Feb 7, 2020


రాజధాని పరిధిలోని  5 గ్రామాలు 
మంగళగిరి, తాడేపల్లిలో విలీనం
అమరావతి: రాజధాని అమరావతి నగర పరిధిలోని 5 గ్రామ పంచాయతీలను మంగళగిరి, తాడేపల్లి పంచాయితీలలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు(పంచాయితీ రాజ్ శాఖ- 06.02.2020-జీఓ నెం.319) జారీ చేసింది. నగర పరిధిలోని 25 రెవెన్యూ గ్రామాలు (29 గ్రామాలు)తో కొత్తగా మరో మూడు పంచాయితీలను కలిపి అమరావతి కేపిటల్ సిటీ మున్సిపల్ కార్పోరేషన్(ఏసీసీఎంసీ) ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. ఇప్పుడు నవులూరు, బేతపూడి, ఎర్రబాలెం, పెనుమాక, ఉండవల్లి పంచాయితీలను మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాడేపల్లి మండలంలోని రాజధాని గ్రామాలైన 1. పెనుమాక, 2. ఉండవల్లిలతోపాటు 3. ప్రాతూరు, 4. వడ్డేశ్వరం, 5. ఇప్పటం, 6. మెల్లింపూడి, 7. చిర్రావూరు, 8.గుండిమెడ పంచాయతీలను తాడేపల్లి మున్సిపాలిటీలో కలిపారు. మంగళగిరి మండలంలోని రాజధాని గ్రామాలైన 1. నవులూరు, 2. బేతపూడి, 3. ఎర్రబాలెంలతోపాటు 4.ఆత్మకూరు, 5.చినకాకాని పంచాయితీలను మంగళగిరి మున్సిపాలిటీలలో విలీనం చేశారు.


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...