Jan 2, 2020


ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి  పరిస్థితులు
              దేశంలో గతంలో ఎన్నడూ జరుగని విధంగా అత్యంత దయనీయ పరిస్థితులలో పార్లమెంటు తలుపులు మూసి మరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించారు. 5 కోట్ల ఆంధ్రప్రజలకు ఇష్టంలేకపోయినా ఆ నాటి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యుపీఏ ప్రభుత్వ రాష్ట్రాన్ని నిట్టనిలువునా రెండుగా చీల్చింది. విభజన ప్రక్రియ, విభజన చట్టం రూపొందించడంలో కూడా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. పార్లమెంట్ ఉభయ సభల్లో సమగ్ర చర్చ జరుగకుండా, ఆంధ్ర ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలు తెలియజేయడానికి అవకాశం ఇవ్వకుండా హడవుడిగా బిల్లును ఆమోదించారు. బీజేపీ నేతలు కూడా బిల్లుకు మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రజాప్రతినిధుల మాటలకు విలువలేకుండా చేశారు. వారి డిమాండ్లు వినిపించుకున్న నాధుడు లేడు. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించారు. రాజధాని లేని, నిండా అప్పులతో మునిగిన రాష్ట్రాన్ని అప్పగించారు. ఆస్తుల పంపకంపై చర్చలేదు. అన్ని విధాల అభివృద్ధి చెందిన, ప్రధాన ఆర్థిక వనరు అయిన హైదరాబాద్ మహానగరాన్ని కోల్పోతున్న ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరిగే విధంగా ఒక్క నిర్ణయం తీసుకోలేదు. ఆస్తుల పంపకంలో సమతూకం పాటించలేదు. ఆస్తులు  అవి ఉన్న ప్రాంతం ప్రాతిపదికన కేటాయించారు. అప్పులను మాత్రం జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ కు 58 శాతం, తెలంగాణకు 42 శాతం విభజించారు. విభజన అనంతరం దేశంలో గుజరాత్ తరువాత మిగులు ఆదాయం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఆంధ్రప్రదేశ్ మాత్రం  భారీ అప్పులతో ఉంది.
జనాభా ఎక్కువ ఆదాయం తక్కువ వచ్చే ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ గా విభజించారు. ఆ నాడు అప్పులతోపాటు రూ.16వేల కోట్ల రెవెన్యూ లోటుతో ఏపీ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో అధిక ఆదాయం సమకూర్చే హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగం అయిపోయింది. క్లిష్టపరిస్థితులలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు తనపై ప్రజలు ఉంచిన నమ్మకానికి అనుగుణంగా రాష్ట్రాభివృద్ధికి, అమరావతి నిర్మాణానికి పట్టుదలతో నిరంతరం శ్రమించారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...