Jul 30, 2023

రాజకీయ సాధికారతతోనే చేనేతల అభ్యున్నతి

వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ఆశయసాధనలో భాగస్వామ్యులుకండి

వ్యవస్థాపక చైర్మన్ అంజన్ కర్నాటి, సభ్యులు రమేష్ మునుకుంట్ల, రాజ్ అడ్డగట్ల 

మంగళగిరిలో విజయవంతమైన వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ వరల్డ్ కాన్ఫరెన్స్-2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేతలు అధికంగా ఉన్న మంగళగిరిలో వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వరల్డ్ కాన్ఫరెన్స్-2023కు ప్రజాప్రతినిధులు, అధికార, అనధికార ప్రముఖులు, వివిధ చేనేత సంఘాల ప్రతినిధులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.  మంగళగిరి బైపాస్ రోడ్డులోని ఆర్.ఆర్. కన్వెన్షన్ లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిర్వహించిన సదస్సులో చేనేతల అభ్యున్నతే ప్రధాన ధ్యేయంగా అందుకు రాజకీయ సాధికారత సాధించాల్సిన ఆవశ్యకతపై నిర్వాహకులు, ముఖ్యఅతిథులు, వివిధ సంఘాల ప్రతినిధుల ప్రసంగాలు స్ఫూర్తిదాయకంగా కొనసాగాయి.

సదస్సులో వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక చైర్మన్ అంజన్ కర్నాటి (అమెరికా), వ్యవస్థాపక సభ్యులు రమేశ్ మునుకుంట్ల (కెనడా), రాజ్ అడ్డగట్ల (చికాగో)లు ఈ సంస్థ ఎందుకు ఏర్పడిందీ.. దాని లక్ష్యాలను సవివరంగా వెల్లడించారు. ‘‘అమెరికాలోని న్యూజెర్సీలో 2021 మే నెలలో ఆవిర్భవించిన వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ కు అంజన్ కర్నాటి (అమెరికా), డాక్టర్ హరనాథ్ పోలిచర్ల (డెట్రాయిట్), రమేశ్ మునుకుంట్ల (కెనడా), రాజ్ అడ్డగట్ల (చికాగో), సారధి కార్యంపూడి (డల్లాస్) వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు. అనుకోని కారణాల వల్ల డాక్టర్ హరనాథ్, సారథి సదస్సుకు హాజరుకాలేదు. వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద వృత్తిగా ఉన్న చేనేత అనేక ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చేనేతలకు అండగా నిలవాలంటే.. చే‘నేత’లందరూ ఐక్యంగా ముందుకు కదలాల్సిన ఆవశ్యకతను గుర్తించి..  చేనేతల్లోని అన్ని సామాజికవర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి చేనేతల అభ్యున్నతికి పాటుపడాలనే ప్రధాన లక్ష్యంతో వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ను నెలకొల్పడం జరిగింది.

 ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో నివసిస్తున్న చేనేత కుటుంబాలను కలుపుకోవడం ప్రధాన లక్ష్యం. చేనేత కుటుంబాలకు ఆసరగా దాతృత్వ కార్యక్రమాలు చేపట్టడం. అందుకు  మన చేనేతలు ఉన్న ప్రాంతాల్లో స్థానిక సామాజిక సంఘాలు ప్రభుత్వ సహకారంతో చేనేతల సాధికారత కోసం కృషిచేయాలి.  ఇక చేనేత కుటుంబాల్లో ప్రతిభావంతులకు కొదవలేదు. మేధో సంపత్తిలో ఇతరులకు ఏమాత్రం తీసిపోరు. అయితే, చేనేత వృత్తుల్లో ఉన్న కుటుంబాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే ఔత్సాహికులకు అవసరమైన సహాయ, సహకారాలు అందించడం. కొత్తగా విదేశాలకు వెళ్లినవారు అక్కడ కుదురుకునేవరకు అవసరమైన సహకారం... ఇమ్మిగ్రేషన్ సూచనలు, సహాయం... ఆరోగ్య సంరక్షణ అవగాహన సెషన్స్/ వెబినార్లు/ శిబిరాలు. వృత్తిపరమైన సహాయం, వ్యాపార అవకాశాలు- పరస్పర సహకారం అందించడం. వివాహ ప్రయోజనాలు కల్పించడం. చేనేతలు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో ఉన్నత స్థితికి ఎదగాలి. అందుకు పరస్పరం సహకరించుకోవాలి. ఎవరు ఏ రంగంలో ఎదుగుతున్నారో.. వారు ఆ రంగంలో మరింత ఉన్నత స్థితికి వెళ్లేందుకు గల అవకాశాలను మెరుగుపరుకునేందుకు కృషి జరగాలి. అన్నింటికి మించి ప్రధానంగా రాజకీయ సాధికారత సాధనకు అందరూ సహకరించుకోవాలి’. ఇవీ  వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ప్రధానలక్ష్యాలు. వీటి సాధన కోసం ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వివిధ చేనేత సంఘాల ప్రతినిధులందరూ వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ఆశయసాధన కోసం సహకరించాలని ఈ సదస్సులో వ్యవస్థాపక చైర్మన్  అంజన్ కర్నాటి, సభ్యులు రమేశ్ మునుకుంట్ల, రాజ్ అడ్డగట్ల విన్నవించారు. 

ఈ సదస్సుకు ముఖ్యఅతిథులుగా కర్నూలు ఎంపీ డాక్టర్ సింగరి సంజీవ్ కుమార్, మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పి.నరహరి, ఎమ్మెల్సీలు ఎల్.రమణ, మురుగుడు హనుమంతరావు, పోతుల సునీత, పంచుమర్తి అనురాధ, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, ఏపీ దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర, ఏపీ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ జింకా విజయలక్ష్మి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీ ఎమ్మెల్సీ బూదాటి రామచంద్రయ్య, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బండారు ఆనందప్రసాద్ లతోపాటు వివిధ రంగాలకు చెందిన చేనేత ప్రముఖులు హాజరయ్యారు. 

ఎంపీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా చేనేతలు రెండు కోట్ల జనాభావున్నారని ముఖ్యంగా తెలుగురాష్ట్రాల నుంచే వీరి మూలాలు వున్నాయని తెలిపారు. నాయకులు ఏ రాజకీయపార్టీకి అనుబంధంగా ఉన్నా చేనేతల సమస్యలపై, చేనేతలకు జరుగుతున్న అన్యాయాలను ఎదురించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మనమందరం ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. చేనేతలు ప్రతిభాశాలురని, చేనేత వృత్తిలోనే కాకుండా అనేకరంగాల్లో నిష్ణాతులున్నారని ఆయన పేర్కొన్నారు. పార్టీలకతీతంగా చేనేతల్లో ఐక్యత సాధించేదిశగా మనలో స్ఫూర్తిరావాలని ఎంపీ సంజీవ్ కుమార్ సూచించారు. 

మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పి.నరహరి మాట్లాడుతూ తాను 2001 బ్యాచ్ ఐఏఎస్ నని, తన సాధారణ కుటుంబ నేపథ్యం గురించి ప్రస్తావించారు. విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, సివిల్స్ , గ్రూపు వన్ ప్రధానపరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆర్థికసహాయం అందించాలని.. 8, 9, 10 తరగతుల్లోనే విద్యార్థులు సివిల్స్ దిశగా లక్ష్యాలను ఏర్పర్చుకోవాలని సూచించారు. ప్రధానం రాజకీయ వ్యవస్థలో మన సామాజిక వర్గాల నుంచి ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం వుందన్నారు. 

