Jan 28, 2017

మిరప ఎగుమతికి ప్రోత్సాహం

·       గుంటూరు జిల్లాలో 82వేల హెక్టార్లలో మిరప సాగు
·       పురుగుల మందు వాడకం తగ్గింపు
·       సస్యరక్షణతో ఉత్పత్తి, నాణ్యత పెంపు
·       గుంటూరు నుంచి 40 శాతం  ఎగుమతి
·       76 గ్రామాల్లో 10 వేల ఎకరాల్లో  సస్యరక్షణలో మిరప పంట సాగు

           పురుగుల మందుల వాడకం తగ్గించి మిరపకాయల నాణ్యత, ఉత్పత్తిని పెంచి ఎగుమతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎగుమతులు పెరిగితే విదేశీ మారకద్రవ్యం సమకూరడమే కాక,  రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చే అవకాశం ఉంటుంది. మిరప ఉత్పత్తి, నాణ్యత పెంచడానికి గుంటూరు జిల్లాలోని ఉద్యానవన శాఖ తగిన ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. ఈ జిల్లాలో గత ఆర్థిక సంవత్సరం(2015-16)లో 64వేల హెక్టార్లలో మిరప పండించగా, ఈ ఏడాది 82 వేల హెక్టార్లలో మిరప పండిస్తున్నారు.  మిరప సాగు చేసే 60 శాతం ప్రాంతంలో హైబ్రీడ్ రకాలనే పండించేవారు. తేజశ్విని, ఇండామ్ 5, యుఎస్ 341, బీఐజేఓ 273, అగ్నిరేఖ, వండర్ హాట్, బాడిగి వంటి రకాలను నాటేవారు. అయితే ఇవి హెక్టార్ కు సరాసరి 6.25 మెట్రిక్ టన్నుల దిగుబడి ఇచ్చేవి. మిగిలిన 40 శాతం మిరప సాగు చేసే భూములలో ఎల్సీఏ334, ఎల్సీఏ625, సరపూడి, సూపర్ 10, సూపర్ 20 వంటి రకాలను పండిస్తారు. ఈ రకాలు హెక్టారుకు సరాసరి 5 మెట్రిక్ టన్నుల దిగుబడిని మాత్రమే ఇచ్చేవి. దీనిని దృష్టిలోపెట్టుకొని మిరప ఉత్పత్తితోపాటు నాణ్యత కూడా పెంచడానికి ఉద్యానవన శాఖ గుంటూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా పది వేల ఎకరాలను ఎంపిక చేసింది.  ఈ భూమిలో మిరప సాగు చేసే రైతులకు అధికారులు, శాస్త్రవేత్తలు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు.

గుంటూరు జిల్లాలో పండే ఉత్పత్తిలో  40 శాతం ఎగుమతి
           గుంటూరు ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే మిరప కాయలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరున్న విషయం తెలిసిందే. ఇక్కడి రేగడి నేలల్లో పండే మిరపకు ఘాటుతోపాటు రుచి కూడా ఎక్కువే. అందువల్ల ఈ పంటకు డిమాండ్ ఎక్కువ. ఈ ప్రాంతంలో పండే మిరపలో దాదాపు 40 శాతం విదేశాలకు ఎగుమతి చేస్తారు. అయితే ఎగుమతి చేసిన ఎండు మిర్చిలో పురుగుమందుల శేషాలు ఉన్నాయని అనేక సార్లు తిప్పి పంపారు. దాంతో  ప్రభుత్వం మిరప నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఉత్పత్తిలో సస్య రక్షణ చర్యలు చేపట్టి మిరపకాయలను యూరప్, అమెరికాలకు  ఎగుమతి చేయాలని నిర్ణయించింది. దీనికి కావలసిన చర్యలు తీసుకోవలసిందిగా ఉద్యానవన శాఖను ఆదేశించింది. దాంతో ఆ శాఖ మిరపపంటలో పురుగుల మందుల వాడకాన్ని తగ్గించేవిధంగా రైతులను ప్రోత్సహిస్తోంది.

