Jan 5, 2020

ప్రజా రాజధాని అమరావతి – ముఖ్యమైన తేదీలు



18.02.2014  ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 లోకసభలో ఆమోదం.
20.02.2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 రాజ్యసభలో ఆమోదం.
01.03.2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 రాష్ట్రపతి ఆమోదం.
03.03.2014  కెసి శివరామకృష్ణన్ కమిటీ నియామకం.
02.06.2014 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు కొత్త రాష్ట్రాల ఏర్పాటు
28.08.2014  శివరామకృష్ణన్ కమిటీ నివేదిక సమర్పణ.
20.07.2014  మంత్రి నారాయణ నేతృత్వంలో కమిటీ.
04.09.2014   రెండు వేల సంవత్సరాలకుపైగా చరిత్ర ఉన్న విజయవాడ - గుంటూరు మధ్య
                     రాష్ట్ర  నడిబొడ్డున, నది ఒడ్డున ప్రాంతాన్ని రాజధానికి
                     ఎంపిక చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రకటించారు.
23.12.2014 శాసనసభలో సీఆర్డీఏ చట్టానికి ఆమోదం.
30.12.2014 ఏపీ సీఆర్డీఏ ఏర్పాటు, అమలు
01.01.2015  సీఆర్ డీఏ భూసమీకరణ చట్టం (ల్యాండ్‌పూలింగ్)
23.04.2015 రాజధానికి అమరావతి అని నామకరణం. జీఓ ఎంఎస్ నెం:97
02.05.2015 కాపిటల్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఏర్పాటు. తరువాత అమరావతి  
                   అభివృద్ధి సంస్థ( ఏడీసీఎల్- అమరావతి డెవలప్‌మెంట్ కార్పోరేషన్) మార్పు.
06.06.2015 తాళ్లాయపాలెం వద్ద భూమి పూజ చేసిన సీఎం చంద్రబాబు.
16.10.2015 నా ఇటుక-నా అమరావతి వెబ్ సైట్ ప్రారంభం.
22.10.2015 ఉద్దండరాయునిపాలెం వద్ద రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన.
17.02.2016 వెలగపూడి తాతాల్కిక సచివాలయానికి  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు  శంకుస్థాపన.
22.02.2016 అమరావతి నగరానికి ఫైనల్ మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ (సర్బనా జురాంగ్ సింగపూర్ సంస్థ) రూపొందించి, సమర్పించింది.
19.03.2016 ఏపీ సీఆర్డీఏ పర్యావరణ నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు.
25.04.2016 తాత్కాలిక సచివాలయం (ఐజీసీ-ఇంటెర్మ్ గవర్నమెంట్ కాంప్లెక్స్)
                     సీఎం చంద్రబాబు ప్రారంభోత్సవం.
18.08.2016 శాసనసభ భవన నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.
03.10.2016  సచివాలయం ఉద్యోగులు పూర్తి స్థాయిలో బాధ్యతల స్వీకారం.
28.10.2016 ప్రభుత్వ నగరంలోని భవన సముదాయాలనిర్మాణానికి
                     కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన.
02.03.2017 శాసనసభ భవనం సీఎం చంద్రబాబు ప్రారంభోత్సవం.
06.03.2017 శాసనసభ తొలి సమావేశాలు ప్రారంభం.
29.03.2017 ఉగాది పండుగా సందర్భంగా సీడ్‌ యాక్సెస్‌ రోడ్లుకు శంకుస్థాపన.
                   29 గ్రామాలను అనుసంధానించే ఏడు ప్రధాన రహదారులు.
06.10.2017 అమరావతి స్మార్ట్ అండ్ సస్టెయినబుల్ సిటీ కార్పోరేషన్ లిమిటెడ్(ఏఎస్ఎస్‌సీసీ) ఏర్పాటు.
17.11.2017  NGT
28.11.2017 విట్ విశ్వవిద్యాలయం ప్రారంభం.
14.08.2018 బొంబాయి స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ సీ)లో అమరావతి బాండ్లు అమ్మకానికి పెట్టిన సీఆర్డీఏ.
                     రూ.2వేల కోట్లు సేకరణ.
27.08.2018 బీఎస్సీలో  బాండ్ల నమోదు. సీఎం చంద్రబాబు ప్రారంభం.
16.09.2018 కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.
27.12.2018 రాజధానిలోని రాయపూడి కొండమరాజుపాలెం వద్ద
                    ప్రపంచంలోనే ఎత్తైన ఐదు టవర్ల సచివాలయ నిర్మాణానికి తొలి అడుగుపడింది.
26.12.2018 నవ్యాంధ్ర నుంచే న్యాయపరిపాలనకు రాష్ట్రపతి కార్యాలయం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల.
01.01.2019 రాష్ట్రంలో న్యాయపాలనకు శ్రీకారం. విజయవాడలో తాత్కాలిక భవనంలో
                     హైకోర్టు నిర్వహణ.
24.01.2019  రైతుల సమక్షంలో డ్రా తీసి 30,222 ప్లాట్లు రైతులకు రిజిస్ట్రేషన్.
31.01.2019 తాళ్లాయపాలెం సమీపంలో టీటీడీ ఆలయ నిర్మాణానికి ఆగమ శాస్త్రం ప్రకారం భూకర్షణం,
                    బీజావాహనం కార్యక్రమం.
03.02.2019 నేలపాడులో హైకోర్టును ప్రారంభించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి
                    రంజన్ గొగోయి.
07.04.2019 అధికారికంగా ఏపీ హైకోర్టు ప్రారంభం. వేరువేరుగా ఏపీ, తెలంగాణ హైకోర్టుల నిర్వహణ.
13.09. 2019 : అమరావతి సహా అన్ని జిల్లాలు, ప్రదేశాలు సమానంగా అభివృద్ధి చెందేందుకు ఉపకరించే సలహాలు, సూచనలివ్వాలంటూ జి.ఎన్‌.రావు కమిటీ ఏర్పాటు. కమిటీ కన్వినర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎస్ రావు,  సభ్యులుగా ప్రొఫెసర్ మహవీర్, డాక్టర్ అంజలీ మోహన్, డాక్టర్ శివానందరెడ్డి, ప్రొఫెసర్ కేటీ రవిచంద్రన్, ప్రొఫెసర్ అరుణాచలం.