తెలంగాణ ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ తనకు రాజకీయంగా దివంగత ఎన్టీరామారావు అవకాశమిస్తే చేనేత బిడ్డ నాయకుడిగా ఉన్నానంటే అందుకు వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ పుణ్యమేనని గుర్తుచేసుకున్నారు. ప్రతి ఒక్కరిలోనూ సర్వీసు చేయాలనే భావన ఉండాలని, రాబోయే కాలంలో మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, అందుకు పరస్పర సహకారం అవసరమని ఎల్.రమణ పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ తెలుగురాష్ట్రాల్లో చేనేతలకు బలమైన నియోజకవర్గాలను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోకూడదని, అందుకు అందరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సు ద్వారా చేనేత పిల్లల్లో కూడా మనం బాగా చదువుకోవాలని.. అటువంటివారికి వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ద్వారా మంచి భవిష్యత్తు ఉంటుందనే విధంగా సంస్థ వ్యవస్థాపకులు కృషిచేయాలని ఆయన సూచించారు.

ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ మనవాళ్లందరికోసం ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటుచేయడం గొప్పవిషయంగా పేర్కొన్నారు. అందుకు ఎన్నారైలు ముందుకు రావడం ముదావహమన్నారు. చేనేతలు అంటే సౌమ్యంగా ఉంటారని, ఎవరి జోలికి వెళ్లరని వారి పని వారుచేసుకుంటారనే పేరుందని చెబుతూ ఇటీవలి ధర్మవరం చేనేత వస్త్రవ్యాపారులపై దారుణ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. బాధితులకు అండగా చేనేతలు ఐక్యంగా ఉండబట్టే కొంతమేరకైనా న్యాయం జరిగిందన్నారు. కాలంమారింది.. సౌమ్యంగా ఉంటే కుదరదు.. న్యాయం కోసం ఫైటింగ్ చేయాలని పిలుపునిచ్చారు.  

ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ మన రాష్ట్రంలో చేనేతలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో మనమే పోటీచేసేవిధంగా చైతన్యం రావాలని, ఆ దిశగా మనల్ని మనం నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగురాష్ట్రాల్లో చేనేతలు రాజకీయ ప్రాధాన్యాన్ని పెంచుకోవాలని సునీత కోరారు.

ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి మాట్లాడుతూ తాము పుట్టిన జాతికోసం సహాయపడాలనే సదుద్దేశంతో ఎన్నారైలు వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటుచేయడం హర్షణీయమన్నారు. చేనేతలు బలహీనులుకాదని, సమాజానికి నాగరికత నేర్పిన జాతి అని గుర్తుచేశారు. చేనేతలు అన్ని రంగాల్లో రాణిస్తూ గతంకన్నాకొంత మెరుగ్గా వున్నారని తెలిపారు. పదవులు శాశ్వతం కాదని చెబుతూ, చేనేత నాయకులను కాపాడుకోవాల్సిన బాధ్యత చేనేతలపై వుందన్నారు. చేనేతలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి వుండాలని, స్వార్థాన్ని పక్కనబెట్టి చేనేత సమాజం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రాల్లో చేనేత జాతి బలమైన నాయకత్వం వహించి సీట్లు సాధించుకోవాలని సూచించారు.

మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ చేనేతలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు గతంలో కూడా కృషిజరిగిందన్నారు. నాయకుల్లో ఎవరు గొప్ప అనే అంశం పక్కనబెట్టి నాయకత్వం కావాలని కోరుకోవాలని సూచించారు. చేనేతల్లో ఉపకులాల ప్రస్తావన తేకుండా ఐకమత్యంతో వుంటే రాజకీయపార్టీలను మనం శాసించవచ్చని నిమ్మల పేర్కొన్నారు. అలాగే మనం గెలవగలిగే సీట్లలో మన నాయకులను ప్రోత్సహించాలని సూచించారు.

మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల మాట్లాడుతూ ఇలాంటి సభలు పెట్టడం చాలా గొప్ప విషయమని అందుకు వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ నిర్వాహక ఎన్నారైలకు అభినందనలు తెలిపారు. మనం రాజకీయంగా ఎదగకపోవడానికి కారణం మనలో ఐక్యత లేకపోవడమేనన్నారు. చేనేతలు అంటే ఒకేకులం.. ఒకేబాటలో నడవాలని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ లక్ష్యం నెరవేరుతుందన్నారు. చేనేత కులాలు ఐక్యంగా వుండి ముందుకు వెళ్లగలిగినప్పుడే ఈ సభల ప్రయోజనం నెరవేరుతుందన్నారు. రాజకీయాల్లో ముందుకువెళుతున్న నాయకులను వెనక్కి లాగే ప్రయత్నాలు మంచి పరిణామం కాదన్నారు. చేనేత ఉపకులాల మధ్య వివాహాలను ప్రోత్సహించాలని సూచిస్తూ.. అలా ముందుకు వెళ్లగలిగినప్పుడు ఉపకులాల మధ్య అంతరాలు, విభేదాలు వైదొలుగుతాయని ఇది తన వ్యక్తిగత అభిప్రాయంగా కమల పేర్కొన్నారు. 

మాజీ ఎమ్మెల్సీ బూదాటి రామచంద్రయ్య మాట్లాడుతూ ఐకమత్యం, ఎడ్యుకేషన్, ఆర్థికాభివృద్ధి, రాజ్యాధికారం వంటి ప్రధాన అంశాలు చేనేతల ఎదుగుదలకు దోహదం చేస్తాయన్నారు. ఏ కులం నీదంటే.. చేనేత కులం అని చెప్పుకునే స్థాయికి చేనేతలు ఎదగాలని సూచించారు. చిన్నచిన్నవిషయాలకే కోపతాపాలకు పోయి సంఘాలు పుట్టుకొస్తున్నాయని ఇది మంచి పరిణామం కాదన్నారు. 

ఏపీ దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర మాట్లాడుతూ చేనేతలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అందుకు వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ను ఒక వేదికగా భావించి చేనేతలందరూ భాగస్వామ్యం వహించాలని సూచించారు.

ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బండారు ఆనందప్రసాద్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా చేనేత నాయకులను ఒక వేదికపైకి తీసుకురావడం గొప్పవిషయమని అందుకు వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. చేనేతలకు  సంబంధించి దీర్ఘకాలికసమస్యలున్నాయని చెబుతూ వాటిని సాధించడం కోసం రాజకీయపార్టీలకతీతంగా చేనేతనాయకులు లాబీయింగ్ చేయాలని సూచించారు.

సదస్సు తీర్మానాలు

ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు చేనేత సామాజిక వర్గాలకు చట్ట సభల్లో తగినన్ని సీట్లు కేటాయించాలని సదస్సు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.

శాసనసభ స్థానాలు : చీరాల, మంగళగిరి, రాజమండ్రి రూరల్, ఎమ్మిగనూరు, వెంకటగిరి, ధర్మవరం, గాజువాక, పిఠాపురం, 

పార్లమెంట్ స్థానాలు :  హిందూపురం, కర్నూలు, రాజమండ్రి కేటాయించాలని సదస్సు తీర్మానించింది.

