Jan 5, 2020

రాజధానిగా అమరావతి ఎందుకు ఉండాలి?

Ø తెలుగు నేలన చారిత్రక ప్రదేశం
Ø రాష్ట్రానికి నడిబొడ్డున, కృష్ణా నది ఒడ్డున ఉంది.
Ø రోడ్లు, రైలు, ఆకాశ మార్గాలకు కనెక్టివిటీ ఉంది.
Ø శానసభలో అధికార, ప్రతి పక్షం ఆమోదం.
Ø 5 ఏళ్లుగా ప్రజలందరి రాజధానిగా నిలిచింది.
Ø ప్రధాని శంకుస్థాపన చేశారు.
Ø హైకోర్టుని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు.
Ø భారత దేశ చిత్ర పటంలో ఏపీ రాజధాని అమరావతిగా గుర్తించారు.
Ø జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ 2008లో ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగానే అమరావతి రాజధాని వుందని నేషనల్ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ స్పష్టం చేసింది. 1853, 2009లో కృష్ణాకు అతిపెద్ద వరదలు వచ్చినా, ఎక్కడా ఎలాంటి ముంపు జరగలేదని గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తీర్పులో చెప్పింది.
Ø శాశ్విత భవనాలలోనే ఇక్కడ శాసనసభ, సచివాలయం, హైకోర్టు నిర్వహిస్తున్నారు.
Ø 29 గ్రామాలలో ఇళ్లు లేని పేదలకు నిర్మించిన 5,024 ఫ్లాట్లు నిర్మాంచరు.
Ø సీడ్ యాక్సెస్ రోడ్డులోపాటు 34 రోడ్ల నిర్మాణం జరిగింది.
Ø ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉద్యోగుల గృహసముదాయాలు నిర్మాణంలో ఉన్నాయి.
Ø ప్రైవేటు రంగంలో విట్, ఎస్ఆర్ఎం, అమృత యూనివర్సిటీలు, ఎన్ఐడి, ఎయిమ్స్ భవనాలు నిర్మాణంలో ఉన్నాయి.
Ø కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం నిర్మాణం జరిగింది.
Ø ఇప్పటి వరకు రూ. 9165.76 కోట్ల నిర్మాణాలు జరిగాయి.
Ø ప్రజా రాజధాని అమరావతి   సెల్ఫ్ ఫైనాన్స్ (స్వయం ఆధారిత అభివృద్ధి) ప్రాజెక్ట్
Ø అమరావతిలో ప్రభుత్వ భవిష్యత్ అవసరాల కోసం ఉంచిన భూమి 5,020 ఎకరాలు
Ø నగరాభివృద్ధికి కేటాయించిన భూమి 3,019 ఎకరాలు
Ø సింగపూర్ కన్సార్టియంకు కేటాయించిన 1,600 ఎకరాలు
Ø మొత్తం 8,039 +1600  = 9,639 ఎకరాలు
Ø ఈ భూమి విలువ లక్షల కోట్ల పైగా పెరుగుతుంది. రాజధాని నిర్మాణాలు పూర్తిగా రాజధాని భూముల డబ్బుతోనే నిర్మించే విధంగా ప్లాన్ చేయబడింది.
Ø అమరావతి ఆర్థిక నగరంగా అభివృద్ధి చెంది ప్రభుత్వానికి ఆదాయ మార్గాలను ఏర్పాటు చేస్తుంది. 13 జిల్లాల యువతకు ఉద్యోగాలు కల్పించగలుగుతుంది.
Ø ఇక్కడ నుండి వచ్చే ఆదాయం రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధికి ఉపయోగించవచ్చు.
Ø రాష్ట్ర బడ్జెట్ లో హైదరాబాద్ ఆదాయం 60 శాతం, బెంగుళూరు ఆదాయం 40 శాతం, చెన్నై ఆదాయం 39 శాతం ఉంది.
Ø హైదరాబాద్ ఆదాయంతోనే తెలంగాణ జిల్లాల అభివృద్ధి జరగడం మనం చూస్తూనే ఉన్నాం.
Ø తీరానికి 80 కిలోమీటర్ల పైగా దూరంగా ఉంది.
Ø రేపు ఏదైనా శత్రుదేశాల తోటి యుద్ధం వచ్చినప్పటికీ రక్షణ పరంగా టార్గెట్ కాదు కాబట్టి భయం లేదు.
Ø అమరావతి(గుంటూరు జిల్లా) అటు 6 జిల్లాలు ఇటు 6 జిల్లాల మధ్యలో ఉంది.
Ø నాలుగు ఎస్సీ నియోజక వర్గాల మధ్య ఉంది.
Ø ఒక వైపు 84 మంది ఎమ్మెల్యేలు, మరో వైపు 74 ఎమ్మెల్యేలు ఉన్నారు.
Ø అటు  12 మంది, ఇటు 12 మంది ఎంపీలు ఉన్నారు.
Ø దూరం అటు 600 కిలోమీటర్లు, ఇటు 600 కిలోమీటర్లు.
Ø జనాభా ఒక వైపు 2.35 కోట్లు, ఇంకో వైపు 2.15 కోట్లు.
Ø అమరావతి కృష్ణా నది ఒడ్డున ఉంది. నీటికి కొరత లేదు.
Ø సమగ్రమైన ప్రణాళిక వుంది. అందువల్ల కాలుష్యం ఉండదు.


