Jan 5, 2020

శివరామకృష్ణన్ కమిటీ నివేదిక



v 03.03.2014  కెసి శివరామకృష్ణన్ కమిటీ నియామకం.
v 27.08.2014  శివరామకృష్ణన్ కమిటీ నివేదిక సమర్పణ.
v ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014  సెక్షన్ 6 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని కోసం శివరామకృష్ణన్ అధ్యక్షునిగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
v మాజీ హోంశాఖ ప్రధాన కార్యదర్శి కె.శివరామకృష్ణన్ అధ్యక్షునిగా ఐదుగురు డాక్టర్ రతిన్ రాయ్, ఆరోమార్ రెవి, జగన్ షా,  కెటి రవీంద్రన్ లతో కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది.
v ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటించింది.  జూన్ 2న ఏర్పడిన నూతన ప్రభుత్వ అభిప్రాయాలను కూడా తీసుకుంది.
v శివరామకృష్ణన్ కమిటీ   ఆగస్ట్ 27, 2014న న్యూ ఢిల్లీలో  కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్‌ గోస్వామికి 187 పేజీల  నివేదిక అందజేసింది. ఈ కమిటీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం కొన్ని ప్రాంతాలను ప్రతిపాదిస్తూ, కొన్ని ప్రాంతాల మంచి చెడ్డల గురించి ప్రస్తావించింది. ఏ ఒక్క ప్రాంతాన్ని స్పష్టంగా, గట్టిగా ప్రతిపాదించలేదు. భూముల లభ్యత, ఇతర కారణాలను మాత్రమే ప్రస్తావించింది.
v   ఈ కమిటీకి రాష్ట్రం నలుమూలల నుంచి 4728 అభిప్రాయాలు అందాయి. వారిలో అత్యధికంగా 2191 మంది విజయవాడ-గుంటూరు మధ్యలోనే రాజధాని కావాలని కోరారు.




కమిటీ సమర్పించిన ప్రజాభిప్రాయ టేబుల్
కమిటీ ప్రధాన సూచనలు
v నీటి వనరులు, రవాణా, రక్షణ, చారిత్రక అంశాలుఆధారంగా రాజధాని ప్రదేశం ఎంపిక చేయాలి.
v రాజధాని నిర్మించే  ప్రాంతానికి మౌలిక వసతులు కల్పించాలి.
v రాజధాని నిర్మాణానికి  లక్షల కోట్ల రూపాయలు అవసరం.
v వీజీటీఎం పరిధిలో సీఎం, మంత్రుల ఆఫీసులు, సచివాలయం ఏర్పాటుకు సూచన. వీజీటీఎం పరిధిలో రాజధానికే 10 వేల ఎకరాలు అవసరం. ఇక్కడ ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూమి 1,458 ఎకరాలు. భూసేకరణకు 3 నుంచి 4 ఏళ్ల సమయం పడుతుంది. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం భూసేకరణ అధిక వ్యయంతో కూడుకున్నది. విజయవాడ, గుంటూరులో ఇప్పటికే భూమి ధర విపరీతంగా పెరిగింది.
v రాజధాని ప్రాంతాలుగా మంగళగిరి, ముసునూరు, మాచెర్ల, గొల్లపల్లి, వినుకొండ, మార్టూరు, దొనకొండ, పులిచింతల అయితే మంచిది.
v అమరావతి, నూజివీడు, ముసునూరు, గన్నవరం ప్రాంతాలలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చు.
v రవాణా అవసరాల దృష్ట్యా విజయవాడ చుట్టూ రింగ్‌ రోడ్‌ నిర్మించాలి. కృష్ణా నదికి ఇరువైపులా రోడ్డు కనెక్టివిటి పెంచాలి.
v అసెంబ్లీ, సెక్రటేరియేట్, ముఖ్యమంత్రి కార్యాలయం రాజధాని నగరంలో ఏర్పాటు చేయాలి.
v  హైకోర్టు విశాఖపట్నంలో ఉండాలి. కర్నూలు లేదా అనంతపురంలో  హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేయాలి.
v  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అత్యవసరం. ఆర్థిక లోటు ఉన్న ఏపీని ఆదుకునేందుకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడం సముచితం.
v   ఎన్‌డీసీని సంప్రదించి త్వరగా ఏపీకి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలి.
v మాచర్ల, పులిచింతల రెండూ తెలంగాణ సరిహద్దులో ఉన్నందున రాజధానికి ఇవి ఉపయుక్తం కావు.
v డైరెక్టరేట్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ కార్యాలయం ముందు నుంచీ అనంతపురంలోనే ఉంది. దానిని అక్కడే కొనసాగించాలి.
v పోర్టులు, పరిశ్రమలు, ఎగుమతులు, మత్స్య విభాగాలకు చెందిన కమిషనరేట్లు, డైరెక్టరేట్లను వైజాగ్‌ జోన్‌లో ఏర్పాటు చేయవచ్చు.
v పునరుత్పాదక ఇంధన కార్యకలాపాలకు సంబంధించి రాయలసీమ ప్రాంతంలో కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి.
v దేశీయ, విదేశీ పెట్టుబడులన్నీ ఉపాధి కారకాలుగా ఉండాలి.
v ఐటీ, పరిశ్రమలకు సంబంధించిన విభాగాలన్నీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలి.
v విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాలను ప్రత్యేక కారిడార్లుగా గుర్తించాలి.
v విశాఖపట్నం పరిశ్రమలకు, అనంతపురం విద్యకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు.
v సచివాలయం, శాసనసభ త్వరగా తరలిస్తే మేలు.
v ప్రస్తుత పరిస్థితులలో గ్రీన్ ఫీల్డ్ నగర నిర్మాణం మంచిదికాదు.
v తగినంత ప్రభుత్వ భూమి ఉన్న ప్రాంతాన్ని ఎన్నుకోండి
v ప్రస్తుతం ఉన్న నగరాలను విస్తరింపజేయదలచుకుంటే తగిన మౌలిక సదుపాయాలు, వాతావరణ పరిస్థితులు పరిగణనలోకి తీసుకోవాలి.
v ఒకవేళ సీఎం, మంత్రుల కార్యాలయాలు, సచివాలయం వంటి వాటి కోసం అత్యవసరంగా కావాలనుకుంటే బీజీటీఎం వెలుపల తగిన స్థలాలను చూడవచ్చు.
v రాజ్యాంగపరమైన సంస్థలు రాజ్ భవన్, శాసనసభ, హైకోర్టు వంటి వాటి కోసం రీఆర్గనైజేషన్ చట్టంలో తెలిపిన ప్రకారం పదేళ్ల పాటు  హైదరాబాద్ నగరాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి.
v రాజధానికి మూడు ఆప్షన్లు
1.   పచ్చదనంతో నిండిన ప్రాంతంలో మహానగర నిర్మాణం.
2.  ఉన్న నగరాలను విస్తరించడం.
3.   అభివృద్ధి వికేంద్రీకరణ






