Jan 29, 2020

జీఎన్‌ రావు ప్రెస్ మీట్


 నిపుణుల కమిటీ కన్వీనర్‌ మాజీ ఐఏఎస్‌ అధికారి జీఎన్‌ రావు హైదరాబాద్ ప్రెస్ మీట్: 
 ‘‘విశాఖ నగరానికి ప్రతికూలతలు ఉండటం నిజం. తీరప్రాంతం కోతకు గురవుతుండటం వాస్తవం. అందుకే, రాజధానిని విశాఖపట్నం కోర్‌ ఏరియాలో కాకుండా, దూరంగా పెట్టాలని చెప్పాం’’ తెలిపారు. విశాఖలో కొత్తగా, భారీ స్థాయిలో ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభించడం వాంఛనీయం కాదు  ‘‘తుఫాన్లు అన్ని ప్రాంతాల్లో వస్తాయి. తీరం కోతకు గురవుతుంది. నేనేం చేయగలను? ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని... విశాఖ ప్రాంత పరిధిలో సముద్రానికి దూరంగా కార్యనిర్వాహక రాజధాని నిర్మించాలని సూచించాం’’ ‘విశాఖ నగరం లోపల కాదు! సముద్రానికి దూరంగా రాజధాని పెట్టాలన్నాం. ఒత్తిడి తగ్గాలంటే అదొక్కటే మార్గం’ 13 జిల్లాలను నాలుగు జోన్ల కింద విభజించి, సీనియర్‌ ఐఏఎస్‌లను జోనల్‌ కమిషనర్లుగా నియమించి, ఆయా జిల్లాల పరిధిలోని యంత్రాంగంపై పర్యవేక్షణ చేయిస్తే ప్రయోజనం ఉంటుందని నివేదికలో పేర్కొన్నాం.
 విశాఖ ప్రాంత అభివృద్ధి మండలి పరిధిలో ప్రభుత్వ భూములున్నాయి. కాస్మోపాలిటన్‌ నగరం కాబట్టే విశాఖకు ప్రాధాన్యం ఇచ్చాం. పెట్రో కారిడార్‌, విశాఖ కారిడార్‌ వంటివి కలిసి వస్తాయి. విశాఖ మాత్రమే ప్రాంతీయ అసమానతలు సరిచేయగలదు. ‘‘అన్ని ప్రాంతాలకూ ప్రతికూలతలున్నాయి. వాటిని నివేదికలో పొందుపరిచాం. కాస్మోపాలిటన్‌ నగరం కాబట్టే విశాఖలో కార్యనిర్వాహక రాజధానికి సిఫారసు చేశాం’’  అమరావతిలో శాసనసభ ఉంటుంది.  ప్రస్తుత భవనాలు ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించుకోవచ్చు.  అక్కడి రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం న్యాయం చేయాల్సిందే. ‘‘అమరావతిలో 20 వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. నాగార్జున వర్సిటీ పరిసర ప్రాంతాల్లో మేలిరకం భూములున్నాయి’’
 నాకు హైదరాబాద్‌లో కార్యాలయం లేదు. ఏపీకి ఫోన్‌ చేసి... సిబ్బందికి డిక్టేట్‌ చేసిన వివరాలే చదువుతున్నా’. ‘నాకిక్కడ కార్యాలయం లేదు. ఇంకేం అడగొద్దు. వదిలేయండి’ ‘వాళ్లంతా పెద్దపెద్దవాళ్లు. కమిటీలో ఉన్నది చిన్నవాళ్లు కాదు. 40, 50 ఏళ్ల అనుభవం ఉన్నవారు. హైదరాబాద్‌, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు నుంచి వచ్చినవారుసందేహాల నివృత్తికోసం విలేకరులు మరిన్ని ప్రశ్నలు అడుగుతుండగా జీఎన్‌రావు అసహనం ప్రదర్శించారు. చివర్లో... ఐటెమ్‌ బాగా రాశారు. నివేదికలో నేను చెప్పినవే రాశారు. అన్నీ కరెక్టే! హెడ్డింగ్‌ మార్చితే బాగుండుఅని ఆంధ్రజ్యోతిప్రతినిధితో అనడం కొసమెరుపు.

