Feb 17, 2020

ఐటీ దాడులు


 24X7 -తేదీ: 17.02.2020 సోమవారం ఉదయం 7.30 గం. నుంచి
అంశాలు :  ఐటీ దాడులు    యాంకర్ :  వెంకటకృష్ణ

పార్థసారధి – ఇన్ కంమ్ టాక్స్ మాజీ కమిషనర్, బీజేపీ
సెక్షన్ 132 ఇన్ కమ్ టాక్స్  సెర్చ్ అండ్ సీజర్ ఆపరేషన్ – చాలా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. బిజినెస్ సంస్థపై దాడులు అనేది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటువంటి కేసులలో సాక్ష్యాలు ఉంటాయి. ఏపీలో వ్యాపారం, రాజకీయాలు కలిసిపోయాయి. ఎన్నికలలో వెయ్యి, రెండు వేలు ఇవ్వడం అలవాటైపోయింది. వచ్చే ఎన్నికలలో 4 వేలు ఇవ్వగలిగితేనే పోటీ చేయాలని అంటున్నారు. ఎమ్మెల్యేలు 70 కోట్లు ఖర్చు పెట్టినవారు కూడా ఉన్నారు. సెర్చ్ కి వెళ్లినప్పుడు ఇద్దరు సాక్షులను తీసుకువెళతాం. ప్రమాణం చేయించి వారి రికార్డ్ నమోదు చేస్తాం. స్టేట్, పంచనామా, ఏఏ మెటీరియల్ తీసుకున్నారో అన్ని కలిపిన ఒక కాపీ ఆ వ్యక్తికి ఇస్తారు. దానిని శ్రీనివాస్ బయటకి ఇచ్చి ఉండవచ్చు. చిన్న వ్యాపారాలకు ఇబ్బంది కలుగకుండా 4480 సెక్షన్ ప్రకారం రెండు కోట్ల టర్నోవర్ వ్యాపారం వరకు వారి రిసిట్స్ లో 8 శాతం ఆదాయంగా ప్రకటించినట్లైతే వారు బుక్స్ మెయింటెనెన్స్ చేయవలసిన అవసరంలేదు. అనుమానాస్పద డాక్యుమెంట్లు అన్నీ రెండు కోట్ల లోపలే ఉంటాయి. అన్ని వివరాలు స్టేట్ మెంట్లో ఉంటాయి. మొబిలైజేషన్ అడ్వాన్స్ ప్రభుత్వం కాంట్రాక్టర్  కు ఇస్తారు. రూ.500 కోట్లు ఇస్తే, 50 కంపెనీలకు, రెండు పార్టీలకు వెళతాయి. డబ్బు డ్రా చేస్తారు. అవి ఎవరికి చేరాలో వారికి చేరతాయి. కాంట్రాక్టర్లు, రాజకీయాలు ఒకటైపోవడం ఈ రాష్ట్రంలో జరిగే దుర్మార్గం. ధన ప్రభావంతో రాష్ట్రం భ్రష్టుపట్టిపోయింది. అందరివి స్టేట్ మెంట్లు బయట పెట్టమని అడగండి. కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ముఖ్యం.

