Mar 22, 2018

22.03.2018 గురువారం – శాసనసభ మీడియా పాయింట్



టిడిపి  విజయవాడ సెంట్రల్  ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు
Ø  బిజేపి  కుటీల రాజకీయాలను దేశం మొత్తం అసహ్యించుకుంటుంది.
Ø  ఆంధ్రులకు చేసిన దగా  దేశం మొత్తం తెలుస్తుందని అవిశ్వాసం చర్చకు రానీయడం లేదు.
Ø  ఏపి  బిజేపి  నేతలు రాష్ట్ర ప్రభుత్వం పై లేనిపోని అబండాలను వేస్తుంది.
Ø   లోటు బడ్జెట్ ఉన్న రాష్టానికి నిధులు తేవాలని ఏపి  బిజేపి  నేతలకు  తెలియాదా ?
Ø   విష్ణు కుమార్ రాజు ఏపి  ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారా ?
Ø  రాం మాధవ్ , హరిబాబులు పోరాటం చేస్తాంమంటున్నారు. ఎవరి మీద చేస్తారు పోరాటం ఐదు కోట్ల ఆంధ్రుల మీదనా?
Ø  మోడి బంధువు అయిన నీరవ్  మోడి పైనా?
Ø  అమిత్ షా కొడుకు కేసుల పైనా సిబిఐ విచారణకు ఆదేశించారు.
Ø  వైసిపి , జవసేనలతో కలసి బిజేపి పోలవరం ఆపాలని కుట్ర చేస్తుంది. పోలవరం జోలికి వస్తే రైతులు తిరగబడతారని గుర్తుంచుకోవాలి.
Ø  నాలుగేళ్లు  కనిపించని అవినీతి జనసేనకు ఇప్పడే కనిపించిందా ?
Ø  జనసేన కార్యకర్తలే టచ్ లో ఉండని   పవన్ కు 40 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారనడం హస్యస్పాదం .
Ø  పవన్ ఎవరి డైరెక్షన్ లో నడుస్తున్నాడో అందరికి తెలుసు.
Ø  గతంలో దేశంలో కాంగ్రెస్ ఎమర్జెన్సీ విధిస్తే....నేడు బిజేపి  ఏపి పై ఎమర్జెన్సీ విధించింది.
Ø  బిజేపి  పప్పులు ఏపి లో ఉడకవు .
---------------------------
ఉమ చిట్ చాట్...
Ø  ఏ నాయకుడు చేయలేని నదుల అనుసంధానం  చంద్రబాబు చేశారు..
Ø  ఆనాడు పట్టిసీమ సూపర్ అని బీజేపీ నాయకులు పొగిడారు..నేడు ఎందుకు ఈ విమర్శలు..
Ø   అమరావతి నిర్మాణం ఆపాలని, పోలవరం నిర్మాణం జరగకూడదు అని బీజేపీ చూస్తుంది...
Ø  అవగాహాన రాహిత్యం గా పవన్ మాటలు ఉన్నాయి..
Ø   పవన్ తీసుకున్న యూ టర్న్ ప్రజలు గమనిస్తూ ఉన్నారు..
Ø   అవిశ్వాసం మీద చర్చ జరగాలి.. చర్చ జరిగితేనే ఎవరిది తప్పు అన్ని ప్రజలందరికి తెలుస్తోంది.
Ø  బీజేపీ ఏపీ లో ఎమర్జెన్సీ వాతవరణం కల్పించాలని చూస్తుంది..
Ø అవిశ్వాస తీర్మానం పై చర్చ జరిగితే బీజేపీ అసలు రంగు బయటపడుతుంది అని సభ లో చర్చ జరగకుండా బీజేపీ అడ్డుకుంటుంది..
Ø అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా175-200 మంది సభ్యులు సిద్ధంగా ఉన్నారు. దాన్ని దారి మళ్లించడానికి బీజేపీ వారు కుట్రలు పన్నుతున్నారు...
Ø పార్లమెంట్ లో తెలుగు ఎం.పీ లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి నిన్న అసెంబ్లీలో విష్ణుకుమార్ రాజు గారు పట్టిసీమ పై అవినీతి ఆరోపణలు చేశారు...