76 గ్రామాల్లో పది వేల ఎకరాల్లో సస్యరక్షణ మిరప సాగు
            ఎండు మిర్చిలో పురుగుమందుల శేషాలు లేకుండా ఉండేదుకు తీసుకోవలసిన సస్యరక్షణ చర్యలను రైతులకు తెలియజెబుతోంది. అంతే కాకుండా గుంటూరు జిల్లాలో పది క్లస్టర్లలో 22 మండలాల్లోని 76 గ్రామాలను ఎంపిక చేసింది. ఆ గ్రామాల్లో పది వేల ఎకరాల్లో నాణ్యత గల మిరప పంట పండించడానికి ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టింది. దాదాపు ఏడు వేల మంది రైతులు ఈ భూమిని సాగు చేస్తున్నారు. ఒక్కో క్లస్టర్ ను ఒక ఉద్యానవన శాఖాధికారి, ఒక వ్యవసాయ మల్టిపర్పస్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్(ఎంపీఈఓ) పర్యవేక్షిస్తుంటారు. సస్యరక్షణతో మిరప సాగు చేయడంలో మిరప శాస్త్రవేత్తలు, ఉద్యానవన శాఖ అధికారులు రైతులకు శిక్షణ ఇచ్చారు. అధికారుల పర్యవేక్షణలోనే తేజా, ఎండామ్5, ఎల్సీఏ334, వీఎస్341, బాడిగ వంటి హైబ్రీడ్ రకాలను సాగు చేస్తున్నారు.
అంతే కాకుండా వారు తరచూ పంట పొలాలను సందర్శిస్తూ రైతులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వేపతో తయారు చేసిన మందులనే వాడే విధంగా వారిని ప్రోత్సహిస్తున్నారు. పంటకు చీడ పట్టకుండా, పట్టినా తక్కువ స్థాయిలో పురుగుల మందులను వాడుతూ రైతులు మిరప పంట పండిస్తున్నారు. రైతులు సస్య రక్షణ చర్యలను అమలు చేయడంతో పురుగుల మందులు చల్లడాన్ని 50 శాతం వరకు తగ్గించారు. అంతేకాకుండా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మిరప పంటను సాగు చేయడంలో కూడా రైతులను ప్రోత్సహించారు. దాంతో పండు మిరపలో పురుగుల మందు అవశేషాలు తగ్గడంతోపాటు ఉత్పత్తి వ్యయం కూడా తగ్గింది. ఈ విధంగా చేయడం వల్ల మిరప ఎగుమతి దారులు పొలాల్లోనే రైతుల నుంచి మిరపను కొనుగోలు చేసే అవకాశం ఏర్పడింది. తద్వారా రైతులు ఒక మెట్రిక్ టన్నుకు రూ.15 వేల రూపాయల వరకు అదనంగా లాభం పొందే అవకాశం ఉంది. పది వేల హెక్టార్లలో సస్యరక్షణ చర్యల ద్వారా పండించిన పంట దాదాపు 50 వేల మెట్రిక్ టన్నుల వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా  రైతులకు రూ.50 కోట్ల రూపాయల వరకు అదనపు ఆదాయం లభిస్తుంది. ఎగుమతిదారులు కూడా నాణ్యమైన మిరపను యూరప్, అమెరికాలకు ఎగుమతి చేసి విదేశీమారకద్రవ్యాన్ని ఆర్జిస్తారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి కూడా పెరిగి ఆర్థిక వృద్ధికి ఇది దోహతపడుతుంది.

Jan 27, 2017

బైలైన్ స్టోరీలు

పరిశ్రమల స్థాపనకు ఏపీ అనుకూలం

 v ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెం.1
  v  14,441 పరిశ్రమలకు అనుమతి
  v మొత్తం దరకాస్తులు 15,490
   v తిరస్కరించినవి 849
   v 14 రోజుల్లోలే 39 రకాల పారిశ్రామిక అనుమతులు

       పారిశ్రామీకరణకు రాష్ట్రంలో ఉన్న అనూకల పరిస్థితుల నేపధ్యంలో వేల పరిశ్రమలు నెలకొల్పడానికి దేశవిదేశాలకు చెందిన అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. వీటిలో అతి భారీ, భారీ నుంచి మధ్య తరహా, చిన్న సూక్ష పరిశ్రమల వరకు ఉన్నాయి. ప్రభుత్వ విధానాలు – భౌగోళికంగా, ఉత్పత్తి, వాణిజ్యానికి అనుకూల పరిస్థితులతోపాటు నైపుణ్యత గల మానవ వనరులు అందుబాటులో ఉంటంతో బహుళజాతి పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో వ్యాపారం చేయడానికి, పరిశ్రమలు స్థాపించడానికి ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలో 974 కిలో మీటర్ల తీర  ప్రాంతం కూడా సముద్ర ఉత్పత్తులకు, జలరవాణాకు అనుకూలంగా ఉంది. వీటన్నిటికీ తోడు పారిశ్రామిక పెట్టుబడులు రాబట్టడానికి, రాష్ట్రంలోని యువతికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి  ప్రభుత్వం అనేక రాయితీలు కల్పిస్తోంది. అంతేకాకుండా  పరిశ్రమకైనా కావలసిన పత్రాల్ననీ సక్రమంగా ఉంటే 14 రోజుల్లోనే ఆన్ లైన్ లో అనుమతులు ఇస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం 2015 ఏప్రిల్ 29న సింగిల్ డెస్క్ పోర్టల్ ను ప్రారంభించింది.  పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా  రాష్ట్రంలో ఏపీ పారిశ్రామిక, మౌలిక వసతుల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) లక్షా 21 వేల 655 ఎకరాలలో 300 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసింది. పరిశ్రమలకు కావలసిన భూముల కేటాయింపు,  విద్యుత్, నీరు, రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, ఫైబర్ లైన్ వంటి మౌలిక సదుపాయాలు సమకూర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో  ప్రపంచ బ్యాంకు, భారత ప్రభుత్వం దేశంలో ఏపీకి నెంబర్ 1 ర్యాంక్ ఇచ్చాయి.

