Jan 31, 2018

మూడు నగరాల్లో భారీ స్థాయి కుటుంబ వినోద కేంద్రాలు


ఆర్థిక మంత్రి యనమల సమీక్ష
                  
  సచివాలయం, జనవరి 31: విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలలో భారీ స్థాయి కుటుంబ వినోద కేంద్రాల(ఎఫ్ఈసీ-ఫ్యామిలీ ఎంటర్ టెయిన్ మెంట్ సెంటర్ల) ఏర్పాటును పర్యాటక శాఖ అధికారులు ప్రతిపాధించారు. సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంతస్తులోని  ఆర్థిక శాఖ సమావేశమందిరంలో బుధవారం ఉదయం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన పట్టనాభివృద్ధి విధానాల సంస్కరణపై మంత్రి మండలి ఉప సంఘం సమావేశం, పర్యాటక శాఖ అభివృద్ధిపై సమీక్షా సమావేశం జరిగాయి. ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలలో ప్రతిపాదించిన మూడు ఎఫ్ఈసీలు, కాకినాడలో రిసార్ట్, ప్రకాశం జిల్లా చీరాలలోని ఓడరేవు సమీపంలో రిసార్ట్ గురించి  పర్యాటక  శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వివరించారు. విశాఖ ఎఫ్ఈసీలో ఒక ఐమాక్స్ థియేటర్, 8 వెండితెరల మల్టీప్లెక్స్, రెండు వేల సీట్ల సామర్ధ్యం గల ఒక కాన్ఫరెన్స్ హాల్(ఎంఐసీఈ-మీటింగ్,ఇన్ సెంటివ్స్, కన్వెన్షన్స్, ఈవెంట్స్), 50వేల అడుగుల వాణిజ్య స్థలం, త్రీస్టార్ హోటల్ ఉంటాయని తెలిపారు. విజయవాడలోని ఎఫ్ఈసీలో ఒక ఐమాక్స్ థియేటర్, 8 వెండితెరల మల్టీప్లెక్స్, రెండు వేల సీట్ల సామర్ధ్యం గల ఎంఐసీఈ, 50వేల అడుగుల వాణిజ్య స్థలం, త్రీస్టార్ హోటల్, తిరుపతిలోని ఎఫ్ఈసీలో ఒక ఐమాక్స్ థియేటర్, 6 వెండితెరల మల్టీప్లెక్స్, రెండు వేల సీట్ల సామర్ధ్యం గల ఎంఐసీఈ, 80వేల అడుగుల వాణిజ్య స్థలం, త్రీస్టార్ హోటల్  ఉంటాయని వివరించారు. కాకినాడలో మొత్తం పది ఎకరాల స్థలంలో ఓ రిసార్ట్ ఏర్పాటు చేసి, అక్కడ వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారి తెలిపారు. ఈ మొత్తం ప్రాజెక్టులకు వంద నుంచి 150 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. పర్యాటక శాఖకు సంబంధించి మూడు కేటగిరీలుగా విభజించిన 9 అంశాలను  పర్యాటక శాఖ కమిషనర్ హిమాన్షు శుక్లా వివరించారు.
         ఈ సందర్భంగా మంత్రి యనమల మాట్లాడుతూ ఏ ప్రాజెక్టులైనా నిర్ణయించిన సమయానికి పూర్తి కాకపోతే వారికి ఇచ్చిన భూములను తప్పనిసరిగా వెనక్కు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో ఏవైనా ప్రాజెక్టులు గిరిజనేతరులు చేపట్టడానికి నిబంధనలు అనుమతించనందువల్ల ప్రభుత్వం ఆధ్వర్యంలో సొసైటీలు ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించమని అధికారులకు చెప్పారు. ఏపీ టూరిజం బోర్డు ఏర్పాటు, మహేంద్ర సంస్థకు శ్రీకాకుళంలో స్థలం కేటాయింపు, తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో పర్యాటక ప్రాజెక్ట్, అక్కడి ఐల్యాండ్, పలు పర్యాటక ప్రాజెక్టులు, ఏపీటీడీసీ ప్రాజెక్టులు, అరవసల్లి, కుప్పం, తోటకొండ, ఎర్రకాలు భూముల కేటాయింపు తదితర పలు అంశాలను చర్చించారు.  ఈ సమావేశాల్లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు, కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయన, పర్యాటక శాఖ మంత్రి భూమన అఖిలప్రియ, మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కె.కరికాల వళవన్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్గృహ నిర్మాణ శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి కాంతిలాల్ దండే తదితరులు పాల్గొన్నరు.