Ø సీబీఐ ఎంక్వైరీల పేరుతో 5 కోట్ల ప్రజలను బ్లాక్మెయిల్ చేస్తారా ??
Ø దేశవ్యాప్తంగా బీజేపీ ని ఎండగడతాం.. ఏపీ కి చేసిన ద్రోహాన్ని దేశప్రజలందరి దృష్టిలో పెడతాం..
----------------------------------------------------------------------
తెలుగుదేశం పార్టీ విజయవాడ తూర్పు MLA గద్దె రామ్మోహన్ రావు చిట్ చాట్
·        ఆనాటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గాయం చేస్తే, ఇప్పటి కేంద్ర ప్రభుత్వం ఆ గాయం మానకుండా రేపుతూ మరింత గాయం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాం.
·         విభజన చేసిన కాంగ్రెస్ కు రాష్ట్రంలో డిపాజిట్లు రాకుండా చేసిన విషయాన్ని బీజేపీ నేతలు ఎందుకు తెలుసుకోలేక పోతున్నారో తెలియడం లేదు.
·        ఈ రోజు చేస్తున్న నిరసన కార్యక్రమాల వలన ఇబ్బందుల్లో ఉన్న ప్రజలు మరింత ఇబ్బంది పడకుండా, జపాన్ తరహాలో రోజు మాదిరిగా పనిచేసే సమయం కంటే మరింత ఎక్కువ సమయం పనిచేస్తూ నిరసన తెలుపనున్నాం.
·        ప్రజా ఆగ్రహానికి గురైన ఏ వ్యక్తులు తపించుకున్నట్లుగా చరిత్రలో లేదు. అలాగే బీజేపీ ఇప్పటికైనా తప్పులు తెలుసుకొని, పశ్చాత్తాప పడి తప్పులు సరి చేసుకోవాలి, లేకపోతే భారతదేశం లో మీ మనుగడ కరువౌతుంది.
·       జూన్ నెలలో నాట్లు పడే పరిస్థితి నుండి, ఎప్పుడు నాట్లు పడతాయి తెలియని పరిస్తితి కి వెళ్లి, మరలా ఇప్పుడు పట్టిసీమ వలన జూన్ లో నాట్లు వేసుకునే పరిస్థితి కి వచ్చాము. అటువంటి పట్టిసీమ మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.
·        
------------------------------------------------------
TDP MLC బుద్దా వెంకన్న

11 కేసులలో A2 గా ఉండి, జగన్ కు సహకరించడమే కాక, నేరాలు ఎలా చేయాలో చెప్పిన విజయసాయిరెడ్డి నిన్న చంద్రబాబుని బోను ఎక్కిస్తా అంటూ ఉడత ఊపులు ఊపుతున్నాడు.
విజయసాయిరెడ్డిని పుట్టించిన వాళ్ళు కూడా చంద్రబాబును బోను ఎక్కించలేరు.
అవినీతికి కేరాఫ్ అడ్రస్ జగన్ అయితే, నిజాయితీకి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు.
2000 సం,, లో YSR అనేక రిట్లు వేసి, మరలా అతనే ఉపసంహరించుకున్నాడు.
చంద్రబాబు పై జగన్ తల్లి విజయమ్మ 26 కేసులు పెడితే సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసింది.
జగన్ కేసులు నిరూపణ అయితే ఎన్నాళ్ళు జైలు శిక్ష వేయాలో జడ్జి లకు కన్ఫ్యూషన్.
జగన్ ను బహిరంగంగా ఉరి తీయాలి.
విజయసాయిరెడ్డి లాంటి నేరస్తులకు అపాయింట్ మెంట్ ఇచ్చిన  ప్రధాని కార్యాలయం విజయమాల్యా, లలిత్ మోడీ, నీరవ్ మోడీ ఇస్తుందా?
ప్రధాని కార్యాలయం నుండి బయటకు వచ్చి విజయసాయిరెడ్డి చంద్రబాబు ను బోను ఎక్కిస్తాను అని మాట్లాడుతుంటే ప్రజలు అర్ధం చేసుకోలేరా.
ఆర్థిక నేరస్తులను తన కార్యాలయంలోనికి రానివ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రధానిది.
నిజాయితీగా ఉన్న వ్యక్తి పై CBI కేసులు పెట్టి విచారణ చేయాలంటున్నారు.