             రాష్ట్రంలో ఇన్ని అనుకూల పరిస్థితులు ఉండటం వల్ల సింగిల్ డెస్క్ విధానం ప్రారంభించిన నాటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు వివిధ రకాల పరిశ్రమల స్థాపనకు 15,490 దరకాస్తులు వచ్చాయి. వాటిలో 14,441 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశారు. అత్యధికంగా ఎనర్జీ విభాగంలో 4969 దరకాస్తులు రాగా, 4668కి ఆమోదం తెలిపారు. ఆ తరువాత ఫ్యాక్టరీల శాఖకు 2,050 దరకాస్తులు రాగా, 1988కి అనుమతులు మంజూరు చేశారు. వ్యాట్,సీఎస్టీ రిజిస్ట్రేషన్ కు 654 దరకాస్తులు రాగా, అన్నిటిని అనుమతించారు. అలాగే బాయిలర్, ఇరిగేషన్ అండ్ సీఏడీ, లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్, సివిల్ సప్లైస్ శాఖలలో వచ్చిన దరకాస్తులు అన్నిటికీ అనుమతులు మంజూరు చేశారు.  అనుమతులు పొందినవాటిలో  అతి భారీ పరిశ్రమలు(మెగాప్రాజెక్టులు), భారీ పరిశ్రమలు, సూక్ష, మధ్య, చిన్న తరహా అన్ని పరిశ్రమలు  ఉన్నాయి. 849 దరకాస్తులు తిరస్కరించారు. సర్వీస్ లెవల్ ఎగ్రిమెంట్ పరిధిలో 200 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ విధంగా 14 రోజుల్లో పూర్తిగా ఆన్ లైన్ లో అనుమతులు మంజూరు చేసే రాష్ట్రం ఏపీ ఒక్కటే.
          పరిశ్రమ స్థాపించడానికి  ఉత్పత్తి అయ్యే వస్తువు, వాడే ముడిపదార్ధం, ప్రమాదకర వ్యర్థాల తీవ్రత తదితర అంశాల ఆధారంగా ప్రభుత్వంలోని 16 శాఖల నుంచి 20 నుంచి 39 రకాల అనుమతులు పొందాలి. పరిశ్రమల శాఖ మొదలుకొని కాలుష్యం నియంత్రణ, విద్యుత్, పౌరసరఫరాలు, అటవీ, భూగర్భజలాలు, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, మునిసిపాలిటీ, పంచాయతీరాజ్, వాణిజ్యపన్నులు, రెవెన్యూ, జలవనరులు, కార్మిక, బాయిలర్, సీఏటీ, సీఎస్టీ తదితర అనుమతుల పొందాలి. ఈ అనుమతులు పొందడానికి గతంలో ఆయా సంస్థల ప్రతినిధులు ప్రభుత్వ శాఖల చుట్టూ తిరగవలసి వచ్చేది. ఇందుకు  సుదీర్ఘ కాలం పట్టేది. అయితే ఇప్పుడు  ఆ జాప్యాన్ని నివారించారు.  రాష్ట్ర ప్రభుత్వం  ప్రవేశపెట్టిన సింగిల్ డెస్క్ ద్వారా కావలసిన అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే 14 రోజులలోనే అనుమతులు మంజూరు చేస్తున్నారు. మెగా ప్రాజెక్టులు మొదలుకొని చిన్న తరహా పరిశ్రమల వరకు కావలసిన ఫ్యాక్టరీ ప్లాన్, భవన నిర్మాణాలకు అనుమతి, పట్టణ, గ్రామీణ ప్రణాళికా శాఖ, గాలి, నీరు చట్టాలకు సంబంధించి రెడ్ క్యాటగిరీ, ఆరంజ్ క్యాటగిరి, పవర్ ఫీజుబిలిటీ సర్టిఫికెట్,  బాయిలర్ సర్టిఫికెట్, విద్యుత్ శాఖ, గ్రామ పంచాయతీ, ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్, ప్రమాదకర వ్యర్థాలకు సంబంధించి, బావుల తవ్వకం, అగ్నిమాపక శాఖ, వ్యాట్, సీఎస్టీ  రిజిస్ట్రేషన్, 11కేవీ లేక 35 కేవీ విద్యుత్ సరఫరా వంటి అనుమతులు చాలా వరకు మంజూరు చేశారు. కొన్ని పరిశ్రమలకు  సంబంధించి ఉత్పత్తుల ఆధారంగా ఆయా శాఖలు కోరిన విధంగా కంపెనీలను వివరణ కోరారు. పరిశ్రమలకు కావలసిన ముడిపదార్ధాలు బొగ్గు, ఆల్కాహాల్ వంటి వాటి కేటాయింపుల విధానాన్ని  కూడా సింగిల్ డెస్క్  పరిధిలోకే తీసుకువచ్చారు. ఇంతటి అద్భుతమైన ఈ సింగిల్ డెస్క్ పోర్టల్ విధానాన్ని  ప్రపంచ బ్యాంకు కూడా ప్రశంసించింది.
      శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్
____________________________________________________________________________________
ఏపీ పారిశ్రామిక హబ్ కానుందా?
·       రూ.2,39,774 కోట్ల పెట్టుబడులతో 45 మెగా ప్రాజెక్టులు
·       12 పవర్ జనరేషన్ ప్రాజెక్టులు
·       5 బల్క్ డ్రగ్స్, ఫార్మాస్యూటికల్ ప్రాజెక్టులు
·       3 సిమెంట్ ఫ్యాక్టరీలు
·       ముందుకు వచ్చిన గెయిల్, ఆసియన్ పెయింట్స్ వంటి సంస్థలు
·       14 రోజుల్లో పారిశ్రామిక అనుమతులు
·       పరిశ్రమల స్థాపనకు అనువుగా ఏపీ

