Sep 26, 2020

వైఎస్ఆర్ పెళ్లి కానుక

"రాష్ట్రంలోని నిరుపేద  కుటుంబాలలో ఆడపిల్ల వివాహ కార్యక్రమము భారం కాకుండా, పెళ్లి కుమార్తె అయి అత్తరింటికి వెళ్లిన తర్వాత కూడా అభద్రత భావంతో ఉండకుండా ఉండేందుకు  రాష్ట్ర ప్రభుత్వం వారు పెళ్ళికానుక పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం పేదింటి ఆడపిల్లలకు ఆర్థిక సాయం చేయడం ద్వారా అండగా ఉండడమే కాక, బాల్య వివాహాలు నిర్మూలించేందుకు, వివాహము రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా వధువు కి రక్షణ కల్పించడం వైయస్సార్ పెళ్లి కానుక రూపకల్పన ముఖ్య ఉద్దేశం".

పథకం  మార్గదర్శకాలు

1, మండల సమాఖ్య/మెప్మా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.

2, అనంతరం అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు.

3, వివాహానికి ముందే సాయం మొత్తంలో 20 శాతం పెళ్లి కుమార్తె బ్యాంక్ ఖాతాలో వేస్తారు.

4, వివాహమయ్యాక మిగతా మొత్తాన్ని జమ చేస్తారు.

5, అనంతరం వివాహ దృవీకరణ పత్రం ఇస్తారు.

అర్హతలు

1, వధువు, వరుడు ఇద్దరు ప్రజాసాధికారిక సర్వే నందు నమోదు కాబడి ఉండాలి(వాలంటీర్ నందు HOUSEHOLD సర్వే చేసుకోవాలి.. దీనికి - మార్గ దర్శకాలు రావలసి ఉంది).

2, వధువు, వరుడు ఇద్దరూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండాలి.

3, వధువు, వరుడు ఇద్దరు ఆధార్ కార్డు కలిగి ఉండాలి.

4, వధువు కచ్చితంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.

5, వివాహ తేదీ నాటికి వధువుకు 18 సంవత్సరాలు, వరుడుకు 21 సంవత్సరములు పూర్తి అయి ఉండవలెను.

6, కేవలం మొదటి సారి వివాహం చేసుకునేవారు మాత్రమే ఈ పథకంకు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. అయితే, వధువు వితంతువు అయినప్పటికీ ఈ పథకమునకు దరఖాస్తు చేసుకోవచ్చును.

7, వివాహం తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే జరగవలెను.


ప్రోత్సహకం

1, వైఎస్ఆర్ పెళ్లి కానుక (ఎస్సీ) సాంఘిక సంక్షేమ శాఖ-40,000/-

2, వైయస్సార్ పెళ్లి కానుక (ఎస్సీ కులాంతర) సాంఘిక సంక్షేమ శాఖ-75,000/-

3, వైయస్సార్ పెళ్లి కానుక (గిరిపుత్రిక) గిరిజన సంక్షేమ శాఖ-50,000/-

4, వైయస్సార్ పెళ్లి కానుక (ఎస్టీ కులాంతర) గిరిజన సంక్షేమ శాఖ-75,000/-

5, వైయస్సార్ పెళ్లి కానుక (బిసి) బీసీ సంక్షేమ శాఖ-35,000/-

6, వైయస్సార్ పెళ్లి కానుక (బి సి కులాంతర) బిసి సంక్షేమ శాఖ-50,000/-

7, వైయస్సార్ పెళ్లి కానుక (dulhan) మైనార్టీ సంక్షేమ శాఖ-50,000/-

8, వైయస్సార్ పెళ్లి కానుక (దివ్యాంగులు) దివ్యాంగుల సంక్షేమ శాఖ-1,00,000/-

9, వైఎస్ఆర్ పెళ్లి కానుక (APBOCWWB) ఆంధ్రప్రదేశ్ భవనములు మరియు ఇతర నిర్మాణ రంగములోని కార్మిక సంక్షేమ సంస్థ, కార్మిక సంక్షేమ శాఖ-20,000/-


కావలసిన డాక్యుమెంట్స్

1, కులము - కమ్యూనిటీ మరియు జనన దృవీకరణ పత్రము.

2, వయసు - ఎస్ఎస్సి సర్టిఫికెట్ 2004 వ సంవత్సరం మరియు ఆ తరువాత పదవ తరగతి పాస్ అయిన వారికి(లేదా) డేట్ ఆఫ్ బర్త్(లేదా) ఆధార్ కార్డ్.

3, ఆదాయము (వధువు కి మాత్రమే) - తెల్ల రేషన్ కార్డు/ఇన్కమ్ సర్టిఫికెట్.

4, నివాసం - ప్రజా సాధికారిక సర్వే నందు నమోదు/హౌస్ హోల్డ్ సర్వే.

5,  అంగవైకల్యం - సదరం సర్టిఫికెట్ ( కనీసం 40% గా ఉండి శాశ్వత అంగవైకల్యం అయి ఉండాలి)

6, వితంతువు - ఆధార్ నెంబర్ ఆధారముగా ఫించన్ డేటాతో పరీసీలిస్తారు.

 వితంతువు అయ్యుండి పింఛన్ పొందకపోతే లేదా పించన్ డేటా లో వివరాలు లేకపోతే వ్యక్తిగత దృవీకరణ.

7, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు - ఎ.పి.బి.ఓ.సి.డబ్ల్యూ. డబ్ల్యూ.బి. చే జారీ చేయబడిన కార్మికుల యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్/గుర్తింపు కార్డ్.


పెళ్ళికానుక వెబ్ సైట్

http://ysrpk.ap.gov.in/Dashboard/index.html


పెళ్ళికానుక స్టేటస్

https://ysrpk.so.gov.in/Registration/cpkstatus

Sep 25, 2020

గాన గంధర్వుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం బహుముఖ ప్రజ్ఞాశాలి.  నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ వంటి పలు భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడారు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. ఆయన పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.

నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో 1946 జూన్ 4  జన్మించారు. తండ్రి శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, తల్లి శకుంతలమ్మ. జీవిత భాగస్వామి సావిత్రి, పిల్లలు చరణ్, పల్లవి.

 తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరారు. చదువుకుంటూనే వేదికల మీద పాటలు పాడుతూ పాల్గొంటూ బహుమతులు సాధించారు. 1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. చాలా మంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవాడు. అలాగే గాత్రదానం కూడా చేశారు. 

 1969 లో మొదటిసారిగా నటుడిగా కనిపించిన ఈయన తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించారు. తర్వాత అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించారు. ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘ సుమంగళీ భవ (1998) మొదలైనవి ఆయన నటించిన కొన్ని సినిమాలు. బాలు డబ్బింగ్ ఆర్టిస్టుగా అనేకమంది కళాకారులకు గాత్రదానం చేశాడు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వాళ్ళకి గాత్రదానం చేసారు.

 

సినిమాల్లోనే కాక టి.వి రంగంలో ఆయన పాడుతా తీయగా, పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమంది నూతన గాయనీ గాయకులను పరిచయం చేశారు. ఇవి కాకుండా ఈటీవీలో ప్రసారమైన స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో తన గానాన్ని వినిపించారు.

 బాలుకు కేంద్ర ప్రభుత్వంలో 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ పురస్కారాలు అందజేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నారు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు. 2012 లో ఆయన నటించిన మిథునం సినిమాకు  నంది ప్రత్యేక బహుమతి లభించింది.

 బాల్యం, విద్యాభ్యాసం      

బాలసుబ్రహ్మణ్యం 1946, జూన్ 4 న నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామంలో జన్మించాడు. బాలు తండ్రి సాంబమూర్తి, పేరొందిన హరికథా పండితుడు. తల్లి శకుంతలమ్మ. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కల పెద్ద కుటుంబములో బాలసుబ్రహ్మణ్యం రెండవ కుమారుడుగా జన్మించారు. బాల్యము నుండే బాలుకు పాటలు పాడటం ఒక హాబీగా ఉండేది. తండ్రి కోరిక మేరకు ఇంజనీరు కావాలనే ఆశయముతో మద్రాసులో AMIE కోర్సులో చేరారు. ఆ కాలంలోనే వివిధ పాటల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకొన్నారు బాలు.

