Jan 16, 2020

అమరావతి - ఆరోపణలు – వాస్తవాలు


ప్రజా రాజధానిని ఎంపిక చేసినప్పటి నుంచి నిర్మాణం చేసే వరకు అడుగడునా వైకాపా నాయకులు దుష్పచారం చేశారు. వైసీపీ రాజకీయ ప్రయోజనం కోసం 5 కోట్ల ప్రజల ఆత్మాగౌరవానికి సంబంధించిన రాజధానిని కూడా ముక్కలు చేశారు. రాజధాని ఎంపిక, భూసమీకరణ, నిర్మాణం వంటి ప్ర్రక్రియలను అత్యంత పారదర్శకంగా తెలుగుదేశం ప్రభుత్వం నిర్వహించింది.  వైకాపా నాయకులు కావాలని దురుద్దేశంతోనే రాద్దాంతం చేస్తున్నారు. ఇన్ సైడ్ ట్రేడింగ్, నిర్మాణ వ్యయం, భూకేటాయింపుల్లో చేస్తున్న ఆరోపణలపై ఒక్కటి కూడా ఆధారం లేదు. వైకాపా నేతల ఆరోపణలను రాజ్యాంగ బద్ధ సంస్థలు, న్యాయసంస్థలు తప్పుపట్టాయి.
Ø    ప్రశ్న: రాజధాని ఏర్పాటులో శివరామకృష్ణన్ కమిటీ నివేదిక అమలు చేయలేదు.
సమాధానం : శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికలోని అంశాలను దృష్టిలోపెట్టుకొనే నీరు, రవాణా, మౌలిక సదుపాయాలతోపాటు అందరికి అందుబాటులో రాష్ట్రం నడిబొడ్డున ఉన్న అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారు. కమిటీకి అందిన ప్రజాభిప్రాయంలో కూడా అత్యధిక మంది విజయవాడ-గుంటూరు మధ్యనే కావాలని కోరారు. కమిటీకి అందిన స్పందనలు  మొత్తం 4,728 కాగా, విజయవాడ - గుంటూరు ప్రాంతంలో రాజధాని ఉండాలని అత్యధిక మంది 2,191 మంది కోరారు.  రాజధానిగా అమరావతిని ఇప్పటి సీఎం, అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించారు. రాష్ట్ర ప్రజలు కూడా ఆమోదించారు. ఏ ప్రాంతం నుంచి కూడా వ్యతిరేకత రాలేదు.
Ø    ప్రశ్న: అమరావతిలో భవన నిర్మాణాలకు చదరపు అడుగుకు చంద్రబాబు ప్రభుత్వం రూ.8 వేలు ఖర్చు చేశారు.
సమాధానం: అసెంబ్లీ భవన నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.5,333,  హైకోర్టు భవనాలకు చ.అ.కు రూ.3,666, సచివాలయం, శాసనసభ, మండలి భవనాలు, పార్కింగ్, భూమి అభివృద్ధి, గ్రీనరీ, ఫర్నీచర్, సెంట్రల్ ఏసీ తదితరాలన్నీ కలిపి చ.అ.కు రూ.7,101, ఎమ్మెల్యే, ఆలిండియా సర్వీస్ అధికారుల భవనాలు, ఎన్జీఓ భవనాలకు చ.అ.కు రూ.3,459 ఖర్చు చేశారు.
Ø    ప్రశ్న :  ఒక సామాజిక వర్గం కోసమే రాజధాని.
Ø    సమాధానం:  అమరావతి పరిధిలో ఎస్సీ, బీసీ, మైనార్టీలు 75 శాతం ఉన్నారు.  29 పంచాయతీల్లో 15 పంచాయితీల్లో కాపులు గణనీయంగా ఉన్నారు. 14 కులాలుంటే, రెడ్లు 17శాతం, కమ్మవారు 14 శాతమే ఉన్నారు. ప్రత్తిపాడు, తాడికొండ, తిరువూరు, నందిగామ 4 ఎస్సీ నియోజకవర్గాల మధ్యలో అమరావతి ఉంది.
