Mar 27, 2018

27.03.2018 మంగళవారం - మీడియా పాయింట్



 అమలాపురం MLA ఐతబత్తుల ఆనందరావు
అవిశ్వాసంపై ఈరోజు ఖచ్చితంగా చర్చ జరగాలి.
BJP నేతలకు దమ్ముంటే అవిశ్వాసంపై చర్చ పెట్టాలి.
BJP బెదిరించి పరిపాలించే పార్టీ.
అంతర్జాతీయ అబద్ధాల పోటిపెడితే అమిత్ షా ఫస్ట్ వస్తారు.
బుందేల్ ఖండ్ కు తలసరి రూ.10,000 చొప్పున ఇస్తూ, ఆంధ్రప్రదేశ్ కు మాత్రం తలసరి రూ.425 ఇస్తున్నారు.
BJP నేతలకు ఆంధ్రా అంటే అలుసు ఎందుకు? బుందేల్ ఖండ్ అంటే భయం ఎందుకు?
విశాఖ ఉక్కుకు రూ.36,000 కోట్లు ఇచ్చామంటున్నారు, అది అబద్ధం. హుదూద్ తుఫాను సమయంలో నష్టపోయిన విశాఖకు రూ.1000 కోట్లు ఇస్తామని చెప్పి రూ.650 కోట్లు మాత్రమే ఇచ్చారు.
అమిత్ షా తప్పుడు లేఖలకు ఆంధ్రా BJP నేతలు తలాడిస్తే జనాలు జాడించి తంతారు.
-------------------------------------------------------
వినుకొండ MLA GV ఆంజనేయులు
BJP, YCP, జనసేన పార్టీలు అఖిల పక్ష సమావేశానికి రాకపోవడం దురదృష్టకరం.
హోదా కోసం ఉమ్మడి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.
AP కి ద్రోహం చేస్తున్న మొదటి ద్రోహి జగన్మోహన్ రెడ్డి.
హోదాపై పోరాటం చేస్తున్న సంస్థలను సమన్వయపరిస్తే ఎందుకు రావడం లేదు?
జగన్, పవన్ లు ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
YCP రాజీనామా బీజేపీ ఆడిస్తున్న డ్రామా.
ప్రజలను మోసం చేయడానికి YCP డ్రామా ఆడుతోంది.
BJP పై పోరాటం చేస్తే జగన్ దోచుకున్న లక్ష కోట్ల రూపాయల అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లాల్సి వస్తుంది అని భయం.
హోదా ఉద్యమాన్ని బలహీన పరచాలనే ఉద్దేశంతోనే YCP డ్రామా ఆడుతోంది.
-----------------------------------------------------------
మంత్రి KS జవహర్ మీడియాతో చిట్ చాట్.....
అఖిల పక్ష సమావేశానికి వ్రాత పూర్వకముగా రమ్మని పిలిచినా రాకుండా, కేవలం రోడ్ల మీద ధర్నాలకు ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యమైన అంశాలకు వెనుకంజ వేయడం ప్రజలు గమనిస్తున్నారు.
ఆలోచన, ప్రత్యేక అజెండా లేకుండా కేవలం ఆవేశంతో వెళ్తున్న జనసేన రాకపోవడం పెద్దగా ఆశ్చర్యపోవలసినదేమీ లేదు.
అవగాహన కలిగిన వాళ్ళు ప్రజలకు ఏ విధంగా మేలు కలుగుతుంది అని ఆలోచన చేస్తారు, అటువంటి ఆలోచన వాళ్ళకు లేదు.
రాత్రి 10 గం. ఇచ్చి ఉదయం 11 గం. రమ్మంటే ఎలా వస్తాము అని ప్రశ్నించిన జనసేనను ఉద్దేశించి  పవన్ కు ఎప్పుడు ఖాళీ ఉంటుందో చెప్పమనండి, అయినా చిత్తశుద్ది ఉంటే రావడం కష్టమేమీ కాదు. రావాలనే ఆకాంక్ష ఉండాలి కానీ సాకులు చూపడం కాదు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం జండాలు పక్కన పెడదాం, అందరి అజెండా ప్రత్యేక హోదా.