Jan 17, 2020

శివరామకృష్ణన్ కమిటీ ప్రజాభిప్రాయ నివేదిక

v రాజధానికి ఏ జిల్లా సూటబుల్ గా ఉంటుందో నిర్ధారించడానికి శివరామకృష్ణన్ కమిటీ 5 సూచికలతో ఒక ఇండెక్స్ తయారు చేసింది. 1. రిస్క్ 2. కనెక్టివిటీ 3. వాటర్ 4. లాండ్ 5. రీజినల్ డెవలప్ మెంట్ అనే సూచికలకు వచ్చిన అగ్రిగేట్ మార్కులను బట్టి విజయవాడ అర్బన్ డెవలప్ మెంట్ పరిధిలో ఉన్న ప్రాంతానికి మొదటి స్థానం ఇవ్వబడింది. ఈ వివరాలు శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ లోని 34, 35, 36, 37 పేజీలలోని టేబుల్-1, ఫిగర్ 28లో పొందుపరచబడి ఉన్నవి. డిస్ట్రిక్ట్ సూటబుల్ ఇండెక్స్, ప్రజాభిప్రాయం ప్రకారం  కృష్ణా- గుంటూరు ప్రాంతానికి మొదటి స్థానం ఇవ్వబడింది.
v శివరామకృష్ణన్ కమిటీ అమరావతిని రాజధానిగా రికమండ్ చేయలేదనేది  వైకాపా దుష్ప్రచారం మాత్రమే
v శివరామకృష్ణన్ కమిటీ ఆగస్ట్ 27, 2014న న్యూ ఢిల్లీలో  కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్‌ గోస్వామికి 187 పేజీల  నివేదిక అందజేసింది. సెప్టెంబర్ 4, 2014న అమరావతి రాజధానిగా అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.
విభజన చట్టం ప్రకారం ఏపీకి ఒక రాజధాని సూచించుటకు కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని నియమించింది. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ(బీసీజీ)లకు చట్టబద్దత లేదు. విభజన చట్టం ప్రకారం శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వడం, దానిపై అసెంబ్లీ, కౌన్సిల్ తీర్మానం చేయడం వల్ల అమరావతి రాజధానిగా అధికారపూర్వకంగా ఏర్పడింది. 


Sivaramakrishnan Report
Total Votes (Opinion)- 4728 (Annex-III, page. 1)

Area
No. Of Votes (opinion)
Vijayawada - Guntur Area
1156
Vijayawada
               663       2191
Guntur
372
Visakhapatnam
507
Kurnool
360
Ongole
265
Rajahmundry
139
Tirupathi
113
Donakonda
116
Others
1037
Total Voters
4728

రాజధాని నేలలకు పటుత్వం ఎక్కువ



§  ఐఐటి మద్రాస్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుభదీప్ బెనర్జీ ఎల్ అండ్ టీ కన్ స్ట్రక్షన్ బిల్డింగ్స్ అండ్ ఫ్యాక్టరీస్ వారి ద్వారా ఇచ్చిన నివేదిక ప్రకారం అమరావతిలో హెచ్ఓడి 3వ టవర్‌కు  ఫౌండేషన్ లోతు 10.9 మీటర్లు, 4వ టవర్ కు 10.6 మీటర్లు సరిపోతుంది.
§  అమరావతిలో నేలకి పటుత్వం ఎక్కువ - ఇది చాలా మంచి నేల - బలం వున్న నేల అని నిపుణులు తేల్చారు.
§  అమరావతి ప్రాంతంలో రాకీ స్టార్టా ఎట్‌ 11 మీటర్లలో మొదలవుతుంది. సాయిల్ బేరింగ్ కెపాసిటీ చ.మీ.కు 150 మెట్రిక్‌ టన్నులు ఉంది.
§  చెన్నై నగరంలో బేరింగ్‌ కెపాసిటీ గరిష్టంగా చ.మీ.కు 10 మెట్రిక్‌ టన్నులే. ఫైల్‌ ఫౌండేషన్‌ 30 నుంచి 40 మీటర్ల లోతు నుంచి వేయాలి.
§  హైదరాబాద్‌లో రాతి నేలల  కారణంగా బ్లాస్టింగ్‌ చేయాలి - బేస్‌మెంట్‌ 7.1 మీటర్లు, ఫైల్ ఫౌండేషన్ 4.5 మీటర్లు మొత్తం 11.6 మీటర్లు.  బ్లాస్టింగ్ కు, రాళ్లు తొలగించడానికి అధిక వ్యయం అవుతుంది.
§  అందుకే అమరావతిలో రాఫ్ట్‌ ఫౌండేషన్‌కు ప్రాధాన్యం. అత్యంత ప్రాముఖ్యత కలిగిన సెక్రటేరియట్‌, హెచ్ఓడీ 5 టవర్లను రాఫ్ట్‌ ఫౌండేషన్‌తో నిర్మించాం. మన సెక్రటేరియట్‌ వద్ద బేరింగ్‌ కెపాసిటీ చ.మీ.150 మెట్రిక్‌  టన్నులు ఉంటుంది.
§  అమరావతిలో ఫౌండేషన్ ఖర్చులు హైదరాబాద్, చెన్నై కన్నా ఎక్కువ కాదని  ఇంజనీరింగ్ నిపుణులు నిర్ధారించారు.

నోట్: అమరావతిలో వరద ముంపుపై మేం ఎటువంటి నివేదిక ఇవ్వలేదని ఐఐటి మద్రాస్ కు చెందిన  డాక్టర్ రవీంద్ర గెట్టు, డీన్, ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ అండ్ స్పోన్సర్డ్ రిసెర్చ్, ప్రొఫెసర్ వి.ఎస్.రాజు, చైర్ ప్రెఫెసర్ ,డిపార్ట్ మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్  వారు జనవరి 13,14, 2020 తేదీలలో తెలిపారు. ఈ అంశంపై మేం హిందూ దినపత్రికకు ఎటువంటి సమాచార ఇవ్వలేదని తెలిపారు.

