంద్రం రూ.1840 కోట్లు పంపింది. వాటిని నవరత్నాలకు వాడుకున్నారు. పాత పనులకు డబ్బు ఇవ్వకుండా ఇప్పుడు చేసే పనులకు ఇస్తున్నారు. గతంలో శ్రీలక్ష్మి గారు అతిగా వెళితే ఏం జరిగిందో మనం చూశాం. కక్ష సాధింపు పనికిరాదు. భవిష్యత్ లో పతనానికే ఇది. చంద్రబాబు నాయుడు గారు అధికారులకు స్వేచ్ఛ ఇస్తారు. మేం అధికారంలో ఉన్నప్పుడు మా కార్యకర్తని అరెస్ట్ చేస్తే మేం అడ్డుకోలేకపోయాం. చంద్రబాబు గారు చట్టానికి ప్రాధాన్యత ఇస్తారు. జేసీ బ్రదర్స్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడరు. మాట్లాడతారు. వారికి చెబుతారు. విజయవాడలో కూడా అలా మాట్లాడితే  చంద్రబాబు నాయుడు గారు ఏలా చేశారో అందరూ చూశారు. ఎవరైనా టూమచ్ గా వెళితే చంద్రబాబు నాయుడు గారు ఖండిస్తారు.
అయితే జేసీ దివాకర్ రెడ్డి గారిని రాయలసీమలో పెట్టే హంస అటువంటిది. రివర్స్ టెండరింగ్ లో పదివేల కోట్లు నష్టం వచ్చే పరిస్థితి ఉంది. డబ్బులు తీసుకొని వైన్ షాపులలో మీరు నచ్చిన బ్రాండ్లు పెట్టుకొని అమ్ముతున్నారు. ఇసకని బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై పంపుతున్నారు.  ఏబీ గారిని పెంపుడు కుక్క అన్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం గారు పెంపుడు కుక్కలా పని చేయకపోవడం వల్ల తీసివేశారా? ఎందుకు తీశారో కారణం చెప్పగలిగారా? కేశినేని నాని, బొండా ఉమ గారు విజయవాడలో అధికారిని అడగటానికి వెళ్లారు. అయినా చంద్రబాబు గారు ఖండించారు. నాని గారు బేషరతుగా ట్రాన్స్ పోర్ట్ ని వదులుకున్నారు. బెంగుళూరులో జోగేంద్ర ప్రసాద్ అనే ఆయన మీద వారి ఎమ్మెల్యే దౌర్జన్యం చేశారు. ఎండీఓ పై వారి ఎమ్మెల్యే దౌర్జన్యం చేశారు. చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ పోలీస్ స్టేషన్ పై దౌర్జన్యం చేశారు. వీరే పోలీస్ వ్యవస్థని సర్వనాశనం చేస్తున్నారు. వారి పెంపుడు కుక్కల్లా ఉంటే ఉంచుకుంటున్నారు. వ్యతిరేకంగా చేస్తే తీసివేస్తున్నారు. సామాజికవర్గంపై కక్షకట్టి వ్యవస్థని నాశనం చేస్తున్నారు. పెంపుడు కుక్కలు అనే మాట ఉపసంహరించుకోండి. ఇంత మందిని ఇంతకుముందు వీఆర్ లో పెట్టారా? నామినేటెడ్ పోస్టులు 50 శాతం బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు ఇస్తామన్నారు. వైవీ సుబ్బారెడ్డి గారికి టీటీడీ, ఏపీ ఐఐసీ రోజారెడ్డికి, తుడా చెవిరెడ్డి భాస్కర రెడ్డికి ఇచ్చారు. అలా 200 మందికి వారికి ఇచ్చారు. వైసీపీవారు వ్యాపారస్తులు. మేం బెల్ట్ షాపులు తీసివేశాం. వీరు వచ్చిన తరువాత కంపెనీలతో లావాదేవీలు చేసుకొని వారికి నచ్చిన బ్రాండ్లను అమ్ముతున్నారు. క్వార్టర్ కి రూ.40 పెరిగింది. నెలకు 12 వందలు, ఏడాదికి 15వేలు. 8 దాటితే షాపు ఉండదు. వాలంటీర్లు కొన్ని బాటిళ్లు ఇంటి వద్ద పెట్టుకొన ఎక్కువ ధరకు అమ్ముతారు.  షాపులలో కార్యకర్తలను పెట్టారు. వీళ్ల జె టాక్స్ వేస్తే, వాళ్లు వాలంటీర్ టాక్స్ వేస్తారు. వారు రూ.50 వేస్తారు. పార్టీకి, కార్యకర్తలకు లాభంవచ్చే విధంగా వాళ్లు ప్లాన్ చేసుకున్నారు. మేం ఎస్పీ, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చాం. టీటీడీ ఎవరికిచ్చాం. బాలయోగి గారిని పార్లమెంటుకు పంపాం. బారుల్లో మద్యం అందుబాటులో ఉంచారు.