  వారికి PMO చుట్టూ తిరగడానికి సమయం ఉంటుంది, అఖిల పక్ష సమావేశం అంటే రారు.
BJP వాళ్ళు అమిత్ షా ఇచ్చిన లేఖకు విలువలేదు. ఆ లేఖపై అసెంబ్లీలో ఎందుకు చర్చించాలి అని అంటున్నారు. కానీ అదే అమిత్ షా ఇచ్చిన B ఫారం తోనే వాళ్ళంతా MLA లు అయ్యారు.
చలసాని శ్రీనివాస్  చిత్త శుద్దితో పనిచేస్తున్నారని భావించి ఆయనను ఆహ్వానించాం. కానీ ఆయన ఎప్పుడో ఇచ్చిన లేఖల గురించి ఇప్పుడు మాట్లాడడం కాకుండా, సమావేశానికి హాజరై, సలహాలు సూచనలు ఇచ్చి, వాటిని మేము పట్టించుకోకుండా ఉంటే అప్పుడు మాట్లాడాలి.
-----------------------------------------------------
ఎమ్మిగనూరు MLA జయ నాగేశ్వర రెడ్డి... చిట్ చాట్...
ఈరోజు జరగనున్న అఖిల పక్షానికి హాజరు కాని వారంతా  ఆంధ్ర రాష్ట్ర ద్రోహులే.
అవిశ్వాసంపై పార్లమెంటులో చర్చకు రానున్న సమయంలో, అందరూ ఉమ్మడిగా పార్లమెంటులో BJP పై పోరాడాల్సిన ఈ సమయంలో డ్రామాలు ఆడుతున్నారు.
చంద్రబాబును నమ్మి  ఆయనకు నాయకత్వము ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము అని YCP నేతలు అంటున్న మాట్లాలను గురించి ప్రశ్నించగా,  వీళ్ళు చంద్రబాబు ను నమ్మి నాయకత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రజలు ఆయనను నమ్మి నాయకత్వం ఇచ్చారు.
పార్టీలు కాదు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం.
BJP కి మొన్నటి వరకు ఈ రాష్ట్రంలో అభివృద్ధి కనబడింది, NDA నుండి మా పార్టీ ఎప్పుడు బయటకు వచ్చిందో అప్పుడు రాజకీయం మొదలైంది.
మీరు UC లు ఇవ్వలేదు, అవినీతి జరిగింది అని నిన్న ఒక MP మాట్లాడుతున్నారు, అయినా UC లకు హోదా కు సంబంధం లేదు.
రాష్ట్ర ప్రజలకు ఒక్కటే ఒక అజెండా, అది ప్రత్యేక హోదా, విభజన హామీలు.
విభజన చేసిన కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. BJP కూడా ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వడం లేదు.
అవిశ్వాసం పై చర్చకు వచ్చే సమయంలో, అందరూ ఉమ్మడిగా BJP ని ఎండగట్టాల్సిన సమయంలో, డ్రామాలు ఆడుతున్నారు.
చంద్రబాబు  ఏ రోజు ప్రత్యేక హోదా వద్దు అని చెప్పలేదు.
---------------------------------------------------
విజయవాడ పశ్చిమ MLA జలీల్ ఖాన్....
2 సం,, నుండి చెబుతూనే ఉన్నాము, ఇప్పుడు ఆధారాలతో దొరికిపోయారు.
YCP, జనసేన లకు BJP తో ఉన్న లోపాయకారి ఒప్పందం వలననే వారు అఖిలపక్ష సమావేశానికి రావడం లేదు.
విజయసాయిరెడ్డి PMO చుట్టూ తిరగడం, పవన్ గానీ, జగన్ గానీ మోడీని విమర్శించక పోవడంతో విషయం తేటతెల్లం అయినది.
జగన్ పాదయాత్ర పేరుతో అసెంబ్లీ బయట తిరుగుతూ అసత్యాలు మాట్లాడుతున్నారు.