 వృత్తి జీవితం     

మద్రాసులో ఎ.ఎం.ఐ.ఇ చదువుకుంటున్న సమయంలో బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేసారు. 1966లో నటుడు, నిర్మాత అయిన పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీగాయకునిగా చలన చిత్ర గాయక జీవితం ప్రారంభించారు. ఈ చిత్రానికి ఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకత్వం వహించారు. తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్ కు "కోదండపాణి ఆడియో ల్యాబ్స్" అని పేరే పెట్టుకున్నారు బాలు.  అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా నిలిచారు. పదాల మాదుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్చారణ అతని పాటను పండిత పామరులకి చేరువ చేసింది. శంకరాభరణం, సాగరసంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ఏక్ దుజే కేలియే లాంటి హిందీ చిత్రాలకు అతను పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. 40 ఏళ్ళ సినీప్రస్తానంలో 40 వేల పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచములోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించారు. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా అతను పాడిన పాటలకి జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గాన గంధర్వుడు.

 2016 నవంబరులో గోవాలో జరిగిన 47 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో అతనికి శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని (సెంటినరీ అవార్డ్‌ ఫర్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ 2016) ప్రదానం చేసారు.

1969లో వచ్చిన పెళ్ళంటే నూరేళ్ళ పంట అనే చిత్రంలో మొదటిసారిగా నటుడిగా కనిపించారు బాలు. 1990 లో తమిళంలో వచ్చిన కేలడి కన్మణి అనే చిత్రంలో బాలు కథానాయకుడినా నటించారు. ఇందులో రాధిక కథానాయిక. ఈ సినిమా తెలుగులో ఓ పాప లాలీ అనే పేరుతో అనువాదం అయింది. ఇంకా ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘ సుమంగళీ భవ (1998) వంటి సినిమాల్లో ప్రాధాన్యత కలిగిన సహాయ పాత్రలు నటించారు. 2012 లో తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన మిథునం సినిమాలో కథానాయకుడిగా నటించారు. ఇందులో లక్ష్మి నాయికగా నటించింది. ఈ సినిమాకు నంది ప్రత్యేక పురస్కారం లభించింది.

డబ్బింగ్ కళాకారుడిగా    

కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం మన్మధ లీలతో బాలు అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా మారారు. అందులో కమల్ హాసన్ కు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. తర్వాత ఆయన కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, కార్తీక్, నగేష్, రఘువరన్ లాంటి వారికి పలు భాషల్లో గాత్రదానం చేశారు. తమిళం నుంచి తెలుగులోకి అనువాదమయ్యే కమల్ హాసన్ చిత్రాలన్నింటికి ఈయనే డబ్బింగ్ చెబుతుండేవారు. 2010లో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన దశావతారం చిత్రంలో కమల్ పోషించిన పది పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇందులో కమల్ పోషించిన ముసలావిడ పాత్ర కూడా ఉంది. అన్నమయ్య చిత్రంలో సుమన్ పోషించిన వేంకటేశ్వర స్వామి పాత్రకు, సాయి మహిమ చిత్రంలో బాలు డబ్బింగ్ చెప్పారు. ఈ రెండు చిత్రాలకు ఆయనకు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారం లభించింది.

ఈటీవీలో పాడుతా తీయగా అనే కార్యక్రమంతో బాలసుబ్రహ్మణ్యం బుల్లితెర ప్రవేశం చేశారు. అనేక మంది కొత్త గాయనీ గాయకులను ఈ కార్యక్రమం ద్వారా పరిచయం చేసారు. 1996 లో మొదలైన ఈ కార్యక్రమం 2016 లో ఇంకా కొనసాగుతూనే ఉంది.

వ్యక్తిగత జీవితం  

బాలుకు సావిత్రితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. పల్లవి, ఎస్. పి. చరణ్. కొడుకు ఎస్. పి. చరణ్ కొన్ని సినిమాల్లో పాటలు పాడి, తర్వాత సినీ నిర్మాతగా కూడా మారారు. బాలు సోదరి ఎస్. పి. శైలజ కూడా సినీ నేపథ్య గాయని. ఈమె సోదరునితో కలిసి పలు చిత్రాల్లో పాటలు పాడారు. ఈమె నటుడు శుభలేఖ సుధాకర్ ను వివాహమాడారు. బాలు తల్లి శకుంతలమ్మ 2019 ఫిబ్రవరి 489 సంవత్సరాల వయసులో నెల్లూరులో మరణించారు.

2020 ఆగస్టు నెలలో కరోనా  వ్యాధి సోకడంతో ఆసుపత్రిలో చేరారు.

భారతీయ భాషల్లో ఆయన సుమారు 40 వేలకు పైగా పాటలు పాడారు. అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయకుడిగా ఆయన పేరిట ఒక రికార్డు ఉంది. ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నారు. 1979 లో వచ్చిన సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. రెండు సంవత్సరాల తర్వాత ఆయనకు 1981 లో బాలీవుడ్ లో ప్రవేశించి ఏక్ దూజే కేలియే చిత్రానికి  రెండోసారి పురస్కారాన్ని అందుకున్నారు. తర్వాత సాగర సంగమం (1983), రుద్రవీణ (1988) చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. 25 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు.

Sep 21, 2020

ఏపీ పోలీస్‌ శాఖ సరికొత్త యాప్

 దేశంలోనే తొలిసారిగా ఏపీ పోలీస్‌ శాఖ సరికొత్త యాప్‌ను రూపొందించింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ స్టేషన్‌‌కు వెళ్లే అవసరం లేకుండా ప్రజలకు 87 రకాల సేవలను పొందేలా ప్రత్యేకంగా ‘ఏపీ పోలీస్‌ సేవ’యాప్‌‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

పోలీసు స్టేషన్‌ ద్వారా లభించే అన్నిరకాల  సేవలను ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా పొందవచ్చు. అన్ని నేరాలపై ఫిర్యాదులు చేయొచ్చు..అంతే కాకుండా ఫిర్యాదులకు రశీదు కూడా పొందే విధంగా  యాప్ ను రూపొందించారు. పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనున్న ఈ ఏపీ పోలీస్‌ సేవ’యాప్‌‌.

ఏపీ పోలీస్‌ సేవ’యాప్‌‌ అందించే సేవలు: 

దర్యాప్తు పురోగతి, అరెస్టులు, ఎఫ్‌ఐఆర్‌లు, రికవరీలు,  రహదారి భద్రత, సైబర్‌ భద్రత, మహిళా భద్రత, వివిధ కార్యక్రమాలకు అనుమతులు, ఎన్‌వోసీలు, లైసెన్సులు, పాస్‌పోర్ట్‌ సేవలు, ఇతర వెరిఫికేషన్లు ఇలా అన్ని పోలీసు సేవలను యాప్‌ ద్వారా పొందవచ్చు.  

ఏపీ పోలీస్‌ సేవ’యాప్‌‌ నుంచే వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అత్యవసర సమయాల్లో  వీడియో కాల్‌ చేస్తే పోలీస్‌ కంట్రోల్‌ రూంకు వెంటనే సమాచారం వెళ్తుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే సమాచారాన్ని నిర్థారించుకునే సౌకర్యం. 

ఈ యాప్‌లో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా  12 మాడ్యూల్స్ తో  ' మహిళల కు రక్షణగా , తోడు నీడగా అన్ని వేళల్లో పోలీసులు తమకు రక్షణ ఉన్నారు అనే భావనతో వారిలో ఆత్మస్థైర్యాన్ని  కల్పించే విధంగా ఈ యాప్ సేవలను అందిస్తుంది. 

రాష్ట్రం లోని మహిళలకు అన్ని సందర్బాలలో అందుబాటులో ఉండే విధంగా అత్యంత ఆధునిక టెక్నాలజీ తో ప్రవేశ పెట్టిన  దిశ మొబైల్ అప్లికేషన్ (SOS)  స్వల్ప వ్యవధి లోనే  పదకొండు(11) లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. 568  మంది నుండి  ఫిర్యాదులు స్వీకరించగా 117 యఫ్.ఐ.ఆర్ లను నామోదు చేసి చర్యలు తీసుకున్నాము. 