Ø    ప్రశ్న : అమరావతి ముంపు ప్రాంతమని తప్పుడు ప్రచారం.
సమాధానం : అమరావతి ముంపు ప్రాంతం కాదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది.1850, 2009లో పెద్ద వరదలు వచ్చినా ఎలాంటి ముంపు జరగలేదని ట్రిబ్యునల్ పేర్కొంది. 

Ø    ప్రశ్న: ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌
సమాధానం : జూన్ 2, 2014 నుంచి  అమరావతి పేరు రాజధానిగా ప్రకటించిన  సెప్టెంబర్ 4న వరకు నాలుగు నెలల్లో 128 ఎకరాలు మాత్రమే రిజిస్ట్రేషన్ జరిగింది. వాటిలో కూడా వంద ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. వారు టీడీపీ వారు కాదు. మిగిలిన 28 ఎకరాలు ఇతరులు కొనుగోలు చేశారు. వాస్తవం ఇదైతే మంత్రి బుగ్గన 4070 ఎకరాలని శాసనసభ సాక్షిగా అబద్దాలు చెప్పారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పై సిటింగ్ జడ్జితో విచారణ జరిపించమంటే జరిపించకుండా అసత్య ఆరోపణలు చేస్తున్నారు.
Ø    ప్రశ్న: బాలకృష్ణ వియ్యంకునికి రాజధానిలో 500 ఎకరాలు.
సమాధానం : బాలకృష్ణ వియ్యంకునికి రాజధానిలో ప్రభుత్వం సెంటు భూమి కూడా ఇవ్వలేదు. రాజధాని వెలుపల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది. ప్రస్తుతం  ఆ భూమి ప్రభుత్వ స్వాధీనంలోనే ఉంది.
Ø    ప్రశ్న: అమరావతిలో ఫౌండేషన్ ఖర్చులు ఎక్కువ అని అబద్దాలు చెప్పారు.
సమాధానం: హైదరాబాద్, చెన్నై కన్నా అమరావతిలో ఫౌండేషన్ ఖర్చులు తక్కువ అని ఇంజనీరింగ్ నిపుణులు ప్రకటించారు. అమరావతిలో రాకీ స్టార్టా ఎల్ 11 మీ. డెప్త్, చ.మీ.కు 150 టన్నుల బేరింగ్ కెపాసిటీ ఉన్నది. హైదరాబాద్ రాకీ స్టార్టా కారణంగా బ్లాస్టింగ్ చేయాలి. బేస్ మెంట్ 7.1 మీటర్లు, బ్లాస్టింగ్ 4.5 మీటర్లు మొత్తం 11.6 మీటర్లు డెప్త్ దీనికి తోడు కృష్ణా, గోదావరి నీటి సరఫరా ఖర్చులు చెన్నైలో బేరింగ్ కెపాసిటీ చ.మీ.కు 10 మెట్రిక్ టన్నులే. ఫైల్ ఫౌండేషన్ 30 నుంచి 40 మీటర్ల లోతు నుంచి వేయాలి.
Ø    ప్రశ్న: అమరావతిలో తన సామాజికవర్గ నేతలకు చంద్రబాబు భూములు కట్టబెట్టారు.
సమాధానం:  130 సంస్థలకు 1293 ఎకరాలు అత్యంత పారదర్శికంగా కేటాయించారు. కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, రైల్వే, విద్యా, ఆరోగ్య, ఆధ్యాత్మిక సంస్థలు వంటివి ఇందులో ఉన్నాయి. ఎస్ఆర్ఎం, విట్, అమృత యూనివర్సిటీలు, టీటీడీ తదితర సంస్థలకు భూములు కేటాయించారు.
Ø    ప్రశ్న :  రాజధానిలో ఒక్క ఇటుక వేయలేదు, ఒక శాశ్విత కట్టడం లేదు.