తెలుగుదేశం ప్రజల పక్షాన ఉన్నది.
BJP ని ఇంతకాలం నమ్మినాము, వాళ్ళు మమ్ముల్ని ముంచారు.
రాష్ట్రం కష్టాలలో ఉన్నది, అఖిల పక్షం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి స్థాయిలో పిలిస్తే వీళ్ళు రావడం లేదు.
పవన్ ను సినిమా యాక్టర్ అంటే బాగుంటుంది.
రాష్ట్రానికి కష్టం వచ్చిన సందర్భంలోనే అఖిలపక్షం ఏర్పాటు చేస్తున్నారు. అంతేకానీ పవన్ కో జగన్ కో నచ్చినప్పుడు పిలవరు.
రాష్ట్రానికి ఏమి ఇచ్చారో  ఆ లెక్కలన్ని కేంద్రం వద్దనే ఉన్నాయి.. ఆడిట్, CAG రిపోర్ట్ లు చూస్తే తెలుస్తాయి.
  ప్రజారాజ్యం పార్టీ పెట్టి ముంచడం వలన, గోదావరి జిల్లాలలో చాలామంది నష్టపోయారు. ఆ పార్టీలో పవన్ ముఖ్య పాత్ర పోషించారు. ఆయన ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడడం ఏమిట?
ఎదిగే పిల్లవాడిని సాకినట్లు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి.
పవన్, జగన్ లు మోడీ ని విమర్శించడం లేదు. చంద్రబాబు ఒక్కరే మాటలాడుతున్నారు.
పవన్, జగన్ BJP అందరూ కలసినా సరే మరలా చంద్రబాబు అధికారంలోకి రావడం ఖాయం.
---------------------------------------------------------------
MLC బుద్దా వెంకన్న.

ఈ రోజు పవన్, జగన్, BJP ల మహా కుట్ర బట్టబయలు అయింది.
ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన అఖిలపక్షంనకు రాకపోవడంతో వారు ముగ్గురు భాగస్వాములు అని తేలిపోయింది.
రాష్ట్ర ప్రయోజనాల కోసం, నిధుల కోసం ముఖ్యమంత్రి  అఖిల పక్షం ఏర్పాటు చేస్తే రాకపోవడం సిగ్గుమాలిన చర్య.
వీళ్ళకు 5 కోట్ల ఆంధ్రుల ప్రయోజనాలు అక్కర్లేదు.
సీపీఐ, CPM, లోక్ సత్తా, ప్రజా సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు, ప్రత్యేక హోదా సాధన సమితి హాజరైతే, వీళ్ళు ముగ్గురు మాట్లాడుకొని గైర్హాజరు అయినారు.
అవిశ్వాసం పై పార్లమెంటు లో చర్చకు వచ్చే సమయంలో సలహాలు, సూచనలు ఇవ్వడం లేదంటే వారు మోడీకి బయపడుతున్నారు.
జగన్ కేసులకు, పవన్ ఇన్ కం టాక్స్ వాళ్లకు బయపడుతునట్లున్నారు.
రాష్ట్ర ప్రయోజనాలు మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు.
మీరు కేంద్రం పక్షమా? ఆంధ్రా పక్షమా?
ఆంధ్రుల మనోభావాలు ఆకాంక్షలు మోడీ దగ్గర తాకట్టు పెట్టారు.
తమిళనాడులో అందరూ ఏకమై రాష్ట్ర ప్రయోజనాలు సాధించుకున్నారు.
ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి పోరాడుతుంటే, వీళ్ళు ముగ్గురూ మహా కుట్రలో భాగస్వాములు అయ్యారు.
జగన్, పవన్ ల గైర్హాజరు, కేంద్రానికి 5 కోట్ల ఆంధ్రులు కలసి లేరని ఇస్తున్న సంకేతం.
వారు రావాలంటే అనేక మార్గాలు, వద్దనుకుంటే అనేక సాకులు.
MP లతో రాజీనామా చేయిస్తారు కానీ విజయసాయిరెడ్డి చేయరట.
ఐక్యంగా పోరాడదాము అంటే కుంటిసాకులు చెప్పి తప్పించుకుంటున్నారు.