                  భారీ పరిశ్రమలకు నెలవుగా ఆంధ్రప్రదేశ్ మారనుంది. పారిశ్రామిక హబ్ గా రూపొందడానికి ఏపీ సమాయత్తమవుతోంది. పారిశ్రామీకరణకు రాష్ట్రంలో ఉన్న అనూకల పరిస్థితుల నేపధ్యంలో వేల పరిశ్రమలు నెలకొల్పడానికి అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వ విధానాలు భౌగోళికంగా, ఉత్పత్తి, వాణిజ్యానికి అనుకూల పరిస్థితులతోపాటు నైపుణ్యత గల మానవ వనరులు అందుబాటులో ఉంటంతో దేశవిదేశీ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో వ్యాపారం చేయడానికి, పరిశ్రమలు స్థాపించడానికి ఆసక్తి చూపుతున్నారు.  ప్రభుత్వం అనుసరించే విధానాలు, సమకూర్చే మౌలిక సదుపాయాల వల్ల ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలో రాష్ట్రం నెంబర్ స్థానం పొందింది. ఒక పరిశ్రమ స్థాపించడానికి అక్కడ జరిగే ఉత్పత్తి, వాడే ముడిపదార్ధాలు, వ్యర్థాల వల్ల ఉత్పన్నమయ్యే ప్రమాద తీవ్రత తదితర అంశాల ఆధారంగా 20 నుంచి 30 రకాల అనుమతులు పొందాలి. పరిశ్రమల శాఖ మొదలుకొని కాలుష్యం నియంత్రణ, విద్యుత్, పౌరసరఫరాలు, అటవీ, భూగర్భజలాలు, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, మునిసిపాలిటీ, పంచాయతీరాజ్, వాణిజ్యపన్నులు, రెవెన్యూ, జలవనరులు, కార్మిక, బాయిలర్, సీఏటీ, సీఎస్టీ తదితర అనుమతులు పొందాలి. ఈ అనుమతులు పొందడానికి గతంలో అయితే సుదీర్ఘ కాలం పట్టేది. ఇప్పుడు  ఆ జాప్యాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏక గవాక్ష (సింగిల్ డెస్క్) విధానం ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే 14 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తున్నారు. పరిశ్రమలకు కావలసిన ముడిపదార్ధాలు బొగ్గు, ఆల్కాహాల్ వంటి వాటి కేటాయింపులను కూడా సింగిల్ డెస్క్  పరిధిలోకే తీసుకువచ్చారు. ఇంతటి అద్భుతమైన ఈ సింగిల్ డెస్క్ పోర్టల్ విధానాన్ని  ప్రపంచ బ్యాంకు కూడా ప్రశంసించింది. ఈ విధంగా 14 రోజుల్లో పూర్తిగా ఆన్ లైన్ లో అనుమతులు మంజూరు చేసే రాష్ట్రం ఏపీ ఒక్కటే. దాంతో ఇక్కడ మెగా ప్రాజెక్టులు నెలకొల్పేందుకు బహుళ జాతి కంపెనీలు సైతం ఆసక్తి చూపుతున్నాయి. వివిధ రంగాలకు సంబంధించి గడచిన ఏడాదిన్నర కాలంలో 45 మెగా ప్రాజెక్టుల స్థాపనకు అనుమతి కోరుతూ సింగిల్ డెస్క్ కు దరకాస్తులు వచ్చాయి. వీటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతోపాటు పలు ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. ఆయా ప్లాంట్ల నిర్మాణానికి, యంత్ర సామాగ్రికి దాదాపు రూ.2,39,774 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయా కంపెనీలు ప్రభుత్వానికి సమర్పించిన పత్రాలలో వివరించాయి.  
        మెగా ప్రాజెక్టులలో పవర్ జనరేషన్ కు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. రూ.29,473 కోట్ల వ్యయంతో 12 పవర్ జనరేషన్ ప్రాజెక్టులు నెలకొల్పనున్నారు. ఆ తరువాత రూ.26,041 కోట్లతో 5 బల్క్ డ్రగ్స్, ఫార్మాస్యూటికల్ ప్రాజెక్టులు  ఏర్పాటు చేయనున్నారు. రూ.4,600 కోట్లతో డిఫెన్స్ అండ్ ఎరో ప్రాజెక్టు నిర్మిస్తారు. రూ.3,173 కోట్లతో మూడు సిమెంట్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడానికి అనుమతులు కోరారు. రూ.1,728 కోట్లతో ఆహారం, వ్యవసాయ, సముద్ర ఉత్పత్తుల శుద్ధి కర్మాగారాలు మూడు నెలకొల్పుతారు.  రూ.71,392 కోట్లతో ఆటో విడి భాగాలు, మోటార్ వాహనాల  ఉత్పత్తి ఫ్యాక్టరీలు నాలుగు ఏర్పాటు చేస్తారు.  రూ.811 కోట్లతో రెండు  కెమికల్, పెట్రోకెమికల్స్ ఫ్యాక్టరీలు, రూ.304 కోట్లతో టెక్స్ టైల్ పరిశ్రమ నెలకొల్పడానికి అనుమతులు పొందారు. రూ.1010 కోట్లతో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ పరిశ్రమను ప్రారంభిస్తారు. రూ.43,705 కోట్ల వ్యయంతో గ్రాస్, సెరామిక్ పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వాన్ని అనుమతులు కోరారు. రూ.3,198 కోట్లతో బేసిక్ మెటల్ పరిశ్రమలు నెలకొల్పుతారు. ఇక మిగిలిన రూ.54,339 కోట్లతో ఇంజనీరింగ్, ఐటీ, యంత్రపరికరాల తయారీ, స్టోన్ క్రషర్, పైప్స్ ఉత్పత్తి వంటి ఫ్యాక్టరీలు ప్రారంభించడానికి పలు సంస్థలు ప్రభుత్వ అనుమతులు కోరాయి.
పారిశ్రామీకరణకు రాష్ట్రంలో ఉన్న అనూకల పరిస్థితుల నేపధ్యంలో వేల పరిశ్రమలు నెలకొల్పడానికి అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి.
        ప్రముఖ సంస్థల ప్రాజెక్టులు
         అనుమతులు పొందిన, పొందవలసిన వాటిలో పేరుపొందిన ప్రముఖ సంస్థలే ఉన్నాయి.  కేంద్ర ప్రభుత్వ సంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(జీఏఐఎల్), హిందూజా నేషనల్ పవర్ కార్పోరేషన్, ఏషియన్ పెయింట్స్ఎమ్మెన్నార్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, సిటీ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, పద్మా ఇండస్ట్రీస్(సెరామిక్స్), ఏపీ పవర్ జనరేషన్ కార్పోరేషన్ లిమిటెడ్, దయానిధి సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్కేకేఆర్ గ్రూప్ కు చెందిన ఎస్బీక్యూ స్టీల్స్, శ్రీ సత్యలక్ష్మి స్టోన్ క్రషర్స్, శెట్టినాడు సిమెంట్ కార్పోరేషన్ లిమిటెడ్, కేసీపీ సిమెంట్స్, అరవిందో ఫార్మా లిమిటెడ్, మోండెల్జ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, గ్లోకెమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి సంస్థలు ఉన్నాయి.