సమాధానం:  సచివాలయం, శాసనసభ, శాసన మండలి, హైకోర్టు భవనాలు శాశ్వితం కాదా? కొండవీటి వాగు ఎత్తిపోతల ప్రాజెక్ట్ గ్రాఫిక్సేనా? ఇటుకలు లేకుండా నిర్మించారా? అమరావతిలో గ్రాఫిక్స్ రోడ్లపై తిరుగుతున్నారా? 29 గ్రామాల పేదలకు నిర్మించిన 5వేల గృహాలు గ్రాఫిక్స్ యేనా? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉద్యోగుల గృహసముదాయాలు గ్రాఫిక్స్ గానే ఉన్నాయా? ప్రైవేటు రంగంలో విట్, ఎస్ఆర్ఎం, అమృత యూనివర్సిటీలు, ఎయిమ్స్ నిర్మాణాలు  గ్రాఫిక్సేనా?
Ø    ప్రశ్న :  రాష్ట్ర రాజధానికి గెజిట్ నోటిఫికేషన్ లేదు.
సమాధానం:  డిసెంబర్ 30, 2014న రాజధాని నగర ప్రాంతం(24 రెవెన్యూ గ్రామాలు, తాడేపల్లి మున్సిపాలిటీలో కొంతభాగం)ని నోటిఫై చేస్తూ జీఓ నెం.254 విడుదల. ఏపీ సీఆర్డీఏ చట్టం 2014 సెక్షన్ (3) సబ్ సెక్షన్  (3) ప్రకారం 122 చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల ప్రాంతం రాజధాని నగరంగా నోటిఫై చేశారు. ఏప్రిల్ 23, 2015న జీఓ ఎంఎస్ నెం.97 ప్రకారం రాజధానికి అమరావతి అని నామకరణం. జీఓ నెం.141(09.06.2015) ప్రకారం పరిధిని 217 చదరపు కి.మీ.పెంచారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.
అక్టోబర్ 29, 2018న సుప్రీం కోర్టు తీర్పు: 2018 నెం.డి.29890 కేసులో జస్టిస్ సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్ లతో కూడిన ధర్మాసనం తీర్పులోని ప్రధాన అంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా అమరావతి అనే నగరాన్ని నిర్మించాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుఅనే పేరుతో జనవరి 1, 2019న రాష్ట్రపతి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేశారు. ఆ హైకోర్టు ప్రిన్సిపల్ సీటు అంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో ఉంటుందని ఆ ఆర్డర్ లో పేర్కొన్నారు.
కేంద్రం విడుదల చేసిన భారతదేశం రాజకీయ చిత్రపటంలో ఏపీ రాజధానిగా  అమరావతికి స్థానం కల్పించారు. 
Ø    ప్రశ్న: రాజధాని వైకాపా మ్యేనిఫెస్టో.
సమాధానం: అమరావతి రాజధానిగా తీర్మానం చేసిన సమయంలో అప్పటి ప్రతి పక్షనేత జగన్మోహన రెడ్డి మన:స్పూర్తిగా మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. రాజధానికి 30వేల ఎకరాలు కావాలన్నారు. రాజధానిని అమరావతి నుంచి మార్చం అని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రెస్ మీట్ పెట్టి  మరీ చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజధానిని మార్చడంలేని మంత్రి బొత్స సత్యనారాయణ శాసనమండలిలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
Ø    ప్రశ్న: దళితులకు అన్యాయం చేసిన టీడీపీ.
సమాధానం: నాలుగు ఎస్సీ నియోజకవర్గాల మధ్యన ఉన్న రాజధానిని విశాఖ నగరానికి తరలిస్తున్నారంటే ఎవరు దళితులకు అన్యాయం చేస్తున్నారో ఆలోచించుకోవాలి.
Ø    ప్రశ్న : పీటర్ కమిషన్ పేరుతో లీకైన నివేదికలో రాజధానిలో రూ.30 వేల కోట్లు దుబారా.
సమాధానం: 28.6.2019న ఏపీసీఆర్డీఏపై జగన్ ప్రభుత్వ శ్వేత పత్రం విడుదల చేసింది. అందులో రూ.9,165.76 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేసినట్ల పేర్కొన్నారు. ఖర్చు చేసిందే రూ.9,165.76 కోట్లు అయితే రూ.30 వేల కోట్లు దుబారా ఎలా అవుతుంది?