ఆపదలో ఉన్న మహిళలకు తక్షణమే పరిష్కరించటం కోసం ఇప్పటికే  సైబర్‌ మిత్ర ప్రత్యేక వాట్సాప్‌ నెంబర్‌ 9121211100 మరియు ఫేస్ బుక్ పేజ్ అందుబాటులో ఉంది.ఇప్పటివరకు 1,850 పిటిషన్ లు అందగా 309 యఫ్.ఐ.ఆర్ లు నమోదు చేసి చర్యలు తీసుకున్నాం.  

 • సైబర్ నేరాలను నియంత్రించేందుకు అత్యాధునిక టెక్నాలజీతో సైబర్‌ల్యాబ్స్‌ను అందుబాటులోకి తెచ్చాము. 

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ కు  వీడియో కాన్ఫరెన్స్  సౌకర్యం.అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో కూడా  రిమోట్ ఏరియా కమ్యూనికేషన్ ఎన్‌హాన్స్‌మెంట్ వెహికల్స్ (రేస్) విధానం. నిరంతర నిఘా  కోసం డ్రోన్‌ల నుండి  ప్రత్యక్ష ప్రసారం.

అన్ని పోలీసు స్టేషన్లకు మొబైల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ పరికరాలు .ఇప్పటికే అందుబాటులో  బాడీవోర్న్ కెమెరాల లైవ్ స్ట్రీమింగ్ (BWC) పరికరాలు. 

స్వల్ప సమయంలో అత్యంత వెనుకబడిన ప్రాంతానికి చేరుకునే విధంగా ఇప్పటికే 3500 వాహనాలను జీపీఎస్ పరికరాలు & స్మార్ట్‌ఫోన్‌లతో అనుసంధానం

సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో జాతీయ స్థాయిలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ ఈ సంవత్సరం ఇప్పటికే 37  అవార్డులను దక్కించుకుంది. 

ఇప్పటికే అందుబాటులో  బాడీవోర్న్ కెమెరాల లైవ్ స్ట్రీమింగ్ (BWC) పరికరాలు.

పోలీస్ స్టేషన్, జైళ్లు మరియు గణనలు (ఐసిఎస్) ఇంటిగ్రేషన్. డిజిటల్ కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్ (డిజిటల్ మొబైల్ రేడియో రిపీటర్లు & మ్యాన్‌ప్యాక్‌లు)

ఆరు విభాగాల్లో ఏపీ పోలీస్‌ సేవ’యాప్‌ 87 రకాల సేవలు

శాంతి భద్రతలు.. 

♦నేరాలు, వేధింపులపై ఫిర్యాదులు 

♦ఎఫ్‌ఐఆర్‌ స్థితిగతులు, డౌన్‌లోడ్‌ 

♦దొంగతనం ఫిర్యాదులు/ రికవరీలు 

♦తప్పిపోయిన కేసులు /దొరికిన వారు/గుర్తు తెలియని మృతదేహాలు 

♦అరెస్టుల వివరాలు 

♦వాహనాల వివరాలు 

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సేవలు.. 

♦ఇంటి పర్యవేక్షణ(లాక్‌మానిటరింగ్‌ సర్వీసు(ఎల్‌ఎంఎస్‌) , ఇ–బీట్‌) 

♦ఇ–చలానా స్టేటస్‌ 

పబ్లిక్‌ సేవలు.. 

♦నేరాలపై ఫిర్యాదులు 

♦సేవలకు సంబంధించిన దరఖాస్తులు 

♦ఎన్‌వోసీ, వెరిఫికేషన్లు 

♦లైసెన్సులు, అనుమతులు 

♦పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌ 

 

రహదారి భద్రత.. 

♦బ్లాక్‌ స్పాట్లు 

♦యాక్సిడెంట్‌ మ్యాపింగ్‌ 

♦రహదారి భద్రత గుర్తులు 

♦బ్లడ్‌ బ్యాంకులు, డయాలసిస్‌ కేంద్రాలు, ఆసుపత్రులు, మందుల దుకాణాల వివరాలు


ప్రజా సమాచారం.. 

♦పోలీస్‌ డిక్షనరీ 

♦సమీపంలోని పోలీస్‌స్టేషన్‌ 

♦టోల్‌ఫ్రీ నంబర్లు 

♦వెబ్‌సైట్ల వివరాలు 

♦న్యాయ సమాచారం 

♦ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ నంబర్లు

అమరావతిపై స్టేటస్ కో అక్టోబరు 5వరకు పొడిగింపు

ఇకపై అంశాల వారీగా హైకోర్టులో విచారణ

తదుపరి విచారణ అక్టోబరు 5కి వాయిదా

అమరావతి నుంచి ఏపీ రాజధాని తరలింపుపై గతంలో ఇచ్చిన స్టేటస్ కోను హైకోర్టు అక్టోబరు 5 వరకు పొడిగించింది. రాజధాని పిటిషన్లపై నేడు విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు తదుపరి విచారణను అక్టోబరు 5కి వాయిదా వేసింది. ఇకపై అంశాల వారీగా పిటిషన్ల విచారణ జరపాలని ఈ సందర్భంగా న్యాయస్థానం నిర్ణయించింది.  తాజా విచారణ సందర్భంగా విశాఖలో కొత్త గెస్ట్ హౌస్ నిర్మాణం కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని, దీనిపై రాష్ట్ర సీఎస్ సంతకంతో కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దాంతో, తమకు వారం రోజుల సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. కాగా, రాజధాని అమరావతికి సంబంధించిన అంశాలపై ఇప్పటివరకు హైకోర్టులో 93 పిటిషన్లు దాఖలయ్యాయి. అమరావతి రైతులు, రైతు పరిరక్షణ సమితి నేతలు, మాజీ శాసనసభ్యుడు శ్రవణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్లు కూడా వాటిలో ఉన్నాయి. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లు, జీఎన్ రావు కమిటీ, హైపవర్ కమిటీ చట్టబద్ధత ఇత్యాది అంశాలపై ఈ పిటిషన్లు వేశారు.రాజధాని రైతులు సీఆర్డీఏతో చేసుకున్న ఒప్పందం ఉల్లంఘన, రాజధాని మాస్టార్ ప్లాన్ డీవియేషన్ పైనా, మౌలిక సదుపాయాల కల్పన చేయకపోవడం పైనా, రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ విధింపుపైనా రైతులు పిటిషన్లు వేసినట్టు తెలుస్తోంది.

Sep 20, 2020

చేనేత అభివృద్ధికి కృషి చేసిన‌‌ పుచ్చల సత్యనారాయణ


చేనేత వ‌ర్గానికి చెందిన
  స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు  పుచ్చల సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ లో 10-4-1909 సం.లో జన్మించారు. వీరు చిన్నతనం నుండి కమ్యూనిస్టు భావాలకు ఆకర్షితులై ఆ పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ కమ్యూనిస్టు యోధుడు గా ఎదిగారు. ఆనాటి స్వాతంత్రపోరాటాలలో పాల్గొంటూ 1936 లో ఉప్పాడలో జరిగిన ఉప్పు సత్యాగ్రహం సమయంలో అరెస్ట్ అయి జైలు జీవితం కూడా గడిపారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా  ప్రజలను చైతన్య పరచి సంఘసేవలు అందించేవారు. ఆ రోజుల్లోనే కులాంతర వివాహాలను ప్రోత్సహించి సర్వమానవ సమానత్వానికై పాటుబడేవారు.  1955 లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట నియోజకవర్గానికి కమ్యూనిస్టు పార్టీ తరుపున  పోటీ చేసిన పుచ్చల సత్యనారాయణ  అఖండ మెజార్టీతో గెలుపొందారు. 1962 వరకు ప్రజానాయకుడిగా తన సేవలు అందించారు.  దేవాంగ కులభూషణుడైన ఆయ‌న‌ ముఖ్యంగా చేనేత పరిశ్రమ అభివృద్ధికి చేసిన కృషి ఎనలేనిది. వారు కమ్యూనిస్టు నాయకుడుగా రష్యా, కెనడా,అమెరికా దేశాలను సందర్శించారు. ఆ సమయంలోనే చేనేత ఉత్పత్తులను ఆయా దేశాలలో ఎక్స్ పోర్ట్ చేయించడంలో ఆయన కృషి మరవలేనిది.  చేనేతవర్గాలపై ఆయన ప్రేమ ఎనలేనిది.అగ్రవర్గాలుగా చెప్పుకునే కొన్ని సామాజికవర్గాలు అభివృద్ధిలో మునుముందుకు దూసుకుపోతున్న తరుణంలో చేనేతవర్గాలు వెనుకబడిపోతున్న తీరును గమనించి విద్యతోనే అభివృద్ధి సాద్యమని గ్రహించి 1976 లో కాకినాడలో పేదవిద్యార్థులకు ఉచిత హాస్టల్ ఏర్పాటు చేసి ఎందరో విద్యార్థులకు చేయూతనందించారు.

