Mar 14, 2018

శాసనసభ మీడియా పాయింట్ 14.03.2018


 శాసనసభ చీఫ్ విప్ పల్లె రఘునాధ్ రెడ్డి

Ø జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర లో చంద్రబాబు గారిని విమర్శించడానికి సమయం కేటాయిస్తున్నారు.
Ø  తన తండ్రి వయస్సుఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనపై గౌరవం లేకుండా వ్యాఖ్యలు
Øచేయడం ప్రజలు హర్షించారు, గుణపాఠం చెబుతారు.
Ø  5 కోట్ల ప్రజల మనోభావమే ప్రత్యేక హోదా.
Ø  పార్లమెంట్ లో, అసెంబ్లీలో ఉద్యమాలు జరుగుతుంటే పట్టించుకోకుండా చంద్రబాబును విమర్శించడం సబబేనా?
Ø  రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా, రాష్ట్రం అట్టుడుకుతుంటే
Øఅదేమి పట్టనట్లుగా ప్రధానిని విమర్శించకుండా చంద్రబాబును విమర్శిస్తే హోదా వస్తుందా?
Ø  జగన్మోహన్ రెడ్డి అనుచరుడు A2 విజయసాయిరెడ్డి ఇండియా టుడేతో మాట్లాడుతూ మోడీపై నమ్మకం ఉంది, హోదా ఇస్తాడు అంటూనే, 21న అవిశ్వాసం ఏవిధంగా పెడతాడు.
Ø  కంటి తుడుపు చర్యగా హోదా కోసం మాట్లాడుతున్నాడు.
Ø  రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో హోదా ఇస్తేనే మద్దతు ఇస్తామని మాట్లాడకుండా, బేషరతుగా ఎందుకు మద్దతు ఇచ్చాడు.
Ø  ప్రపంచంలో అతి తక్కువ సమయంలో లక్ష కోట్లు సంపాదించిన వారు ఎవరైన ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి  ఒక్కరే.

----------------------------------------------
14.03.2018 – బుధవారం మీడియా పాయింట్- ఆమదాలవలస శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్
·        విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడుతూ YCPతో మాకు ఏ సంబంధాలు లేవు అన్నారు. కానీ నిన్న ఢిల్లీలో తెలుగుదేశం MP లు
·కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గారిని కలసి రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడడానికి ఇంటర్వ్యూ అడిగితే ఇవ్వకుండా, YCP పార్లమెంట్ సభ్యునికి ఇంటర్వ్యూ ఇచ్చారు.
·        వైసీపీ వాళ్ళు రాష్ట్ర హక్కుల కోసం కాకుండా జగన్మోహన్ రెడ్డి కేసుల మాఫీకోసం, ED అటాచ్ చేసిన ఆస్తులు విడిపించుకోవడం కోసం లాబీయింగ్ చేస్తున్నారు.
·        రాష్ట్రానికి రావాల్సిన హోదా, 19 అంశాలు రాకుండా జగన్మోహన్ రెడ్డి శకుని పాత్ర పోషిస్తున్నారు.
·        సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో బెయిల్ కోసం సోనియా గాంధీ తో కుమ్మక్కై సమైక్యాంధ్రను మోసం చేశారు.
·       ఈరోజు రాష్ట్రానికి  హోదా కావాలి, లేకపోతే రాజీనామా చేస్తాం అన్నారు కానీ 2 సం,, నుండి చేయలేదు.
·        ఏ జాతీయ పార్టీ హోదా ఇస్తే వారికి అండగా ఉంటాము అన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ హోదా ఇస్తాను అంటుంది, వారికి మద్దతు ఇస్తారా అని అడిగితే సమాధానం చెప్పడం లేదు. దీనిని బట్టి చూస్తే BJP YCP లాలూచీ అర్ధం అవుతోంది.
·        ఒక ప్రక్క మోడీ పై విశ్వాసం ఉంది, హోదా ఇస్తారు అంటున్నారు, మరో ప్రక్క 21న అవిశ్వాసం ఎలా పెడతారు.
·        5 కోట్ల మంది ప్రజలు పోరాడుతుంటే, TDP మంత్రులు రాజీనామా చేసి బయటకు వచ్చి పోరాడుతుంటే, YCP కేసుల మాఫీ కోసం పోరాడుతున్న ట్లుగాఉన్నది.
·        ప్రధాని కార్యాలయం విజయసాయిరెడ్డి కి రెడ్ కార్పెట్ పరుస్తుంది, 11 కేసుల్లో ఆర్థిక ఉగ్రవాదులుగా ఉన్నవారితో BJP కి లాబీయింగ్ ఏమిటి?
---------------------------------------------------------------------------
14.03.2018 – బుధవారం మీడియా పాయింట్- అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు

