Jan 14, 2020

ఐఐటీ - చెన్నై అధ్యయనం


v ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది గరిష్ట వరద నీటి మట్టం 21.50 మీటర్లు. కృష్ణా నదికి దక్షిణాన రాజధాని ప్రాంతం ఉంది. కృష్ణా నదిలో వరద ప్రవాహం ఆరు, ఏడు లక్షల క్యూసెక్కులు దాటితే రాజధాని గ్రామాల్లోకి వరద నీరు చేరి 71 శాతం ప్రాంతాన్ని ముంచెత్తుతుంది.
v కొండవీటివాగు రాజధాని గుండా ప్రవహించి ఉండవల్లి అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌కు ఎగువన కృష్ణా నదిలో కలుస్తుంది. కొండవీటి వాగు గరిష్ట వరద మట్టం 17.50 మీటర్లు. స్థానికంగా వర్షాలు కురిస్తే కొండవీటివాగుకు వరద ఉప్పొంగుతుంది. కృష్ణా నది, కొండవీటి వాగులకు వరద వస్తే రాజధాని గ్రామాల్లో 71శాతం ప్రాంతంలో 0.5 నుంచి 1 మీటరు ఎత్తున నీళ్లు చేరి ముంచెత్తుతాయి.
v రాజధాని నిర్మాణానికి అమరావతి ప్రాంతం ఏమాత్రం అనుకూలం కాదు. వరద ముప్పు పొంచి ఉంది.
v అమరావతి నిర్మాణం చేపట్టిన 29 గ్రామాల్లో కనీసం 71 శాతం, అంటే 21 గ్రామాలపై కృష్ణా నది వరదలు తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆ ప్రాంతంలో భూములన్నీ నల్లరేగడి కావడంతో 2.5 నుంచి 5 మీటర్ల లోతులోనే భూగర్భజలాల లభ్యత ఉంది. అందువల్ల రాజధాని గ్రామాల్లో భవన, రహదారుల నిర్మాణం కోసం రెట్టింపు వ్యయం తప్పదు.
v  కృష్ణా నది సమీపంలోనే ప్రవహిస్తుండటం వల్ల అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో భూగర్భజలాలు తక్కువ లోతులోనే లభ్యమవుతాయి. అందువల్ల ఈ భూములు భారీ భవన నిర్మాణాలకు అనుకూలం కావు. ప్రభుత్వ భవనాల సముదాయం, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్, ఫైనాన్స్‌ సిటీ, టూరిజం సిటీల పనులు చేపట్టనున్న ప్రాంతాలపై వరదల ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. ఈ భూముల్లో భవనాలను నిర్మించడానికి ర్యాప్ట్‌ ఫౌండేషన్‌(పునాదులు తవ్వి.. రెండు వైపులా ఇనుప రేకులు దించి.. కాంక్రీట్‌ వేయడం) పనికి రాదుఅని చెన్నై ఐఐటీ స్పష్టం చేసింది. చాలా లోతు నుంచి పునాది వేయాలి
v రాజధాని భూముల్లో 40 మీటర్ల లోతుకు తవ్వితేగాని రాతిపొర తగలదు. ఆ ప్రాంతంలో భవనాలు నిర్మించాలంటే.. పైల్‌ ఫౌండేషన్‌(రిగ్‌ల ద్వారా  చాలా లోతుకు పైల్‌లు దించి.. అక్కడి నుంచి కాంక్రీట్‌ వేయడం) అవసరం. పైల్‌ ఫౌండేషన్‌ విధానంలో పునాదుల నిర్మాణానికి భారీ వ్యయం అవుతుంది. ఇది భవన నిర్మాణ వ్యయాన్ని రెట్టింపు చేస్తుంది.
v వరద ముంపు నుంచి రక్షణ కోసం రాజధాని భూముల్ని 3–4 మీటర్ల ఎత్తున మట్టితో నింపి అభివృద్ధి చేయాలని సీఆర్‌డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌ను చెన్నై ఐఐటీ ఈ సందర్భంగా ఎత్తిచూపింది. వరద ముంపు నేపథ్యంలోనే మాస్టర్‌ప్లాన్‌లో ఈ సూచనలు చేశారు.
v భూగర్భజలాలు ఉబికి వచ్చే నల్లరేగడి నేలల్లో రహదారుల నిర్మాణం సవాలుతో కూడింది. రహదారుల నిర్మాణానికి కూడా పైల్‌ ఫౌండేషన్‌ విధానంలోనే పునాదులు వేయాలి. రాజధాని ప్రాంతాన్ని వరదల ముప్పు నుంచి తప్పించాలంటే కనీసం 3–4 మీటర్ల ఎత్తున మట్టిని నింపి అభివృద్ధి చేయాలి. ఇందుకు భారీ వ్యయం చేయాలి.
v ముంపు ప్రాంతంలోని నిర్మాణాలకు అనుకూలంగా లేని భూముల్లో రాజధాని నిర్మించడం క్షేమకరం కాదు.


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...