సచివాలయంలో స్మార్ట్ బైకులు ప్రారంభించిన సీఎం


·       అమరావతిలో స్మార్ట్ బైకుల తయారీ యూనిట్ ప్రతిపాదన
·       త్వరలో విశాఖ, విజయవాడ, తిరుపతిల్లో స్మార్ట్ బైకులు

           సచివాలయం, జనవరి 31: విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలలో కూడా స్మార్ట్ బైకులు ప్రవేశపెట్టాలని ఆలిండియా బైసైకిలింగ్ ఫెడరేషన్ వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సచివాలయం ప్రాంగణం 2వ బ్లాక్ ఎదురుగా బుధవారం ఉదయం ఆయన స్మార్ట్ బైక్ స్టాండ్, స్మార్ట్ బైకులను ప్రారంభించారు.  స్మార్ట్ కార్డ్ ద్వారా డిజిటల్ తాళం తీసే పద్దతి,  బైకుని ఉపయోగించే విధానాన్ని నిర్వాహకులు సీఎంకు వివరించారు. సచివాలయం వద్ద మూడు స్టాండులు, 24 స్మార్ట్ బైకులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బైకుకు ఉన్న బుట్టలో హెల్మెట్ కూడా ఉంది.  ఆంధ్రా బ్యాంకువారి సౌజన్యతంలో ఈ బైకులు ఏర్పాటు చేసినట్లు, ఒక్క పైసా కూడా ప్రభుత్వం ఖర్చు చేయలేదని సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ సీఎంకు చెప్పారు. అత్యంత ఆధునికమైన, అత్యుత్తమమైన ఈ సైకిళ్లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నట్లు, ప్రభుత్వం అనుమతిస్తే త్వరలో అమరావతిలో అసెంబ్లింగ్ యూనిట్ నెలకొల్పనున్నట్లు ఆలిండియా బైసైకిలింగ్ ఫెడరేషన్ చైర్మన్ డివి మనోహర్ సీఎంకు చెప్పారు. ఇంతకు ముందు ఎక్కడా లేనివిధంగా ఈ బైక్ స్టాండ్ డిజైన్ చేసినట్లు తెలిపారు. మిగిలిన నగరాలలో కూడా ప్రవేశపెడతామని చెప్పారు.  సైకిల్ రేసులు కూడా నిర్వహించమని సీఎం ఆయనకు సలహా ఇచ్చారు. బైక్ స్టాండ్ నిర్మాణం చూసి సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. స్టాండ్ చుట్టూతా మొక్కలు పెంచి పచ్చదనం నింపి, కలర్ ఫుల్ గా తయారుచేసి, సందర్శకులు ఇక్కడ కూర్చోవడానికి కూడా ఏర్పాట్లు చేయమని చెప్పారు. అలాగే ఇక్కడ సోలార్ విద్యుత్ యూనిట్ ఏర్పాటు చేసి ఏసీకి, విద్యుత్ వాహనాలకు వినియోగించే ఏర్పాటు చేయమని అధికారులను ఆదేశించారు. విజయవాడ-గుంటూరు మధ్యన కూడా ఇటువంటి సైకిళ్లను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించమన్నారు. స్మార్ట్ బైక్ తయారీ యూనిట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు పరిశీలించమని కమిషనర్ శ్రీధర్ కు సీఎం చెప్పారు. ఆ తరువాత సీఎం స్వయంగా సైకిల్ తొక్కుతూ 1వ బ్లాక్ లోని తన కార్యాలయానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎనర్జీ, మౌలికసదుపాయలు, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.
స్మార్ట్ బైక్ ఉపయోగించే విధానం
సచివాలయం బయట బస్టాండ్ వద్ద, లోపల 5వ బ్లాక్, 2వ బ్లాక్ వద్ద స్మార్ట్ బైక్ స్టాండ్ లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మూడు చోట్ల ఎక్కడైనా బైక్ తీసుకోవచ్చని, ఎక్కడైనా పార్క్ చేయవచ్చని తెలిపారు. పేరు నమోదు చేయించుకున్నవారికి సభ్యత్వ స్మార్ట్ కార్డు ఇస్తారని, ఆ కార్డు ద్వారా బైక్ డిజిటల్ తాళం తీయవచ్చని వివరించారు. యాప్ ద్వారా కూడా బైక్ తాళం తీయవచ్చని తెలిపారు. బైక్ ని తీసుకొని, ఉపయోగించుకునే వివరాలు స్టాండ్ వద్ద శాశ్వితంగా ప్రదర్శనకు ఉంచారు. ప్రస్తుతం ఈ బైకులకు ఉచితంగానే వినియోగించుకోవచ్చిని తెలిపారు. దేశంలోని ఇతర  ప్రాంతాల్లో  రెండు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున ఛార్జి వసూలు చేస్తారని వివరించారు. నగరం విస్తరించిన తరువాత ఈ బైకుల వినియోగం ఎక్కువగా ఉంటుందని చెప్పారు.
ఆంధ్రాబ్యాంక్ రూ.30 లక్షల మంజూరు
అమరావతిలో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ స్మార్ట్ బైక్ ప్రాజెక్టుకు అయిన ఖర్చు మొత్తం రూ.30 లక్షలు ఆంధ్రాబ్యాంక్ ఇచ్చినట్లు సీఆర్డీఏ కమిషనర్ చెరుకూలి శ్రీధర్ తెలిపారు. బ్యాంక్ ఏజీఎం ఎం.విజయప్రతాప్ చొరవతో నిధులు విడుదల చేసిన జీఎం కెవిఎస్పీ ప్రసాద్ కు ఆయన కృతజ్ఙతలు తెలిపారు.