Jan 16, 2020


జీఎన్‌రావు  కమిటీ నివేదిక
13.09. 2019 : అమరావతి సహా అన్ని జిల్లాలు, ప్రదేశాలు సమానంగా అభివృద్ధి చెందేందుకు ఉపకరించే సలహాలు, సూచనలివ్వాలంటూ జి.ఎన్‌.రావు కమిటీ ఏర్పాటు. కమిటీ కన్వినర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎస్ రావు,  సభ్యులుగా ప్రొఫెసర్ మహవీర్, డాక్టర్ అంజలీ మోహన్, డాక్టర్ శివానందరెడ్డి, ప్రొఫెసర్ కేటీ రవిచంద్రన్, ప్రొఫెసర్ అరుణాచలం.
v 08.11.2019 జీఎన్‌ రావు కమిటీకి భారీగా లేఖలు, ఈమెయిల్స్‌(ఆంధ్రజ్యోతి): జి.ఎన్‌.రావు కమిటీకి ఇప్పటి వరకు సుమారు 25 వేల లేఖలు, ఈ-మెయిల్స్‌ అందినట్లు  తెలిసింది. 13 జిల్లాలూ సరిసమానంగా పురోగమించేందుకు తోడ్పడే వినతులు కూడా ఉన్నట్లు సమాచారం.
v రాజధాని కమిటీని రద్దు చేయమని  హైకోర్టులో గుంటూరు రైతుల పిటిషన్‌ : రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జీఎన్‌రావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీని రద్దు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా బోరుపాలెం గ్రామానికి చెందిన రైతులు సీహెచ్‌ శివలింగయ్య, సీహెచ్‌ రామారావు హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ సీఆర్‌డీఏ చట్ట నిబంధనలకు విరుద్ధంగా కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. చట్టసభ ద్వారా ఏర్పాటైన సీఆర్‌డీఏపై పునఃసమీక్ష జరిపే అధికారం కూడా ఈ కమిటీకి లేదని పిటిషన్‌లో వివరించారు. ఈ నేపథ్యంలో కమిటీని నియమిస్తూ జారీచేసిన జీవోను రద్దు చేయాలని అభ్యర్థించారు. వైసీపీ ప్రభుత్వం రాజధానిని తరలించినా, నిర్మాణం ఆలస్యం చేసినా భూములిచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోతారని వివరించారు.
నివేదిక సమర్పణ
v 20.12.2019 : జీఎన్‌రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ రాష్ట్రంలో 10,600 కిలోమీటర్లు పర్యటించి, 125 పేజీలతో కూడిన నివేదిక ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డికి  అందజేసింది.
v   మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్‌లో ఉన్నట్లు రాష్ట్రంలో అమరావతి, విశాఖపట్నంలో శాసన (లెజిస్లేచర్‌) వ్యవస్థ ఉండాలి.  శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేయాలి.
v అసెంబ్లీ అమరావతిలో ఉన్నా.. వేసవికాల సమావేశాలు విశాఖలో, శీతాకాల సమావేశాలు అమరావతిలో నిర్వహించాలి.
v  విశాఖలో సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాలు, సీఎం క్యాంపు కార్యాలయం, హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుచేయాలి.
v అమరావతిలో హైకోర్టు బెంచ్, సీఎం క్యాంపు కార్యాలయం, రాజ్‌భవన్‌ ఉండాలి.
v అమరావతిలో భూమి తీరు, వరద ప్రభావం తదితర అంశాల కారణంగా రాజధాని కార్యకలాపాలను ఇతర నగరాలకు వికేంద్రీకరించాలి. ఇక్కడ దాదాపుగా పూర్తయిన నిర్మాణాలను వినియోగంలోకి తీసుకురావాలి.
v అమరావతిలో ప్రతిపాదిత నిర్మాణాల్ని తగ్గించాలి. ఎన్జీటీ ఆదేశాల ప్రకారం రివర్‌ ఫ్రంట్‌ నిర్మాణాలు ఉండరాదు.
v   సీడ్‌ యాక్సిస్‌ రోడ్డును జాతీయ రహదారికి అనుసంధానించాలి.
v  నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
v నివేదిక ప్రకారం విజయనగరంతో కలిపి విశాఖపట్నం మెట్రో రీజన్‌ఏర్పాటు
v విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు.
v . సచివాలయం, అసెంబ్లీ(వేసవికాల) విజయనగరంలో ఏర్పాటు..
v అమరావతిలో హైకోర్టు ధర్మాసనం ఉంటుంది. మంగళగిరి కాంప్లెక్స్‌ లో సీఎం క్యాంప్‌ కార్యాలయం, రాజ్‌ భవన్‌ ఉంటాయి. అసెంబ్లీ శీతాకాల, వర్షాకాల సమావేశాలు ఇక్కడ జరుగుతాయి.
v కర్నూలులో ప్రధానమైన హైకోర్టు ఉంటుంది. దీనికి అనుబంధంగా 2 వేర్వేరు ధర్మాసనాలు ఏర్పాటవుతాయి.
v సచివాలయాన్ని విశాఖ, అమరావతిలో సమాంతరంగా నడపాలి. 
v ట్రైబ్యునళ్లను కూడా 3 నగరాల మధ్య విభజించాలి.