చేనేత వుత్పత్తులపై, చిలపల నూలుపై జీఎస్టీ పూర్తిగా తొలగించాలని, నేషనల్ హండ్లూమ్ బోర్డ్ తో పాటు కేంద్ర ప్రభుత్వ చేనేత సంస్థల్ని పునరుద్ధరించాలని, 1985 చేనేత రిజర్వేషన్ యాక్ట్ ను పటిష్టం గా అమలు చేయాలని, చేనేత సహకార సంఘాల బకాయిలు వెంటనే చెల్లించి చేనేత పరిశ్రమను ఆదుకోవాలని సదస్సు తీర్మానించింది.

చేనేత సామాజికవర్గాలన్నీ ఒకటవుతున్న వేళ!

నేడు మంగళగిరిలో వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ సదస్సు

రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాలు, సామాజిక వర్గాలు ఏకమవడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. వారు అసంఘటితవర్గాలుగా ఉండటం, ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం వల్ల వారు ఏకం కాలేకపోతున్నారు. కొన్ని వృత్తులకు సంబంధించి సామాజిక వర్గాలకు సమాజంలో మంచి గుర్తింపు ఉన్నా, ఉన్నత చదువులు చదువుకున్నా వారు రాజకీయంగా ఎదగలేకపోతున్నారు.  మనదేశంలో అనేక కులావారు  ఒకే వృత్తిలో ఉంటుంటారు. అటువంటివారిలో ఐక్యతాలోపం వల్ల రాజకీయంగా మంచి స్థానాన్ని పొందలేకపోతున్నారు. అటువంటి వారిలో చేనేత సామాజిక వర్గాల వారు కూడా ఒకరు. తెలుగు రాష్ట్రాలలో, దేశంలో గణనీయంగా ఉన్నా వారికి రాజకీయంగా తగిన స్థానం లభించడంలేదు. అయితే, చేనేత కులాలలో ఉన్నత చదువులు చదివి దేశవిదేశాలలో ఆర్థికంగా స్థిరపడినవారు అనేక మంది ఉన్నారు. శాస్త్రసాంకేతిక రంగాలలో నిష్ణాతులున్నారు. చేనేతకు సంబంధించి  పద్మశాలి, దేవాంగ, జాండ్ర, పట్టుశాలి, సాలి, స్వకులశాలి, కురిమిసెట్టిశాలి,  సేనాపతులు, కైకాల, కర్ణభక్తులు, తొగటశాలీలు, తొగుల వీరక్షత్రియ,  కరికాలభక్తులు, సాధనాసూరులు, అచ్చుకట్లవాళ్ళు, దూదేకుల, కైకాల,  కుర్ని, ఖత్రి,  నీలి, నీలకంఠి, కోష్ఠి, నక్కల, పట్కార్ వంటి దాదాపు 25 కులాల వారు మన దేశంలో ఉన్నారు. వీరి ప్రధాన వృత్తి చేనేత. చేనేత వృత్తిగా ఉన్న వీరిలో కొన్ని కులాల వారికి తగిన గుర్తింపేలేదు.  అందువల్ల రాజకీయంగా, సామాజికంగా తగిన స్థానం సాధించుకోవాలన్న తపనతో   చేనేత వృత్తిగా గల ఈ కులాలవారినందరినీ  కలపడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనేక కుల సంఘాలు ఆ ప్రయత్నాలు చేస్తున్నాయి.   అందులో భాగంగా భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా చేనేత మూలాలున్న ఉన్నత విద్యావంతులు, మేథావులు కలిసి అంతర్జాతీయ చేనేత కార్మిక సంస్థ(వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్)ను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అమెరికాలోని డెట్రాయిట్, డల్లాస్, చికాగో, న్యూజెర్సీ వంటి నగరాలతోపాటుకెనడాలలో ఉండే వారు ఈ సంస్థను స్థాపించారు.  దేశవ్యాప్తంగా ఉన్న, ఎన్ఆర్ఐ చేనేత కులాల వారిని ఒకే వేదికపైకి తీసుకురావడం, ఒక  బలమైన శక్తిగా రూపొందించండి ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. అలాగే, ప్రభుత్వాల సహకారంతో చేనేత కుల సంఘాలను కలుపుకొని ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టడం. చేనేత వర్గాలు  ఆర్థిక, విద్యా, సామాజిక, సాంస్కృతిక తదితర రంగాలలో నిలదొక్కుకోవడానికి సహాయ సహకారాలు అందించడం,  చేనేత వృత్తిపై ఆధారపడిన వారి వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరిచి, వారికి కావలసిన పరికరాలు అందించడం, చేనేత వస్త్రాల మార్కెటింగ్, చేనేత కుటుంబాలకు వైద్యం, విద్య వంటి ముఖ్యమైన విషయాలలో సహకారం, విదేశీ విద్య, ఉపాధి, వ్యాపారం, వివాహాలు వంటి అంశాలలో సహకారం అందించాలన్న ఉత్తమ ఉద్దేశాలతో దీనిని స్థాపించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాల సహకారంతో కూడా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. 

తెలంగాణ ప్రభుత్వం, భారతీయ ట్రస్ట్ సహకారంతో  2022 ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పద్మశాలి భవన్ లో  వంద చేనేత కుటుంబాలకు  ఆసు యంత్రాలను ఈ సంస్థ అందించింది.  ఆంధ్రప్రదేశ్, తమిళనాడులతోపాటు ఇతర రాష్ట్రాలలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలన్న ఉద్దేశంలో ఈ సంస్థ ఉంది.  గత డిసెంబరు 10న తిరుచిరాపల్లిలో వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ తమిళనాడు శాఖను ఏర్పాటు చేశారు. దేశంలోని చేనేత సామాజిక వర్గాల మధ్య సమన్వయం, సహకారం పెంపొందించేందుకు ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసిద్ధ చేనేత కేంద్రం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ సదస్సు-2023ని నిర్వహించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల చేనేత సామాజిక వర్గాలకు చెంది కుల సంఘాల   ప్రముఖ నేతలను, రాజకీయ, అధికార, అనధికార ప్రముఖులతోపాటు విదేశాలలో ఉండేవారిని  కూడా ఆహ్వానించారు. ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పి.నరహరి, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు, ఎల్.రమణ, పంచుమర్తి అనురాధ, పోతుల సునీత,మాజీ ఎంపీలు బుట్టా రేణుక, రాపోలు ఆనందభాస్కర్, నిమ్మల కిష్టప్ప, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, ఎన్ఆర్ఐలు అంజన్ కర్నాటి, రమేష్ మునుకుట్ల, రాజ్ అడ్డగట్ల, సారథి కార్యంపూడి  వంటివారు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. చేనేత కులాల మధ్య ఐక్యత, అన్ని అంశాలలో పరస్పర సహకారం, రాజకీయంగా ఒక బలమైన శక్తిగా ఎదగడం వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. చేనేత కార్మికులకు అన్నివిధాల సహాయపడటంతో వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో  చేనేత వర్గాలకు అధిక సీట్లు సాధించుకోవాలన్నది ఈ సదస్సు ముఖ్య లక్ష్యం.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Jul 13, 2023

