Sep 7, 2020

అవినీతిపరుల చిట్టా సేకరించే విధానం

ఒక సమాచార దరఖాస్తు ద్వారా ఏ అధికారి వలన అయితే మీకు అన్యాయం జరిగిందో సదరు అధికారి SR(సర్వీస్ రిజిస్టర్) నకలు కాపీ తీసుకోండి.అందులో సదరు అధికారి పుట్టిన గ్రామం మొదలు సదరు అధికారి ఇప్పటిదాకా ఏఏ ప్రాంతాల్లో పనిచేశాడు. అతనిపై జరిగిన విచారణలు ఉన్నతా ధికారులు తీసుకున్న చర్యల వరకు అన్నీ క్షుణ్ణంగా ఉంటాయి.

ఒక ప్రభుత్వ అధికారి అవినీతికి పాల్పడు తున్నాడు అంటే అది ఖచ్చితంగా లంచాల రూపకంగా వచ్చే డబ్బు కోసం మాత్రమే.ఇలా లంచాల రూపకంగా సంపాదించిన బ్లాక్ మనీ/నల్ల ధనంను తల్లి/తండ్రి/అన్న/తమ్ముడు/అక్క/బావ/చెల్లెలు/బావమరిది/అత్త/మామా/భార్య తరుపున బంధువులు/కలిసి చదువుకున్న స్నేహితులు/నమ్మదగిన బంధువులు/తమకింద పనిచేసే కిందిస్థాయి సిబ్బంది/తాము పనిచేసే ప్రాంతంలో పరిచయమైన నమ్మదగిన బినామీలు ఇలాంటి వాళ్ళ పేర్లతో ఆస్తులు కొని దాచుకుని ఉంటారు.

ఒక వారం రోజులు టైం కేటాయించుకుని సదరు అధికారి పుట్టిపెరిగిన ప్రాంతము మొదలు/చదువుకున్న ప్రాంతాలు/అత్తగారి ఊరు/పనిచేసిన ప్రాంతాలు అన్నీ తిరిగితే నాలుగు పచ్చనోట్లు కొడితే వీళ్ళ ఆస్తుల చిట్టా చెప్పేవాళ్ళు ఆయా ప్రాంతాల్లో బొచ్చెడుమంది వుంటారు.పనిచేసిన ప్రాంతాల్లో అయితే ఆ మాత్రం పచ్చనోట్లు కొట్టాల్సిన అవసరం కూడా ఉండదు.వీళ్ళ అవినీతి సొమ్ముతో తనకు వాటా ఇవ్వలేదనో/పక్కనోడికి ఇచ్చాడనో/పక్కనోడికి ఎక్కువ వాటా ఇచ్చాడనో అక్కసుతో ఉండేవాళ్ళ సంఖ్య ప్రతీ ఆఫసులో ఎక్కువగానే ఉంటుంది.అక్కడ సమాచారం తీసుకోవడం చాలా ఈజీ.

ఇక మిగిలింది ఏముంది. అక్రమాస్తుల చిట్టా మొత్తం మూటకట్టి ఏసీబీ DG ఆఫీసుకు పంపడమే.ఏసీబీ వాళ్ళు కచేరీ ఏర్పాటుచేసి అక్రమార్జనలో ప్రతిభ చాటిన ప్రతిభావంతులను సన్మానిస్తారు.

ఎదుటివాళ్ళ అత్యాశ / అవినీతి/అధికార దుర్వినియోగం వల్ల మీకు చచ్చిపోవాలి అన్నంత బాధ కలిగిందా?!?!. ప్రజలు కట్టిన పన్నుల్లోంచి ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వం నియమించు కున్న గుమాస్తాలు అనే ప్రభుత్వ ఉద్యోగులు చేసే పనికి ప్రభుత్వం ఇచ్చే జీతం చాలక వాడవాడో లంచాల కోసం అధికార దుర్వి నియోగం చేస్తే చేతగాని వాళ్ళలా మీరు చావడం ఎందుకు?!?!. నిజంగా మీకు చచ్చేటంత నష్టమో?!?! కష్టమో?!?! సదరు అధికారుల నుండి వచ్చి ఉంటే అలాంటి అధికారుల నుండి నీలా ఇంకే సామాన్యునికి అంతటి కష్టం రాకుండా ధైర్యం చేసి అక్రమాస్తుల చిట్టా బయటికి తీసి ఏసీబీ రైడ్ చేయించు.అలాంటి అవినీతి అధికారులు ఇంటికి పోతే కనీసం నీలా ఇంకొకరు బాధలడకుండా అడ్డుకోగలిగినవాడు అవుతావుకదా?!?!.

