Jan 11, 2017

జన్మభూమిలో ఆకర్షణగా సీమంత వేడుకలు


·       మహిళల నుంచి విశేస స్పందన
·       పార్టీలు, కులమతాలకు అతీతంగా ప్రజలందరూ చేరే వేదికలు

      రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4వ విడత ‘జన్మభూమి-మాఊరు’ సభలలో సీమంతాలు, అన్నప్రాశన వేడుకలు ఆకర్షణగా నిలుస్తున్నాయి. దాంతో పండుగ వాతావరణం నెలకొంటోంది. ప్రతి పౌరునికి 15 రకాల భద్రతలు కల్పిస్తూ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అర్హులైన వివిధ వర్గాల వారికి పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు, కొత్త దీపం కనెక్షన్లు, చంద్రన్న కానుకలు, 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు సైకిళ్లు వంటి వాటిని పంపిణీ చేస్తున్నారు. ఆరోగ్య బీమా కల్పిస్తున్నారు.  వైద్య శిబిరాలు నిర్వహించి, వైద్య పరీక్షలు చేయడంతోపాటు మందులను కూడా అందజేస్తున్నారు. గ్రామాలలో అయితే పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.  

అంతేకాకుండా మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ఈ ప్రభుత్వం జన్మభూమి సభలలో గర్భిణీలకు చీర, జాకెట్టు, పసుపు,కుంకు, ఆకులు, వక్కలు, పండ్లు ఇచ్చి సగౌరవంగా సీమంతాలు నిర్వహిస్తోంది. స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ (సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకం) వారు ఈ సీమంతాలు నిర్వహిస్తున్నారు. దాంతో మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను వేడుకగా జరుపుకొంటున్నారు. కొన్ని గ్రామాలలో అయితే చిన్న పిల్లలకు అన్నప్రాశన వేడుకలు కూడా జరుపుకుంటున్నారు. ఈ విధంగా ఒకే చోట ఇన్ని కార్యక్రమాలు సామూహికంగా  నిర్వహించడంతో తిరునాళ వాతావరణం నెలకొంటోంది. తమ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మునిసిపల్ చైర్మన్లు, సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో ఇటువంటి వేడుకలు జరగడంతో మహిళలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఈ సభలు సమస్యలకు పరిష్కార వేదికలుగా మారడంతో రాజకీయ పార్టీలు, కులమతాలతో సంబంధంలేకుండా అన్ని వర్గాల వారు హాజరవడంతో గ్రామ సభలలో సందడిసందడిగా ఉంటోంది.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...