చేనేత కార్మికుల సంఖ్య తెలియని ప్రభుత్వాలు

ఎన్నికల సమయంలో గుర్తుకు వచ్చే నేతన్నలు

తూతూ మంత్రంగా పథకాలు
చాలీ చాలని నిధుల కేటాయింపుతో మమ అనిపించేస్తారు

దేశంలో చేనేత రంగం తర్వాత అత్యంత ప్రాధాన్యం కలిగి, అత్యధిక మందికి ఉపాధి కల్పించేది చేనేత రంగం. స్వాతంత్య్రోద్యమంలో కూడా ఈ రంగం కీలకపాత్ర పోషించింది. భారతీయ చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. చేనేత అనేది ఎంతో కళాత్మకమైనది, మనదేశ ఆర్థిక వ్యవస్థ బలపడటంలో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే, ప్రభుత్వాలు మాత్రం ఈ రంగం అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇవ్వడంలేదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేంద్రంలో, రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు మారాయి. కానీ, దేశంలో, రాష్ట్రంలో ఎన్ని చేనేత మగ్గాలు ఉన్నాయో, ఎంతమంది చేనేత కళాకారులు లేక కార్మికులు ఉన్నారో లెక్కలు తేల్చలేకపోయాయి. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే అన్ని రాజకీయ పార్టీలకు చేనేత వర్గాలు గుర్తుకు వస్తాయి. ఆ సమయంలో ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తాయి. అవి చేస్తాం, ఇవి చేస్తాం అని హామీలపై హామీలు ఇస్తారు.   అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం చిత్తశుద్ధిని ప్రదర్శించవు. తూతూ మంత్రంగా ఆకర్షణీయమైన పథకాలు ప్రవేశపెట్టి చేతులు దులుపుకుంటాయి.

ఆంధ్రప్రదేశ్ లో చేనేత మగ్గం నేసే కార్మికులు దాదాపు 3 లక్షల మంది వరకు ఉన్నారు. దేశంలో అత్యధిక మంది చేనేత రంగంపై జీవిస్తున్నవారు ఏపీలోనే ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఆంధ్రప్రదేశ్ లో చేనేత సహకార సంఘ సభ్యులు 2,00,310 మంది ఉన్నారు. సహకార సంఘాలలోలేని కార్మికులు 1,58,902 మంది ఉన్నారు. అంటే మొత్తం దాదాపు 3.60 లక్షల మంది ఉన్నారు. ఇందులో ఓ లక్ష మంది చిలపలు ఎలిచేవాళ్లు, కండెలు చుట్టేవాళ్లు, అచ్చులు అతికేవాళ్లు ఉన్నా,  2.60 లక్షల మంది చేనేత కార్మికులు ఉంటారు.  వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద  81,700 మంది మాత్రమే  లబ్ధి పొందుతున్నారు. అంటే ఇంకా 1,78,300 కార్మికులకు ఈ పథకం అందడంలేదు.  ఈ పథకం వర్తించడానికి రూపొందించిన నిబంధనలు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. సొంత ఇల్లు లేక అద్దెకు ఉండే ఇంట్లో మగ్గం ఉన్న కార్మికులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఇల్లు లేక మగ్గం పట్టేంత ఇంటికి అద్దె చెల్లించలేక మగ్గాల షెడ్లలో నేత నేసే నిజమైన చేనేత కార్మికులకు మాత్రం ఈ పథకం వర్తించడంలేదు.వారు ఈ పథకం కింద లబ్ధి పొందలేకపోతున్నారు. ప్రభుత్వం దృష్టిలో వారు చేనేత కార్మికులు కారు. చేనేత కార్మికులను శాస్త్రీయంగా గుర్తించే విధానాన్ని ఏ ప్రభుత్వం(అది ఏ పార్టీ అయినా) అనుసరించలేదు. ఆ ఆలోచన కూడా ఏ ప్రభుత్వం చేయలేదు.  ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలకు చేనేత కార్మికులు, చేనేత కులాలు గుర్తుకు వస్తాయి.గెలిచిన తర్వాత పేరుకి మాత్రమే ఏదో ఒక పథకం ప్రవేశపెట్టి మమ అనిపిస్తారు.ఇన్ని కోట్లు ఇచ్చాం, అన్ని కోట్లు ఇచ్చాం అని లెక్కలు చెప్పేస్తారు. నిజంగా నేత నేసే కార్మికులకు ఆ పథకం అందినా అందకపోయినా పట్టించుకోరు. రాజకీయ పార్టీలకు గాని, ప్రభుత్వాలకు గాని చిత్తశుద్ధి ఉంటే ఒక్క నెల రోజుల స్పెషల్ డ్రైవ్ ద్వారా చేనేత కార్మికులను శాస్త్రీయంగా లెక్కించవచ్చు. చేనేత, సహకార వంటి సంబంధిత శాఖల అధికారులు మండలాల వారీగా ప్రతి చేనేత కార్మికుని ఇంటికి, ప్రతి సొసైటీకి, ప్రతి చేనేత షెడ్డు వద్దకు వెళ్లి మగ్గాలను ప్రత్యక్షంగా పరిశీలించి, ఆ మగ్గాలను నేసే స్త్రీ, పురుష కార్మికులను గుర్తించాలి. అలాగే, పడుగుల సాగుల వద్దకు, ఆసుల వద్దకు వెళ్లి అక్కడ పని చేసే కార్మికులను గుర్తించాలి. చేనేత కార్మికులుగా వారికి అధికారికంగా ప్రభుత్వం  గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఆ కార్డుల ద్వారా వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పొందే అవకాశం కల్పించాలి. ఈ విధంగా లెక్క తేల్చి, వారికి గుర్తింపు కార్డులు ఇచ్చిన నాడే వారికి న్యాయం చేసినవారవుతారు. ఏ ప్రభుత్వం అయినా ఈ పద్దతిని పక్కాగా అనుసరించవలసిన అవసరం ఉంది. గతంలో కేంద్ర ప్రభుత్వం కార్వే సంస్థ ద్వారా సర్వే చేయించి కొంతమందికి కార్డులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా హాండ్ లూమ్ శాఖ ద్వారా గుర్తింపు కార్డులు ఇచ్చింది. కానీ, ఇప్పుడు వారికి పథకాలు వర్తించడంలేదు. అంటే, ప్రభుత్వం కార్డులు ఇచ్చినా ప్రయోజనంలేకుండాపోయింది. ఇక పథకాల విషయానికి వస్తే ప్రభుత్వం మారినప్పడల్లా వారి పేర్లతో పథకాలు ప్రవేశపెడతారు. పాత పథకాలు రద్దు చేస్తారు. వారికి ఏ పథకాలు ఉపయోగపడతాయో ఆలోచన చేయరు. పాఠశాలల పిల్లలకు చేనేత వస్త్రాలతో తయారు చేసిన యూనిఫాం ఇవ్వవలసిన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడంలేదు.