Jan 30, 2018

పెట్టుబడులు పెట్టడానికి దిగ్గజ సంస్థల ఆసక్తి


Ø  సీఎం 14 దావోస్ పర్యటన విజయవంతం
Ø ఏపీలో పైలెట్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు సుజ్లాన్ గ్రూప్ ఆసక్తి
Ø మంత్ర డాటా సెంటర్స్ ఏర్పాటుకు సిద్దం
Ø వైజాగ్ మెడ్‌టెక్ పార్కులో యురోపియన్ సెగ్మెంట్
      
   ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 14వ సారి జరిపిన  4 రోజుల దావోస్ పర్యటన విజయవంతమైంది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం బృందం దావోస్ వెళ్లిన విషయం తెలిసిందే. కాస్త అనారోగ్యంగా ఉన్నప్పటికీ సీఎం జనవరి 22 నుంచి 25 వరకు చాలా బిజీగా గడిపారు.  ఏపీ నుంచి వెళ్లిన సీఎం బృందానికి అంతర్జాతీయంగా పలువురు మేథావులను, వివిధ కంపెనీల ముఖ్యకార్య నిర్వహణాధికారులు, పారిశ్రామిక వేత్తలను, పెట్టుబడిదారులను కలుసుకొని, ప్రపంచం వ్యాప్తంగా ఆవిష్కృతమవుతున్న అనేక కొత్తకొత్త విషయాలను, పారిశ్రామిక రంగం విస్తరణ గురించి తెలుసుకునే అవకాశం లభించింది. అనేక దిగ్గజ సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడిపెట్టడానికి ఆసక్తి చూపించాయి. ఈ పర్యటనలో 25 ద్వైపాక్షిక సమావేశాలు, రెండు ఎంఓయులు జరిగాయి. తొలుత జ్యూరీక్ చేరిన సీఎం  పయనీరింగ్ వెంచర్స్ చైర్మన్ రోన్ పాల్, చీఫ్ ఇన్వెస్టర్ ఆఫీసర్ సందీప్ రాజ్ తో మొదటి ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు..  పాల ఉత్పత్తుల కోసం సహకార సంస్థల ఏర్పాటు, ఉద్యాన పంటలకు ప్రోత్సహాం తదితర అంశాలను చర్చించారు, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పూర్తి ప్రణాళికతో రండి. మీకు అన్నివిధాలా సహకారం అందజేస్తాం. సింగిల్ డెస్క్ విధానం ద్వారా అన్ని అనుమతులను మూడు వారాల్లో ఇస్తున్నాం అని సీఎం వారికి భరోసా ఇచ్చారు. ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని పరిశీలించాలని పయనీరింగ్ సంస్థకు సీఎ సూచించారు. కుప్పంలో చిన్నపాటి విమానాశ్రయం ఏర్పాటు చేయబోతున్నట్లు కూడా తెలిపారు. పండ్లతోటల సాగు, కూరగాయల సాగుకు భారీగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించామని, ఇందుకు ఓ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు  రోన్ పాల్ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయాభివృద్ధిని పరిశీలించి భవిష్యత్తు  కార్యాచరణను సవివరంగా ప్రకటిస్తామన్నారుఈ సంస్థ  మన దేశంలో ఇప్పటికే వ్యవసాయ రంగంలో రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టింది. మన రాష్ట్రంలోని  కుప్పంలోమహారాష్ట్రలోని నాందేడ్ లో ఇప్పటికే పయనీరింగ్ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించింది. ఏపీ ప్రభుత్వం జ్యురిక్ స్టేట్ తో సిస్టర్ స్టేట్ అవగాహన ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో  జూరిచ్, ఏపీ ప్రభుత్వం అధికారులు సిస్టర్ స్టేట్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.  జ్యూరిక్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల మంత్రి కార్మెన్ వాకెర్ స్పా, ఆర్థిక వ్యవహారాల ఉప మంత్రి బ్యూన్ సాటర్, జ్యూరిక్ ప్రభుత్వానికి చెందిన ప్రాజెక్టు మేనేజర్ కొరిన్ వ్యేర్ సీఎంని కలిశారు.  