నారాయణ కమిటీ
v 2014 జులై 20న నాటి పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ ఆధ్వక్షతన 9 మంది సభ్యులతో  కమిటీ ఏర్పాటైంది. రాజధాని నిర్మాణం, డిజైన్ అంశాలకు సంబంధించి  సలహాలు ఇవ్వడానికి  ఈ కమిటీని నియమించారు.
v ఈ కమిటీలో అప్పటి మంత్రి పి.నారాయణతోపాటు ఎంపీలు వైఎస్ చౌదరి, గల్లా జయదేవ్, మాజీ ఎమ్మెల్యే బీడా మస్తాన్ రావు,  జీవీ సంజయ్ రెడ్డి (జీవీకె గ్రూప్), బొమ్మిడాల శ్రీనివాస్ (జీఎంఆర్ గ్రూప్), ఎం.ప్రభాకర్ రావు(నూజివీడు సీడ్స్), చింతలపాటి శ్రీనివాస రాజు (పీపుల్ కేపిటల్), మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యులుగా ఉన్నారు.
v రాజధాని నగరంలో ప్రజలు సౌకర్యవంతంగా జీవించే పర్యావరణ వ్యవస్థ, భూమి, నీరు వంటి సహజ వనరులు సమర్థవంతంగా వినియోగించడం, అన్ని విధాల నగరం అభివృద్ధి, నగర ప్రణాళిక విధానాలు, రవాణా కారిడార్లు, కొత్త రాజధానిలో సమర్థవంతమైన నిర్వహణా వ్యవస్థలు, కేంద్ర నిధులతోపాటు ఇతర మార్గాలలో నిధుల సేకరణ వంటి అంశాలలో సలహాలు ఇవ్వడానికి మాత్రమే ఈ కమిటీని నియమించారు.
v ఈ కమిటీ రాజధాని స్థల ఎంపిక కోసం ఏర్పాటు చేసినది కాదు.
v ఈ కమిటీ దేశంలోని చంఢీగడ్, నయా రాయపూర్, నవీ ముంబయితో సహా పుత్రజయ, ఆస్టిన్, దుబాయి, సింగపూర్‌ తదితర ప్రాంతాలలో పర్యటించి అక్కడి రాజధాని ప్రాంతాలను అధ్యయం చేసింది.



No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...