మెగా ప్రాజెక్టులకు కావలసిన ఫ్యాక్టరీ ప్లాన్, భవన నిర్మాణాలకు అనుమతి, పట్టణ, గ్రామీణ ప్రణాళికా శాఖ, గాలి, నీరు చట్టాలకు సంబంధించి రెడ్ క్యాటగిరీ, ఆరంజ్ క్యాటగిరి, పవర్ ఫీజుబిలిటీ సర్టిఫికెట్బాయిలర్ ఎరక్షన్ సర్టిఫికెట్, విద్యుత్ శాఖ, గ్రామ పంచాయతీ, ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్, ప్రమాదకర వ్యర్థాలకు సంబంధించి, కొత్త బావుల తవ్వకం, అగ్నిమాపకదళం, వ్యాట్, సీఎస్టీ  రిజిస్ట్రేషన్, 11కేవీ లేక 35 కేవీ విద్యుత్ సరఫరా వంటి అనుమతులు చాలా వరకు మంజూరు చేశారు. కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఆయా శాఖలు కోరిన విధంగా  సింగిల్ డెస్క్ వారు కంపెనీలను వివరణ కోరారు. అంతేకాకుండా
పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా  రాష్ట్రంలో ఏపీ పారిశ్రామిక, మౌలిక వసతుల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) లక్షా 21 వేల 655 ఎకరాలలో 300 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసింది. ఇంకా మరికొన్ని పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్టులు అన్నీ కార్యరూపం దాల్చితే రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతోపాటు యువత ఉపాధికి కొదవ ఉండదు. లక్ష్యాల మేరకు రాష్ట్రం రెండంకెల స్థిరమైన ఆర్థిక వృద్ధి సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది.

-          శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్
^____________________________________________________________________________________
                    ఇలా చదవండి-విజయం మీదే
పంచాయతీ సెక్రటరీ(గ్రేడ్-IV) పోస్టుల పోటీ పరీక్షలకు సిలబస్
      ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ కోసం గత నెలలో విడుదల చేసిన  నోటిఫికేషన్లలో పంచాయతీరాజ్ సబార్డినేట్ సర్వీస్ లో  పంచాయతీ సెక్రటరీ(గ్రేడ్-IV) పోస్టులే అత్యధికంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 1055 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ సారి పోటీ పరిక్షలకు వయోపరిమితిని 42 సంవత్సరాలకు పెంచడంతో పోస్టులకు తగ్గట్టుగానే అత్యధిక మంది పోటీపడే అవకాశం ఉంది. అందువల్ల ఈ పోస్టు కోసం పోటీ పడే అభ్యర్థులు ప్రణాళికాబద్దంగా కాస్త ఎక్కువగానే  అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. ఈ ఖాళీలకు 25వేల మందికి మించి అభ్యర్థులు పోటీపడితే కమిషన్ ముందుగా స్క్రీనింగ్ టెస్  నిర్వహిస్తుంది. ఎక్కువ మంది అభ్యర్థులు దరకాస్తు చేసుకునే అవకాశం ఉన్నందున  ఏప్రిల్ 23న ఆఫ్ లైన్ లో  స్క్రీనింగ్ టెస్  నిర్వహించే అవకాశం ఉంది. అందులో ఎంపికైన వారికి మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఆ పరీక్ష జూలై 16న నిర్వహించే అవకాశం ఉంది. ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థులు (1:50 నిష్పత్తి) ఉండే విధంగా  జనరల్ మెరిట్ లో మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు.  మెయిన్ పరీక్షను ఆన్ లైన్ లో నిర్వహిస్తారు.