--------------------------------------------------------------
ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర నిజం అయ్యింది
విజయసాయిరెడ్డిని అక్కున చేర్చుకుంటున్న ప్రధాని
అన్ని పార్టీలు కలిసి పోరాడాల్సిన సమయంలో నాటకాలు ఆడుతున్నారు
బీజేపీ, వైసీపీ, పవన్ ఈ అఖిలపక్షంకి ఎందుకు హాజరు కావడంలేదు?
ఏదో సాధిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఢిల్లీ లో పోరాటం ఎందుకు చేయటం లేదు
నీ ఇంటికి 2 ఎకరాలు స్థలం కావాలి, రాజధానికి 34 వేల ఎకరాలు ఎందుకు అంటున్నావు
అవినీతి పై చేసిన ఆరోపణలను రుజువు చెయ్యి
అఖిలపక్షం కి వచ్చి వాస్తవాలు తెలుసుకోండి అంతే ఊరికే ఆరోపణలు చేయకండి
విభజన హామీల పై స్పష్టంగా వివరణ ఇవ్వాల్సిన సమయంలో ఎవరికి వారు నాటకాలు ఆడుతున్నారు.
5 కోట్ల ప్రజల కోసం అందరూ పార్టీ లకి అతీతం గా అందరూ పోరాడాల్సిన అవసరం ఉంది.
----------------------------------------------------------
BJP ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎంఎల్సీ మాధవ్
v 4 సంవత్సరాల కాలంలో ఏనాడు ఏ పార్టీతో మాట్లాడని టీడీపీ ఈ రోజు హడావిడిగా అఖిలపక్షం ఏర్పాటు ఎందుకు చేసింద
v  రాజకీయ క్రీడ మాత్రమే. ప్రజల పేరుతో నాటకాలు ఆడుతున్నారు
v  టీడీపీ వైఫల్యం బయట పడకుండా ఉండేందుకు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారు
v  ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అన్ని బాయ్ కాట్ చేసారు.
v  ప్రత్యేక ప్యాకేజికి ఒప్పుకున్న సమయంలో కూడా అఖిలపక్షం ఏర్పాటు చేయలేదు
v  మిత్రపక్షంగా ఉన్నపుడు కూడా కనీసం బీజేపీతో సంప్రదింపులు జరపలేదు.
v  ఇప్పుడు అఖిలపక్షం ఏర్పాటు చేస్తే ప్రజలు నమ్ముతారు అనుకోవటం వాళ్ల బ్రమ
v  అఖిలపక్షం పెట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు మంచిది కాదు
v ----------------------------------------------------------------
మంత్రి KS జవహర్....
YCP వైఖరి బ్లాక్ డే గా ఉన్నది.
A2 విజయసాయిరెడ్డి ఈరోజు ప్రధానిని కలసి కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం పొంది వచ్చారు.
ఆయన త్వరలో మంత్రి అయ్యే అవకాశం ఉంది.
YCP వాళ్ళది లోక్ సభలో ఒక నీతి, రాజ్యసభ లో ఒక నీతి.
అందరూ రాజీనామా చేస్తే వాళ్ళ నిజాయితీ ని నమ్మొచ్చు.
విజయసాయిరెడ్డి మోడీ వద్దకు వెళ్ళినపుడు, ఎన్ని కేసులు ఉన్నా పర్వాలేదు అన్నట్లుగా భుజం తట్టారు.
నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ వీళ్ళంతా దేశం వదలి వెళ్ళితే దేశం బాగు పడుతుంది.
అద్వానీకి ప్రతి నమస్కారం చేయని సంస్కారం మోడీది. అటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి కి ప్రతి నమస్కారం చేశారు.
రాష్ట్రాన్ని మూకుమ్మడిగా మోసం చేసే దొంగలు అందరూ ఒకటి అయ్యారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ కలసి రావలసిన అవసరం ఉన్నది.
కేసులు పెన్ డ్రైవ్ ల కోసం వాళ్ళు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు.
----------------------------

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...