Jan 5, 2020

అమరావతి నిలిపివేత జాతీయ విషాదం


28-12-2019
 ఇదో పిచ్చి తుగ్లక్‌ నిర్ణయం
ప్రముఖ జర్నలిస్టు శేఖర్‌ గుప్తా మనోగతం
            భారతదేశంలో ఆరు దశాబ్దాల తర్వాత ఒక అద్భుతమైన గ్రీన్‌ ఫీల్డ్‌ రాజధాని ఏర్పడే అవకాశాలను కాలరా స్తూ 3 రాజధానులు ఏర్పాటు చేయాలని జగన్‌ ప్ర భుత్వం తీసుకున్న నిర్ణయం తుగ్లక్‌ తీసుకున్న నిర్ణయం లాంటిదని సీనియర్‌ జర్నలిస్టు, ‘ప్రింట్‌అధినేత శేఖర్‌ గుప్తా వ్యాఖ్యానించారు. దేశానికి మొఘలులు వచ్చి నగరాలు నిర్మించి.. సంపదను పెంచి లూటీ చేశారని, తుగ్లక్‌ ఒక్కడే అందుకు మినహాయింపని తన ప్రింట్‌ వెబ్‌సైట్‌లో వ్యాఖ్యానించారు. తుగ్లక్‌ను ఉదాహరణగా తీసుకుని అమరావతిని రాజధాని కాకుండా చేయడం విషాదకరమన్నారు. వైఎస్‌ జీవించి ఉంటే.. చంద్రబాబును జనం మరచిపోయేలా రాజధానిని నిర్మించేవారని చెప్పారు. ఆంధ్ర ప్రజల ప్రయోజనాల రీత్యా ప్రధాని మోదీ ఇప్పటికే జగన్‌కు ఫోన్‌ చేసి ఇలాంటి తప్పుడు నిర్ణయంపై మందలించి ఉంటే బాగుండేదన్నారు. జగన్‌ అధికారం తలకెక్కడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని. ముగ్గురు తుగ్లక్‌లు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఉందని.. ఈ పిచ్చితనానికి అడ్డుకట్ట వేయాల్సిందేనని స్పష్టీకరించారు.
                   బాబుకు క్రెడిట్‌ దక్కుతుందనుకుని.. చంద్రబాబు నిర్ణయాలన్నిటినీ కాలరాయాలనుకోవడం, రాజధానికి చంద్రబాబు తీసుకున్న బృహత్తర నిర్ణయం వల్ల ఆయనకు క్రెడిట్‌ దక్కుతుందని.. దానివల్ల తానేదో కోల్పోతానని జగన్‌ అనుకోవడం సరైంది కాదు. బృహత్తర రాజధాని నిర్మాణం ప్రారంభం కావడం, రైతులు భూములివ్వడంతో జగన్‌కు ఏం చేయాలో తోచక ఆ నిర్ణయాన్ని కాలరాయాలనుకున్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల మధ్య స్పర్థలు ఇంత అనారోగ్యకరమైన స్థితికి దిగజారకూడదు.
                   పెద్ద నగరాలు ఉంటే సంపద ఏర్పడుతుంది. ఉద్యోగాల కోసం, నాణ్యమైన జీవనం, విద్య, వైద్యం అవసరాలు, హుందాగా బతకడానికి జనం ఆ నగరాలకు తరలి వస్తారు. కానీ దురదృష్టవశాత్తు మనకు అలాంటి నగరాలు లేవు. ఉన్న నగరాలు జనంతో నిండిపోయాయి. ఆరోగ్యకరమైన, మంచి పాలనతో కూడిన, మౌలిక సదుపాయాలు పుష్కలంగా లభించే నగరాలు మనకు కావాలి. మహారాష్ట్ర నుంచి గుజరాత్‌ విడిపోవడంతో గాంధీనగర్‌ నిర్మించారు. అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు తప్పమరేమీలేవు.
                  ఏపీ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మమకారం పెంచుకున్న హైదరాబాద్‌ ను కోల్పోయారు. వారి భావోద్వేగాలు హైదరాబాద్‌తోనే ఉండిపోయాయి. చాలా మంది కోస్తా సంపన్నులు పెట్టుబడులు పెట్టి హైదరాబాద్‌లో ఆస్తులు నిర్మించుకున్నారు. అందువల్ల వారూ ఆ నగరాన్ని వీడలేకపోయారు. ఈ సమయంలో ఒక అద్భుతమైన గ్రీన్‌ఫీల్డ్‌ నగరాన్ని నిర్మించాలని చంద్రబా బు తలపెట్టినప్పుడు నేనెంతో సంతోషించాను. ఆ రోజుల్లోనే ఏపీకి రాజధానిని నిర్మించుకునే అవకాశం వచ్చిందని రాశాను.
              చండీగఢ్‌లో రాజధాని పెట్టుకుని హరియాణా, పంజాబ్‌ ప్రజలు సతమతమవుతున్నట్లుగా కాకుండా ఆంధ్రప్రదేశ్‌ వేరే రాజధాని ఏర్పర్చుకోవడం మంచిదని అభిప్రాయపడ్డాను. ఆరు దశాబ్దాల తర్వాత మొదటి గ్రీన్‌ఫీల్డ్‌ నగరాన్ని నిర్మించ తలపెట్టడం మంచి పరిణామం’ ‘దురదృష్టవశాత్తూ జగన్‌ మొదటి నుంచీ రాజధాని అమరావతి పట్ల అనుమానాస్పద వైఖరితో వ్యవహరించారు. బడ్జెట్‌లో కేవలం రూ.500 కోట్లే కేటాయించారు. అత్యంత గౌరవప్రదమైన లులు గ్రూపు కూడా నిష్క్రమించింది.’ ‘అమరావతిలో అద్భుతమైన రాజధాని నిర్మించే అవకాశాలను కాలదన్నుకుని తుగ్లక్‌ లాగా జగన్‌ మూడు రాజధానులను ప్రకటించడం హాస్యాస్పదం. ఇదొక జాతీయ విషాదం.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...