v   జీఎన్‌రావు  : పట్టణీకరణంతా మధ్య, ఉత్తర కోస్తాలోనే కేంద్రీకృతమైంది. దక్షిణకోస్తా, సీమ ప్రాంతాల్లో పట్టణీకరణ తక్కువ. అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ ఏపీకి తప్పనిసరి. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఏపీని నాలుగు ప్రాంతాలుగా చూడాలి. శ్రీబాగ్‌ ఒడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు ఉండాలి. అమరావతిలో టెంపరరీ అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ మాత్రమే. వరద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కేంద్రీకరించకూడదు. పర్యావరణానికి చేటు చేయని అభివృద్ధి ఉండాలి.  సచివాలయం, సీఎం క్యాంప్ ఆఫీస్, అసెంబ్లీ విశాఖలో ఉండాలి. హైకోర్ట్ బెంచ్‌, అసెంబ్లీ భవనం, రాజ్‌భవన్‌ అమరావతిలో ఉండాలి, హైకోర్టు కర్నూలులో ఉండాలి.
v అమరావతిలో రాజధానికి సంబంధించిన నిర్మాణాలు వద్దు. ఇప్పటికే పెట్టిన వ్యయం వృథా కాకుండా చూడాలి. తుళ్లూరు ప్రాంతంలో గత ప్రభుత్వం చాలా పెట్టుబడి పెట్టింది. అందువల్ల ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణాల్ని పూర్తి చేసి శాఖల వారీగా వాడుకోవాలి.
v ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్న పనులను సమీక్షించి తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. మొత్తం నిధులు అమరావతిలోనే కేంద్రీకరించడం సరైంది కాదు. పర్యావరణ సమస్యలున్న చోట అభివృద్ధి పనులు తగ్గించాలి. అవసరం మేరకే క్వార్టర్లు, అపార్ట్‌ మెంట్లు నిర్మించాలి. అమరావతిలో డిజైన్లన్నీ భారీ ఖర్చుతో కూడినవి కావడంతో వీటిని మార్చి.. ఉన్న వనరులతో మిగతా నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలి.
v  డిజైన్లను మరోసారి పునఃపరిశీలించాలి. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ నేపథ్యంలో అవసరాల మేరకు ప్రభుత్వ విభాగాల కోసం భవనాలు నిర్మించాలి. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు అదే విధానం అవలంబించాలి. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించుకునేలా, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ తర్వాత ఇక్కడ ఉండాల్సిన ప్రభుత్వ విభాగాలు కార్యకలాపాలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు ఉండాలి. అమరావతి ప్రాంతంలో రైతులంతా తమకు భూములు ఇవ్వాలని కోరారు. అదే విషయాన్ని ప్రభుత్వానికి సూచించాం.
v   2 వేల మంది రైతులతో మాట్లాడాం: జీఎన్‌ రావు
రాజధాని, అభివృద్ధి అంశాలపై కమిటీ సభ్యులమంతా అధ్యయనం చేశాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించాం. ప్రజాభిప్రాయ సేకరణకు అనుగుణంగా నివేదిక ఇచ్చాం. రాష్ట్రంలో చాలా ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు చాలా వెనకబడితే.. మరికొన్ని అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. వాటి మధ్య సమతూకం సాధించాలి. ఇందుకోసం రెండంచెల వ్యూహాన్ని సూచించాం. ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘమైన తీర ప్రాంతంతో పాటు పలు నదులు, అడవులు ఉన్నాయి. అభివృద్ధి వల్ల పర్యావరణం పాడవకుండా పలు సూచనలు చేశాం. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అందుకే అన్ని ప్రాంతాల్ని దృష్టిలో పెట్టుకుని సూచనలు ఇచ్చాం. మాకు మొత్తం 38 వేల విజ్ఞాపనలు అందగా.. 2 వేల మంది రైతులతో నేరుగా మాట్లాడాం.
v జిల్లాలకు వెళ్ళి.. అక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారో అన్న దానిపై ప్రజాభిప్రాయ సేకరణ చేశాం. వాటికి అనుగుణంగా అంతా ఒకేచోట కాకుండా అందరికీ అన్నీ అనుకూలంగా ఉండేలా సూచనలు చేశాం. సమగ్ర పట్టణాభివృద్ధి, ప్రణాళిక కోసం ప్రయత్నించాం.  పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని నాలుగు రీజియన్‌లుగా విభజించాలని సూచించాం. తుళ్లూరు ప్రాంతానికి వరద ముప్పు ఉంది. రాజధానికి అనుకూలం కాదు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన భూమిని ఇవ్వాలి. రాజధాని ఎక్కడో చెప్పడం మా పని కాదు. సుస్ధిర అభివృద్ధి లక్ష్యంగా ప్రాంతాల వారీగా అభివృద్ధి, సమతుల్యతపై కొత్త మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేశాం.  మేము రైతులతో మాట్లాడలేదన్నది అవాస్తవం.
v  ప్రాంతీయ అసమానతల్ని తగ్గించాలి : జీఎన్ రావు
ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం మెరుగైన సూచనలు చేశాం. ఆంధ్రప్రదేశ్‌లో పట్టణీకరణ మధ్య, ఉత్తర కోస్తాలోనే ఉంది. అందువల్ల ప్రాంతాల మధ్య అభివృద్ధిసమతూకంపై అధ్యయనం చేసి సూచనలిచ్చాం. అదే సమయంలో రాష్ట్రంలోని అభివృద్ధి వల్ల పర్యావరణం దెబ్బతినకూడదు. పర్యావరణాన్ని రక్షించుకుంటూనే అభివృద్ధి సాగాలి. రాష్ట్రంలో రాయలసీమ బాగా వెనకబడడంతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా తీరానికి దూరంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. అడవుల్ని పరిరక్షించడంతో పాటు మరిన్ని పెంచాలి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడాన్ని ప్రోత్సహించకూడదు. బీడు భూములను వినియోగంలోకి తీసుకురావాలి.
v తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి
రాష్ట్రంలోని విశాల తీర ప్రాంతంతో పాటు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు దాదాపు 900 కి.మీ. తీర ప్రాంతమంతా అభివృద్ధి చేయాలి. ఆర్థిక పురోగతితో పాటు, ఉపాధి కల్పన దిశగా పనులు చేపట్టాలి. గోదావరి, కృష్ణ, వంశధార, నాగావళి, మహేంద్రతనయ తదితర నదుల పరీవాహక ప్రాంతాలను అభివృద్ధి చేసి.. అక్కడ అన్ని వసతులు కల్పించాలి. ఈ ప్రక్రియలో భాగంగా కాలువల్ని అభివృద్ధి చేయడంతో పాటు కొత్త వాటి నిర్మాణం చేపట్టాలి.
v  రాయలసీమలో అనంతపురం, కర్నూలు జిల్లాలను అభివృద్ధి చేయడం ద్వారా ప్రాంతీయ అసమానతలు తగ్గించేందుకు కృషి చేయాలి. అమరావతిలోని కొన్ని అధికార వ్యవస్థలను ఆ ప్రాంతానికి తరలించడం ద్వారా ఆ ప్రాంతం అభివృద్ధి చెంది అక్కడి ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
v  అన్ని జిల్లాల్లోని సహజ వనరుల మేరకు సమగ్ర మార్గదర్శకాలను రూపొందించి అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించాలి.
v  గిరిజనులు, మత్స్యకార వర్గాలకు కూడా తగిన ప్రాధాన్యమిస్తూ వారి అభివృద్ధికి అనుగుణంగా పెట్టుబడి, అభివృద్ధి ప్రణాళిక తయారుచేయాలి.
v  రాయలసీమలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను అత్యధిక ప్రాధాన్యమిచ్చి పూర్తి చేయాలి. ఆ ప్రాంతంలో జలవనరుల్ని పూర్తి సామర్థ్యం మేరకు సద్వినియోగం చేసుకోవాలి.
v   పొడవైన తీర ప్రాంతంలోని వైవిద్య భరితమైన పర్యావరణం, మడ అడవులు, బీచ్‌ల్ని పరిరక్షిస్తూ అభివృద్ధి చేయాలి.
v   పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ కొత్త పోర్టులు ఏర్పాటు చేయాలి. రెండు పోర్టుల మధ్య కనీస దూరం, రోడ్డు, రైలు సౌకర్యాల్ని దృష్టిలో పెట్టుకుని కొత్త పోర్టులు నెలకొల్పాలి.
v   విద్యుత్‌ సరఫరా సమస్యలు తలెత్తకుండా, ప్రభుత్వమే సౌర విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరాపై దృష్టి పెట్టాలి.
v పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టుల పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలి. తక్కువ వ్యయంతో పూర్తయ్యే ప్రాజెక్టులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. అనంతరం అధిక వ్యయంతో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టి పూర్తి చేయాలి. తద్వారా ఎక్కువ ఆయకట్టుకు నీటిని అందించవచ్చు.
v   డెల్టా కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. లీకేజీలు అరికట్టి.. ఆయకట్టుకు సమర్ధంగా నీటిని అందించేందుకు కాలువల వ్యవస్థను ఆధునికీకరించాలి.
v  పరీవాహక ప్రాంతం ఆధారంగా గొలుసుకట్టు చెరువులను మైక్రో వాటర్‌షెడ్‌ విధానంలో అభివృద్ది చేయాలి. నీటి యాజమాన్య పద్ధతులను అమలు చేసి.. అధిక ఆయకట్టుకు నీటిని అందించడంపై దృష్టి సారించాలి.
v   రోడ్ల విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చెట్లను నరికేస్తున్న నేపథ్యంలో భారీగా చెట్ల పెంపకాన్ని చేపట్టి.. పచ్చదనాన్ని పెంచాలి.
v  ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు 
1.      ఉత్తరాంధ్ర:  శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం
2.       మధ్య కోస్తా: తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా
3.      దక్షిణ కోస్తా: గుంటూరు, ప్రకాశం, నెల్లూరు
4.      రాయలసీమ: వైఎస్సార్, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం
v అన్ని ప్రాంతాల అభివృద్ధికి వనరులు, అవకాశాలకు అనుగుణంగా విస్తృత విధానాలు, వ్యూహాలు అమలు చేసి ప్రాంతీయ సమానాభివృద్ధి సాధించాలి.