కాకుమాను రాజశేఖర్ – వైసీపీ
అవినీతి, అక్రమ కట్టడాలు అంతం చేయడానికి ఈ ప్రభుత్వం కృతనిశ్ఛయంతో ఉంది. గత 5 ఏళ్లలో జరిగిన అవినీతి, అక్రమాలు వెలికి తీసి, ప్రక్షాళన చేసి ప్రజలకు సుపరిపాలన అందించాలన్న లక్ష్యంతో ఉన్నాం. గతంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఎవరూ మాట్లాడటంలేదు. ఇప్పుడు పోలీస్ శాఖ గురించి మాట్లాడుతున్నారు. కొందరు వ్యక్తుల వల్ల ఆ శాఖకు చెడ్డ పేరు వస్తోంది. చాలా మంది ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పనులు చేస్తున్నారు. కొందరు దుర్మార్గులు చాలా అవినీతికి పాల్పడుతున్నారు. ఏబీ దేశభద్రత, రాష్ట్ర భవిష్యత్, రక్షణ అంశాలకు సంబంధించి, ఆయన కుమారుడికి లబ్ది చేకూరే విధంగా వ్యవహరించారని ప్రాధమిక ఆధారాలు ఉన్నాయి. విచారణ తరువాత న్యాయాన్యాలు తెలుస్తాయి. కొంతమంది అవినీతికి పాల్పడ్డారు. అప్పటి ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారు. వారిపై చర్యలు తీసుకుంటుంటే ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు. అన్యాయంగా చర్యలు తీసుకుంటే మాట్లడవచ్చు. విచారణ జరగనివ్వండి. ఏబీ టైంలో చంద్రబాబు గారి కోసం రాజకీయ ప్రయోజనాల కోసం పని చేశారు. 23 ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేసిన విషయంలో ఏబీ గారి పాత్ర ఉంది. వీఆర్ లో పెట్టడం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఉంటారు. అందరికీ పోస్టింగ్ లు ఉండవు. పోలీసు వ్యవస్థని ధ్వంసం చేస్తే చర్యలు తీసుకోకుండా ఎలా ఉంటారు. ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పై దాడి జరిగితే చంద్రబాబు గారు రాజీ కుదిర్చారు. అవినీతి అక్రమాలను మా పార్టీలో వారు చేసినా తప్పించుకునే అవకాశం లేదు. గత 5 ఏళ్లలో ఆయన ఏవిధంగా పని చేశారో అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి పెంపుడు కుక్కలా పని చేశారు. నీతివంతమైన అధికారులకు పెద్దపీట వేస్తుంది. ఇరిగేషన్ శాఖలో రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రక్షాళన చేస్తున్నాం. ఇసుక ఇంటి వద్దకు పంపుతున్నాం. రవాణాలో కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవం.  ఇసుక సమస్యలేదు. మద్యం ఉండకూడదనేదే మా పాలసీ. నాది పోలీస్ కుటుంబం. 35 ఏళ్ల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. గత ప్రభుత్వంలో సొంత మనుషులకు, సొంత కులం వారికి ఇష్టారాజ్యంగా ప్రమోషన్లు ఇచ్చారు. అడ్డగోలుగా పోస్టింగ్ ఇచ్చారు. దళితులకు కీలకమైన పోస్టింగ్ లు ఇచ్చారా? పోలీసుల ప్రమోషన్లు, పోస్టింగ్ ల విషయంలో కక్షపూరితంగా వ్యవహరించారు. ఆ వ్యవస్థని బ్రస్టుపట్టించింది చంద్రబాబు గారు.  అలాంటి పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని రక్షించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. నామినేటెడ్ పోస్టులు ఇంకా ఇవ్వవలసి ఉంది. గతంలో ఇనస్పెక్టర్లను డీఎస్పీలుగా చేశారు. అవుట్ దవే ఇచ్చారని ఇనస్పెక్టర్లు కోర్టుకు వెళ్లారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఏబీ  గారు వారిని పిలిపించి మీ ప్రమోషన్లు నేను చూస్తానని బలవంతాన వారిని విత్ డ్రా చేయించారు. సామాన్యులకు ధరలు అందుబాటులో ఉండకూడదనే మద్యం పాలసీని తీసుకున్నాం. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు అందరూ 4ఏళ్లు కలిసే ఉన్నారు. వాళ్లు తాగి, ప్రజల చేత కూడా తాగించారు. పేదలు ఆరోగ్యరీత్యా నాశనమయ్యారు. పాదయాత్రలో మహిళలు కోరిన విధంగా దశలవారీగా మద్యనిషేధం చేపట్టారు. మేం రావడంతోనే బెల్ట్ షాపులు తొలగించాం. పేదలకు మద్యం అంటుకుంటే షాక్ కొట్టేవిధంగా ఉండాలి. ప్రజలకు ఇబ్బందిలేదు. వారికి ప్రోబ్లమ్.
