Jan 16, 2017

దిగ్విజయంగా ముగిసిన జన్మభూమి సభలు


Ø 16,400 సభల నిర్వహణ
Ø 5,79,474 కొత్త  రేషన్ కార్డులు
Ø 26,21,086 మందికి రూ.278.54 కోట్ల పెన్షన్లు
Ø 3,139 మందికి సైకిళ్లు పంపిణీ
Ø గర్భిణులకు సీమంతాలు, పిల్లలకు అన్నప్రాసన
              రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2 నుంచి 11 వరకు పది రోజుల పాటు  ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 4వ విడత ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమాలు దిగ్విజయంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 16,400 గ్రామ,వార్డు సభలు జరిగాయి. అన్ని వర్గాల ప్రజలకు వివిధ రకాల భద్రతలు కల్పిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమాలలో  ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కుటుంబ వికాసం(15 అంశాలు), సమాజ వికాశం(పది అంశాలు) పేరుతో జరిగిన ఈ సభలలో పండుగ వాతావరణం నెలకొంది. అన్ని వర్గాల ప్రజలతోపాటు విద్యార్థులు అత్యధికంగా ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,46,026 మంది విద్యార్థులు, 47,142 మంది ఉపాధ్యాయులు, 36,763 మంది అంగన్ వాడీ కార్యకర్తలు, పాల్గొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు 13,350 కార్యక్రమాలకు హాజరయ్యారు. తహశీల్ దార్లు, ఎండీఓలు, ఎంఆర్ఓలు,  మునిసిపల్ కమిషనర్లు, హౌసింగ్, పంచాయతీరాజ్, పోలీస్, ఇరిగేషన్, వ్యవసాయ, వైద్యఆరోగ్య, పశుసంవర్థక శాఖల అధికారులు, ఐసీడీఎస్ అధికారులు, వీఆర్ఓలు, జన్మభూమి కమిటీ సభ్యులు,పంచాయతీ కార్యదర్శులు, శానిటరీ ఇనస్పెక్టర్లు, నీటి వినియోగ సంఘాల వారు ఈ కార్యక్రమాలలో పెద్ద ఎత్తున పాల్గొని తమ సేవలందించారు.
 26,21,086 మందికి రూ.278.54 కోట్ల పెన్షన్లు
   వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు మొత్తం 26,21,086 మందికి రూ.278.54 కోట్లు పంపిణీ చేశారు. 5,79,474 రేషన్ కార్డులు అందజేశారు.
ఆహార రక్షణ కార్యక్రమం కింద అర్హులైన 93,48,753 మంది 5 కిలో బియ్యం చొప్పున లబ్ది పొందారు. 81,22,950 మంది సంక్రాంతి కానుకలు, 15,24,172 మంది క్రిస్మస్ కానుకలు అందుకున్నారు. బీమా రక్షణలో భాగంగా  చంద్రన్న బీమా పథకం కింద 1,13,939 చనిపోయినవారి తరపున క్లెయిమ్ చేశారు. అంగవైకల్యం పొందిన 45,192 మంది బీమా కోసం దరకాస్తు చేసుకుననారు.
            విద్యుత్ రక్షణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,25,86,183 గృహాలకు 24 గంటలూ విద్యుత్ సరఫరా అవుతోంది. వ్యవసాయానికి రోజుకు 7 గంటల పాటు ఉచిత విద్యుత్ పథకం కింద 14,52,085 రైతులు లబ్ది పొందుతున్నారు. నీటి రక్షణలో భాగంగా పంటసంజీవని పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరం(2016-17)లో 6,26,238 ఫారమ్ పాండ్స్ మంజూరు చేశారు. ఇప్పటి వరకు 3,36,545 పూర్తి చేశారు. 3,59,728 నివాస ప్రాంతాలకు పూర్తిగా, 4,03,648 ప్రాంతాలకు పాక్షికంగా త్రాగునీటిని అందిస్తున్నారు. నీరు-ప్రగతి పథకం కింద కొత్తగా 1,67,392 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం కల్పించారు. కరవు ప్రాంతాలలో 15,025 రెయిన్ గన్స్ ఉపయోగించారు.
           రాష్ట్రంలో సొంత ఇల్లు లేని  ప్రతి కుటుంబానికి సొంత ఇంటిని సమకూర్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద 2,31,233 ఇళ్లను మంజూరు చేసింది. పారిశుధ్య రక్షణలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం కింద 17,58,842 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేశారు. వాటిలో 10,04,817 నిర్మాణం పూర్తి అయ్యాయి.
16,311 వైద్యశిబిరాలు
 అందరికీ ఆరోగ్య రక్షణ కల్పించే ఉద్దేశంలో ఈ కార్యక్రమాలలో 16,311 వైద్యశిబిరాలు నిర్వహించారు. 8,90,048 మందికి మందులు పంపిణీ చేశారు. 35,779 మందికి కంటి చూపు లోపం ఉందని, వారికి కళ్లద్దాలు కావాలని గుర్తించారు. కంటి ఆపరేషన్ చేయడానికి 6,195 మంది పేర్లను నమోదు చేశారు. 37,643 మందిని ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పథకానికి అర్హులుగా గుర్తించారు. తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్ పథకం కింద 94,157 మంది లబ్ది పొందారు. 108 సేవల కింద 1,48,709 మంది, 104 సర్వీసుల కింద 9,75,190 మంది లబ్ది పొందారు. ప్రజలకు తక్కువ ధరలకు మందులు అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 7,277 జనరిక్ మెడికల్ షాపులను ఏర్పాటు చేశారు.
 15,244 పశ వైద్య శిబిరాలు
జన్మభూమి సందర్భంగా గ్రామాలలో 15,244 పశ వైద్య శిబిరాలు నిర్వహించారు. 15,21,910 పశువులకు వైద్యం చేశారు. 47,284 పశువులకు కృత్రిమ గర్భధారణ చేయించారు. 83,20,080 గొర్రెలకు డీ-వార్మింగ్ చేశారు. 4,61,333 దూడలకు కూడా డీ-వార్మింగ్ చేశారు. పశుగ్రాస రక్షణలో భాగంగా పశు-మిత్రాస్ ద్వారా 3,07,984 కుటుంబాలు పశుగ్రాసాన్ని సమకూరుస్తున్నాయి. జీవన్-మిత్ర పథకం కింద 2,32,799 కుటుంబాలు గొర్రెలకు మేతను అందిస్తున్నాయి.