MLA గా వున్న సమయంలోనే వారు చేనేత పరిశ్రమకు అద్దం పట్టేలా చేనేత దర్పణం అనే పుస్తాకాన్ని రచించారు. దానితో పాటు AP సేల్స్ టాక్స్ అనే మరో పుస్తకాన్ని కూడా రచించి ఎన్నో విషయాలు వాటిలో చర్చించారు.  ఇంకా వీరు అనేక సంస్థల్లో సభ్యులుగా వుంటూ తనదైన శైలిలో సేవలు అందిస్తూ అందరి మన్నలను అందుకున్నారు.  కొత్తపల్లి చేనేత సొసైటీ అధ్యక్షుడిగా, జిల్లా ప్లానింగ్ కమిటీ అధ్యక్షుడిగా .... అనేక సంస్థలో  ద్వారా సేవలు అందించారు.  తన చిరస్మరణీయమైన సేవలతో ఎందరికో స్పూర్తిని నింపుతూ తన జీవితమంతా పేదప్రజలకు,చేనేత వర్గాలకు ధారపోసిన ఆ మహానుభావుడు 29-9-1995న కన్నుమూశారు.


చెన్నైలో ఓ చేనేత పేరుతోనే టీన‌గ‌ర్




సర్ పిట్టి త్యాగరాయ శెట్టి  1852 ఏప్రిల్ 27వ తేదీన మదరాసు చాకలిపేటలోని సంపన్న చేనేత కుటుంబంలో జన్మించాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బి.ఏ.వరకు చదువుకున్నారు. తండియారు పేటలో మగ్గాలు పెట్టించి తాను స్వయంగా నేత నేసి, పది మంది చేత నేయించి అనేక బహుమతులు అందుకున్నారు. 1905లో ఆయన పర్యవేక్షణ కింద మదరాసులో చేతితో నాడి విసిరే త్రో షటిల్ మగ్గం స్థానంలో కుచ్చుతో నాడిలాగే షటిల్ మగ్గం రూపు దిద్దుకుంది.  తండ్రి అయ్యప్ప చేస్తున్న తోళ్ళవాప్యారంలోకి దిగి మంచి పేరు గడించారు.


40 సంవత్సరాలు మద్రాసు నగర మేయర్ గా వుండి నగరాభివృద్ధి నిస్వార్థంగా చేసిన కృషికి గుర్తింపుగా కార్పొరేషన్ కార్యాలయం (రిప్పన్ బిల్డింగ్) ముందు త్యాగరాయ శెట్టి విగ్రహం ప్రతిష్టించారు.  ఇది చేనేత వర్గీయులకెంతో గర్వకారణం. ఆయన స్మారకార్థం టి.నగర్ (త్యాగరాయ నగర్) అని పేరు పెట్టడం జరిగింది. 1921లో దివాన్ బిరుదు పొందారు. 1920లో లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడై ముఖ్యమంత్రి పదవి  వరించి వచ్చినా సున్నితంగా తిరస్కరించారు. 1921లో సర్ బిరుదు వచ్చింది చేనేత వారి బిడ్డల విద్యాభివృద్ధికై 1897లో నార్త్ మదరాసు హిందూ హైస్కూలును స్థాపించారు. 1906నాటికి ఉన్నత పాఠశాల అయింది. 1950 నాటికి త్యాగరాయ కళాశాలగా రూపుదిద్దుకుంది.   ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ కాలేజీకి 45,000 రూపాయల విరాళం యిచ్చింది.  1921 లో ఏర్పడిన అఖిల భారత పద్మశాలి సంఘానికి, చేనేత ఉద్యమాలకు పేద చేనేత విద్యార్థులకు ధారాళంగా ధన సహాయం చేసిన ధర్మమూర్తి త్యాగరాయ శెట్టి.    1925, జూన్ 30న త‌న 73వ ఏట‌ ఆయ‌న క‌న్నుమూశారు. ఆయన వారసత్వం పోకుండా కుమారులు కుమార స్వామి శెట్టి, బెంగాల్ రాయ్ శెట్టి చేనేత కాంగ్రెస్ కార్యక్రమాలకు యితోధికంగా సహకరించేవారు. మదరాసులో  నిర్వహించిన పలు కార్యక్రమాలకు, ప్రత్యేకించి 1951 సత్యాగ్రహానికి, చిన్నా పెద్ద మీటింగులకు త్యాగరాయ కాలేజి కేంద్రస్థానంగా నిలిచింది.

- గోలి హనుమంత రావు


Sep 14, 2020

ఐపిసిలో కొన్ని సెక్షన్ లు

  * సెక్షన్ 307 * = హత్యాయత్నం

  * సెక్షన్ 302 * = హత్యకు శిక్ష

  * సెక్షన్ 376 * = అత్యాచారం

  * సెక్షన్ 395 * = దోపిడీ

  * సెక్షన్ 377 * = అసహజ కదలికలు

  * సెక్షన్ 396 * = దోపిడీ      సమయంలో హత్య

  * సెక్షన్ 120 * = కుట్ర

  * సెక్షన్ 365 * = కిడ్నాప్

  * సెక్షన్ 201 * = సాక్ష్యాలను తొలగించడం

  * సెక్షన్ 34 * = వస్తువుల ఉద్దేశం

  * సెక్షన్ 412 *= జరుపుకుంటున్నారు

  * సెక్షన్ 378 * = దొంగతనం

  * సెక్షన్ 141 * = అక్రమ డిపాజిట్

  * విభాగం 191 * = తప్పు లక్ష్యం

  * సెక్షన్ 300 *   =   హత్య

  * సెక్షన్ 309 * = ఆత్మహత్య ప్రయత్నం

  * సెక్షన్ 310 * = మోసం

  * సెక్షన్ 312 * = గర్భస్రావం

  * సెక్షన్ 351 * = దాడి చేయడానికి

  * సెక్షన్ 354 * = మహిళలపై సిగ్గు

  * సెక్షన్ 362 * = కిడ్నాప్

  * సెక్షన్ 415 * = ట్రిక్

  * సెక్షన్ 445 * = దేశీయ వివక్ష

  * సెక్షన్ 494 * = జీవిత భాగస్వామి  జీవితంలో పునర్వివాహం

  * సెక్షన్ 499 * = పరువు నష్టం

  * సెక్షన్ 511 * = నేరారోపణపై జీవిత ఖైదు.

   మ‌రికొన్ని ముఖ్య‌మైన విష‌యాలు

 (1) సాయంత్రం 6 గం,,తర్వాత    ఉదయం 6గం,, లోపు  మహిళలను అరెస్టు చేయలేము -

  క్రిమినల్ కోడ్, సెక్షన్ 46 ప్రకారం, సాయంత్రం 6 గంటల తరువాత,  ఉదయం 6 గంటలకు ముందు, భారత పోలీసులు ఎంత తీవ్రమైన నేరం చేసినా, ఏ మహిళను అరెస్టు చేయలేరు.  పోలీసులు అలా చేస్తే, అరెస్టు చేసిన పోలీసు అధికారిపై ఫిర్యాదు చేయవచ్చు.  ఇది ఈ పోలీసు అధికారి ఉద్యోగానికి హాని కలిగించవచ్చు.