ఏసీబీ అధికారులే కాదు  సాక్షాత్తు అత్యున్నత న్యాయస్థానం కూడా ఒక అవినీతి అధికారుల అక్రమాస్తుల చిట్టా నిజమా?!?! కాదా?!?! అని మాత్రమే చూస్తుంది. అంతేకానీ అది ఎలా తెచ్చావు?!?!.ఎందుకు తెచ్చావు అని ఎవరూ అడగరు?!?!. అడిగే అధికారం ఎవరికీ లేదు?!?!.అడిగినా చెప్పాల్సిన అవసరం మనకులేదు?!?!

10సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సర్వీస్ లో నానా సంకలు నాకి  కొన్ని వేలాది/లక్షలమంది జీవితాలు నాశనము చేసి సంపాదించిన ఇలాంటి వాళ్ళ సొమ్ము మొత్తం రిటైర్మెంట్ కు ఒక్కరోజు ముందైనా మీరు ఏసీబీ అధికారుల చేతుల్లో పోయగలితే వాడికి అంతకు మించిన శిక్ష ఉండదు.బాధితులకు అంతకుమించిన సంతృప్తి ఉండదు.

సెక్రటేరియట్ కు ఫిర్యాదులు చేస్తాము/ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తాము/కలెక్టర్ కు అర్జీలు రాస్తాము/SP కి ఫిర్యాదులు చేస్తాము.   ఇవన్నీ వేస్ట్ అక్రమాస్తులు సమాచార సేకరణ బెస్ట్.

చిత్రగుప్తుడు మనుష్యుల పాపాలు లెక్కపెట్టినట్టు మీరు మీ ప్రాంతంలోని అధికారుల అక్రమార్జన అక్రమాస్తుల వివరాల సేకరణపై దృష్టి పెట్టండి. అది మాత్రమే చేయండి.ఈ క్రమంలో అధికారులు అక్రమా కేసులు పెడతాం/అక్రమ కేసులు పెట్టిస్తాం. జైలుకు పంపుతాం. ఇలాంటి బెదిరింపులు చేస్తారు.వాటికేమీ ఎవ్వరూ భయపడవద్దు.         

రిమాండ్ అనేది శిక్ష కాదు.జరిగిన నేరముపై పోలీస్ విచారణ ముగి సేంత వరకు నేరా రోపణ చేయబడిన వ్యక్తి విచా రణకు ఆటంకం కలిగించ కుండా పోలీస్ కస్టడీలో పేట్టుకోవడం మాత్రమే ఆ తరువాత బెయిల్ వస్తుంది.

ఈ అక్రమాస్తులను కనిపెట్టే నీ వేటను నీవు నిరంత రాయంగా చేసు కోవచ్చు. నీవు ఒక్కసారి ఏసీబీ రైడ్ చేయించ గలిగితే చాలు అది ఆ అవినీతి అధికారికి కోలుకోలేని చావుదెబ్బె.

అధికారుల అవినీతికి/అత్యాశకు/అధికార దుర్వినియోగానికి బలై చావడానికి పెట్రోల్ పోసుకునే బాధితులకు/ఆత్మహత్యలు చేసుకునే పిరికివాళ్ళకు ఇదే నా సలహా పోరాడ్డానికి కావాల్సిన ధైర్యం కంటే. చావడానికి ఎక్కువ ధైర్యం కావాలి.చచ్చే అంతటి ధైర్యం నీలో ఉనప్పుడు ఆ ధైర్యాన్ని అవినీతి అధికారుల అక్రమాస్తులు బయటికి తీసి అటు ప్రభుత్వానికి & ఏసీబీ విభాగానికి ఇటు నీలాంటి నిస్సహాయులకు మంచి జరగడానికి ఉపయోగించండి.          

ఒక పదిమందికి వేటుపడితే ఆటోమేటిక్ గా ఎవరికి వాళ్ళు మారుతారు.

పవర్ ఆఫ్ ఆర్టీఐ

 


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...