కేంద్ర ప్రభుత్వం 2014 తర్వాత నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డ్,హోం ఫర్ వర్క్ షెడ్, మార్కెటింగ్ ఇన్సెంటివ్, చేనేత కార్మికులకు ఎంతో ప్రయోజనకరమైన మహాత్మాగాంధీ బంకర్ బీమా  వంటి  పథకాలను రద్దు చేసింది. దేశంలో  నూలు ఉత్పత్తి చేసే స్పిన్నింగ్ మిల్లులు 40 శాతం చిలపనూలును  గతంలో చేనేత అవసరాల కోసం సరఫరాచేసేవారు. ఇప్పుడు దాన్ని 15 శాతానికి తగ్గించారు. దీంతో నూలు ధరలు పెరిగాయి. ముడి సరుకు అందుబాటులో లేకపోవడంతో చేనేత వృత్తికి తీరని అన్యాయం జరుగుతోంది. లక్షాలాది మంది జీవిస్తున్న చేతి వృత్తి ద్వారా తయారయ్యే చేనేత వస్త్రాలపై   కేంద్రం 5 శాతం  జీఎస్‌టీ విధించడం అత్యంత దారుణం. అంతే కాకుండా, చేనేతకు ఉపయోగించే నూలుకు వేసే రంగులు, రసాయనాలపై 18 శాతం జీఎస్టీ విధించారు. చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని, రద్దు చేసిన చేనేతకు సంబంధించిన పథకాలను పునరుద్దరించాలని, చేనేత వృత్తి చేస్తూ 80 సంవత్సరాలుపైబడి మరణించిన చేనేత కార్మికుల కుటుంబాలకు కేంద్రం మత్స్యకారులకు ఇచ్చే విధంగానే ఐదు లక్షల రూపాయల బీమా వర్తింపచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.చేనేతను జౌళి రంగం నుంచి విడగొట్టాలని, చేనేతకు బడ్జెట్ లో ఏటా కేంద్రం రూ.5వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.2వేల కోట్లు కేటాయించాలని, స్పిన్నింగ్ మిల్లులు చేనేతకు ఉపయోగించే నూలుని 50 శాతం ఉత్పత్తి చేయాలని, 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వాలని వారు కోరుతున్నారు.  చేనేత సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి, వాటి పరిష్కారం కోసం సెప్టెంబర్ నెలలో చీరాలలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించాలని చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ నిర్ణయించింది.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Jul 11, 2023

భారతదేశ పాలకులు

 బానిస రాజవంశం

 1 = 1193 ముహమ్మద్ ఘోరి

 2 = 1206 కుతుబుద్దీన్ ఐబాక్

 3 = 1210 అరామ్ షా

 4 = 1211 ఇల్టుట్మిష్

 5 = 1236 రుక్నుద్దీన్ ఫిరోజ్ షా

 6 = 1236 రజియా సుల్తాన్

 7 = 1240 ముయిజుద్దీన్ బహ్రమ్ షా

 8 = 1242 అల్లావుద్దీన్ మసూద్ షా

 9 = 1246 నాసిరుద్దీన్ మెహమూద్

 10 = 1266 గియాసుడిన్ బల్బన్

 11 = 1286 కై ఖుష్రో

 12 = 1287 ముయిజుద్దీన్ కైకుబాద్

 13 = 1290 షాముద్దీన్ కామర్స్

 1290 బానిస రాజవంశం ముగుస్తుంది

 (ప్రభుత్వ కాలం - సుమారు 97 సం.)

 ఖిల్జీ రాజవంశం

 1 = 1290 జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ

 2 = 1296 అల్లాదీన్ ఖిల్జీ

 4 = 1316 సహబుద్దీన్ ఒమర్ షా

 5 = 1316 కుతుబుద్దీన్ ముబారక్ షా

 6 = 1320 నాసిరుదిన్ ఖుస్రో షా

 7 = 1320 ఖిల్జీ రాజవంశం ముగిసింది

 (ప్రభుత్వ కాలం - సుమారు 30 సం.)

 తుగ్లక్ రాజవంశం

 1 = 1320 గయాసుద్దీన్ తుగ్లక్ I.

 2 = 1325 ముహమ్మద్ బిన్ తుగ్లక్ రెండవ

 3 = 1351 ఫిరోజ్ షా తుగ్లక్

 4 = 1388 గయాసుద్దీన్ తుగ్లక్ రెండవ

 5 = 1389 అబూబకర్ షా

 6 = 1389 ముహమ్మద్ తుగ్లక్ మూడవ

 7 = 1394 సికందర్ షా మొదటి

 8 = 1394 నాసిరుదిన్ షా దుస్రా

 9 = 1395 నస్రత్ షా

 10 = 1399 నాసిరుద్దీన్ మహమ్మద్ షా వెంటాడే రెండవ స్థానంలో ఉన్నారు

 11 = 1413 డోలత్ షా

 1414 తుగ్లక్ రాజవంశం ముగుస్తుంది

 (ప్రభుత్వ కాలం - సుమారు 94 సం.)

 సయ్యిద్ రాజవంశం

 1 = 1414 ఖిజ్ర్ ఖాన్

 2 = 1421 ముయిజుద్దీన్ ముబారక్ షా రెండవ

 3 = 1434 ముహమ్మద్ షా నాల్గవ

 4 = 1445 అల్లావుద్దీన్ ఆలం షా

 1451 సయీద్ రాజవంశం ముగుస్తుంది

 (ప్రభుత్వ కాలం - సుమారు 37 సం.)

 అలోడి రాజవంశం

 1 = 1451 బహ్లోల్ లోడి

 2 = 1489 అలెగ్జాండర్ లోడి రెండవది

 3 = 1517 ఇబ్రహీం లోడి

 1526 లోడి రాజవంశం ముగుస్తుంది

 (ప్రభుత్వ కాలం - సుమారు 75 సం.)

 మొఘల్ రాజవంశం

 1 = 1526 జహ్రుదిన్ బాబర్

 2 = 1530 హుమయూన్

 1539 మొఘల్ రాజవంశం సమయం ముగిసింది

 సూరి రాజవంశం

 1 = 1539 షేర్ షా సూరి

 2 = 1545 ఇస్లాం షా సూరి

 3 = 1552 మహమూద్ షా సూరి

 4 = 1553 ఇబ్రహీం సూరి

 5 = 1554 ఫిరుజ్ షా సూరి

 6 = 1554 ముబారక్ ఖాన్ సూరి

 7 = 1555 అలెగ్జాండర్ సూరి

 సూరి రాజవంశం ముగుస్తుంది, (పాలన -16 సంవత్సరాలు సుమారు)

 మొఘల్ రాజవంశం పున ప్రారంభించబడింది

 1 = 1555 హుమాయున్ మళ్ళీ సింహాసనం పైన 

 2 = 1556 జలాలుద్దీన్ అక్బర్

 3 = 1605 జహంగీర్ సలీం

 4 = 1628 షాజహాన్

 5 = 1659 u రంగజేబు

 6 = 1707 షా ఆలం మొదట

 7 = 1712 జహదర్ షా

 8 = 1713 ఫరూఖ్సియార్

 9 = 1719 రైఫుడు రజత్

 10 = 1719 రైఫుడ్ దౌలా

 11 = 1719 నెకుషియార్

 12 = 1719 మహమూద్ షా

 13 = 1748 అహ్మద్ షా

 14 = 1754 అలమ్‌గీర్

 15 = 1759 షా ఆలం

 16 = 1806 అక్బర్ షా

 17 = 1837 బహదూర్ షా జాఫర్

 1857 మొఘల్ రాజవంశం ముగుస్తుంది

 (ప్రభుత్వ కాలం - సుమారు 315 సంవత్సరాలు.)

 బ్రిటిష్ రాజ్ (వైస్రాయ్)

 1 = 1858 లార్డ్ క్యానింగ్

 2 = 1862 లార్డ్ జేమ్స్ బ్రూస్ ఎల్గిన్

 3 = 1864 లార్డ్ జాహోన్ లోరెన్ష్

 4 = 1869 లార్డ్ రిచర్డ్ మాయో

 5 = 1872 లార్డ్ నార్త్‌బుక్

 6 = 1876 లార్డ్ ఎడ్వర్డ్ లాటెన్లార్డ్

 7 = 1880 లార్డ్ జార్జ్ రిపోన్

 8 = 1884 లార్డ్ డఫెరిన్

 9 = 1888 లార్డ్ హన్నీ లాన్స్‌డన్

 10 = 1894 లార్డ్ విక్టర్ బ్రూస్ ఎల్గిన్

 11 = 1899 లార్డ్ జార్జ్ కర్జన్

 12 = 1905 లార్డ్ టివి గిల్బర్ట్ మింటో

 13 = 1910 లార్డ్ చార్లెస్ హార్డింగ్

 14 = 1916 లార్డ్ ఫ్రెడరిక్ సెల్మ్స్ఫోర్డ్

 15 = 1921 లార్డ్ రూక్స్ ఐజాక్ రైడింగ్

 16 = 1926 లార్డ్ ఎడ్వర్డ్ ఇర్విన్

 17 = 1931 లార్డ్ ఫ్రీమాన్ వెల్లింగ్డన్

 18 = 1936 లార్డ్ అలెగ్జాండర్ లిన్లిత్గో

 19 = 1943 లార్డ్ ఆర్కిబాల్డ్ వేవెల్

 20 = 1947 లార్డ్ మౌంట్ బాటన్

బ్రిటిషర్స్ పాలన సుమారు 90 సంవత్సరాలు.