  (2.) సిలిండర్ పేలడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టంపై రూ .4 మిలియన్ల వరకు బీమా పొందవచ్చు

  పబ్లిక్ లయబిలిటీ పాలసీ ప్రకారం, ఏదైనా కారణం చేత మీ ఇంటిలో సిలిండర్ పేలిపోయి, మీరు ప్రాణ, ఆస్తి నష్టాన్ని ఎదుర్కొంటే, మీరు వెంటనే గ్యాస్ కంపెనీ నుండి బీమా రక్షణ పొందవచ్చు.  గ్యాస్ కంపెనీ నుండి రూ .4 మిలియన్ల వరకు బీమా క్లెయిమ్ చేయవచ్చు.  కంపెనీ మీ దావాను తిరస్కరించినా లేదా వాయిదా వేసినా, దాని గురించి ఫిర్యాదు చేయవచ్చు.  నేరం రుజువైతే, గ్యాస్ కంపెనీ లైసెన్స్ రద్దు చేయవచ్చు.

  (3) ఏదైనా హోటల్ 5 నక్షత్రాలు అయినా; మీరు ఉచితంగా నీరు త్రాగవచ్చు, వాష్‌రూమ్‌ను ఉపయోగించవచ్చు -

  ఇండియన్ సిరీస్ యాక్ట్, 1887 ప్రకారం, మీరు దేశంలోని ఏ హోటల్‌కైనా వెళ్లి నీరు అడగవచ్చు, త్రాగవచ్చు,  ఆ హోటల్ యొక్క వాష్‌రూమ్‌ను కూడా ఉపయోగించవచ్చు.  హోటల్ చిన్నది లేదా 5 నక్షత్రాలు అయితే, వారు మిమ్మల్ని ఆపలేరు.  హోటల్ యజమాని లేదా ఉద్యోగి మిమ్మల్ని తాగునీరు లేదా వాష్‌రూమ్ ఉపయోగించకుండా ఆపివేస్తే, మీరు చర్య తీసుకోవచ్చు.  మీ ఫిర్యాదు ఈ హోటల్ లైసెన్స్ రద్దు చేయబడవచ్చు.

   (4) గర్భిణీ స్త్రీలను తొలగించలేరు -

  ప్రసూతి ప్రయోజన చట్టం 1961 ప్రకారం, గర్భిణీ స్త్రీలను అకస్మాత్తుగా తొలగించలేరు.  గర్భధారణ సమయంలో, యజమాని మూడు నెలల నోటీసు,  ఖర్చులలో కొంత భాగాన్ని చెల్లించాలి.  అతను అలా చేయకపోతే, ప్రభుత్వ ఉపాధి సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు.  ఈ ఫిర్యాదు సంస్థను మూసివేయడానికి కారణం కావచ్చు లేదా కంపెనీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

  (5) మీ ఫిర్యాదు రాయడానికి పోలీసు అధికారి నిరాకరించలేరు

  ఐపిసి సెక్షన్ 166 ఎ ప్రకారం, మీ ఫిర్యాదులను నమోదు చేయడానికి ఏ పోలీసు అధికారి నిరాకరించలేరు.  అతను అలా చేస్తే, అతనిపై సీనియర్ పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు.  నేరం రుజువైతే, పోలీసు అధికారికి కనీసం * (6) * నెలల నుండి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా తొలగింపును ఎదుర్కోవచ్చు.




Sep 7, 2020

అవినీతిపరుల చిట్టా సేకరించే విధానం

ఒక సమాచార దరఖాస్తు ద్వారా ఏ అధికారి వలన అయితే మీకు అన్యాయం జరిగిందో సదరు అధికారి SR(సర్వీస్ రిజిస్టర్) నకలు కాపీ తీసుకోండి.అందులో సదరు అధికారి పుట్టిన గ్రామం మొదలు సదరు అధికారి ఇప్పటిదాకా ఏఏ ప్రాంతాల్లో పనిచేశాడు. అతనిపై జరిగిన విచారణలు ఉన్నతా ధికారులు తీసుకున్న చర్యల వరకు అన్నీ క్షుణ్ణంగా ఉంటాయి.

ఒక ప్రభుత్వ అధికారి అవినీతికి పాల్పడు తున్నాడు అంటే అది ఖచ్చితంగా లంచాల రూపకంగా వచ్చే డబ్బు కోసం మాత్రమే.ఇలా లంచాల రూపకంగా సంపాదించిన బ్లాక్ మనీ/నల్ల ధనంను తల్లి/తండ్రి/అన్న/తమ్ముడు/అక్క/బావ/చెల్లెలు/బావమరిది/అత్త/మామా/భార్య తరుపున బంధువులు/కలిసి చదువుకున్న స్నేహితులు/నమ్మదగిన బంధువులు/తమకింద పనిచేసే కిందిస్థాయి సిబ్బంది/తాము పనిచేసే ప్రాంతంలో పరిచయమైన నమ్మదగిన బినామీలు ఇలాంటి వాళ్ళ పేర్లతో ఆస్తులు కొని దాచుకుని ఉంటారు.

ఒక వారం రోజులు టైం కేటాయించుకుని సదరు అధికారి పుట్టిపెరిగిన ప్రాంతము మొదలు/చదువుకున్న ప్రాంతాలు/అత్తగారి ఊరు/పనిచేసిన ప్రాంతాలు అన్నీ తిరిగితే నాలుగు పచ్చనోట్లు కొడితే వీళ్ళ ఆస్తుల చిట్టా చెప్పేవాళ్ళు ఆయా ప్రాంతాల్లో బొచ్చెడుమంది వుంటారు.పనిచేసిన ప్రాంతాల్లో అయితే ఆ మాత్రం పచ్చనోట్లు కొట్టాల్సిన అవసరం కూడా ఉండదు.వీళ్ళ అవినీతి సొమ్ముతో తనకు వాటా ఇవ్వలేదనో/పక్కనోడికి ఇచ్చాడనో/పక్కనోడికి ఎక్కువ వాటా ఇచ్చాడనో అక్కసుతో ఉండేవాళ్ళ సంఖ్య ప్రతీ ఆఫసులో ఎక్కువగానే ఉంటుంది.అక్కడ సమాచారం తీసుకోవడం చాలా ఈజీ.

ఇక మిగిలింది ఏముంది. అక్రమాస్తుల చిట్టా మొత్తం మూటకట్టి ఏసీబీ DG ఆఫీసుకు పంపడమే.ఏసీబీ వాళ్ళు కచేరీ ఏర్పాటుచేసి అక్రమార్జనలో ప్రతిభ చాటిన ప్రతిభావంతులను సన్మానిస్తారు.

ఎదుటివాళ్ళ అత్యాశ / అవినీతి/అధికార దుర్వినియోగం వల్ల మీకు చచ్చిపోవాలి అన్నంత బాధ కలిగిందా?!?!. ప్రజలు కట్టిన పన్నుల్లోంచి ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వం నియమించు కున్న గుమాస్తాలు అనే ప్రభుత్వ ఉద్యోగులు చేసే పనికి ప్రభుత్వం ఇచ్చే జీతం చాలక వాడవాడో లంచాల కోసం అధికార దుర్వి నియోగం చేస్తే చేతగాని వాళ్ళలా మీరు చావడం ఎందుకు?!?!. నిజంగా మీకు చచ్చేటంత నష్టమో?!?! కష్టమో?!?! సదరు అధికారుల నుండి వచ్చి ఉంటే అలాంటి అధికారుల నుండి నీలా ఇంకే సామాన్యునికి అంతటి కష్టం రాకుండా ధైర్యం చేసి అక్రమాస్తుల చిట్టా బయటికి తీసి ఏసీబీ రైడ్ చేయించు.అలాంటి అవినీతి అధికారులు ఇంటికి పోతే కనీసం నీలా ఇంకొకరు బాధలడకుండా అడ్డుకోగలిగినవాడు అవుతావుకదా?!?!.

ఏసీబీ అధికారులే కాదు  సాక్షాత్తు అత్యున్నత న్యాయస్థానం కూడా ఒక అవినీతి అధికారుల అక్రమాస్తుల చిట్టా నిజమా?!?! కాదా?!?! అని మాత్రమే చూస్తుంది. అంతేకానీ అది ఎలా తెచ్చావు?!?!.ఎందుకు తెచ్చావు అని ఎవరూ అడగరు?!?!. అడిగే అధికారం ఎవరికీ లేదు?!?!.అడిగినా చెప్పాల్సిన అవసరం మనకులేదు?!?!

10సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సర్వీస్ లో నానా సంకలు నాకి  కొన్ని వేలాది/లక్షలమంది జీవితాలు నాశనము చేసి సంపాదించిన ఇలాంటి వాళ్ళ సొమ్ము మొత్తం రిటైర్మెంట్ కు ఒక్కరోజు ముందైనా మీరు ఏసీబీ అధికారుల చేతుల్లో పోయగలితే వాడికి అంతకు మించిన శిక్ష ఉండదు.బాధితులకు అంతకుమించిన సంతృప్తి ఉండదు.

సెక్రటేరియట్ కు ఫిర్యాదులు చేస్తాము/ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తాము/కలెక్టర్ కు అర్జీలు రాస్తాము/SP కి ఫిర్యాదులు చేస్తాము.   ఇవన్నీ వేస్ట్ అక్రమాస్తులు సమాచార సేకరణ బెస్ట్.

చిత్రగుప్తుడు మనుష్యుల పాపాలు లెక్కపెట్టినట్టు మీరు మీ ప్రాంతంలోని అధికారుల అక్రమార్జన అక్రమాస్తుల వివరాల సేకరణపై దృష్టి పెట్టండి. అది మాత్రమే చేయండి.ఈ క్రమంలో అధికారులు అక్రమా కేసులు పెడతాం/అక్రమ కేసులు పెట్టిస్తాం. జైలుకు పంపుతాం. ఇలాంటి బెదిరింపులు చేస్తారు.వాటికేమీ ఎవ్వరూ భయపడవద్దు.         

రిమాండ్ అనేది శిక్ష కాదు.జరిగిన నేరముపై పోలీస్ విచారణ ముగి సేంత వరకు నేరా రోపణ చేయబడిన వ్యక్తి విచా రణకు ఆటంకం కలిగించ కుండా పోలీస్ కస్టడీలో పేట్టుకోవడం మాత్రమే ఆ తరువాత బెయిల్ వస్తుంది.

ఈ అక్రమాస్తులను కనిపెట్టే నీ వేటను నీవు నిరంత రాయంగా చేసు కోవచ్చు. నీవు ఒక్కసారి ఏసీబీ రైడ్ చేయించ గలిగితే చాలు అది ఆ అవినీతి అధికారికి కోలుకోలేని చావుదెబ్బె.

అధికారుల అవినీతికి/అత్యాశకు/అధికార దుర్వినియోగానికి బలై చావడానికి పెట్రోల్ పోసుకునే బాధితులకు/ఆత్మహత్యలు చేసుకునే పిరికివాళ్ళకు ఇదే నా సలహా పోరాడ్డానికి కావాల్సిన ధైర్యం కంటే. చావడానికి ఎక్కువ ధైర్యం కావాలి.చచ్చే అంతటి ధైర్యం నీలో ఉనప్పుడు ఆ ధైర్యాన్ని అవినీతి అధికారుల అక్రమాస్తులు బయటికి తీసి అటు ప్రభుత్వానికి & ఏసీబీ విభాగానికి ఇటు నీలాంటి నిస్సహాయులకు మంచి జరగడానికి ఉపయోగించండి.          

ఒక పదిమందికి వేటుపడితే ఆటోమేటిక్ గా ఎవరికి వాళ్ళు మారుతారు.

పవర్ ఆఫ్ ఆర్టీఐ

 


ప్రకృతి వ్యవసాయం

 గ్రామాల డబ్బు గ్రామాల్లోనే ఉండాలి – నగరాల డబ్బు గ్రామాలకు రావాలి

అదే ప్రకృతి వ్యవసాయ ఫలితం

“ప్రకృతి వ్యవసాయం గురించి అందరికీ తెలియాలి. ఈ తరహా సాగు విధానంతో చిన్నపాటి భూమిలో ఒక కుటుంబంలో నలుగురూ కలిసి పని చేసుకొంటే ఎంత ఆదాయం వస్తుంది అనే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం” అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు తెలిపారు. ప్రకృతితో ముడిపడిన ఈ వ్యవసాయం విధానం అవసరం, విశిష్టత గురించి తెలిపే అనుభవం శ్రీ విజయరామ్ గారికి ఉంది అన్నారు. ప్రకృతి వ్యవసాయ విధానం గురించి శ్రీ విజయరామ్ గారు మాట్లాడుతూ “ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పే ముందు  నేను ముందు ఆచరించాలి... తర్వాత చెప్పాలి అని కృష్ణా జిల్లాలో ఆరు ఎకరాలు కొని అక్కడ చెరువు తవ్వాను. శ్రీ పాలేకర్ గారు చెప్పే విధానంలో 10 శాతం చెరువు.. 10 శాతం అడవి అంటారు ఎక్కడైనా సరే.. నేను ముందుగా చెరువు తవ్వుకున్నాను. మనం మాగాణులు అంటే చాలా మంచిది అనుకుంటాం. అవి వరికి అనుకూలం. వైవిద్యం అంటే తెలంగాణ, రాయలసీమల్లోనే బతికుంది. మెట్ట సేద్యం మంచిది. ప్రకృతి వ్యవసాయాన్ని మాగాణిలో కూడా మేం రూపొందిస్తున్న ఫైవ్ లేయర్ మోడల్ ప్రకారం చేసుకోవచ్చు.                                                                            

శ్రీ పాలేకర్ గారు ఒక మాట చెబుతారు – గ్రామం డబ్బులు గ్రామంలోనే ఉండాలి... నగరాల డబ్బులు గ్రామాలకు రావాలి అంటారు. యూరియా, డి.ఎ.పి. కలుపు మందులు, పురుగు మందులు, ట్రాక్టర్లు, స్పేర్ పార్టులు, డీజిల్ ఆయిల్.. ఇలా ఏదైతేనేం ఒక గ్రామం నుంచి రూ.16 లక్షలు విదేశాలకు వెళ్తున్నాయి. భారత దేశంలో ఇలాంటి గ్రామాలు 6 లక్షలు ఉన్నాయి. రెండవది అందరికి అన్నంపెట్టే రైతుకి అన్నం దొరకడం లేదు. 15 సంవత్సరాల్లో 3 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

భారత దేశానికి ఈ ప్రపంచంలోనే ఇప్పటికీ అతి గొప్ప స్థానం ఉంది. గురు స్థానంలో ఉంది. ఎందుకు అంటే 75 శాతం జీవ వైవిద్యం భారత దేశానికి భగవంతుడు ఇచ్చి, మిగిలిన దేశాలకు 25 శాతం ఇచ్చాడు. ఇక్కడున్నది సమ శీతోష్ణస్థితి. కాలానికి తగ్గట్టు పండ్లు, ఫలసాయాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఇది మీకు బయట దేశాల్లో చూసుకుంటే విపరీతమైన చలి లేదా విపరీతమైన ఎండ.  శ్రీ పాలేకర్ గారు గత 38 సంవత్సరాలుగా 40 లక్షల మంది రైతులకు శిక్షణ ఇచ్చారు. అందులో నేను ఒక్కడిని. 40 లక్షలు అనుకున్నా కూడా చాలా పెద్ద సంఖ్యలా కనబడుతుంది గానీ, దేశ జనాభాతో మనం చూస్తే ఒక్క శాతం లేదు. శ్రీ పవన్ కల్యాణ్ గారు నాతో మాట్లాడినప్పుడు ఇది నేను రాజకీయాల గురించి చేయడం లేదు. ఇది నా బాధ్యత అన్నారు. 

భారతదేశంలో ఇప్పటి వరకు శ్రీ పాలేకర్ గారు తెలుగు రాష్ట్రాలకు చాలా ఎక్కువ సమయం ఇచ్చారు. కానీ ప్రకృతి వ్యవసాయంలో భారత దేశంలో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. కారణం ఏంటంటే గోవుని పూజించే స్వాములు, పీఠాధిపతులు, వారి ఆశ్రమాలన్నీ అక్కడ ఎక్కువ. తమ భక్తులకు ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు. అలాంటి బాధ్యత ఇక్కడ స్వాములంతా తీసుకోవాలి. 