అమరావతి - ఆరోపణలు – వాస్తవాలు


ప్రజా రాజధానిని ఎంపిక చేసినప్పటి నుంచి నిర్మాణం చేసే వరకు అడుగడునా వైకాపా నాయకులు దుష్పచారం చేశారు. వైసీపీ రాజకీయ ప్రయోజనం కోసం 5 కోట్ల ప్రజల ఆత్మాగౌరవానికి సంబంధించిన రాజధానిని కూడా ముక్కలు చేశారు. రాజధాని ఎంపిక, భూసమీకరణ, నిర్మాణం వంటి ప్ర్రక్రియలను అత్యంత పారదర్శకంగా తెలుగుదేశం ప్రభుత్వం నిర్వహించింది.  వైకాపా నాయకులు కావాలని దురుద్దేశంతోనే రాద్దాంతం చేస్తున్నారు. ఇన్ సైడ్ ట్రేడింగ్, నిర్మాణ వ్యయం, భూకేటాయింపుల్లో చేస్తున్న ఆరోపణలపై ఒక్కటి కూడా ఆధారం లేదు. వైకాపా నేతల ఆరోపణలను రాజ్యాంగ బద్ధ సంస్థలు, న్యాయసంస్థలు తప్పుపట్టాయి.
Ø    ప్రశ్న: రాజధాని ఏర్పాటులో శివరామకృష్ణన్ కమిటీ నివేదిక అమలు చేయలేదు.
సమాధానం : శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికలోని అంశాలను దృష్టిలోపెట్టుకొనే నీరు, రవాణా, మౌలిక సదుపాయాలతోపాటు అందరికి అందుబాటులో రాష్ట్రం నడిబొడ్డున ఉన్న అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారు. కమిటీకి అందిన ప్రజాభిప్రాయంలో కూడా అత్యధిక మంది విజయవాడ-గుంటూరు మధ్యనే కావాలని కోరారు. కమిటీకి అందిన స్పందనలు  మొత్తం 4,728 కాగా, విజయవాడ - గుంటూరు ప్రాంతంలో రాజధాని ఉండాలని అత్యధిక మంది 2,191 మంది కోరారు.  రాజధానిగా అమరావతిని ఇప్పటి సీఎం, అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించారు. రాష్ట్ర ప్రజలు కూడా ఆమోదించారు. ఏ ప్రాంతం నుంచి కూడా వ్యతిరేకత రాలేదు.
Ø    ప్రశ్న: అమరావతిలో భవన నిర్మాణాలకు చదరపు అడుగుకు చంద్రబాబు ప్రభుత్వం రూ.8 వేలు ఖర్చు చేశారు.
సమాధానం: అసెంబ్లీ భవన నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.5,333,  హైకోర్టు భవనాలకు చ.అ.కు రూ.3,666, సచివాలయం, శాసనసభ, మండలి భవనాలు, పార్కింగ్, భూమి అభివృద్ధి, గ్రీనరీ, ఫర్నీచర్, సెంట్రల్ ఏసీ తదితరాలన్నీ కలిపి చ.అ.కు రూ.7,101, ఎమ్మెల్యే, ఆలిండియా సర్వీస్ అధికారుల భవనాలు, ఎన్జీఓ భవనాలకు చ.అ.కు రూ.3,459 ఖర్చు చేశారు.
Ø    ప్రశ్న :  ఒక సామాజిక వర్గం కోసమే రాజధాని.
Ø    సమాధానం:  అమరావతి పరిధిలో ఎస్సీ, బీసీ, మైనార్టీలు 75 శాతం ఉన్నారు.  29 పంచాయతీల్లో 15 పంచాయితీల్లో కాపులు గణనీయంగా ఉన్నారు. 14 కులాలుంటే, రెడ్లు 17శాతం, కమ్మవారు 14 శాతమే ఉన్నారు. ప్రత్తిపాడు, తాడికొండ, తిరువూరు, నందిగామ 4 ఎస్సీ నియోజకవర్గాల మధ్యలో అమరావతి ఉంది.
Ø    ప్రశ్న : అమరావతి ముంపు ప్రాంతమని తప్పుడు ప్రచారం.
సమాధానం : అమరావతి ముంపు ప్రాంతం కాదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది.1850, 2009లో పెద్ద వరదలు వచ్చినా ఎలాంటి ముంపు జరగలేదని ట్రిబ్యునల్ పేర్కొంది. 