పరీక్షల విధానం :
స్ర్కీనింగ్ టెస్ట్, మెయిన్ పరీక్ష రెండూ డిగ్రీ స్థాయిలో ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. స్ర్కీనింగ్ టెస్ట్ లో 150 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. సమయం 150 నిమిషాలు కేటాయిస్తారు. ఈ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ఏదైన ఒక ప్రశ్నకు జవాబు తప్పుగా మార్క్ చేస్తే, ఒన్ థర్డ్ మార్క్ నష్టపోవలసి ఉంటుంది. అంటే మూడు జవాబులు తప్పుగా మార్క్ చేస్తే ఒక మార్కు పోతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని జవాబులు మార్క్ చేయవలసి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక నిమిషం సమయం ఉన్నందున జాగ్రత్తగా ఆలోచించి జవాబు మార్క్ చేయడం మంచింది.
మెయిన్ పరీక్ష: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్లో 150 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. 150 నిమిషాల సమయం ఉంటుంది. మొదటి పేపర్ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీలో 150 మార్కులకు ఉంటుంది. రెండవ పేపర్ గ్రామీణాభివృద్ధి, ఏపీలోని గ్రామీణ ప్రాంత సమస్యలపై 150 మార్కులకు ఉంటుంది.  మొత్తం 300 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. దీంట్లో కూడా స్ర్కీనింగ్ టెస్ట్ లో మాదిరే మైనస్ మార్కులు ఉంటాయి. ఏదైన ఒక ప్రశ్నకు తప్పుడు జవాబు మార్క్ చేస్తే, ఒన్ థర్డ్ మార్క్ మైనస్ చేస్తారు. మూడు ప్రశ్నలకు తప్పుడు జవాబులు మార్క్ చేస్తే ఒక మార్క్ మైనస్ చేస్తారు.

స్ర్కీనింగ్ టెస్ట్ సిలబస్:
1.జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలకు సంబంధించి కరెంట్ ఎఫైర్స్.
2. జనరల్ సైన్స్ లో ప్రాధమిక అంశాలు, దైనందిక జీవితంలో వాటి ప్రధాన్యత. సైన్స్, టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలలో జరుగుతున్న అభివృద్ధి.
3. జాతీయోధ్యమం, ఆధుని భారత దేశ చరిత్ర.
4.స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత దేశంలో ఆర్థికాభివృద్ధి.
5. లాజికల్ రీజనింగ్, విశ్లేషణా సామర్థ్యం, డేటా ఇంటర్ ప్రిటేషన్.
6. భారత రాజ్యాంగం స్థూల పరిశీలన.
7. ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు- విభజన కారణంగా తలెత్తిన రాజకీయ, పరిపాలన, ఆర్థిక,సామాజిక, సాంస్కృతిక, న్యాయపరమైన సమస్యలు.
8.భారత దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ స్వరూపం, దానిలో వచ్చిన మార్పులు, దానికి సంబంధించి  జరిగిన రాజ్యాంగ సవరణలు, వివిధ కమిటీల నివేదికలు.
9. ఏపీలో పంచాయతీరాజ్ వ్యవస్థ, దానిలో వచ్చిన మార్పులు.
10. ఏపీ పంచాయతీరాజ్ శాఖలోని ప్రధానమైన పథకాలు.
11. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు, గ్రామీణ చేతివృత్తులు.
12. ఏపీలో గ్రామీణ పరపతి స్వరూపం. ఇందులో బ్యాంకులు, సహకార సంఘాలు, మైక్రో ఫైనాన్స్ వంటి వాటి పాత్ర.
13. స్వయం సహాయకం సంఘాల ద్వారా మహిళా సాధికారత, ఆర్థిక అభివృద్ధి.