 స్వంత్రభారతదేశ ప్రధానులు

 1 = 1947 జవహర్‌లాల్ నెహ్రూ

 2 = 1964 గుల్జారిలాల్ నందా

 3 = 1964 లాల్ బహదూర్ శాస్త్రి

 4 = 1966 గుల్జారిలాల్ నందా

 5 = 1966 ఇందిరా గాంధీ

 6 = 1977 మొరార్జీ దేశాయ్

 7 = 1979 చరణ్ సింగ్

 8 = 1980 ఇందిరా గాంధీ

 9 = 1984 రాజీవ్ గాంధీ

 10 = 1989 విశ్వనాథ్ ప్రతాప్సింగ్

 11 = 1990 చంద్రశేఖర్

 12 = 1991 పివి నరసింహారావు

 13 = అటల్ బిహారీ వాజ్‌పేయి

 14 = 1996 H.D. దేవేగౌడ

 15 = 1997 ఐకె గుజ్రాల్

 16 = 1998 అటల్ బిహారీ వాజ్‌పేయి

 17 = 2004 డాక్టర్ మన్మోహన్ సింగ్

18 = 2014 నుండి నరేంద్ర మోడీ

764 సంవత్సరాల తరువాత, పరదేశీ, బ్రిటిష్ వారి బానిసత్వం నుండి స్వేచ్ఛ పొందాం.

18 రకాల క్యాన్సర్లు : రోగి రాకపోయినా మందు

N.S.NARAYANA MURTHY CANCER TREATMENT CENTER

NARSIPURA, GOUTAM PURA POST, SAGAR ROAD, SHIMOGA ,KARNATAKA, PHONE NO: 08183-258033

7411398335        https://www.vaidhyanarayanamurthy.com/

క్యాన్సర్ కు మందు ఇచ్చే  N.S.నారాయణ మూర్తి హిందీ, కన్నడ, భాషలలో మాట్లాడుతారు. తెలుగు మాట్లాడితే అర్ధం చేసుకోగలరు. రిపోర్ట్స్ లేకపోయినా పేషంట్ ను చూసి మందు ఇస్తారు. స్కానింగ్ రిపోర్ట్స్ వుంటే మంచిది. ఒక్క క్యాన్సర్ కే కాకుండా చాలా రోగాలకు మందును ఇస్తారు. మందు వాడే విధానము కరపత్రము రూపములో ఇస్తారు. 

అపాయింట్మెంట్ అనేది లేదు, Q లో ఎవరు ముందుగా వుంటే వారికి మందు ఇవ్వటం జరుగుతుంది. చాలా సీరియస్ స్థితిలో వున్న పేషంట్ కు ప్రత్యేకముగా Q ను ఆపి చూసి మందు ఇచ్చి పంపుతారు.  18 రకాల క్యాన్సర్లకు మందు ఇస్తారు, ఎటువంటి స్టేజి లో వున్నా వారు చూసి నిర్దారణ చేసి మందు ఇస్తారు. పేషంట్ పోవాల్సిన అవసరంలేదు. రిపోర్ట్స్ తీసుకొని పేషంట్ స్థితి తెలిసినవారు ఒక్కరు పోతే చాలు. పేషంట్ వెళ్ళగలిగే స్థితిలో ఉంటే అభ్యంతరం లేదు, 

ఇతర దేశాల నుండి కూడా చాలా మంది వస్తున్నారు. గురువారం, ఆదివారం  రెండురోజులు మాత్రమే ఉదయము 8:00 గం ల నుండి అందరిని చూసి మందులు ఇచ్చిగాని  వెళ్లరు. అర్దరాత్రి అయిన సరే.

గురువారం మందు పొందాలి అంటే బుధవారము పొద్దుటి నుండే Q మొదలవుతుంది. ఆదివారం మందు పొందాలి అంటే శనివారం పొద్దుటి నుండే Q మొదలవుతుంది. కోటీశ్వరుడు అయినా పేదవాడు అయినా అందరూ అక్కడ సమానమే. షిమోగలో లాడ్జింగ్,హోటల్స్, ట్యాక్సీ, సౌకర్యం వుంది. షిమోగా నుండి నర్సిపుర కు 60 Km డైరెక్ట్ హాస్పిటల్ కు ప్రేవేట్ బస్స్ సౌకర్యం వుంది.

Jul 10, 2023

‘వెనక్కితిరిగి చూడకు’ పోస్టర్ విడుదల

గుంటూరు : హ‌ర్ర‌ర్‌, థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ‘వెనక్కితిరిగి చూడకు’ సినిమా పోస్టర్ ని గుంటూరులోని బృందావ‌న్ గార్డెన్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం సాయంత్రం  విడుదల చేశారు. స‌ముద్ర తీరప్రాంతంలో జ‌రిగే హ‌ర్ర‌ర్ బ్యాక్ డ్రాప్ లో క‌థ జ‌రుగుతుంద‌ని డైరెక్ట‌ర్ గోడి శివ‌ప్ర‌సాద్ చెప్పారు. ప్ర‌తి స‌న్నివేశం ఉత్కంఠ భ‌రితంగా ఉంటుంద‌ని,ప్రేక్ష‌కుల్ని థ్రిల్లింగ్ కు గురిచేస్తుంద‌న్నారు. 90 శాతం ఔట్ డోర్ లోనే ఘూటింగ్ చేశామ‌ని చిత్ర నిర్మాత తిరుమ‌లేశ్వర్రావు చెప్పారు. చీరాల‌, గుంటూరు, విజ‌య‌వాడ‌లోని అంద‌మైన లోకేష‌న్స్ లో షూటింగ్ జ‌రిగింద‌న్నారు. చీరాల పొట్టి స‌బ్బుయ్య‌పాలెంలోని దట్టమైన అట‌వీ ప్రాంతాల్లో షూటింగ్ చేసినట్లు తెలిపారు. అక్క‌డ షూట్ చేస్తున్నంత‌సేపు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింద‌న్నారు. ఈ విష‌యంలో యాక్ట‌ర్స్ కు, కెమేరా టీమ్ కు ప్ర‌త్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. వాడ‌రేవు ద‌గ్గ‌ర స‌ముద్రంలో కాలువ క‌లిసే ప్రాంతంలో అమావాస్య రోజు షూటింగ్ చేశామ‌న్నారు. తాము ప‌డ్డ క‌ష్ట‌మంతా ప్ర‌తి ఫ్రేమ్ లో క‌నిపిస్తుంద‌ని, ప్రేక్ష‌కుల‌ను పూర్తిగా అల‌రిస్తుంద‌నే ధీమా వ్య‌క్తం చేశారు. 