ఒప్పందం వల్ల పర్యావరణ సాంకేతికత, జీవశాస్త్రాలు, పట్టణ, ప్రాంతీయాభివృద్ధి రంగాల్లో పరస్పరం సహకరించుకుంటాయి. రెండో రోజు దావోస్ లో జరిగిన బిజినెస్ బ్రేక్ ఫాస్ట్ సమావేశం ప్యానెల్ డిస్కషన్ లో ఐటి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి సానుకూలాంశాలను వివరించారుపెట్రోలియం రిఫైనరీ రంగంలో ప్రసిద్ధి చెందిన సౌదీ ఆర్మ్‌కో ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ విభాగం  వైస్ ప్రెసిడెంట్  సైద్ ఎ. అల్ హద్రమీ చర్చలు జరిపారు. ఏపీలో చమురు సహజవాయు నిక్షేపాలు అపారంగా ఉన్న దృష్ట్యా హద్రమీ ఆసక్తి కనబరిచారు.  ఆంధ్రప్రదేశ్ లో  640 .కి.మీ మేర చమురు, రసాయనాలు, పెట్రెకెమికల్స్ ఇన్వె స్టిమెంట్ రీజియన్ (పెట్రోలియం, కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ పెట్టుబడుల ప్రాంతం- పీసీపీఐఆర్) లో ఉందని, అలాగే 6 సెజ్‌లు ఉన్న విషయాలను అధ్యయనం చేసిన సంస్థ రాష్ట్రంలోని కృష్ణపట్నాన్ని తన పెట్టుబడులకు  ప్రాధాన్యతా కేంద్రంగా సౌదీ ఆర్మ్‌కో ఎంచుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు 974 కి.మీ సముద్రతీరం ఉందని, కృష్ణా-గోదావరి బేసిన్ లో అపార చమురు నిక్షేపాలు ఉన్నాయని, పెట్రోలియం శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు దేశంలో తమ రాష్ట్రం ఎంతో అనుకూలమని   సౌదీ ఆర్మ్‌కో సంస్థకు  సీఎం సూచించారు. చమురు శుద్ధి రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు. భారత్‌కు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు మీరు చూపిస్తున్న వ్యక్తిగత శ్రద్ధను అభినందిస్తున్నామని సైద్ హద్రమీ అన్నారు. సి.., పిడబ్ల్యుసి సంయుక్తంగా నిర్వహించిన ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ ఇండియా‘  వ్యాపార విభాగ (బిజినెస్ సెషన్)‌లో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఏపీకీ  వైజాగ్ -చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై -బెంగుళూరు ఇండస్ట్రియల్
కారిడార్లు రెండూ ఒక వరం అని చెప్పారు. తిరుపతి  ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో ఇప్పటికే సెల్కాన్,డిక్సన్, కార్బన్ లాంటి సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయని గుర్తు చేశారు.శ్రీ సిటీ సెజ్ లో ఫాక్స్‌కాన్ మొబైల్ తయారీ కంపెనీ లో ఒకే చోట 12 వేల మంది మహిళలకు ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్  రాజధాని అమరావతిని  హరిత, ఆహ్లాదభరిత వాతావరణం ఉట్టిపడేలా ప్రపంచ స్థాయిలో ప్రజా రాజధానిగా నిర్మిస్తున్నామని, ఇందుకోసం మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. 150 కంపెనీలను ఏపీకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్న  మిడ్‌టెక్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. అత్యున్నత సాంకేతిక నైపుణ్యం గలవారు, శాస్త్ర నిపుణులతో 45 నుంచి 50 వేలకు పైగా ఉద్యోగాల కల్పన, దీనికి రెట్టింపు సంఖ్యలో పరోక్ష ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ఈ సంస్థ పని చేస్తోంది. వైజాగ్ మెడ్‌టెక్ పార్కులో భాగస్వామ్యం తీసుకుని క్రమంగా విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తోంది. వైజాగ్ మెడ్‌టెక్ పార్కులో యురోపియన్ సెగ్మెంట్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
