Sep 20, 2020

చేనేత అభివృద్ధికి కృషి చేసిన‌‌ పుచ్చల సత్యనారాయణ


చేనేత వ‌ర్గానికి చెందిన
  స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు  పుచ్చల సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ లో 10-4-1909 సం.లో జన్మించారు. వీరు చిన్నతనం నుండి కమ్యూనిస్టు భావాలకు ఆకర్షితులై ఆ పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ కమ్యూనిస్టు యోధుడు గా ఎదిగారు. ఆనాటి స్వాతంత్రపోరాటాలలో పాల్గొంటూ 1936 లో ఉప్పాడలో జరిగిన ఉప్పు సత్యాగ్రహం సమయంలో అరెస్ట్ అయి జైలు జీవితం కూడా గడిపారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా  ప్రజలను చైతన్య పరచి సంఘసేవలు అందించేవారు. ఆ రోజుల్లోనే కులాంతర వివాహాలను ప్రోత్సహించి సర్వమానవ సమానత్వానికై పాటుబడేవారు.  1955 లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట నియోజకవర్గానికి కమ్యూనిస్టు పార్టీ తరుపున  పోటీ చేసిన పుచ్చల సత్యనారాయణ  అఖండ మెజార్టీతో గెలుపొందారు. 1962 వరకు ప్రజానాయకుడిగా తన సేవలు అందించారు.  దేవాంగ కులభూషణుడైన ఆయ‌న‌ ముఖ్యంగా చేనేత పరిశ్రమ అభివృద్ధికి చేసిన కృషి ఎనలేనిది. వారు కమ్యూనిస్టు నాయకుడుగా రష్యా, కెనడా,అమెరికా దేశాలను సందర్శించారు. ఆ సమయంలోనే చేనేత ఉత్పత్తులను ఆయా దేశాలలో ఎక్స్ పోర్ట్ చేయించడంలో ఆయన కృషి మరవలేనిది.  చేనేతవర్గాలపై ఆయన ప్రేమ ఎనలేనిది.అగ్రవర్గాలుగా చెప్పుకునే కొన్ని సామాజికవర్గాలు అభివృద్ధిలో మునుముందుకు దూసుకుపోతున్న తరుణంలో చేనేతవర్గాలు వెనుకబడిపోతున్న తీరును గమనించి విద్యతోనే అభివృద్ధి సాద్యమని గ్రహించి 1976 లో కాకినాడలో పేదవిద్యార్థులకు ఉచిత హాస్టల్ ఏర్పాటు చేసి ఎందరో విద్యార్థులకు చేయూతనందించారు.

MLA గా వున్న సమయంలోనే వారు చేనేత పరిశ్రమకు అద్దం పట్టేలా చేనేత దర్పణం అనే పుస్తాకాన్ని రచించారు. దానితో పాటు AP సేల్స్ టాక్స్ అనే మరో పుస్తకాన్ని కూడా రచించి ఎన్నో విషయాలు వాటిలో చర్చించారు.  ఇంకా వీరు అనేక సంస్థల్లో సభ్యులుగా వుంటూ తనదైన శైలిలో సేవలు అందిస్తూ అందరి మన్నలను అందుకున్నారు.  కొత్తపల్లి చేనేత సొసైటీ అధ్యక్షుడిగా, జిల్లా ప్లానింగ్ కమిటీ అధ్యక్షుడిగా .... అనేక సంస్థలో  ద్వారా సేవలు అందించారు.  తన చిరస్మరణీయమైన సేవలతో ఎందరికో స్పూర్తిని నింపుతూ తన జీవితమంతా పేదప్రజలకు,చేనేత వర్గాలకు ధారపోసిన ఆ మహానుభావుడు 29-9-1995న కన్నుమూశారు.


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...