శ్రీనివాస రాజు – బీజేపీ
రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులు నిలువునా చీలిపోయారు. దీనికి మూలం చంద్రబాబు నాయుడు గారే. ఆయన ప్రారంభించారు. ఇప్పుడు పరాకాష్టకు వెళ్లింది. కక్షతో, వ్యతిరేకతతో పరిపాలించకూడదు. ఎవరైనా తన వద్దకు వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కన్సిడర్ చేసేవారు. జగన్ గారు అలా చేయడంలేదు. ఏబీ వెంకటేశ్వర రావు విషయం, ఎల్వీ సుబ్రహ్మణ్యం, జాస్తి కృష్ణ కిషోర్ ల విషయం వేరు. ఏబీ విషయంలో రోపణలు వచ్చాయి. వీరిద్దరి విషయంలో అటువంటివిలేవు. ప్రస్తుతం అధికారులకు రాంగ్ సమాచారం వెళుతుంది. అధికారులు ఎవరూ రిస్కు తీసుకునే అవకాశం లేదు. ఇంటిలిజెన్స్ నివేదిక అధికారంలో ఉన్న పార్టీకి ఉపయోగపడేవిధంగా చేస్తోంది. వంద, 150 మంది అధికారులను వీఆర్ లో పెడుతున్నారు. ఏబీ విషయంలో వాస్తవాలు ఉంటే చర్యలు తీసుకోవాలి. పోలీసు, విద్య,వైద్యంలో రాజకీయ జోక్యం ఉండకూడదు. రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడితే ఎన్నికల సందర్భంలో ఆ డబ్బు బయటకు వస్తుంది. అధికారులు అవినీతికి పాల్పడితే ఆ బ్లాక్ మనీ దశాబ్దాలపాటు బయటకు రాదు. జగన్ విషయంలో కొన్ని బాగున్నాయి. రాజధాని, ఇతర కొన్ని అంశాలలో బాగోలేదు. అంతమంది ఉద్యోగులను వీఆర్ లో ఉంచడం ఏమిటి? అవినీతికి పాల్పడేవారిపై చర్యలు తీసుకోండి. ప్రక్షాళన అంటున్నారు. ఏ శాఖలు చేస్తున్నారు. ఇసుక మీరు ఆపారు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు, విశాఖకు, ప్రకాశం, నెల్లూరు నుంచి చెన్నైకీ ఇసుక లారీలు పోలీస్ ఎస్కార్ట్ తో పంపుతున్నారా? లేదా? పోలీస్ ప్రక్షాళన అంటే ఇదా? రాజమండ్రి నుంచి విశాఖకు 40  నుంచి 50 వేలు, కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్ కు 40 నుంచి 50వేలు. ఇసుకలో, మద్యంలో అవినీతి ఉంది. మద్యం పాలసీ మొదట్లో మంచి పని అనుకున్నాం. తరువాత అసలు విషయం తెలిసింది. కంపెనీలతోనే మాట్లాడి జగన్ గారు డబ్బు తీసుకున్నారని తెలుస్తుంది. ఆధారాలు లేవు. అయితే 7,8 కంపెనీల మందులు మాత్రమే ఎందుకు దొరుకుతున్నాయి. 8 గంటల తరువాత దొరకడంలేదనేది కరెక్ట్ కాదు. డబ్బు ఎక్కువైతే దొరుకుతుంది.  ఆ రేట్లు పెంపు ప్రభుత్వానికి వెళ్లడంలేదు.