          సీఎంని మర్యాదపూర్వకంగా  కలిసిన ఎస్‌బీఐ చైర్మన్ రజ్నీష్ కుమార్ అమరావతి అభివృద్ధిని నిశితంగా పరిశీలిస్తున్నానని చెప్పి, అమరావతిలో ప్రాంతీయ ప్రధాన కార్యలయాన్ని ప్రారంభించడానికి అంగీకారం తెలిపారు. అమరావతిలో ఫ్యూచరిస్టిక్ క్యాంపస్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సీఎంతో సమావేశమైన ఏజిల్ లాజిస్టిక్స్ సంస్థ సీఈవో తరక్ సుల్తా అల్ ఎస్సా ఏపీలో వ్యాపార విస్తరణకు ప్రణాళికలతో ఉన్నామన్నారుప్రభుత్వ నేతగా ఉన్న వ్యక్తి నుంచి సాంకేతికతకు సంబంధించిన మాటలు వినడం తనకు అమితాశ్చర్యంగా ఉందని, సంస్థలకు సంబంధించిన వారు కూడా ఇంత పరిజ్ఞానంతో మాట్లాడలేరని వ్యాఖ్యానించారు. పెట్టుబడులు పెట్టించేందుకు మీరు మమ్మల్ని ఒప్పించనవసరం లేదు. ఎందుకంటే మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని మేము ఇప్పటికే స్థిర నిర్ణయం తీసుకున్నాంఅని చెప్పారు.
 హిటాచీ ప్రెసిడెంట్ తొషైకీ హిగషిహర కూడా సీఎంతో భేటీ అయ్యారుసిటిజన్ లైఫ్ సైకిల్ ఇ-గవర్నెన్స్ ప్లాట్‌ఫామ్‌ అంశంపై హిటాచి సంస్థతో ఏపీ ఈడీబీ ఎంవోయూ కుదుర్చుకుంది. సుజ్లాన్ గ్రూప్ సీఎండీ తుల్సి తంతి సీఎంతో సమావేశమై పవన, సౌర, గ్యాస్ ఆధారిత విద్యుత్ రంగాలలో తమ భవిష్యత్ విస్తరణ ప్రణాళికల గురించి వివరించారు. ఈ గ్రూప్ ఇప్పటికే రాష్ట్రంలో పవన, సౌర విద్యుత్ రంగాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. పునరుత్పాదక విద్యుత్ నిల్వ అంశంలో భారీ పరిశోధనలు చేస్తున్న ఈ గ్రూప్ ఏపీలో పైలెట్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఆసక్తి కనబర్చింది. మంత్ర డాటా సెంటర్స్ బోర్డ్ మెంబర్ మోహన్ చైనాని సీఎంని కలిసి ఏపీలో  డాటా సెంటర్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గూగుల్, యాక్సెంచర్ డాటా సెంటర్లు కూడా ఏపీలో ఏర్పాటు చేయిస్తామని చెప్పారు.  అందుకు అవసరమైన భూమి, విద్యుత్, ఫైబర్ వసతులు కల్పించాలని కోరారు.  కావాల్సిన అన్ని అనుమతులు 21 రోజుల్లో కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.అత్యున్నత ఎలక్ట్రానిక్ మెడికల్ హెల్త్ రికార్డుల తయారీపై అధ్యయనం చేస్తున్న గ్లోబల్ ఫార్మా కంపెనీ రోషేభారతదేశంలో దీర్ఘకాలంగా కార్యకలాపాలు సాగిస్తోంది. రోషేప్రతినిధి క్రిస్టోఫె ఫ్రాంజ్‌ సీఎంని కలిసి తమ సంస్థ భారత్ లో మరింతగా విస్తరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. తనను కలిసిన ఏబీబీ అధ్యక్షుడు చున్యున్‌గుకు సీఎం సౌర, పవన, హైబ్రీడ్ విద్యుత్ రంగాలలో ఏపీ అనుసరిస్తున్న నూతన విధానాలను, అమరావతిలో కాలుష్య రహిత విద్యుత్ వాహనాలకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించి ఏపీలో  ఏబీబీ తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ విధానాలను అధ్యయనం చేసి, తయారీ కేంద్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని చున్యున్‌గు బదులిచ్చారు. వ్యవసాయ ఉపకరణాలు, ఉత్పత్తులకు పేరుగాంచిన యూపీఎల్ సంస్థ గ్లోబల్ సీఈవో జై షరోఫ్ తో సీఎం భేటీ అయిన సందర్భంగా ఎరువుల వినియోగాన్ని తగ్గించడం, సమర్ధ నీటి నిర్వహణ చేపట్టడం, వ్యవసాయ వ్యయ భారాన్ని నియంత్రించడం, ఉత్పాదకత పెంచడం తమ సంస్థ లక్ష్యాలని ఆయన వివరించారు.