Ø    ప్రశ్న: ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌
సమాధానం : జూన్ 2, 2014 నుంచి  అమరావతి పేరు రాజధానిగా ప్రకటించిన  సెప్టెంబర్ 4న వరకు నాలుగు నెలల్లో 128 ఎకరాలు మాత్రమే రిజిస్ట్రేషన్ జరిగింది. వాటిలో కూడా వంద ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. వారు టీడీపీ వారు కాదు. మిగిలిన 28 ఎకరాలు ఇతరులు కొనుగోలు చేశారు. వాస్తవం ఇదైతే మంత్రి బుగ్గన 4070 ఎకరాలని శాసనసభ సాక్షిగా అబద్దాలు చెప్పారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పై సిటింగ్ జడ్జితో విచారణ జరిపించమంటే జరిపించకుండా అసత్య ఆరోపణలు చేస్తున్నారు.
Ø    ప్రశ్న: బాలకృష్ణ వియ్యంకునికి రాజధానిలో 500 ఎకరాలు.
సమాధానం : బాలకృష్ణ వియ్యంకునికి రాజధానిలో ప్రభుత్వం సెంటు భూమి కూడా ఇవ్వలేదు. రాజధాని వెలుపల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది. ప్రస్తుతం  ఆ భూమి ప్రభుత్వ స్వాధీనంలోనే ఉంది.
Ø    ప్రశ్న: అమరావతిలో ఫౌండేషన్ ఖర్చులు ఎక్కువ అని అబద్దాలు చెప్పారు.
సమాధానం: హైదరాబాద్, చెన్నై కన్నా అమరావతిలో ఫౌండేషన్ ఖర్చులు తక్కువ అని ఇంజనీరింగ్ నిపుణులు ప్రకటించారు. అమరావతిలో రాకీ స్టార్టా ఎల్ 11 మీ. డెప్త్, చ.మీ.కు 150 టన్నుల బేరింగ్ కెపాసిటీ ఉన్నది. హైదరాబాద్ రాకీ స్టార్టా కారణంగా బ్లాస్టింగ్ చేయాలి. బేస్ మెంట్ 7.1 మీటర్లు, బ్లాస్టింగ్ 4.5 మీటర్లు మొత్తం 11.6 మీటర్లు డెప్త్ దీనికి తోడు కృష్ణా, గోదావరి నీటి సరఫరా ఖర్చులు చెన్నైలో బేరింగ్ కెపాసిటీ చ.మీ.కు 10 మెట్రిక్ టన్నులే. ఫైల్ ఫౌండేషన్ 30 నుంచి 40 మీటర్ల లోతు నుంచి వేయాలి.
Ø    ప్రశ్న: అమరావతిలో తన సామాజికవర్గ నేతలకు చంద్రబాబు భూములు కట్టబెట్టారు.
సమాధానం:  130 సంస్థలకు 1293 ఎకరాలు అత్యంత పారదర్శికంగా కేటాయించారు. కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, రైల్వే, విద్యా, ఆరోగ్య, ఆధ్యాత్మిక సంస్థలు వంటివి ఇందులో ఉన్నాయి. ఎస్ఆర్ఎం, విట్, అమృత యూనివర్సిటీలు, టీటీడీ తదితర సంస్థలకు భూములు కేటాయించారు.
Ø    ప్రశ్న :  రాజధానిలో ఒక్క ఇటుక వేయలేదు, ఒక శాశ్విత కట్టడం లేదు.
సమాధానం:  సచివాలయం, శాసనసభ, శాసన మండలి, హైకోర్టు భవనాలు శాశ్వితం కాదా? కొండవీటి వాగు ఎత్తిపోతల ప్రాజెక్ట్ గ్రాఫిక్సేనా? ఇటుకలు లేకుండా నిర్మించారా? అమరావతిలో గ్రాఫిక్స్ రోడ్లపై తిరుగుతున్నారా? 29 గ్రామాల పేదలకు నిర్మించిన 5వేల గృహాలు గ్రాఫిక్స్ యేనా? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉద్యోగుల గృహసముదాయాలు గ్రాఫిక్స్ గానే ఉన్నాయా? ప్రైవేటు రంగంలో విట్, ఎస్ఆర్ఎం, అమృత యూనివర్సిటీలు, ఎయిమ్స్ నిర్మాణాలు  గ్రాఫిక్సేనా?
Ø    ప్రశ్న :  రాష్ట్ర రాజధానికి గెజిట్ నోటిఫికేషన్ లేదు.
సమాధానం:  డిసెంబర్ 30, 2014న రాజధాని నగర ప్రాంతం(24 రెవెన్యూ గ్రామాలు, తాడేపల్లి మున్సిపాలిటీలో కొంతభాగం)ని నోటిఫై చేస్తూ జీఓ నెం.254 విడుదల. ఏపీ సీఆర్డీఏ చట్టం 2014 సెక్షన్ (3) సబ్ సెక్షన్  (3) ప్రకారం 122 చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల ప్రాంతం రాజధాని నగరంగా నోటిఫై చేశారు. ఏప్రిల్ 23, 2015న జీఓ ఎంఎస్ నెం.97 ప్రకారం రాజధానికి అమరావతి అని నామకరణం. జీఓ నెం.141(09.06.2015) ప్రకారం పరిధిని 217 చదరపు కి.మీ.పెంచారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.
అక్టోబర్ 29, 2018న సుప్రీం కోర్టు తీర్పు: 2018 నెం.డి.29890 కేసులో జస్టిస్ సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్ లతో కూడిన ధర్మాసనం తీర్పులోని ప్రధాన అంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా అమరావతి అనే నగరాన్ని నిర్మించాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుఅనే పేరుతో జనవరి 1, 2019న రాష్ట్రపతి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేశారు. ఆ హైకోర్టు ప్రిన్సిపల్ సీటు అంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో ఉంటుందని ఆ ఆర్డర్ లో పేర్కొన్నారు.