పట్టాభి – టీడీపీ
శ్రీనివాస్ గారు ఒకటి, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కంపెనీలు రెండు ఉన్నాయి. రెండువేల కోట్లు అనేది ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కంపెనీలకు సంబంధించింది. ఆ విషయం అందరికీ అర్ధమైంది గానీ, వైసీపీ వారికి అర్ధంకాలేదు. అర్ధమై కూడా అర్థం అవనట్లు ప్రజలను తప్పుదారి పట్టించారు. శ్రీనివాస్ గారి ఖాతాలో రెండు వేల కోట్లు అని వైసీపీ నాయకులు ఊదరగొట్టారు. రెండు వేల కోట్లు ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కంపెనీలకు సంబంధించినవి. ప్రతిమ కంపెనీ, మెఘా కంపెనీలు కేసీఆర్, జగన్ గారి సన్నిహితమైనవి. ఆర్వీఆర్ కంపెనీ శ్రీనివాస్ రెడ్డి గారిది. వాళ్లు ప్రతిమ, మెఘా కంపెనీల గురించి ఎందుకు మాట్లాడరు? చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుటుంబ ఆస్తులు ఎవరూ అడగకపోయినా స్వచ్ఛందంగా ఆస్తులు ప్రకటిస్తున్నారు. ఆయనకు గానీ, లోకేష్ గారికి గానీ ఐటీ వారు నోటీస్ ఇవ్వలేదు. మేం ఐటీ డిపార్ట్ మెంట్ ని ఛాలెంజ్ చేస్తాం. చౌదరి గారిపై దాడి జరిగింది. ఏమైనా జరిగిందా?   నవంబర్ 2018 డిక్లేర్ చంద్రబాబు కుటుంబ ఆస్తులు 165 కోట్లు అప్పులు పోగా 76 కోట్ల నిఖర ఆస్తి. ఇంతకు మించి ఆస్తులు ఉంటే సేవా సంస్థలకు రాసేస్తానని చెప్పారు. ఐటీ డిపార్ట్ మెంట్ పదేళ్ల క్రితం జగన్ గారికి పదేళ్ల క్రితం భారీ సన్మానం చేసింది.  122 కోట్లు ఫైన్ వేసింది. బోగస్, సూట్ కేస్ కంపెనీల నుంచి వచ్చిన ఆస్తులతో సాక్షి పేపర్ స్థాపించినట్లు ఐటీ శాఖ తెలిపింది. చంద్రబాబు గారి అనుమతి తీసుకోవలసిన అవసరంలేదు. నిజాయితీపరుడైన నాయకుడి నాయకత్వంలో పని చేస్తున్నాం. రాష్ట్రం తగలబడిపోతుంటే మీ ముఖ్యమంత్రి బయటకు రారు. ప్రజలతో మాట్లాడరు. ఢిల్లీ వెళ్లి నాలుగు గోడల మధ్య ఏం మాట్లాడతారో ఎవరికీ తెలియదు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు. రాజధాని గురించి మాట్లాడరు. అటువంటి నాయకుడి నాయకత్వంలో మీరు పని చేస్తున్నారు. అనకొండ, అనకొండ అంటున్నారు. 9 నెలలైపోయింది. గట్టికూడా పీకలేకపోయారు. దమ్ముంటే జ్యుడిషియల్ విచారణ వేయండి. రాష్ట్రం తగలబడిపోతోంది. ప్రత్యేక హోదా ఏమైందో తెలియదు. సీఎం మాట్లాడరు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవారు. చంద్రబాబు ఆదాయం హెరిటేజ్ డెయిరీ నుంచి వస్తుంది. 2500 కోట్ల కంపెనీ.16 రాష్ట్రాలలో వ్యాపారం. పబ్లిక్ ఇష్యూ 54 టైమ్స్ ఓవర్ సబ్ స్క్రైబ్ అయింది. నీతివంతమైన వ్యాపారం చేస్తున్నారు. అటువంటి రిప్యూటెడ్ కంపెనీ. ఐటీ శాఖ ఎప్పుడైనా వచ్చి తనిఖీ చేసుకోవచ్చు. భువనేశ్వర్, బ్రహ్మణి గారు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అది మా రికార్డ్. ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం మీ రికార్డ్ 17 కేసుల్లో ఫోర్జరీ, 420, మనీ ల్యాండరింగ్,  ఏ2 విజయసాయి రెడ్డి 13 కేసుల్లో 420. సెర్బియాలో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ కోసం వెళ్లారా? ఎవరి కోసం వెళ్లారు? జగన్ గారు 17 కేసులు ఎదుర్కొంటున్నారు. ఏ రోజైనా ఆ కేసులు గురించి మాట్లాడారా?  శుక్రవారం రాగానే జగన్ గారికి ఏదో ఒకటి వస్తుంది.

రవిచంద్రా రెడ్డి – వైసీపీ
పంచనామా కాపీ రైడ్ చేసినవారికి తప్పనిసరిగా అందిస్తారు. శ్రీనివాస్ గారి కాపీ బయటకు వచ్చింది. పంచనామా కాపీతోపాటు స్టేట్ మెంట్ కాపీ ఎందుకు బయటకు రాలేదు? ఆ కాపీ బటకు వస్తే పాలు, నీళ్లు తెలిసిపోతాయి. ఆ స్టేట్ మెంట్లో దొరికిన డాక్యుమెంట్లు అన్ని ఉంటాయి. ఇది వ్యూహాత్మకంగా బయటపెట్టారు.  పట్టాభి గారు చంద్రబాబు నాయుడు గారి తరపున ఐటీ శాఖకు సవాల్ చేస్తున్నారు. రేపు చంద్రబాబు వద్ద ఆస్తులు దొరికితే అవన్నీ సీజ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీ తలకాయ అంటుతారు. పెద్దపెద్ద ఛాలెంజ్ లు విసిరేటప్పుడు మీ బాస్ అనుమతి తీసుకోండి. లెక్కలు క్లియర్-నో ఫియర్ అని చంద్రబాబు చెబుతుంటారు. ప్రత్యేక హోదా విషయంలో రాత్రి 12 గంటలకు ప్రెస్ మీట్ పెట్టారు. సహాయకుడిపై ఐటీ దాడి జరిగితే ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? ఐటీ వారికి పెద్ద అవినీతి అనకొండ ఉంది. ఐటీ వారు తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తప్పు చేసి దొరికిపోతే తండ్రి, కొడుకులకు శిక్షలు పడతాయి. స్టేట్ కాపీ కూడా విడుదల చేయమని కోరుతున్నాను. కాంట్రాక్టర్ కు చాలా కష్టాలు ఉంటాయి. లంచాలు ఇవ్వవలసి ఉంటుంది. ఇది రెండు వేల కోట్లతో ఆగటంలేదు. రెండు లక్షల కోట్ల వరకు వెళుతుంది. వారికి వ్యతిరేకంగా వస్తున్న వార్తలకు అడ్డుకట్టవేయడానికి ఆ పంచనామా మాత్రమే బయటపెట్టారు. స్టేట్ మెంట్ కాపీని కూడా ప్రకటించమని అడుగుతున్నాను.
స్టేట్ మెంట్ కాపీ బయటపెట్టాలి. పచ్చ ఛానల్స్ ఈ రోజు టెలీకాస్ట్ చేయాలి. మాపై ఉన్న ఆరోపణలు, కేసులు గతంలో టీడీపీ, కాంగ్రెస్ వారు చేయించినవి. చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల నుంచి ఎందుకు దాక్కున్నారు. వారి గొంతులు ఎందుకు మూగబోయాయి. కన్నా గారు కూడా ఎందుకు మాట్లాడటంలేదు? రూ.2వేల కోట్లు అవినీతి జరిగిందని తెలిస్తే చంద్రబాబు నాయుడుని ప్రశ్నించలేని స్థితిలో పవన్ కల్యాణ్ ఉన్నారు.