Ø    ప్రశ్న: 33 వేల ఎకరాలు తీసుకున్నారన్నారు.
సమాధానం: దేశ చరిత్రలో రాజధాని నిర్మాణానికి తొలిసారిగా ఏపీ ప్రభుత్వం అత్యుత్తమ భూ సమీకరణ విధానంతో ఇంత భూమి సమీకరించిందని నీతి అయోగ్ కొనియాడింది. రైతులకు సమ న్యాయం అందించే ఓ కొత్త విధానం అని పేర్కొంది. ఈ విధానం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో  ఒక కేస్ స్టడీగా మారింది. రాజధాని నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూసమీకరణ పథకం (ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం- ఎల్పీఎస్‌) ఉత్తమమైనదని ఏపీసీఆర్డీయే కమిషనర్‌ గా ఉన్న డాక్టర్‌ పి.లక్ష్మీ నరసింహం ఈ ప్రభుత్వంలో ఇటీవల  పేర్కొన్నారు.
Ø    ప్రశ్న: అమరావతికి రూ.1,09,023 కోట్ల రాష్ట్ర  ప్రభుత్వం వ్యయం చేస్తుందంటారు.
సమాధానం: వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 7 నెలలుగా అమరావతి నుంచే పాలన సాగిస్తోంది. ఒక్క పైసా ఖర్చు కాలేదే!. ఇక్కడ అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవన్‌, డీజీపీ కార్యాలయం అన్నీ ఉన్నాయి. ఉద్యోగులు, జడ్జిల క్వార్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలు 50 నుంచి 70 శాతం పూర్తయ్యాయి. స్వల్ప సొమ్ముతో వీటిని పూరి చేయవచ్చు. ఇవే కాకుండా విజయవాడ, మంగళగిరిలలో ఏపీఐఐసీ వంటి అనేక నూతన భవనాలను నిర్మించారు. అమరావతిలో అన్ని అవసరాలకుపోను ప్రభుత్వానికి మిగిలే 10 వేల ఎకరాలను విక్రయిస్తే లక్ష కోట్లకుపైనే వస్తుంది. ఆ విధంగా అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ప్రాజెక్ట్. 2019 ఫిబ్రవరిలో విడుదలైన జీఓ 50 ప్రకారం అమరావతి నిర్మాణ వ్యయం రూ.55,343 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం 8 ఏళ్ళలో ఖర్చు పెట్టేది కేవలం 6,629 కోట్లు మాత్రమే.
Ø    ప్రశ్న : అమరావతిలో పెద్ద రైతులని ప్రచారం.
 సమాధానం : రాజధానిరైతుల్లో సన్నకారు రైతులే  అత్యధికం. రెండు ఎకరాలు లోపు ఉన్నవారే 86 శాతం మంది ఉన్నారు. భూములు ఇచ్చిన రైతులు 29,881 మంది ఉంటే వారిలో ఎకరం లోపు ఉన్నవారు 20,490 మంది ఉన్నారు.
Ø    ప్రశ్న : అసైన్డ్ భూముల్లో అవకతవకలు.
అసైన్డ్ భూముల్లో ఎక్కడా అవకతవకలు జరగలేదు. ఎస్సీల నుంచి ఎస్సీలకే ఆ భూములు బదిలీ అయ్యాయి. రిటర్న్‌ బుల్‌ ప్లాట్లు పొందిన ఎస్సీ లకు అమ్ముకునే హక్కు ఇచ్చారు. వారు చేసుకున్న అమ్మకం చట్ట బద్ధము. ఇందులో ఎవరినైనా మోసము చేసి కొంటే వారు ఫిర్యాదు చేస్తారు. కొన్న వారిలో తెలుగు దేశం పార్టీ వారు ఉంటే, వారు మోసము చేసారని నిరూపిస్తే చర్యలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...