కేంద్రం విడుదల చేసిన భారతదేశం రాజకీయ చిత్రపటంలో ఏపీ రాజధానిగా  అమరావతికి స్థానం కల్పించారు. 
Ø    ప్రశ్న: రాజధాని వైకాపా మ్యేనిఫెస్టో.
సమాధానం: అమరావతి రాజధానిగా తీర్మానం చేసిన సమయంలో అప్పటి ప్రతి పక్షనేత జగన్మోహన రెడ్డి మన:స్పూర్తిగా మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. రాజధానికి 30వేల ఎకరాలు కావాలన్నారు. రాజధానిని అమరావతి నుంచి మార్చం అని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రెస్ మీట్ పెట్టి  మరీ చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజధానిని మార్చడంలేని మంత్రి బొత్స సత్యనారాయణ శాసనమండలిలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
Ø    ప్రశ్న: దళితులకు అన్యాయం చేసిన టీడీపీ.
సమాధానం: నాలుగు ఎస్సీ నియోజకవర్గాల మధ్యన ఉన్న రాజధానిని విశాఖ నగరానికి తరలిస్తున్నారంటే ఎవరు దళితులకు అన్యాయం చేస్తున్నారో ఆలోచించుకోవాలి.
Ø    ప్రశ్న : పీటర్ కమిషన్ పేరుతో లీకైన నివేదికలో రాజధానిలో రూ.30 వేల కోట్లు దుబారా.
సమాధానం: 28.6.2019న ఏపీసీఆర్డీఏపై జగన్ ప్రభుత్వ శ్వేత పత్రం విడుదల చేసింది. అందులో రూ.9,165.76 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేసినట్ల పేర్కొన్నారు. ఖర్చు చేసిందే రూ.9,165.76 కోట్లు అయితే రూ.30 వేల కోట్లు దుబారా ఎలా అవుతుంది?
Ø    ప్రశ్న: 33 వేల ఎకరాలు తీసుకున్నారన్నారు.
సమాధానం: దేశ చరిత్రలో రాజధాని నిర్మాణానికి తొలిసారిగా ఏపీ ప్రభుత్వం అత్యుత్తమ భూ సమీకరణ విధానంతో ఇంత భూమి సమీకరించిందని నీతి అయోగ్ కొనియాడింది. రైతులకు సమ న్యాయం అందించే ఓ కొత్త విధానం అని పేర్కొంది. ఈ విధానం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో  ఒక కేస్ స్టడీగా మారింది. రాజధాని నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూసమీకరణ పథకం (ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం- ఎల్పీఎస్‌) ఉత్తమమైనదని ఏపీసీఆర్డీయే కమిషనర్‌ గా ఉన్న డాక్టర్‌ పి.లక్ష్మీ నరసింహం ఈ ప్రభుత్వంలో ఇటీవల  పేర్కొన్నారు.
Ø    ప్రశ్న: అమరావతికి రూ.1,09,023 కోట్ల రాష్ట్ర  ప్రభుత్వం వ్యయం చేస్తుందంటారు.
సమాధానం: వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 7 నెలలుగా అమరావతి నుంచే పాలన సాగిస్తోంది. ఒక్క పైసా ఖర్చు కాలేదే!. ఇక్కడ అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవన్‌, డీజీపీ కార్యాలయం అన్నీ ఉన్నాయి. ఉద్యోగులు, జడ్జిల క్వార్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలు 50 నుంచి 70 శాతం పూర్తయ్యాయి. స్వల్ప సొమ్ముతో వీటిని పూరి చేయవచ్చు. ఇవే కాకుండా విజయవాడ, మంగళగిరిలలో ఏపీఐఐసీ వంటి అనేక నూతన భవనాలను నిర్మించారు. అమరావతిలో అన్ని అవసరాలకుపోను ప్రభుత్వానికి మిగిలే 10 వేల ఎకరాలను విక్రయిస్తే లక్ష కోట్లకుపైనే వస్తుంది. ఆ విధంగా అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ప్రాజెక్ట్. 2019 ఫిబ్రవరిలో విడుదలైన జీఓ 50 ప్రకారం అమరావతి నిర్మాణ వ్యయం రూ.55,343 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం 8 ఏళ్ళలో ఖర్చు పెట్టేది కేవలం 6,629 కోట్లు మాత్రమే.
Ø    ప్రశ్న : అమరావతిలో పెద్ద రైతులని ప్రచారం.
 సమాధానం : రాజధానిరైతుల్లో సన్నకారు రైతులే  అత్యధికం. రెండు ఎకరాలు లోపు ఉన్నవారే 86 శాతం మంది ఉన్నారు. భూములు ఇచ్చిన రైతులు 29,881 మంది ఉంటే వారిలో ఎకరం లోపు ఉన్నవారు 20,490 మంది ఉన్నారు.
Ø    ప్రశ్న : అసైన్డ్ భూముల్లో అవకతవకలు.
అసైన్డ్ భూముల్లో ఎక్కడా అవకతవకలు జరగలేదు. ఎస్సీల నుంచి ఎస్సీలకే ఆ భూములు బదిలీ అయ్యాయి. రిటర్న్‌ బుల్‌ ప్లాట్లు పొందిన ఎస్సీ లకు అమ్ముకునే హక్కు ఇచ్చారు. వారు చేసుకున్న అమ్మకం చట్ట బద్ధము. ఇందులో ఎవరినైనా మోసము చేసి కొంటే వారు ఫిర్యాదు చేస్తారు. కొన్న వారిలో తెలుగు దేశం పార్టీ వారు ఉంటే, వారు మోసము చేసారని నిరూపిస్తే చర్యలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది.

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...