భారత్ లో రెండో డేటా సెంటర్ ఏపీలో ఏర్పాటుకు  సిద్ధంగా ఉన్నట్లు కామర్స్ దిగ్గజ సంస్థ అలీబాబా క్లౌడ్ అధ్యక్షుడు సైమన్ హూ సీఎంకు చెప్పారు. మహీంద్ర సంస్థ గ్రూప్ అధిపతి ఆనంద్ మహీంద్రతో సీఎం భేటీ అయ్యారు. మా రాష్ట్రాన్ని ప్రపంచానికే ఒక ఆదర్శ నమూనాగా తీర్చిదిద్దటం నా స్వప్నంఅని చంద్రబాబు వివరించారు. ఇండస్ట్రియల్  సిటీ సెజ్‌ను ఏపీలో ఏర్పాటుచేయడానికి అన్ని విధాలుగా  సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ పర్యటనలో ముఖ్యమంత్రిని కలిసినవారిలో బ్లూమ్‌బెర్గ్సంస్థ సీఈవో జస్టిన్ స్మిత్. హెచ్ పీ 3డీ ప్రింటింగ్ హెడ్ స్టీఫెన్ నిగ్రో, నన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్శిటీ ప్రెసిడెంట్ సుబ్రా సురేశ్‌, బ్లాక్‌చైన్ టెక్నాలజీకి చెందిన ఎథేరియంవ్యవస్థాపకుడు జో లుబిన్, రహేజా గ్రూప్ ప్రతినిధి రవి రహేజా, జాన్సన్ ఇన్వెస్టిమెంట్స్  ప్రతినిధి యుల్లి జాన్సన్, శానిటరీవేర్ తయారీదారులుగా పేరొందిన లిగ్జిల్ గ్రూపు సీఈఓ కిన్యా సెటో, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ (టీజీహెచ్) సంస్థ చైర్మన్, సీఈవో సంజీవ్ అహుజా. ప్రసిద్ధ ఏవియేషన్ సంస్థ డస్సాల్ట్గ్రూపు ప్రతినిధి బెర్నార్డ్ చార్లెస్, బిజినెస్ అప్లికేషన్స్‌లో వరల్డ్ లీడర్‌గా ఉన్న శాప్ ప్రతినిధులు ఉన్నారు. దావోస్‌లో జరిగిన సీఐఐ రౌండ్ టేబుల్ సమావేశంలో, ఇంటరాక్టివ్ లంచాన్ విత్ టాప్ ఇన్నోవేటర్స్ ఇన్ టెక్అనే కార్యక్రమంలో టెక్నాలజీస్ ఫర్ టుమారోఅనే అంశంపై సీఎం అద్బుతంగా ప్రసంగించారు. జ్ఞాన సంపదతో రాత్రికి రాత్రే అద్భుతాలు చేయవచ్చని, నవ్య ఆవిష్కరణలు మన జీవన విధానాన్నే మార్చివేస్తున్నాయని చెప్పారు.ఈ పర్యటనలో సీఎం తన ప్రసంగాలు, చర్చల సందర్భంగా రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్( వ్యాపార అనుకూల వాతావరణం), -ప్రగతి, రియల్‌టైమ్ గవర్నెన్స్, 7 మిషన్లు, 5 గ్రిడ్లు, 5 కాంపెయిన్లు, ఫైబర్ గ్రిడ్ తో అనుసంధానం, 6 వేలకు పైగా వర్చువల్ క్లాస్‌రూములు, డ్రోన్ల వినియోగం, -ఆఫీసు, -క్యాబినెట్, బయోమెట్రిక్, 1100 నెంబర్ కాల్ సెంటర్, క్లౌడ్ హబ్ పాలసీ, 20 వేలకు పైగా సీసీ కెమరాల వినియోగం గురించి వివరించారు. రాష్ట్రం మొత్తాన్ని స్మార్ట్ రాష్ట్రంగా మార్చాలని భావిస్తున్నామని చెప్పారు. ఏపీని ఇన్నోవేషన్ వ్యాలీ ఆఫ్ ది వరల్డ్ గా మార్చడం తమ  ధ్యేయం అన్నారు. తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్కరూ  అత్యంత ఆనందదాయకమైన జీవనం సాగించేలా చూడటం, 2022కు దేశంలోని మూడు అత్యుత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దడం, 2050 ప్రపంచ పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం తమ లక్ష్యంగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బృందంలో  రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడురాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ఐటి, పంచాయతీరాజ్ శాఖా మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్, ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈఓ జాస్తి కృష్ణ కిశోర్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, వ్యవసాయ సలహాదారు టి. విజయకుమార్ ఉన్నారు.