         ఈ పరీక్ష కోసం 6వ తరగతి నుంచి 10 తరగతి వరకు సైన్స్, సోషల్ పుస్తకాలను చదవాలి. వాటిలో భౌతిక, రసాయన,జీవ, పౌర, అర్థ శాస్తాలతోపాటు జాగ్రఫీ కూడా ఉంటుంది.  5 నుంచి 8 వరకు గణితం పుస్తకాలను అధ్యయనం చేయాలి. ఆధుని భారత దేశ చరిత్ర, జాతీయోధ్యమం కోసం డిగ్రీ చరిత్ర పుస్తకం చదవడం ఉత్తమం. కరెంట్ ఎఫైర్స్ కోసం ప్రతి రోజూ పేపర్లు చదవాలి. అమెరికా అధ్యక్షుని ఎన్నిక, దావోస్ సమ్మిట్ వంటి అంతర్జాతీయ, పెద్ద నోట్ల రద్దు, క్యాష్ లెస్ లావాదేవీలు వంటి జాతీయ, నూతన రాజధాని అమరావతి, విశాఖలో పార్టర్ షిప్ సమ్మిట్ వంటి రాష్ట్ర అంశాలను తెలుసుకోవాలి. రాష్ట్ర విభజనకు కారణాలు, విభజన తరువాత తలెత్తిన సమస్యలపై అవగాహన ఉండాలి. ఆరోగ్యబీమా, ఎన్టీఆర్ వైద్యసేవలు, ఎన్టీఆర్ గృహనిర్మాణం వంటి ప్రభుత్వ పథకాలతోపాటు సీఆర్డీఏ, సింగిల్ విండో విధానం, కాపు కార్పోరేషన్, కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం, పంచాయతీరాజ్ వ్యవస్థ స్వరూపం మొత్తం తెలుసుకోవాలి. రైతు రుణాల మాఫీ, మహిళా సాధికారిత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, జిల్లాలు, నదులు, పంటలు వంటి వాటిపై అవగాహన ఉండాలి. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలకు వచ్చేసరికి స్వచ్చభారత్, మేక్ ఇన్ ఇండియా, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం), ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన వంటి పథకాలు గురించి తెలుసుకోవాలి. ఆయా అంశాలకు సంబంధించి పుస్తకాలు మార్కెట్లో దొరుకుతాయి. అలాగే ఇంటర్నెట్ లో అన్ని వ్యవస్థలపై వెబ్ సైట్స్ ఉన్నాయి. వాటిలో తాజా సమాచారం దొరుకుతుంది. సెన్సెస్ సైట్ లోకి వెళితే 2011 భారతదేశ జనాభాతోపాటు రాష్ట్రం, జిల్లా, పట్టణం గ్రామాల జనాభాకు సంబంధించి పూర్తి వివరాలు వేరువేరుగా లభిస్తాయి. అలాగే గూగుల్ సెర్చింజన్  లోకి వెళ్లి ఏ అంశం కావాలో దానిని ఎంటర్ చేస్తే ఆ వెబ్ సైట్లు కనిపిస్తాయి. సీఎం డ్యాష్ బోర్డు, సీఆర్డీఏ, ఎంజీఎన్ఆర్ఈజీఎస్, జన్ ధన్ యోజన, అసెంబ్లీ, పార్లమెంట్, ప్రసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆధార్....ఇలా ప్రతిదానికి వెబ్ సైట్ ఉంటుంది. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ విషయాలన్నిటినీ తెలుసుకోవడం సులభమైంది. అయితే చదవడమే ప్రణాళిక ప్రకారం చదవాలి.

మెయిన్ పరీక్ష
పేపర్ - I  జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ
1.     జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత గల సంఘటనలు.
2.    జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలకు సంబంధించి కరెంట్ ఎఫైర్స్.
3.    జనరల్ సైన్స్ లో ప్రాధమిక అంశాలు, దైనందిక జీవితంలో వాటి ప్రధాన్యత. సైన్స్, టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలలో జరుగుతున్న అభివృద్ధి.
4.     జాతీయోధ్యమం, ఆధుని భారత దేశ చరిత్ర.
5.    స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత దేశంలో ఆర్థికాభివృద్ధి.
6.    లాజికల్ రీజనింగ్, విశ్లేషణా సామర్థ్యం, డేటా ఇంటర్ ప్రిటేషన్.
7.    విపత్తు నిర్వహణకు సంబంధించి ప్రాధమిక అంశాలు(సీబీఎస్ఈ VIII & IVస్థాయి).
8.    ఏపీకి ప్రాధాన్యత ఇస్తూ భారతదేశ భౌగోళిక స్వరూపం.
9.     భారత రాజ్యాంగం స్థూల పరిశీలన.
10.      పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధికి అవకాశాలు
11.  ఆంధ్రప్రదేశ్ విభజన - ఆ కారణంగా తలెత్తిన రాజకీయ, పరిపాలన, ఆర్థిక,సామాజిక, సాంస్కృతిక, న్యాయపరమైన సమస్యలతోపాటు ఈ దిగువ తెలిపిన అంశాలు
  ఏ. రాజధాని నగరాన్ని వదులుకోవడం, కొత్త రాజధాని నిర్మాణంలో ఎదురయ్యే చాలెంజెస్, ఆర్థిక సమస్యలు.
బి. ఉమ్మడి సంస్థల విభజన
సీ. ఉద్యోగుల విభజన, వారి తరలింపు, వారి స్థానికత సమస్యలు
డీ. వాణిజ్యం, వ్యాపార సంస్థలపై విభజన ప్రభావం.
ఈ. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరుల సమస్య.
ఎఫ్. విభజన తరువాత రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు, మౌలిక సదుపాయా ల అభివృద్ధి.
జీ. జనాభాతోపాటు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలపై విభజన ప్రభావం.
హెచ్. నదీ జలాల పంపకం, సంబంధిత అంశాలపై విభజన ప్రభావం.
ఐ. ఏపీ పునర్వవస్తీకరణ చట్టం-2014, ఏక పక్ష విభజన.