ఈ మూవీలో రెండు పాట‌లు ఉంటాయ‌న్నారు. ఇంట‌ర్వేల్ బ్లాక్‌, క్లైమాక్స్ సినిమాకు బిగ్ అస్సెట్ అన్నారు. చీరాల బీచ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో చిత్రీకరించిన  ఈ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంద‌ని చిత్ర యూనిట్ వెల్ల‌డించింది. ఆగ‌స్టు చివ‌ర్లో గానీ, సెప్టెంబ‌ర్  లో గానీ ఈ మూవీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ‘వెనక్కితిరిగి చూడకు’ పోస్టర్ ని విడుదల చేసినవారిలో రామరాజు ఫౌండేషన్ అధ్యక్షులు రామరాజు, ప్రముఖ రచయిత కావూరి సత్యనారాయణ, సీనియర్ నటులు నడింపల్లి వెంకటేశ్వరరావు, నిర్మాత డి.తిరుమలేశ్వరరావు, దర్శకుడు శివప్రసాద్, హీరో పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. 

Jul 6, 2023

చేనేత కార్మికుల సంఖ్య తెలియని ప్రభుత్వాలు

ఎన్నికల సమయంలో గుర్తుకు వచ్చే నేతన్నలు

తూతూ మంత్రంగా పథకాలు

చాలీ చాలని నిధుల కేటాయింపుతో మమ అనిపించేస్తారు

దేశంలో చేనేత రంగం తర్వాత అత్యంత ప్రాధాన్యం కలిగి, అత్యధిక మందికి ఉపాధి కల్పించేది చేనేత రంగం. స్వాతంత్య్రోద్యమంలో కూడా ఈ రంగం కీలకపాత్ర పోషించింది. భారతీయ చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. చేనేత అనేది ఎంతో కళాత్మకమైనది, మనదేశ ఆర్థిక వ్యవస్థ బలపడటంలో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే, ప్రభుత్వాలు మాత్రం ఈ రంగం అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇవ్వడంలేదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేంద్రంలో, రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు మారాయి. కానీ, దేశంలో, రాష్ట్రంలో ఎన్ని చేనేత మగ్గాలు ఉన్నాయో, ఎంతమంది చేనేత కళాకారులు లేక కార్మికులు ఉన్నారో లెక్కలు తేల్చలేకపోయాయి. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే అన్ని రాజకీయ పార్టీలకు చేనేత వర్గాలు గుర్తుకు వస్తాయి. ఆ సమయంలో ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తాయి. అవి చేస్తాం, ఇవి చేస్తాం అని హామీలపై హామీలు ఇస్తారు.   అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం చిత్తశుద్ధిని ప్రదర్శించవు. తూతూ మంత్రంగా ఆకర్షణీయమైన పథకాలు ప్రవేశపెట్టి చేతులు దులుపుకుంటాయి. 

ఆంధ్రప్రదేశ్ లో చేనేత మగ్గం నేసే కార్మికులు దాదాపు 3 లక్షల మంది వరకు ఉన్నారు. దేశంలో అత్యధిక మంది చేనేత రంగంపై జీవిస్తున్నవారు ఏపీలోనే ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఆంధ్రప్రదేశ్ లో చేనేత సహకార సంఘ సభ్యులు 2,00,310 మంది ఉన్నారు. సహకార సంఘాలలోలేని కార్మికులు 1,58,902 మంది ఉన్నారు. అంటే మొత్తం దాదాపు 3.60 లక్షల మంది ఉన్నారు. ఇందులో ఓ లక్ష మంది చిలపలు ఎలిచేవాళ్లు, కండెలు చుట్టేవాళ్లు, అచ్చులు అతికేవాళ్లు ఉన్నా,  2.60 లక్షల మంది చేనేత కార్మికులు ఉంటారు.  వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద  81,700 మంది మాత్రమే  లబ్ధి పొందుతున్నారు. అంటే ఇంకా 1,78,300 కార్మికులకు ఈ పథకం అందడంలేదు.  ఈ పథకం వర్తించడానికి రూపొందించిన నిబంధనలు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. సొంత ఇల్లు లేక అద్దెకు ఉండే ఇంట్లో మగ్గం ఉన్న కార్మికులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఇల్లు లేక మగ్గం పట్టేంత ఇంటికి అద్దె చెల్లించలేక మగ్గాల షెడ్లలో నేత నేసే నిజమైన చేనేత కార్మికులకు మాత్రం ఈ పథకం వర్తించడంలేదు.వారు ఈ పథకం కింద లబ్ధి పొందలేకపోతున్నారు. ప్రభుత్వం దృష్టిలో వారు చేనేత కార్మికులు కారు. చేనేత కార్మికులను శాస్త్రీయంగా గుర్తించే విధానాన్ని ఏ ప్రభుత్వం(అది ఏ పార్టీ అయినా) అనుసరించలేదు. ఆ ఆలోచన కూడా ఏ ప్రభుత్వం చేయలేదు.  ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలకు చేనేత కార్మికులు, చేనేత కులాలు గుర్తుకు వస్తాయి.గెలిచిన తర్వాత పేరుకి మాత్రమే ఏదో ఒక పథకం ప్రవేశపెట్టి మమ అనిపిస్తారు.ఇన్ని కోట్లు ఇచ్చాం, అన్ని కోట్లు ఇచ్చాం అని లెక్కలు చెప్పేస్తారు. నిజంగా నేత నేసే కార్మికులకు ఆ పథకం అందినా అందకపోయినా పట్టించుకోరు. రాజకీయ పార్టీలకు గాని, ప్రభుత్వాలకు గాని చిత్తశుద్ధి ఉంటే ఒక్క నెల రోజుల స్పెషల్ డ్రైవ్ ద్వారా చేనేత కార్మికులను శాస్త్రీయంగా లెక్కించవచ్చు. చేనేత, సహకార వంటి సంబంధిత శాఖల అధికారులు మండలాల వారీగా ప్రతి చేనేత కార్మికుని ఇంటికి, ప్రతి సొసైటీకి, ప్రతి చేనేత షెడ్డు వద్దకు వెళ్లి మగ్గాలను ప్రత్యక్షంగా పరిశీలించి, ఆ మగ్గాలను నేసే స్త్రీ, పురుష కార్మికులను గుర్తించాలి. అలాగే, పడుగుల సాగుల వద్దకు, ఆసుల వద్దకు వెళ్లి అక్కడ పని చేసే కార్మికులను గుర్తించాలి. చేనేత కార్మికులుగా వారికి అధికారికంగా ప్రభుత్వం  గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఆ కార్డుల ద్వారా వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పొందే అవకాశం కల్పించాలి. ఈ విధంగా లెక్క తేల్చి, వారికి గుర్తింపు కార్డులు ఇచ్చిన నాడే వారికి న్యాయం చేసినవారవుతారు. ఏ ప్రభుత్వం అయినా ఈ పద్దతిని పక్కాగా అనుసరించవలసిన అవసరం ఉంది. గతంలో కేంద్ర ప్రభుత్వం కార్వే సంస్థ ద్వారా సర్వే చేయించి కొంతమందికి కార్డులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా హాండ్ లూమ్ శాఖ ద్వారా గుర్తింపు కార్డులు ఇచ్చింది. కానీ, ఇప్పుడు వారికి పథకాలు వర్తించడంలేదు. అంటే, ప్రభుత్వం కార్డులు ఇచ్చినా ప్రయోజనంలేకుండాపోయింది. ఇక పథకాల విషయానికి వస్తే ప్రభుత్వం మారినప్పడల్లా వారి పేర్లతో పథకాలు ప్రవేశపెడతారు. పాత పథకాలు రద్దు చేస్తారు. వారికి ఏ పథకాలు ఉపయోగపడతాయో ఆలోచన చేయరు. పాఠశాలల పిల్లలకు చేనేత వస్త్రాలతో తయారు చేసిన యూనిఫాం ఇవ్వవలసిన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడంలేదు.