v 06.11.2019:  రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతల పర్యటన - అమరావతిలో నిర్మాణాలు లేవన్న ఆరోపణలకు కౌంటర్ గా ఈ పర్యటన.  ఈ పర్యటనలో ఏపీ అసెంబ్లీ ప్రతిపక్ష ఉప నేత అచ్చెన్నాయుడు,  మాజీ మంత్రులు నారాయణ, దేవినేని ఉమ,  ఎంపి గల్లా జయదేవ్, ఎమ్మెల్యే రామానాయుడు,  పంచుమర్తి అనురాధ  తదితరులు పాల్గొన్నారు. నిర్మాణంలో ఉన్న భవనాలన్నింటినీ పరిశీలించారు.
v 08.11.2019 జీఎన్‌ రావు కమిటీకి భారీగా లేఖలు, ఈమెయిల్స్‌(ఆంధ్రజ్యోతి): జి.ఎన్‌.రావు కమిటీకి ఇప్పటి వరకు సుమారు 25 వేల లేఖలు, -మెయిల్స్‌ అందినట్లు  తెలిసింది. 13 జిల్లాలూ సరిసమానంగా పురోగమించేందుకు తోడ్పడే వినతులు కూడా ఉన్నట్లు సమాచారం.
v రాజధాని కమిటీని రద్దు చేయమని  హైకోర్టులో గుంటూరు రైతుల పిటిషన్‌ : రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జీఎన్‌రావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీని రద్దు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా బోరుపాలెం గ్రామానికి చెందిన రైతులు సీహెచ్‌ శివలింగయ్య, సీహెచ్‌ రామారావు హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ సీఆర్‌డీఏ చట్ట నిబంధనలకు విరుద్ధంగా కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. చట్టసభ ద్వారా ఏర్పాటైన సీఆర్‌డీఏపై పునఃసమీక్ష జరిపే అధికారం కూడా ఈ కమిటీకి లేదని పిటిషన్‌లో వివరించారు. ఈ నేపథ్యంలో కమిటీని నియమిస్తూ జారీచేసిన జీవోను రద్దు చేయాలని అభ్యర్థించారు. వైసీపీ ప్రభుత్వం రాజధానిని తరలించినా, నిర్మాణం ఆలస్యం చేసినా భూములిచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోతారని వివరించారు.
v అమరావతి స్టార్ట్ అప్ ఏరియా ప్రాజెక్ట్  సింగపూర్‌ కన్సార్టియం ఎంఓయు 15,05.2017న జరిగింది.
v 12.11.2019 : ఒప్పందం రద్దు చేసుకున్నట్లు సింగపూర్ పరిశ్రమలు, వాణిజ్య మంత్రి ఈశ్వరన్‌ తెలిపారు.
v 23.11.2019 : సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసిన భారతదేశ కొత్త మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి గుర్తింపు.
v   27.11.2019 : స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమరావతికి ఇప్పటి వరకు రూ.496 కోట్లు కేటాయింపు. చేసిన ఖర్చు రూ.472.9 కోట్లు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి రాజసభలో వెల్లడి.
v 28.11.2019 : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజారాజధాని అమరావతి పర్యటన
v  03-12-2019 : రాజధాని నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూసమీకరణ పథకం (ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం- ఎల్పీఎస్‌) ఉత్తమమైనదని ఏపీ సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ పి.లక్ష్మీ నరసింహం పేర్కొన్నారు.  స్వచ్ఛంద సంస్థ తెరి’ (ది ఎనర్జీ అండ్‌ రీసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌) ఆధ్వర్యంలో భూసమీకరణపై న్యూఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు.
v  05.12.2019 :  ప్రజా రాజధాని అమరావతి, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన అజెండాగా విజయవాడలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతంమైంది. దాదాపు 15 రాజకీయ పార్టీలు, పలు ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. అమరావతి నిర్మాణం ఆపవద్దని ముక్తకంఠంతో కోరారు.
v 11.12.2019 : సీఆర్డీఏ పరిధిలో థర్డ్ పార్టీ కొనుగోలు చేసిన అసైన్డ్ భూముల లావాదేవీలను మంత్రి మండలి రద్దు చేసింది.   