గంగాధర్ – కాంగ్రెస్
ప్రతీకారేచ్చ మనిషి ఆరోగ్యాన్ని చెబగొడుతుంది. ప్రభుత్వ ఆరోగ్యమైనా బెద్దతింటుంది. అభివృద్ధి కుటుంపడుతుంది. ప్రభుత్వ డోస్ ఎక్కువైంది. అధికారులు రాజభక్తి ప్రదర్శించడం పెరిగిపోయింది. వారు నిబంధనలు అతిక్రమిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. జగన్మోహన రెడ్డి గారు గతంలో విశాఖలో మీ అంతు చూస్తాం అని పోలీస్ శాఖని ఉద్దేశించి మాట్లాడారు. ఇంటిలిజెన్స్ విభాగం ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరించడం దురదృష్టకరం. ప్రజాసంఘాల పట్ల దూకుడుగా వ్యవహరించడం కూడా మంచికాదు. అధికార యంత్రాంగం చట్టబద్దంగా వ్యవహరించాలి. ప్రభుత్వాలు నచ్చని అధికారులను వేధించడం ఎక్కువైంది. ఎల్వీ సుబ్రహ్మణ్యం గారి అంశం ప్రక్షాళనా? అది ప్రక్షాళన అయితే ఇది కూడా అంతే అనుకోవచ్చు. జేసీ బ్రదర్స్ ని చంద్రబాబు గారు ఎందుకు కట్టడి చేయడంలేదు. వాళ్లు ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నట్లు, ఉద్యోగులను వారి ఇంట్లో పనివారిగా మాట్లాడటం చేశారు. జేసీ ప్రభాకర్  నాయి బ్రాహ్మణుడుకు చెందిన ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ని కులం పేరుతో దూషించారు.
96లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అధికారులకు అడ్డగోలుగా ఇచ్చారు. వైఎస్ హయాంలో అంత అడ్డగోలుగా జరుగలేదు. గత 5 ఏళ్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. వీరు కూడా అలా చేయడం మంచి పద్దతి కాదు. ఇంత స్థాయిలో 178 మంది వీఆర్ లో లేరు. సామాజిక న్యాయం అంటారు. ప్రభుత్వ నియామకాల్లో మొత్తం ఒక పక్షం ఒరిగిపోయారు. దాసుకోవాలన్నా దచుకోలేరు. ప్రక్షాళన చేస్తామని ఇసుకలో దోచుకున్నారు. మద్యంలో వారు బెల్ట్ షాపులు పెట్టి దోచుకున్నారు. మీరు కొన్ని బ్రాండ్ లను మాత్రమే పెట్టి దోచుకుంటున్నారు. ప్రభుత్వం కొన్ని బ్రాండ్లను మాత్రమే ప్రమోట్ చేస్తున్నారు. అంటే వారి ప్రమేయం ఉన్నట్లే. అవినీతిని ప్రోత్సహించినట్లే. డీఎడిక్షన్ సెంటర్లు పెట్టించాలి.

చెవుల  కృష్ణాంజనేయులు – సీనియర్ జర్నలిస్ట్
ప్రభుత్వంలో పోలీస్ శాఖ కీలకం. అందరూ మన చెప్పుచేతల్లో ఉండాలన్న ఉద్దేశం పాలకుల్లో ఉంటుంది. వెంటనే వారికి గుర్తుకు వచ్చే శాఖ పోలీస్ శాఖ. వారికి ఆ శాఖ ఆయుధంగా ఉంటుంది. అయితే పోలీస్ శాఖ ప్రజలకు న్యాయం చేయడం కోసం, చట్టాలను అమలు పరచడం కోసం ఉంది. ఆ శాఖలో కొంత మంది అధికారులు పాలకులకు లాయల్ గా ఉంటుంటారు. దీంతో ఆ శాఖ టార్గెట్ అవుతుంది. పాలకుల మాట వినకపోతే వారికి మంచి పోస్టులు రావు. మంచి పోస్టులు కావాలనుకున్నవారు వారి మాటలు వింటారు. ఆ తరువాత వారు అనేక ఇబ్బందులు పడతారు. చాలా మంది కోర్టుల చుట్టూ కూడా తిరుగుతున్నాయి. చట్టపరిధిలో పని చేసేవారు ఎవరికీ బెదరవలసిన అవసరంలేదు. గతంలో ఎప్పుడూ ఇంత సంఖ్యలో పోలీసులు వీఆర్ లో లేరు. మా మాట విననివారిని ఇబ్బందులు పడవలసి వస్తుందని బెదిరిస్తున్నట్లు ప్రభుత్వం ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నట్లు ఉంది. ఏబీ సస్పెన్షన్ లో రాజకీయ పరమైన కారణాలు ఉన్నాయి. ఎలక్షన్ కు ముందు ఆయనపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో ఆయన పాత్రపై ఒక దర్యాప్తు సంస్థని ఏర్పాటు చేయవచ్చు. టైం నియంత్రణ కొంతవరకు మంచిదే. ప్రభుత్వం చెప్పేదానికి ఆచరణకు తేడా ఉంటుంది. కఠిన నియంత్రణ ఉండాలి. దీనిని అడ్డం పెట్టుకొని అధికారపార్టీ ఎమ్మెల్యేలు దోచుకునే అవకాశం ఉంది. పేదలకు మద్యం అందకుండా చేయడం మంచిదే. వారు స్పిరిట్, వైటనర్ వైపుకు వెళ్లే ప్రమాదం ఉంది. అందువల్ల మద్యానికి వ్యతిరేకంగా ప్రచారం, డీఎడిక్ట్ సెంటర్స్ వంటివి పెట్టాలి.