బొలిశెట్టి సత్యనారాయణ – జనసేన
ఇన్ కమ్ టాక్స్ శాఖ కేంద్రం పరిధిలోనిది. ఆ సమాచారం జగన్ గారి వద్ద గానీ, రవిచంద్రా రెడ్డి వద్దగానీ ఉండదు. వాళ్లు చాలా స్ట్రిక్ట్ గా చేస్తారు. 20 ఏళ్ల క్రితం నాపై కూడా దాడి జరిగింది. ఇద్దరూ అతిగా మాట్లాడుతున్నారు. రూ.2 లక్షల కోట్లన్నా ఆశ్చర్యపోను. చంద్రబాబు నాయుడు అంతకు సమర్థుడు.  పట్టాభి గారు చాలా అమాయకుడు. ఆయనకు పూర్తిగా తెలియదు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు రాకముందు ఎంత ఆస్తి ఉందో, ఇప్పుడు ఎంత ఆస్తి ఉందో బయట పెట్టాలి. కాలవ తీసి నదులు అనుసంధానం చేసినట్లు ప్రచారం చేసుకున్నారు. అన్నిటిలోనూ అవినీతే. చంద్రబాబు నాయుడు గారు గానీ, జగన్ గారికి గాని లక్షల కోట్లు అవినీతి ఉంటుంది. నిబద్దత ఉంటే వ్యక్తిగత కార్యదర్శిపై దాడి జరిగినప్పుడు చిన్న కాగితంతో సహా బయట పెట్టాలి. ఆయనకు నిబద్దత లేదు. ఉంటే మొత్తం స్టేట్ మెంట్ బయట పెట్టండి.
చంద్రబాబు నాయుడు పీఏపై దాడి జరిగింది. పవన్ కల్యాణ్ పీఏపై దాడి జరగలేదు. చంద్రబాబు నాయుడు, జగన్ ఇద్దరూ దొంగలు. రెండు కులాల నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించడానికి మేం వచ్చాం. కులాలను కలిపేందుకు పుట్టిన పార్టీ మాది. ఒక పులివెందులకు న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తారు.?

ధీశెట్టి బాబ్జీ – లోక్ సత్తా
దాడులు జరిగిన తరువాత శిక్షలు పడటంలేదు. ఈ దాడులు ప్రతిపక్ష పార్టీపై ప్రభుత్వం చేయిస్తున్న దాడులుగా ప్రజల వద్దకు వెళ్లింది. దాడుల వెనక దురుద్దేశం ఉన్నట్లు భావిస్తున్నారు. గతంలో సుజనా చౌదరి వంటి వారిపై దాడులు జరిగాయి. ఆ తరువాత ఏమైందో ఎవరికీ తెలియదు. ఆరు రోజులు దాడులు చేశారు. ఏం చేశారు.? దొరికినవి దాచారా? అందరి రిపోర్టులు బయట పెడితే కొంత క్లారిటీ వస్తుంది. అవినీతి పరులని ఒకరికొకరు తిట్టుకోవడమే సరిపోతుంది. ప్రజలకు ప్రయోజనం ఏమిటి? రాజకీయాలపై ప్రజలకు నమ్మకం పోయింది. ఒకవైపు కేజ్రీవాల్ వంటి రాజకీయాలు కావాలనుకుంటున్నారు. దాడులు వల్ల ఫలితాలు ఉంటాయన్న భావనలేదు. వైసీపీ వారు చేయించి ఉంటారని అనుకుంటున్నారు. ఈ కంపెనీలు భాగోతం ఏమిటీ? న్యాయం జరుగుతుందని ఎవరికైనా నమ్మకం ఉందా? దర్యాప్తు సంస్థ క్రెడిబిలిటీపై ఆధారపడి ఉంటుంది. గతంలో లిక్కర్ కుంభకోణంపై దర్యాప్తు జరిగింది. అందరికీ దడ పుట్టించారు. ప్రజా సమస్యలపై చర్చ జరుగుతున్నట్లు లేదు. ప్రభుత్వ కార్యక్రమాలకు కవరేజ్ తక్కువ,తిట్టుకుంటే ఎక్కువ ఉంటుంది.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...