-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్-9440222914

అభివృద్ధిపథంలో ఆంధ్రప్రదేశ్


                ఎవరు ఎన్ని చెప్పినా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని నేత నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర విభజన  నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ఆయనకున్న అపార అనుభవంతో నిలదొక్కుకునేలా చేస్తున్నారు. తుది నిర్ణయం తీసుకున్న తరువాత ఏపీ నేతల అభిప్రాయాలు, ఆలోచనలు చెప్పడానికి అవకాశం లేకుండా, కొంపలు మునిగిపోతున్నట్లు ఆదరాబాదరగా అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించారు. రాజధాని లేదు. ఆర్థిక లోటు. విద్యుత్ కొరత. ఉమ్మడి రాష్ట్రంలో ఆదాయవనరులు హైదరాబాద్ లో కేంద్రీకృతం కావడం వీటన్నిటి నేపథ్యంలో రాష్ట్రాన్ని దయనీయమైన స్థితిలో వేరు చేశారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు మొక్కవోని దీక్షతో, పట్టుదలతో రాష్ట్రానికి నూతన రాజధానితోపాటు జలవనరులు, -ప్రగతి, పారిశ్రామికీకరణ, ఇతర  ఆదాయ వనరులు సమకూర్చడానికి రాత్రిపగలు రోజుకు 18 గంటలు శ్రమిస్తున్నారు. ప్రభుత్వ సిబ్బందిని కూడా పరుగులు పెట్టిస్తూ అభివృద్ధిలో, వృద్ధి రేటులో ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. ప్రణాళికాబద్దంగా లక్ష్యాలను రూపొందించుకుని రెండంకెల వృద్ధి రేటు సాధించారు. మొత్తం జాతీయ స్థూల అదనపు విలువ (జీవీఏ - గ్రాస్ వ్యాల్యూ యాడెడ్) వృద్ధి రేటుతో పోల్చితే రాష్ట్ర జీవీఏ వృద్ధి రేటు గత ఏడాది, ఈ ఏడాది ఇప్పటివరకు ఎక్కువగానే ఉంది. దేశంలో 25 ఏళ్ల క్రితం పివి నరసింహారావు హయాంలో మొదలైన ఆర్థిక సంస్కరణల ఫలితాలు మన రాష్ట్రంలో కూడా కనిపిస్తున్నాయి. 1991 నాటి ఆర్థిక సంస్కరణలు ప్రైవేటు రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి. దేశంలో సంపదతోపాటు ఉద్యోగ అవకాశాలు, ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరిగాయి. 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఆ సంస్కరణలను అందిపుచ్చుకొని, ఆర్థిక పరంగా రాష్ట్రంలో గట్టి పునాదులు వేశారుమళ్లీ 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గతంలో తను కొనసాగించిన విధానాలనే మళ్లీ కొనసాగించారు. ఆయన వేసిన పునాదులపై బలపడిన  వ్యవస్థ నుంచి మంచి ఫలితాలు రావడం మొదలైంది. ఈ ప్రభుత్వం ఏర్పడిన మూడున్నర ఏళ్లలో ఏడాదికి ఏడాది వృద్ధి నమోదవుతోంది. దాంతో అన్ని రంగాలలో సమ్మితళిత వృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తోంది.  
మానవ వనరులు, మౌలిక వసతులు, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, రాజకీయ సుస్థిరత, పాలనావిధానం, వ్యాపార అనుకూల వాతావరణం అనే ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకొని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లయిడ్‌ ఎకనమిక్‌ రిసెర్చ్‌ (ఎన్‌సీఏఈఆర్‌) సంస్థ దేశవ్యాప్తంగా 2016లో 29 రాష్ట్రాలు, ఢిల్లీతో సహా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులను పరిశీలించినప్పుడు ఏపీలో శరవేగంగా అభివృద్ధి చెందే వాతావరణం ఉందని పేర్కొంది. కార్మికుల లభ్యత, కార్గో నిర్వహణ, సులభతరమైన భూకొనుగోలు కార్యకలాపాలు, ఏపీ ప్రధాన బలాలని సర్వే నివేదిక వెల్లడించింది.

