Jan 5, 2020

అమరావతి ఎల్పీఎస్‌ భేష్‌: సీఆర్డీయే కమిషనర్‌ లక్ష్మీ నరసింహం

v రాజధాని నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూసమీకరణ పథకం (ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం- ఎల్పీఎస్‌) ఉత్తమమైనదని ఏపీసీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ పి.లక్ష్మీ నరసింహం పేర్కొన్నారు.
v  డిసెంబర్ 3, 2019న న్యూఢిల్లీలో స్వచ్ఛంద సంస్థ తెరి’ (ది ఎనర్జీ అండ్‌ రీసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌) ఆధ్వర్యంలో భూసమీకరణపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు.
v అమరావతి కోసం భూములను పూలింగ్‌ ప్రాతిపదికన ఇవ్వాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరినంతనే రాజధానిలోని 29 గ్రామాలకు చెందిన వేలాది మంది రైతులు సుమారు 34,000 ఎకరాలను అందించడం చారిత్రాత్మకం.
v ఇంతటి భారీ ప్రక్రియ, అదీ పూర్తి శాంతియుతంగా జరగడం దేశంలోనే కాదు బహుశా ప్రపంచంలోనే మరెక్కడా జరిగి ఉండకపోవచ్చు.
v రాజధాని గ్రామాల్లోని రైతుల కోసం అమలు పరిచిన ఎల్పీఎస్‌ ప్యాకేజీ వివరాలతోపాటు నిరుపేదలు, ఇతర వర్గాలకు వర్తింపజేసిన సంక్షేమ పథకాలు, భూములిచ్చిన రైతులకు బదులుగా కేటాయించిన రిటర్నబుల్‌ ప్లాట్లను ఎటువంటి ఆరోపణలకు ఆస్కారమివ్వని రీతిలో ఆన్‌లైన్‌ లాటరీ ద్వారా కేటాయించారు.
v దేశంలోని కొన్ని చోట్ల ఎల్పీఎస్‌ అమలు చేసే క్రమంలో తలెత్తిన అవాంఛనీయ సంఘటనలు, ప్రతికూలత వంటివేమీ అమరావతిలో జరగలేదు. ఈ పథకం ఇక్కడ  విజయవంతమైంది.  అన్ని వర్గాల వారిని సంతృప్తి పరచింది.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...