Jan 5, 2020

అమరావతి హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్ట్


§  అమరావతిలో సీఆర్‌డీఏ నిర్మిస్తున్న గృహ నిర్మాణ ప్రాజెక్టు
§  నేలపాడు వద్ద మొత్తం 1200 ఫ్లాట్లు నిర్మించాలని ప్రతిపాదన.
§  24 నెలల్లో ప్రాజెక్ట్ పూర్తి చేయాల్ననది లక్ష్యం.
§  14.46 ఎకరాలు - 12 టవర్ల – ఒక్కో టవర్ 19 అంతస్తులు (జీ+18) - 1200 ఫ్లాట్లు – 2 బెడ్ రూమ్, 3 బెడ్ రూమ్ ఫ్లాట్లు -  గేటెడ్ కమ్యూనిటీ. చదరపు అడుగు రూ.3,492 – ఫ్లాట్ ధరలో 7 శాతం ముందుగా చెల్లింపు.
§  ప్రాజెక్ట్ విలువ : రూ.658.46 కోట్లు. 
§  కాంట్రాక్టర్ : ఎస్పీసీపీఎల్ (Shapoorji Pallonji And Company Private Limited)
§  09.11.2018 : మొదటి విడత 300 ఫ్లాట్లు ఆన్ లైన్ బుకింగ్.
§  10.12.2018 : రెండవ విడత 9 ఫ్లాట్లు ఆన్ లైన్ బుకింగ్ (గంటలో ఫ్లాట్లు అన్ని బుక్)
§  28.02.2019 గురువారం : హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్ట్ సిరీస్-1 నిర్మాణానికి భూమి పూజ
§  ఫైల్ ఫౌండేషన్ పనులు జరుగుతుండగా పనులు నిలిపివేశారు.
§  హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టు నిర్మాణానికి నేలపాడు సమీపంలో ప్లాట్లు బుక్‌ చేసుకున్న యజమానుల సమక్షంలో భూమి పూజ నిర్వహించారు.
§  హ్యాపీనెస్ట్‌ - 1 ప్రాజెక్టుకు రెరా(Real Estate Regulatory Authority) నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు లభించాయి.
§  ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ సిబిఆర్‌ఈ, స్ట్రక్చరల్‌ డిజైన్‌లు ఐఐటి చెన్నై వంటి ప్రముఖ సంస్థలు పర్యవేక్షించాయి.
§  కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌, ప్లానింగ్‌, గ్రీన్‌ కాన్సెప్ట్‌, పిఎంసి తదితర అన్ని అంశాల్లో ఇది బెంచ్‌ మార్కు ప్రాజెక్టుగా నిలిచే విధంగా చర్యలు.
§  హ్యాపీనెస్ట్‌ నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కస్టమర్లకు సిసి కెమెరాల ఆన్‌లైన్‌ లింక్‌ను పంపించే ఏర్పాటు చేశారు.
§   హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టుపై  రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించి మార్గదర్శకాలను జారీచేయాలని సీఆర్‌డీఏకు తాజాగా ఆదేశాలిచ్చింది.
------------------------------------------------------------------------------------------------------------------

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...