              అత్యాధునిక సాంకేతికత వినియోగించుకుంటూ  సమర్థవంతమైన పాలనతోపాటు ఆర్థిక వృద్ధి సాధించేందుకు చంద్రబాబు చేపట్టిన బహుముఖ వ్యూహాలు ఫలిస్తున్నాయి. పాలన వేగవంతం చేసేందుకు ప్రారంభించిన ఏడు మిషన్లు (ప్రాధమిక రంగం, సామాజిక సాధికారిత, పరిజ్ఞాన నైపుణ్యాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పారిశ్రమలు, మౌలికసదుపాయాలు, సేవల రంగం), ఐదు గ్రిడ్లు (గ్యాస్, వాటర్, ఫైబర్, రోడ్, పవర్) మరో ఐదు (నీరు-చెట్టు, బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది, పేదరికంపై గెలుపు, పరిశుభ్ర-ప్రజారోగ్యం) ప్రచార కార్యక్రమాలు నిర్ణీత వ్యవధిలో నిర్ధేశించిన లక్ష్యాలు చేరుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెయ్యడం ద్వారా దేశంలో ఏపీని అగ్రగామిగా నిలపాలన్నది చంద్రబాబు ఆలోచన. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో రాష్ట్రంలోని 13 జిల్లాలను దృష్టిలో పెట్టుకొని అందుకు తగిన ప్రణాళికలు సిద్దం చేయడంతోపాటు  పథకాలు అమలు చేస్తున్నారు. ప్రపంచం అంతా ఏపీ పైపు చూసేలా తెలుగువారి సత్తా చాటుతూ మౌలిక వసతులు కల్పిస్తున్నారు. విదేశీ, స్వదేశీ సంస్థల భాగస్వామ్యంతో ఈ రంగాన్ని అభివృద్ధిపరుస్తున్నారువిద్యుత్ రంగంలో లోటు నుంచి మిగులుకు చేరింది. దక్షిణ భారతదేశంలో నిరంతరం విద్యుత్ సరఫరా చేసిన మొదటి రాష్ట్రం ఏపీ. 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ అందిస్తూ రికార్డు నెలకొల్పింది. ఎల్ఈడీ బల్బుల వినియోగంలో కూడా రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఐటీ వినియోగంలో రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికే ప్రభుత్వ విభాగాలన్నింటిలో నూరు శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ దాదాపు పూర్తి అయింది. రాష్ట్రంలో ఫైబర్ నెట్ వర్క్ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటికి రూ.149 లకే ఇంటర్నెట్, టీవీ, టెలిఫోన్ మూడు సౌకర్యాలను కల్పిస్తున్నారు. పౌర సేవలన్నీ ఒకే తాటిపైకి తీసుకొస్తున్నారు. ప్రజలే ముందు అన్న నినాదంతో 1100కు ఒక్క ఫోన్ చేస్తే సమస్యలు పరిష్కారం అయ్యే ఏర్పాట్లు చేశారు. -పరిపాలనలో రాష్ట్రం ముందుంది. వచ్చే మార్చి నుంచి పేపర్ లెస్ పాలనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐటీ, ఇన్నొవేషన్ పాలసీలు, -గవర్నెస్ లో రాష్ట్రం అద్వితీయమైన ప్రగతి సాధించి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలించింది. ప్రపంచంలో ఈ-ప్రగతి ద్వారా పరిపాలన కొనసాగించే రాష్ట్రాల సరసన చేరింది. ఈ విధంగా అన్ని అంశాలలో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోంది. రాష్ట్రంలో 974 కిలో మీటర్ల సముద్ర తీరం ఉండటం ఓ వరం. సముద్రంలోనే కాకుండా తీరం వెంట భూగర్భంలోనూ అపారమైన ఖనిజ సంపద నిక్షిప్తమై ఉందిదానికి తోడు రాష్ట్రంలో  నైపుణ్యత కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. నిరంతరం విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండటంతో సాగర తీరంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి, జల రవాణాకు అనేక అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటినీ సమర్థవంతంగా వినియోగించుకుంటూ సీఎం దేశ,విదేశాల్లో పర్యటిస్తూ పెట్టుబడులను రాబడుతూ ఇటు ప్రభుత్వం రంగంలోనూ, అటు ప్రైవేటు రంగంలోనూ  పరిశ్రమలు నెలకొల్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రయత్నాలు ఫలిస్తున్నాయిరాష్ట్ర తీరప్రాంతంలో భారీ పరిశ్రమలు నెలకొల్పుతున్న నేపధ్యంలో కేంద్రం తీర ప్రాంత ఉపాధి మండలి’ (కోస్టల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ జోన్‌ - సీఈజెడ్‌) ఏర్పాటు చేసి అనేక రాయితీలు ఇవ్వడం ద్వారా  పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దేశంలో పెట్టుబడుల వృద్ధి, భవిష్యత్ అంచనాలపై చేసిన అధ్యయనంలో  దేశంలో ఏ రాష్ట్రం సాధించనంతటి వృద్ధిని ఏపీ సాధించింది. ఆర్బీఐ నివేదిక ప్రకారం 2014-15 ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం మీద రాష్ట్రానికి 8.1 శాతం పారిశ్రామిక  పెట్టుబడులు రాగా2015-16 లో  15.8 శాతం పెట్టుబడులు వచ్చాయి. అంటే  ఒక్క ఏడాది కాలంలో 7.7 శాతం పెట్టుబడులు పెరిగాయి. విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులలో లక్షల కోట్ల పెట్టుబడుల అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయులు కూడా కుదుర్చుకుంది.

          రాష్ట్రం గురించి సీఎం కన్న కలలు ఒక్కొక్కటిగా  ఫలిస్తున్నాయి. 2022 నాటికి దేశంలో మొదటి 3 రాష్ట్రాలలో ఏపీ ఒకటిగా ఉండాలని, 2029 నాటికి మొదటి స్థానానికి చేరాలన్ని ఆయన లక్ష్యం. 2050 నాటికి ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు గల రాష్ట్రంగా తీర్చిదిద్దటానికి కావలసిన ప్రణాళికలు రూపొందించారు. ఆ దిశగా అడుగులు వేస్తూ, రాష్ట్రం గడచిన గడచిన మూడన్నరేళ్లలో సాధించిన ప్రగతిని గమనిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నట్లు అర్ధమవుతోంది. చంద్రబాబుపై ఉన్న నమ్మకం, ఆయన కృషి ఫలితంగా పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ మొదటి స్థానానికి ఎగబాకింది. రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో ఉద్యమంలా ఓ ఊపు తీసుకువచ్చి ఈ స్థాయికి తీసుకురావడం చంద్రబాబుకే చెల్లింది.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ -9440222914


అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...