ఈ భూమ్మీద వేల కోట్ల జీవరాశులు ఉన్నాయి. మనిషి లేకుండా ఎప్పటి నుంచో ఈ భూమ్మీద ఉన్నాయి ఇవి. మనిషి అవసరం వాటికి ఎక్కడా లేదు. కానీ వాటి అవసరం మనిషికి ఉంది. వీటిని పెంచి పోషించేది ఈ ప్రకృతి వ్యవసాయం మాత్రమే.  శ్రీ పవన్ కల్యాణ్ గారు లాంటివారు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయంలో ముందు ఉంటుందని నమ్ముతున్నాను. అందరికీ విషతుల్యం కాని ఆహారం ఇవ్వాలి. మా తాత ఉన్నప్పుడు ఇన్ని క్యాన్సర్ ఆసుపత్రులు లేవు. నాన్న ఉన్నప్పుడు ఇన్ని లేవు. మనం ఉన్నప్పుడు ఇన్ని వచ్చాయి. మన కొడుకులు, మనవళ్లు వచ్చే సరికి పరిస్థితి ఏమవుతుంది అనే భయం ఉంది. అందరికీ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలగాలి” అన్నారు.

Sep 5, 2020

ఒకే ఒక్క పోలీస్ - ఉమేష్ చంద్ర IPS

నీతినిజాయితీకి మారు పేరు

 ఎంతో మందికి స్ఫూర్తి ...

ఇప్పటి కీ ఆయనే అందరికీ మార్గదర్శకం..

చదలవాడ ఉమేష్ చంద్ర

పోలీస్ వర్గాలలో ఈ పేరు చెబితే చాలు వాళ్ళ రోమాలు నిక్కబొడుస్తాయి .. రక్తం పోటెత్తుతుంది, కానీ ఇప్పటి యువతరానికి పెద్దగా తెలియదు,

 మహా అయితే హైదరాబాద్ అమీర్ పేట, ఎస్.ఆర్.నగర్ ఏరియాల్లో ఉండేవాళ్ళకి

ఉమేష్ చంద్ర స్టాట్యూ దగ్గరఅని అడ్రస్ లాండ్ మార్క్ గా చెప్పడానికి తెలుసేమో " !

 మరి ఎవరీ ఉమేష్ చంద్ర ?

నక్షలిజం, ఫ్యాక్షనిజం, రౌడీయిజం లాంటి ఇజాలకు తన పోలీసిజం రుచి చూపించిన ఒక్క మగాడు ..

దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ లాంటి పదాలకు ప్రాణం పోస్తే ఆయన రూపం 

మనకు తెలుగు సినిమాలలో చాలా మంది పులులు సింహలు ఉన్నారు, కానీ నిజజీవితంలో కడప పులిఅని పేరుగాంచిన పోలీస్ అధికారి ఉమేష్ చంద్ర..

ఆయన అమర మరణం చెంది నేటికి 17 సంవత్సరాలు .. ఆయన కథేంటో చూద్దాం ..

ఉమేశ్ చంద్ర మార్చి 19, 1966 న గుంటూరు జిల్లా పెదపూడి గ్రామములో వేణుగోపాల రావు, నయనతార దంపతులకు జన్మించారు.

1991లో IPS కి ఎన్నికై, 1991-92 లో జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందారు, మొదట 1992 నుండి 1994 వరకు వరంగల్లులో ASP గా పని చేశారు. వరంగల్లులో పనిచేసిన కాలంలో జనజాగృతిఅనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు,

దాని ద్వారా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో వరంగల్లు గ్రామాల్లో పాతుకుపోయిన నక్షలిజాన్ని రూపుమాపడానికి కృషిచేస్తూ మొదటి పోస్టింగుతోనే

నక్షల్స్ కు బద్దవిరోధి అయ్యారు.తరువాత కడప జిల్లాలో ఫాక్షనిజంతో కరుడుగట్టిన పులివెందుల ఏరియాకి గా బదిలీ చేయబడ్డారు, అక్కడ పనిచేసింది కేవలం 4 నెలలు మాత్రమే కానీ తన చర్యలతో అక్కడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారు.

 మనం కేవలం సినిమాల్లో చూసే పోలీస్ హీరోయిజాన్ని పులివెందుల్లో చూపించారు, చిన్న చిన్న గుండాల నుండి బడా బడా ఫ్యాక్షనిస్టులకు కంటికి నిద్రలేకుండా చేసారు, అర్ధారాత్రులు, తెల్లవారుజాము ఇలా విశ్రాంతి అనేదే లేకుండా రైడింగులు చేస్తూ దొరికిన వాడిని దొరికినట్లుగా అరెస్టులు చేస్తూ ప్రజలకి ఒక భరోసా కల్పించారు, మామూలుగా సినిమా హీరోల పైన, రాజకీయనాయకుల పైన పాటలు వ్రాస్తారు.అలాంటిది పోలీసు అధికారి పై పాటలు వ్రాసారు.

అదికూడా కేవలం నాలుగు నెలల కొంచెం సమయంలోని ఆయన చేసిన పనికి ఈ ఒక్కటి చాలు ఆయన శాంతిని నెలకొల్పడానికి చేసిన పనులు అక్కడ ప్రజలను ఎంతగా ఆకట్టుకున్నాయో తెలియడానికి

ఫిబ్రవరి 1995 లో వరంగల్లు ప్రత్యేక విధుల అధికారిగా నియమితులయ్యారు, ఈసారి నక్షలిజం పై విరుచుకుపడ్డారు, వరంగల్లులో తొలిసారిగా ప్రజలు కష్టం వస్తే అన్నలను కాకుండా పోలీసులను కలవడం మొదలుపెట్టారు.

ఈమధ్య కాలంలో బాగా వినిపిస్తున్న ఫ్రెండ్లీ పోలీస్ ని అప్పట్లోనే ఆయన ఆచరించి చూపించారు

ప్రజలతో మమేకమై పోలీసులపై సంఘములోగల దురభిప్రాయములు తొలగించారు. ఎంతో మంది నక్సలైట్లను పట్టుకొనుటలో సఫలమయ్యారు.

 1995 జూన్ లో పోలీస్ సూపరింటెండెంట్ గా పదోన్నతి పొంది కడప జిల్లాకు తిరిగి వచ్చారు. తరువాత జూన్ 1997 న కరీంనగర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా బదిలీ అయ్యారు, ఈ రెండు సంవత్సరాలలో ఆయన చేసిన కృషి ప్రజలకు ఎంతో మంచిచేసింది, ఆయన్ని కడప ప్రజలు ఎంతలా అభిమానించారంటే ఆయన బదిలీ ఆపమని ధర్నాలు కూడా చేసారు, ఆయన బదిలీ అయి వెళుతున్న రోజు ప్రజలు ఆయనికి పలికిన వీడ్కోలు అంతకుముందు గానీ, ఆ తరువాత గానీ ఎక్కడా ఏ పోలీసు అధికారికి జరగలేదు

ఉమేశ్ చంద్ర సెప్టెంబరు 4, 1999 న హైదరాబాదు యస్సార్ నగర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగగా నలుగురు నక్సలైట్లు కాల్పులు జరిపారు. అంగ రక్షకుడు,  డ్రైవరు వెంటనే మరణించారు. ఉమేశ్ చంద్ర కారు దిగి నక్సలైట్లను తరిమి వెంటాడారు.

ఆయన వద్ద గన్ లేదని గ్రహించిన నక్సలైట్లు ఆగి రెండు సార్లు కాల్పులు జరిపారు. గుండు దెబ్బలు తిని పడిపోయిన ఉమేశ్ చంద్ర వద్దకు వచ్చి సమీపము నుండి కాల్చి పారిపోయారు.