పేపర్ –II  గ్రామీణాభివృద్ధి, గ్రామీణ ప్రాంత ముఖ్యంగా ఏపీలోని సమస్యలు

1.     భారత దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ స్వరూపం, దానిలో వచ్చిన మార్పులు, దానికి సంబంధించి  జరిగిన రాజ్యాంగ సవరణలు, వివిధ కమిటీల నివేదికలు.
2.    ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీరాజ్ వ్యవస్థ.
3.    పంచాయతీ సెక్రటరీ బాధ్యతలు.
4.    గ్రామీణ సమాజం : గ్రామీణ పేదల అభివృద్ధికి ఉపయోగపడిన పథకాలు
5.    గ్రామీణాభివృద్ధికి ఉపకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖల అతి ముఖ్యమైన పథకాలు.
6.    ఏపీ పంచాయతీరాజ్ శాఖకు చెందిన ముఖ్యమైన పథకాలు
7.    రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ: వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు, గ్రామీణ చేతి వృత్తిదారులు.
8.    ఏపీలో గ్రామీణ పరపతి : బ్యాంకులు, సహకార సంఘాలు, మైక్రో ఫైనాన్స్
9.    కమ్యునిటీ ప్రాతిపదికగా ఏర్పాటైన సంస్థలు, సంక్షేమ పథకాలు
10.           . స్వయం సహాయకం సంఘాల ద్వారా మహిళా సాధికారత, ఆర్థిక అభివృద్ధి.
11.            స్థానిక సంస్థల ఆదాయ, వ్యయాల నిర్వహణ
12.           వివిధ పథకాల కింద వచ్చిన నిధుల నిర్వహణ, వాటి జమాఖర్చుల లెక్కలు.

మెయిన్ పరీక్ష సిలబస్ ని పరిశీలిస్తే  కొన్ని అంశాలు స్ర్కీనింగ్ టెస్ట్ సిలబస్ లోనివే అయినప్పటికీ పరిధి ఎక్కువగా ఉంది. దానికి తోడు కొన్ని కొత్త అంశాలు కూడా చేరాయి. అంటే దాని కంటే మెయిన్ కు ఎక్కవగా కష్టపడవలసిన అవసరం ఉంది. విపత్తు నిర్వహణ, పంచాయతీరాజ్ సెక్రటరీ బాధ్యతలు, పర్యావరణ, ఆదాయ,వ్యయాల లెక్కలు, నిధుల నిర్వహణ వంటివి అదనంగా వచ్చాయి. అలాగే రాష్ట్ర విభజన పరిణామ క్రమం, విభజన తీరు, ఆ తరువాత ఎదుర్కొంటున్న సమస్యలు, రాజధాని నిర్మాణం వంటి అంశాలతో విస్తృత స్థాయిలో అధ్యయనం చేయాలి.  ఇందు కోసం యోజన, ఆంధ్రప్రదేశ్ వంటి పుస్తకాలు చదడంతోపాటు పంచాయతీరాజ్, ఏపీ రూరల్ డెవలప్ మెంట్, నాబార్డ్... వంటి వెబ్ సైట్లను అధ్యయనం చేయాలి. ఆ వెబ్ సైట్లలోకి వెళితే సంబంధింత వెబ్ సైట్ల లింకులు కూడా ఉంటాయి. ఆ విధంగా కూడా కొత్తకొత్త వెబ్ సైట్ల గురించి తెలుస్తుంది. కొన్ని వెబ్ సైట్లలో తెలుగులో కూడా సమాచారం ఉంటుంది.

ఈ పరీక్షలకు ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన వెబ్ సైట్లు ఈ దిగువ ఇస్తున్నాం.

india.gov.in
presidentofindia.gov.in
www.ap.gov.in
desap.cgg.gov.in
aplegislature.org
reorganisation.ap.gov.in
core.ap.gov.in
www.crda.ap.gov.in
pmjdy.gov.in
rural.nic.in
digitalindia.gov.in
www.apagrisnet.gov.in
apseeds.ap.nic.in
www.nrega.ap.gov.in
www.ssp.ap.gov.in   
www.egmm.cgg.gov.in      
www.aaby.ap.gov.in 
www.socialaudit.ap.gov.in 
www.apard.gov.in    
www.rdhrms.ap.gov.in      
www.iwmp.ap.gov.in
www.serp.ap.gov.in
www.apagros.org
www.haca.co.in
www.aphorticulture.com
www.apmarkfed.org
www.market.ap.nic.in
www.icrisat.org
www.angrau.net
www.agri.ap.nic.in
www.sfci.nic.in
www.nsc.gov.in
www.apssca.ap.nic.in
www.nafed-india.com
horticulturedept.ap.gov.in
www.nabard.org
www.censusindia.gov.in
goidirectory.nic.in
apahd.gov.in
jbmv.ap.gov.in

-          శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్.
-------------------------------------------------------------------------------------------------------------------------------------------

26.01.2017 విశాలాంధ్ర నుంచి

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...