v  13.12.2019 :  ఏపీ రాజధాని అమరావతిని మార్చడం లేదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శాసనమండలిలో  లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. రాజధాని మార్చే ఉద్దేశం ఉందా? అని టీడీపీ ఎమ్మెల్సీలు పామిడి శమంతకమణి, గుణపాటి దీపక్ రెడ్డి, పరుచూరి అశోక్ బాబు అడిగిన  ప్రశ్నకు అలాంటి ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు.
v 16.12.2019: రాజధాని తరలింపు యోచన లేదని మండలిలో ప్రకటించిన రెండు రోజులకే డిసెంబర్ 16,2019న మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట మార్చారు. శివరామకృష్ణ కమిటీ రాజధానికి ఈ ప్రాంతం తగదని చెప్పిందన్నారు. అందుకే అమరావతిపై జీఎన్‌ రావు సమన్వయకర్తగా నిపుణులతో కమిటీ వేశామని చెప్పారు.
 మూడు రాజధానులు
v 17.12.2019 ‌: శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి :  దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులున్నాయి. మనకూ మూడు ఉంటే తప్పేంటి.? అమరావతిలో చట్టసభలు, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో హైకోర్టు.
 జీఎన్‌రావు  కమిటీ నివేదిక
v 20.12.2019 : జీఎన్‌రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డికి నివేదిక అందజేసింది.
v 23.12.2019 : 25 సంఘాలతో అమరావతి పరిరక్షణ సమితి ఏర్పాటు. అమరావతి రాజధానిగా కొనసాగాలని పోరాటం.
26.12.2019: గవర్నర్‌ను కలిసిన రాజధాని రైతులు: అమరావతి రైతులు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని వారు వినతిపత్రం సమర్పించారు. తొమ్మిది రోజులుగా రాజధానిలో జరుగుతున్న పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. 175 మంది ఎమ్మెల్యేల సమక్షంలో ఆనాడు అమరావతిని రాజధానిగా అంగీకరించారు.
గుంటూరు, కృష్ణా వైసీపీ ఎమ్మెల్యేల సమావేశం:  అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయాలనేది సీఎం జగన్ లక్ష్యం - ఉపాధి అవకాశాలు కలిపించేందుకు కృషి. తాత్కాలిక నిర్మాణాలకే రూ.5,800 కోట్లు ఖర్చు.  మరో లక్షా 15 వేల కోట్లు ఖర్చు చేయాలి. తక్కువ ఖర్చుతో ఏపీని అభివృద్ధి చేయాలనేది మా ప్రభుత్వ నిర్ణయం. అమరావతిలో నిర్మాణాలన్నీ పూర్తిచేయాలంటే బడ్జెట్ సరిపోదు.
-         పార్థసారథి, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, మల్లాది విష్ణు
v 27.12.2019 : అమరావతి కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో ఓ గంటపాటు మౌన దీక్ష చేశారు. కన్నా మౌన దీక్షకు పలువురు బీజేపీ నేతలు మద్దతుగా నిలిచారు.
v మంత్రి మండలి సమావేశం: రాజధానిపై అధ్యయనానికి హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (జీసీజీ)ల నివేదికలను ఈ హైపవర్ కమిటీ అధ్యయనం చేస్తుంది. హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చిన తరువాతే రాజధానిపై ప్రకటన. సీఆర్డీఏ పరిధిలోని అవినీతిపై విచారణకు న్యాయనిపుణుల సలహాలు తీసుకుని సమగ్రమైన దర్యాప్తు. రాజధాని ప్రకటనకు ముందు చంద్రబాబు, మాజీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిన భూములపై విచారణ చేయించాలని నిర్ణయం. లోకాయుక్త లేదా సీబీఐ లేదా సీఐడీతో విచారణ.
v హైపవర్ కమిటీ
29-12-2019 : ఆంధ్రప్రదేశ్‌ మూడు రాజధానులపై జీఎన్‌రావు కమిటీ, బీసీజీ కమిటీల నివేదికలను అధ్యయనం చేయడానికి హైపవర్ కమిటీ నియామకం

 
v   30-12-2019 : రాజధాని రైతు పరిరక్షణ సమితి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. జనవరి 23న తిరిగి విచారణ.
v జిఎన్ రావు కమిటీ సిఫార్సులను సమర్ధిస్తూ నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలకు చెందినవారు హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్లు వేశారు.
v 31.12.2019 : రాష్ట్రపతి కోవింద్‌కు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వమని లేఖలు రాసిన రాజధాని రైతులు.
v 01.01.2020:  రాజధాని గ్రామాల్లో  చంద్రబాబు దంపతుల పర్యటన.  

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...