Sep 4, 2020

తెలుగంటే

 తెలుగంటే...గోంగూర

తెలుగంటే...గోదారి

తెలుగంటే...గొబ్బిళ్ళు

తెలుగంటే...గోరింట

తెలుగంటే...గుత్తోంకాయ్

తెలుగంటే...కొత్తావకాయ్

తెలుగంటే....పెరుగన్నం

తెలుగంటే...ప్రేమా, జాలీ, అభిమానం

తెలుగంటే...పోతన్న

తెలుగంటే...బాపు

తెలుగంటే...రమణ

తెలుగంటే...అల్లసాని పెద్దన

తెలుగంటే...తెనాలి రామకృష్ణ

తెలుగంటే...పొట్టి శ్రీరాములు

తెలుగంటే...అల్లూరి సీతారామరాజు

తెలుగంటే...కందుకూరి వీరేశలింగం

తెలుగంటే...గురజాడ

తెలుగంటే...శ్రీ శ్రీ

తెలుగంటే...వేమన

తెలుగంటే...నన్నయ

తెలుగంటే...తిక్కన

తెలుగంటే...ఎఱ్ఱాప్రగడ

తెలుగంటే...గురజాడ

తెలుగంటే...క్షేత్రయ్య

తెలుగంటే...శ్రీనాధ

తెలుగంటే...మొల్ల

తెలుగంటే...కంచర్ల గోపన్న

తెలుగంటే....కాళోజి

తెలుగంటే...కృష్ణమాచార్య

తెలుగంటే...సిద్ధేంద్ర

తెలుగంటే...గౌతమీ పుత్ర శాతకార్ణి

తెలుగంటే...రాణీ రుద్రమదేవి

తెలుగంటే...రాజరాజ నరేంద్రుడు

తెలుగంటే...రామలింగ నాయుడు

తెలుగంటే...తిమ్మనాయుడు

తెలుగంటే...రామదాసు

తెలుగంటే...ఆచార్య నాగార్జున

తెలుగంటే...పోతులూరి వీరబ్రహ్మం

తెలుగంటే...జిడ్డు కృష్ణమూర్తి

తెలుగంటే...వుప్పలూరి గోపాల కృష్ణమూర్తి

తెలుగంటే...సింగేరి శంకరాచార్య

తెలుగంటే...అన్నమాచార్య

తెలుగంటే...త్యాగరాజు

తెలుగంటే...వీర పాండ్య కట్టబొమ్మన

తెలుగంటే...విశ్వేశ్వరయ్య

తెలుగంటే...చిన్నయ్య సూరి

తెలుగంటే...సర్వేపల్లి రాధాకృష్ణన్

తెలుగంటే...పీవీ నరసింహారావు

తెలుగంటే...రాజన్న

తెలుగంటే...సుశీల

తెలుగంటే...ఘంటసాల

తెలుగంటే...రామారావు

తెలుగంటే...అక్కినేని

తెలుగంటే...సూర్యకాంతం

తెలుగంటే...ఎస్.వీ.రంగారావు

తెలుగంటే...అయ్యలరాజు రామభద్రుడు

తెలుగంటే...పండుమిరప

తెలుగంటే...సంక్రాంతి

తెలుగంటే...సరోజిని నాయుడు

తెలుగంటే....భద్రాద్రి రామన్న

తెలుగంటే...తిరుపతి ఎంకన్న

తెలుగంటే...మాగాణి

తెలుగంటే...సాంబ్రాణి

తెలుగంటే...ఆడపిల్ల ఓణి

తెలుగంటే...చీరకట్టు

తెలుగంటే...ముద్దపప్పు

తెలుగంటే...ఓంకారం

తెలుగంటే...యమకారం

తెలుగంటే....మమకారం

తెలుగంటే...సంస్కారం

తెలుగంటే...కొంచెం ఎటకారం

తెలుగంటే...పట్టింపు

తెలుగంటే...తెగింపు

తెలుగంటే....లాలింపు

తెలుగంటే...పింగళి వెంకయ్య

తెలుగంటే...పైడి మర్రి వెంకట సుబ్బారావు

తెలుగంటే....టంగుటూరి ప్రకాశం

తెలుగంటే...చిలకమర్తి లక్ష్మీనరసింహం

తెలుగంటే...భాస్కరుడు

తెలుగంటే...దేవులపల్లి

తెలుగంటే...ధూర్జటి

తెలుగంటే...తిరుపతి శాస్త్రి

తెలుగంటే...గుఱ్ఱం జాషువ

తెలుగంటే...కోరాడ మహాదేవశాస్ట్రీ

తెలుగంటే...కోరాడ రామకృష్ణయ్య

తెలుగంటే...కోరాడ రామచంద్రకవి

తెలుగంటే...కొనకళ్ల వెంకటరత్నం

తెలుగంటే...మల్లన్న

తెలుగంటే...నండూరి

తెలుగంటే...పానుగంటి

తెలుగంటే...రామానుజం

తెలుగంటే...రావి శాస్త్రి

తెలుగంటే...రంగనాధుడు

తెలుగంటే...కృష్ణదేవరాయలు

తెలుగంటే...తిరుపతి వెంకటకవులు

తెలుగంటే...విశ్వనాథ

తెలుగంటే...నన్నే చోడుడు

తెలుగంటే...ఆరుద్ర

తెలుగంటే...ఎంకి

తెలుగంటే...ఆదిభట్ల

తెలుగంటే...గాజుల సత్యనారాయణ

తెలుగంటే...మల్లాది సుబ్బమ్మ

తెలుగంటే...ఆర్యభట్టు

తెలుగంటే...త్యాగయ్య

తెలుగంటే...కేతన

తెలుగంటే...వెంపటి చిన సత్యం

తెలుగంటే...ఉషశ్రీ

తెలుగంటే...జంధ్యాల

తెలుగంటే...ముళ్ళపూడి

తెలుగంటే...మంగళంపల్లి బాలమురళీకృష్ణ

తెలుగంటే...అక్కిరాజు ఉమాకాంతం

తెలుగంటే...తిలక్

తెలుగంటే...అడివి బాపిరాజు

తెలుగంటే...జక్కన

తెలుగంటే...అచ్చమాంబ

తెలుగంటే...దాశరథి

తెలుగంటే...తెలంగాణ,ఆంధ్ర

తెలుగంటే...ముక్కుపుడక 

తెలుగంటే...పంచెకట్టు

తెలుగంటే...ఇంటిముందు ముగ్గు

తెలుగంటే...నుదుటిమీద బొట్టు

తెలుగంటే...తాంబూలం

తెలుగంటే...పులిహోర

తెలుగంటే....సకినాలు

తెలుగంటే....మిర్చి బజ్జి

తెలుగంటే...బందరు లడ్డు

తెలుగంటే....కాకినాడ ఖాజా

తెలుగంటే.....జీడిపాకం

తెలుగంటే...మామిడి తాండ్ర

తెలుగంటే...రాగి ముద్ద

తెలుగంటే...జొన్న రొట్టె

తెలుగంటే...అంబలి

తెలుగంటే...మల్లినాథ సూరి

తెలుగంటే...భవభూతి

తెలుగంటే...ప్రోలయ నాయకుడు

తెలుగంటే...రాళ్ళపల్లి 

తెలుగంటే...కట్టమంచి

తేనెలూరు తెలుగంటే ఆంధ్ర కోనసీమ పంట

తెలుగు నేలంటే రాయలేలిన సీమ రాయలసీమ

తెలుంగు ఆణమంటే తెలంగాణ

తెలుగంటే..... నీవు నేను మనం

జై తెలుగు తల్లీ 

Sep 3, 2020

యువతరం శిరమెత్తితే నవతరం గళమిప్పితే

 

యువతరం కదిలింది కదిలింది కదిలింది

నవతరం లేచింది లేచింది లేచింది

యువతరం శిరమెత్తితే నవతరం గళమిప్పితే

లోకమే మారిపోదా ఈ చీకటే మాసిపోదా

లోకమే మారిపోదా ఈ చీకటే మాసిపోదా

దురాచార బంధనాలు దొర్లిపడిన పల్లెల్లో

దోపిడి దొంగల దొడ్లై దోచే యీ పట్నాల్లో

కొత్తవెలుగు రాదా సరికొత్త బ్రతుకు రాదా

కొత్తవెలుగు రాదా సరికొత్త బ్రతుకు రాదా

||యువతరం||

కలవారి పిడికిలిలో నలుగుతున్న సిరిసంపద

కామాంధుల చేతచిక్కి కన్నీరిడు నేలతల్లి

నలుగురిదీ కాదా అది నవయుగమై రాదా

నలుగురిదీ కాదా అది నవయుగమై రాదా

||యువతరం||

విడని గొలుసు లంకెల ముడి మడత పేచీ రాజ్యాంగం

కల్లోలిత పాలనలో నలిగిపోవు ఈ దేశం

మారిపోవు తధ్యం నవమానవుడే నిత్యం

మారిపోవు తధ్యం నవమానవుడే నిత్యం

||యువతరం||

-     నార్ల చిరంజీవి

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...