కేంద్ర ప్రభుత్వం 2014 తర్వాత నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డ్,హోం ఫర్ వర్క్ షెడ్, మార్కెటింగ్ ఇన్సెంటివ్, చేనేత కార్మికులకు ఎంతో ప్రయోజనకరమైన మహాత్మాగాంధీ బంకర్ బీమా  వంటి  పథకాలను రద్దు చేసింది. దేశంలో  నూలు ఉత్పత్తి చేసే స్పిన్నింగ్ మిల్లులు 40 శాతం చిలపనూలును  గతంలో చేనేత అవసరాల కోసం సరఫరాచేసేవారు. ఇప్పుడు దాన్ని 15 శాతానికి తగ్గించారు. దీంతో నూలు ధరలు పెరిగాయి. ముడి సరుకు అందుబాటులో లేకపోవడంతో చేనేత వృత్తికి తీరని అన్యాయం జరుగుతోంది. లక్షాలాది మంది జీవిస్తున్న చేతి వృత్తి ద్వారా తయారయ్యే చేనేత వస్త్రాలపై   కేంద్రం 5 శాతం  జీఎస్‌టీ విధించడం అత్యంత దారుణం. అంతే కాకుండా, చేనేతకు ఉపయోగించే నూలుకు వేసే రంగులు, రసాయనాలపై 18 శాతం జీఎస్టీ విధించారు. చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని, రద్దు చేసిన చేనేతకు సంబంధించిన పథకాలను పునరుద్దరించాలని, చేనేత వృత్తి చేస్తూ 80 సంవత్సరాలుపైబడి మరణించిన చేనేత కార్మికుల కుటుంబాలకు కేంద్రం మత్స్యకారులకు ఇచ్చే విధంగానే ఐదు లక్షల రూపాయల బీమా వర్తింపచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.చేనేతను జౌళి రంగం నుంచి విడగొట్టాలని, చేనేతకు బడ్జెట్ లో ఏటా కేంద్రం రూ.5వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.2వేల కోట్లు కేటాయించాలని, స్పిన్నింగ్ మిల్లులు చేనేతకు ఉపయోగించే నూలుని 50 శాతం ఉత్పత్తి చేయాలని, 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వాలని వారు కోరుతున్నారు.  చేనేత సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి, వాటి పరిష్కారం కోసం సెప్టెంబర్ నెలలో చీరాలలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించాలని చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ నిర్ణయించింది. 

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Jul 1, 2023

Resume

Resume

SIRAMDASU  NAGARJUNA   RAO

Flat No:203, Satyasai Nilayam, 

 Ippatam Road, 

Besides Vijayadurga Chamundeswari Temple, 

Atmakuru,  MANGALAGIRI-522302
Andhra Pradesh
, Contact: 9440222914/9346619396
pronagarjuna@gmail.com 

EXPERIENCE IN JOURNALISM : 33 Years   

        ----------------------------------------------------------------------------------------------------------------------

  • Hardworking professional with experience in Special Stories writing, Reporting, Editing, Translation, Photoshop, Training Reporters, Internet Desk Handling etc.
  • Three Years experience as Developmental Stories Writer (Outsourcing Journalist) in I&PR, AP
  • 250  development stories published from January 2017  in various Telugu dailies and magazines  like  Andhrajyothy, Andhraprabha, Andhrapatrika, Andhrabhoomi, Vaartha, Surya, Visalandhra, Hamsa and Teluguvidyathi, Pragati, Andhrapradesh Magazines.
  • Eight  years experience as Internet Desk and Amaravati Desk in-charge (News editor) in Sakshi Telugu Daily.

§  One and half years experience as Chief Content Editor in The New Indian Express Group.

§  More than 11 years experience as Edition in charge in Vaartha Telugu daily.

§  5 years experience as citydesk in-charge & 2 years in Central Desk in Andhra Jyothy Telugu daily.

§  Two years experience as Sub-Editor in Andhra Bhoomi Telugu daily

§  One year experience as Reporter in Udayam Telugu daily.

WORK HISTORY

Organisation

Position Held

Period

Andhrajyothy

Chief Sub-Editor

From 28.02. 2020 to 11.07.2022

I&PR, AP

PRO

June 2016 to 24.06.2019

Sakshi Group

Chief Sub-Editor & News Editor

2008-2015

The New Indian Express Group

Chief Content Editor (Chennai)

2006-2008

VAARTHA

Chief Sub-Editor    (Edition-in-Charge)

2002 2006

VAARTHA

Senior Sub-Editor  (Edition-in-Charge)

1995 - 2002

ANDHRA JYOTHY

Sub-Editor (Visakha City Desk Incharge)

1991 - 1995

ANDHRA BHOOMI

Sub-Editor         (Vijayawada)

1989 - 1991

UDAYAM

Reporter    (Mangalagiri)

1988

ACADEMIC QUALIFICATIONS

Qualification

Specialization

University

Year

B.A.

Economics

Nagarjuna University

    1984

B.L.

Law

Nagarjuna University

    1990

BJMC    

(5th Rank)

Journalism and
 Mass Communication

Andhra University

    1993

MJMC             (5th Rank)

Journalism and
Mass Communication

(TV, Cinema & Radio)

Andhra University

1995

WORKED AT  :

§  Velagapudi, AP Secretariat

§  Hyderabad

§  Chennai 

§  Anantapuram  

§  Kadapa  

§  Ongole 

§  Visakhapatnam

§  Vijayawada

§  Mangalagiri

OTHER ACTIVITIES :
___________________________________________________________________________________

  • Many articles, especially development stories published in Andhra Jyothy, Sakshi, Andhra prabha, Andhra Bhoomi, Andhrapatrika, Vaartha,  Manam, Visalandhra, Suryaa, Udayam, Prajashakti, Prajapalana, Hamsa, Antimateerpu dailies, Andhrapradesh Magazine, Pragati, Gundlakamma, Vaartha Lekha Telugu Vidyarhi monthlies and Rajadhani Varthalu weekly
  •  Radio talks.
  •  Lectures delivered under the aegis of A.P.Press Acadamy.
  • Easily interact with team members.
  • PRAJARAJADHANI  AMARAVATI Book Published

Skills :
___________________________________________________________________________________

  • Special stories, especially development stories writing
  • Internet  Desk Lead
  • Comparative Study
  •  Photoshop.

LANGUAGES KNOWN   :
___________________________________________________________________________________

Telugu & English

PERSONAL INFORMATION

Date of Birth                           : 1st January, 1962

Father's Name                         : Suryanarayana

Mother's Name                        : Bhikshavati

Gender                                    : Male

Marital Status                          : Married

Andhra Card No.                    : 975554054342

Pan Card No                           : AGUPR9286M

Last drawn salary                    : Rs.47,000/-

DECLARATION :
___________________________________________________________________________________

I hereby declare that the above furnished information is true to the best of my knowledge.

Place :  MANGALAGIRI                                                                        
Date :   02.08.2023                                                                                       (S.NAGARJUNA RAO)

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...