3,139 మందికి సైకిళ్లు పంపిణీ
విద్యా రక్షణలో భాగంగా 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులు 3,139 మందికి సైకిళ్లు పంపిణీ చేశారు. 10,339 విద్యార్థులకు ప్రతిభ అవార్డులు ఇచ్చారు. పలు చోట్ల డిజిటల్ క్లాస్ రూములు ఏర్పాటు చేశారు. ఉద్యోగ భద్రత కింద ఈ ఆర్థిక సంవత్సరంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కింద 72,96,907 జాబ్ కార్డులు పంపిణీ చేశారు. ఈ పథకం కింద 160,20,83,152 పని దినాలు కల్పిచారు. ఇందుకు రూ.1651 కోట్లు ఖర్చు చేశారు. విజ్ఞాన భద్రత కింద రాష్ట్ర వ్యాప్తంగా నెలకు రూ.149 రూపాయలకే ఇంటర్నెట్, ఫోన్, కేబుల్ టీవీ కనెక్షన్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 15,930 కనెక్షన్లు ఇచ్చారు. ఆదాయభద్రతలో భాగంగా ప్రతి కుటుంబం నెలకు కనీసం రూ.10 వేలు సంపాదించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ కింద 1,00,530 ఎస్సీ,ఎస్టీ కుటుంబాలు ఆ ఆదాయం పొందే ఏర్పాట్లు చేశారు.
 2017-18 యాక్షన్ బడ్జెట్ ప్లాన్లు
 ఆయా గ్రామ పంచాయతీలు, వార్డులలో 2014 జూన్ నుంచి సాధించిన ఫలితాల వివరాలు తెలుపుతూ 13,856 చోట్ల బహిరంగంగా బోర్డులు ఏర్పాటు చేశారు. గ్రామాలు, వార్డులు అభివృద్ధికి సంబంధించి  రూపొందించిన 2017-18 యాక్షన్ బడ్జెట్ ప్లాన్లను 13,271 చోట్ల రూపొందించారు. 15,078 చోట్ల  కుటుంబ వికాసం, సమాజ వికాసం కార్యక్రమాలను నిర్వహించారు. అంతే కాకుండా గర్భిణులకు ప్రభుత్వం తరపున సీమంతం వేడుకలు, చిన్న పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనేక సంక్షేమ పథకాలతోపాటు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల సభలలో  మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
క్యాష్ లెస్ లావాదేవీలపై అవగాహన
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం క్యాష్ లెస్ లావాదేవీలను విస్తృతంగా ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా  జన్మభూమి కార్యక్రమాలలో క్యాష్ లెస్ లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామ సభలలో ఇప్పటి వరకు 7,47,900 మందికి ఈ అంశంపై శిక్షణ ఇచ్చారు. 7,82,575 రూపే కార్డులు పంపిణీ చేశారు. 6,57,423 రూపే కార్డులను యాక్టివేట్ చేశారు.  రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ జన్మభూమి కార్యక్రమాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, మునిసిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్ లు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొని ప్రజల సమస్యలకు పరిష్కార మార్గాలు చూపారు. సభలను విజయవంతం చేశారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...