Jan 5, 2020

కర్నూలులో హైకోర్టు


17.12.2019 ‌: దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులున్నాయి. మనకూ మూడు ఉంటే తప్పేంటి.? మన ఆలోచనలు మారాలి.  అమరావతిలో చట్టసభలు, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయవచ్చు అని శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి చెప్పారు.
 కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు బీజేపీ, కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు పలికాయి. అయితే రాయలసీమవాసులు మాత్రం అంత సంతృప్తిగా లేరు. సచివాలయం లేదా మినీ సచివాలయం కావాలని కోరుతున్నారు.
v  మైసూరా రెడ్డి:  మూడు రాజధానుల్లో ఒకటి విశాఖలో పెట్టాలని సీఎం జగన్ చెప్పడం రాయలసీమ వాసుల చెవిలో పువ్వులు పెట్టేలా ఉన్నాయి. ‘‘మద్రాస్‌ రాష్ట్రంలో ఉన్నప్పుడు నెల్లూరు వాళ్లు రాయలసీమతోనే ఉన్నారు. కృష్ణదేవరాయల పాలన సమయంలో అలాగే ఉండేది. రాయలసీమతో పాటు పాత నెల్లూరు, ప్రకాశం జిల్లా గ్రేటర్‌ రాయలసీమ. రాజకీయ రాజధాని లేదా పరిపాలన రాజధాని పెట్టాలి. రాజధానితో పాటు హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయండి.  విశాఖ వాళ్లు రాయలసీమకు రావడానికి దూరమైనపుడు మేం కూడా అక్కడికి వెళ్లడానికి దూరమవుతుంది. ఉత్తరాంధ్ర వాళ్లు ఏం కోరలేదు. వాళ్లకి ఇస్తున్నారు. మేం ఎప్పుటి నుంచో కోరుతున్నాం. ఇవ్వడానికి సమస్యేంటి? కర్నూలు రాజధానిని గతంలో త్యాగం చేశాం. అది అలా ఉంటే రాయలసీమ ఎంతో అభివృద్ధి చెందేది.

 సీఎంకు సీమ నేతలు లేఖ: మాజీ మంత్రులు మైసూరా రెడ్డి, శైలజానాథ్, మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి, దినేశ్ రెడ్డి సహా పలువురు నేతలు కర్నూలులో రాజధాని పెట్టాలని సీఎం జగన్ కు లేఖ రాశారు. హైకోర్ట్ బెంచ్ అనేది కంటి తుడుపు చర్యే. రాయలసీమకు ఒరిగేది ఏమీ లేదు. రాయలసీమ ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. రాజధానిని గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఏర్పాటు చేయాలి.  

 బైరెడ్డి రాజశేఖర రెడ్డి : రాయలసీమకు అన్యాయం జరుగుతోంది. రాజధానిని కర్నూలు నుంచి హెదరాబాద్‌ తీసుకెళ్లారని, అక్కడి నుంచి అమరావతికి, ఇప్పుడు విశాఖకు తీసుకువెళుతున్నారు. బానకచెర్లకు గోదావరి జలాల తరలింపు అసాధ్యం. రాయలసీమకు కావాల్సింది వరద జలాలు కాదు.  నికరజలాలు.. కర్నూలు జిల్లాకు తుంగభద్ర జిల్లా అని పేరుపెట్టాలి. తుంగభద్ర నదీ జలాలన్నింటినీ రాయలసీమకే కేటాయించాలి. మూడు కాదు.. జగన్‌ దృష్టిలో విశాఖనే రాజధాని. ఎన్నికలకు ముందే వైజాగ్‌లో విజయసాయి రెడ్డి తిష్టవేశారు. రియల్టర్లు రాసి ఇచ్చిందే జీఎన్‌ రావు కమిటీ రిపోర్ట్. న్యాయ రాజధాని అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. తల వైజాగ్‌కు ఇచ్చి.. తోక మీద వెంట్రుక రాయలసీమకు ఇస్తున్నారు. కోస్తాంధ్రలో సీట్ల కోసమే నాడు అమరావతికి జగన్‌ ఆమోదం తెలిపారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...