 బొప్పన విజయ కుమార్ – రిటైర్డ్ డీఎస్పీ
పోలీస్ శాఖలో తనకు అనుకూలమైన పోస్టింగ్ కావాలనుకోవడం అతను రాజకీయాలకు అనుకూలంగా ఉండటం, కోరుకున్న పోస్ట్ పొందడం, అతను సుఖశాంతులతో ఉండటం జరుగుతుంది. పోలీస్ శాఖలో ఇది అనవాయితీ అయింది. ఇక్కడ సమాజిక వర్గాల అంశం కూడా ఉంటుంది. నాకు 33 ఏళ్లలో 43 ట్రాన్సఫర్లు వచ్చాయి. గతంలో నిజాయితీగా విధులు నిర్వహిస్తే వారికి నచ్చకపోతే ట్రాన్స్ ఫర్ చేస్తారు. ఇప్పుడు సస్పెండ్ చేయడం, వీఆర్ లో పెట్టడం వచ్చాయి.   భయానక వాతావరణం వచ్చింది. అధికారులు ప్రజలకు లాయల్ గా ఉండాలి. చట్టాన్ని అమలు చేసి, ప్రజలకు నమస్కారం పెట్టగలగాలి. సంతృప్తి ఉంటుంది. తాత్కాలికంగా బదిలీ చేస్తారు. లేకపోతే సస్పెండ్ చేస్తారు.   ఒక్కోసారి ఉద్యోగంలో నుంచి కూడా తీసివేయవచ్చు. ప్రక్షాళన అయితే ఎక్కడో ఒక చోట పోస్టింగ్ ఇవ్వాలి. ఏబీపై అభియోగాలే ఉన్నాయి. నిబంధనలు అతిక్రమించారో లేదో అప్పుడే చెప్పలేం. పరిశోధన పూర్తి అవ్వాలి. అమరావతి ఆందోళన విషయంలో, రైతుల విషయంలో చాలా మంది పోలీస్ అధికారులపై విమర్శలు వస్తున్నాయి. మనం చేసేది న్యాయంగా ఉండాలి.   ప్రభుత్వానికి లాయల్ గా లేకపోతే కష్టం, ఎప్పుడు కష్టం అంటే తనకు కావలసిన, తను కోరుకున్న జీవితాన్ని కోరుకున్నప్పుడు. నేను, చాలా మంది అధికారులు నక్సలైట్ ప్రాంతాలలో పని చేశాం. వారంతా సుఖవంతమైన జీవితం కావాలనుకుంటే   చాలా మంచి స్లేస్ లకు వెళ్లేవాళ్లు.   
 ఒక్క కానిస్టేబుల్ కి అవుట్ దవే ప్రమోషన్ ఇచ్చినా ఎందుకు నా ప్రమోషన్ ఆపారని  వెంటనే అతను అప్పీల్ కు వెళ్లిపోతాడు. మనం కోర్టుకు వెళ్లిపోతాం. 2008లో నేను రిటైర్డ్ అయ్యాను.  ఇటువంటి కేసులు కోర్టులో చాలా పెండింగ్ లో ఉన్నాయి. ఒక డీఎస్పీ కేసు 12 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉంది. డిపార్ట్ మెంట్ లోప్రమోషన్ ఇవ్వాలంటే దానికి ఒక ప్యానల్ ఉంటుంది. అన్యాయం జరిగితే ట్రిబ్యునల్ కు వెళ్లిపోతాం.  ప్రొసీజర్ ని ఎవరూ కాదనలేరు.   
--------------------------


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...