ü నాడు  బెయిల్ పొందడానికి జగన్ కు కాంగ్రెస్ కావాలి...నేడు కేసులు క్లియర్  చేసుకోవడానికి జగన్ కు బీజేపీ కావాలి.
ü  తల్లి కాంగ్రెస్ ను చూస్తే చిందులు వేసే మోడీ పిల్ల కాంగ్రెస్ ను ఎందుకు చంకనెక్కించుకుంటున్నారు ?
ü   మీ చీకటి ఒప్పందాలను తెలుగువారు గమనిస్తున్నారు.
ü  ప్రత్యేక హోదా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న 18 కోట్ల తెలుగువారికి బీజేపీ మీద ఉన్న భ్రమలు తొలగిపోయాయి.
ü  నాడు దేశంలో బీజేపీ, మోదీ కావాలన్న తెలుగువారు నేడు దేశంలో బీజేపీనే వద్దనుకునే స్థాయికి రాకుండగా చూసుకోవాలి.
ü  తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం.హోదా మా హక్కు. కేంద్రానికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది
---------------------------------------------------------------------

14.03.2018 – బుధవారం మీడియా పాయింట్- గజపతి నగరం ఎమ్మెల్యే డాక్టర్ అప్పల నాయుడు

v  ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో 3 వ సారి తీర్మానం చేసి కేంద్రానికి పంపాము.
v  TDP 5 కోట్ల మందు ఆంధ్రుల తరుపున కేంద్రాన్ని నిలదీయాలనుకున్న తరుణంలో కేంద్రం ఈ విధంగా చేస్తుంది.
v  విశాఖ రైల్వే జోన్ కు హామీ ఇచ్చారు, ఇప్పుడు అధికారుల ద్వారా అవకాశం లేదు అని చెబుతున్నారు.
v  దుగరాజపట్నం సీ పోర్టు హామీ ఇస్తామన్నారు, పోర్టుకి అక్కడ అనువుగా లేదని చెప్పడం ఎంతవరకు సమంజసం.
v  16 కేసులతో A1 ముద్దాయిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నాడు. బాధ్యతలు విస్మరించి ఏవేవో మాట్లాడుతున్నాడు.
v   సభనుండి పారిపోయి ఏవేవో మాట్లాడుతున్నాడు.
v  అటువంటి ముద్దాయికి PMO లో రెడ్ కార్పెట్ వేస్తున్నారు.
v  ప్రస్తుత పరిస్థితులలో బిజెపి స్టాండ్ ఏమిటో ప్రజలు ఆలోచించాలి
v  గతంలో కాంగ్రెస్ కు పట్టిన దుస్థితే బీజేపీ కి పడుతుంది.
--------------------------------------------------------------------------

14.03.2018 – బుధవారం మీడియా పాయింట్- పుట్టపర్తి ఎమ్మెల్యే, చీఫ్ విప్ పల్లె రఘునాధ్

*    జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ Mpలు విజయసాయిరెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. స్థాయి మరచి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు కు అభద్రతా భావం అని, తొలి నుంచి ప్రత్యేక హోదా గురించి తామే మాట్లాడుతున్నామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు.
*    చంద్రబాబు పై ఏ కేసులు లేవు. నలబై యేండ్లు నిప్పులా బ్రతికాడు. కడిగిన ఆణి ముత్యం, కోట్లాదిమంది అభిమాన నాయకుడు, అలాంటి వ్యక్తికి అభద్రతాభావం ఎందుకు ఉంటుంది.
*    జగన్ 11 కేసులలో A1 ముద్దాయి, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళాలి, ఎప్పుడు శిక్ష పడుతుందోనన్న అభద్రతాభావం ఆయనకు ఉంటుంది.
*    అవినీతిపరుల ఆస్తుల ED స్వాధీనం చేసుకోవచ్చని పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టారు. దానితో తన ఆస్తులు ఎక్కడ స్వాధీనం చేసుకుంటారో అని జగన్ కు హదలెత్తుతోంది.
*    చంద్రబాబు మొదటి నుండి చిత్తశుద్దితో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇందుకోసం 29 సార్లు ఢిల్లీ వెళ్లారు.
*    ప్రపంచ స్థాయిలో కూడా ఆయన ప్రశంసలు అందుకుంటున్నారు.
*    జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో లేనిపోని హామీలు ఇస్తున్నారు. ప్రజలను ప్రలోభ పెడుతున్నారు.
*    విజయ సాయి రెడ్డి ఇండియా టుడే కి ఇంటర్వ్యూ ఇస్తూ మోడీ పై నమ్మకం ఉందని చెప్పారు, మళ్ళీ 21 న అవిశ్వాస తీర్మానం పెడతామని అంటున్నారు, వారిది రెండు నాలుకల ధోరణి.
*    రాష్ట్ర అభివృద్ధిని సయిందవుని మాదిరి అడ్డుకున్నారు.

*********


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...