Ø     విశాఖ ఎందుకు వద్దు?
Ø విశాఖపట్నం ఏ విధంగా చూసినా రాజధానిగా నిర్ణయించడానికి సరైన ప్రదేశం కాదు.
Ø  10 జిల్లాలు ఒకవైపు - 2 జిల్లాలు ఒకవైపు.
Ø ఒకవైపు 1000 కిలోమీటర్లు, మరో వైపు 100 కిలోమీటర్లు.
Ø జనాభా ఒకవైపు 3.5 కోట్లు, మరోవైపు 50 లక్షలు.
Ø ఎమ్మెల్యేలు ఒక వైపు 141 మంది. మరోవైపు 19 మంది.
Ø రాయలసీమ వాసులకు విశాఖపట్నం దూరంగా ఉంటుంది
Ø తుఫానులు వంటి ప్రకృతివైపరీత్యాల ప్రమాదం 

Ø దేశానికి తూర్పు తీరాన రక్షణ పరంగా ఉన్న అతి కీలకమైన ప్రదేశం.
Ø సైనిక స్థావరాలు ఉన్నాయి. రక్షణ పరంగా అనుకూలమైనది కాదు.
Ø నీటి కొరత ఉంది.
Ø విశాఖపట్నం ప్రస్తుత జనాభా 25 లక్షలు. పెరిగి పెరిగి 50 లక్షలకు చేరుకుంటుంది.  నగరాన్ని విస్తరించుకుంటూ  పోవటం వలన అస్తవ్యస్తంగా తయారవుతుంది. రద్దీ, కాలుష్యం పెరిగిపోతోంది.


Ø అభివృద్ధి వికేంద్రీకరణ
Ø   13 జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Ø  అనంతపురంలో కియా మోటార్స్
Ø  కర్నూలు జిల్లాలో ఆసియా ఖండంలోనే అతి పెద్ద సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్
Ø  చిత్తూరు జిల్లాలో శ్రీసిటీ
Ø  బెంగుళూరు-చెన్నై కారిడార్
Ø ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పూర్తి
Ø నదుల అనుసంధానం ద్వారా గోదావరి నీటిని కృష్ణా నదికి మళ్ళించడం వల్ల రాయలసీమలోని  జిల్లాలలో 120 టిఎంసిల కృష్ణా నది నీటిని సాగునీరు, త్రాగు నీటి అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఏర్పడింది.
Ø గండికోట-సీబీఆర్ లిఫ్ట్ పథకం, హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు సీమలో పారుతున్నాయి.
Ø సీమలో పారుతున్న కృష్ణానది జలాలు
Ø చిత్తూరు జిల్లాలో రూ.లక్ష దాటిన తలసరి ఆదాయం
Ø ప్రభుత్వం చేపట్టిన చర్యలు, రైతుల కృషి ఫలితంగా రాయలసీమలో భూగర్భ జలాలు పెరిగాయి.
Ø మామిడి ఉత్పాదకతలో కర్నూలు మొదటి స్థానం, చిత్తూరు 3వ స్థానం 
Ø అరటి ఉత్పాదకతలో అనంతపురం, కడప, కర్నూలు  వరుసగా 1,2.3 స్థానాలు.
Ø  బొప్పాయి ఉత్పాదకతలో చిత్తూరు మొదటి స్థానం,
Ø తీపి కమలాల ఉత్పాదకతలో కడప, అనంతపురం జిల్లాలు వరుసగా 1,2 స్థానాల్లో ఉన్నాయి.
Ø ఎండు మిర్చి, టమోటా ఉత్పాదకతలో కర్నూలు మొదటి స్థానంలో ఉంది.
Ø రాయలసీమ జిల్లాల్లో ప్రముఖ విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. తిరుపతిలో ఐఐటీ, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కలినరీ స్కిల్స్, చిత్తూరులో ఐఐఎస్ఈఆర్, కర్నూలులో ట్రిపుల్ ఐటీ, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటయ్యాయి. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏ-ప్లస్ గ్రేడ్ తో రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో ఉంది.
Ø అనంతపురం - అమరావతి  ఎక్స్ ప్రెస్ హైవే
Ø కర్నూలు జిల్లాలో 700 ఎకరాల్లో అల్ట్రా మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్ పార్క్‌
Ø  విశాఖ- చెన్నై కారిడార్.


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...