CBI వాళ్ళ చెప్పుచేతల్లో ఉన్నట్లు, మా మీదికి పంపుతాము అంటే మీ ఆటలు సాగవు.
అవినీతి పరులపై మాత్రమే CBI విచారణ చేస్తుంది.
----------------------------------------
పొన్నూరు టిడిపి MLA ధూళిపాళ్ళ నరేంద్ర
విష్ణు కుమార్ రాజు నిన్న పట్టిసీమ గురించి చేసిన వ్యాఖ్యలు ఆయన బాధ్యత రాహిత్యాన్ని తెలియచేస్తున్నాయి.
సెప్టెంబర్ 2015 లో పట్టిసీమ ప్రారంభిస్తే, 2016 మార్చిలో CAG నివేదిక ఇచ్చింది. ఇప్పుడు 2 సం,, తరువాత TDP రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి మాట్లాడుతుంటే, కేంద్రం పై అవిశ్వాసం పెడతా ఉంటే, ఈ సమయంలో TDP పై అవినీతి ఆరోపణలు చేయడం BJP ఉద్దేశాన్ని బహిర్గతం చేస్తుంది.
రాష్ట్ర విభజన కు వ్యతిరేకంగా ఆరోజు పోరాటం చేశాం, విభజన జరిగితే నాగార్జున సాగర్ డెల్టా రైతులు నష్ట పోతారని చెప్పాం.
డెల్టా హక్కుగా 132 TMC లు రావాల్సి ఉంటే, ఆ రోజుల్లో 140 TMC లు వచ్చేవి.
ఇప్పుడు 2015-16 లో 8 TMC లు, 2016-17 లో 40 TMC లు, 2017- 18 లో కూడా అలాగే వచ్చాయి.
డెల్టా ప్రాంతం ఎడారిగా మారుతుందని, పోలవరం ఆలస్యం అవుతుంది అని, పట్టిసీమ కట్టి డెల్టా కి నీళ్లు ఇచ్చాము.
ఓపెన్ టెండర్ లు పిలిచి, 5 శాతం సీలింగ్ ఎత్తివేసాం. రైతులను కాపాడదానికి అతి తక్కువ కాలంలో పూర్తి చేయాలని భావించి, 5 1/2 నెలల కాలంలో కట్టి డెల్టాకు నీళ్లు ఇచ్చాము.
ఈ మూడు సం,, లలో 115 TMC ల నీళ్లు ఇచ్చాము.
2 సం,, తరువాత BJP వాళ్ళు పట్టిసీమ పై విమర్శలు చేయడం రైతులకు బాధని కలిగిస్తుంది.
టీడీపీ NDA నుండి బయటకు వచ్చిన తర్వాత ఆరోపణలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ముఖ్యమంత్రి, అధికారులకు, కాంట్రాక్టర్లు కు కూడా సన్మానం చేయాలని ఆనాడు సభలో మాట్లాడిన విష్ణు కుమార్ రాజు, ఈ రోజు అవినీతి ఆరోపణలు చేయడం, అసలు ఆయన ఆలోచనలు ఏమిటో ప్రజలకు చెప్పాలి.
రైతులకు BJP క్షమాపణలు చెప్పాలి.
పట్టిసీమ పై వేసిన అన్ని కేసులు హైకోర్టు కొట్టివేసింది.
అర్ధం లేని ఆరోపణలు చేస్తే ప్రజలు క్షమించరు.
30 పంపులకు గానూ, 24 పంపులే పెట్టామని మాట్లాడుతున్నారు, అధిక సామర్ధ్యం గల పంపులు పెట్టి ముందుగా చెప్పిన ప్రకారం 8400 క్యూసెక్కుల నీటిని పంప్ చేస్తున్నామా, లేదా అనేది చూడాలి.
CAG చట్టబద్ధమైన ఏజెన్సీ, CAG అభ్యంతరాలను PAC చూసుకుంటుంది.
--------------------------------------------------
ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వరరెడ్డి చిట్ చాట్
§   మోడీ ని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైన సీబీఐ ఎంక్వైరీలు, ఐటీ దాడులు చేయించేలా చంద్రబాబు మీద, లోకేష్ బాబు మీద, టీడీపీ మీద కుట్ర జరుగుతున్నట్లు అనుమానంగా ఉంది.
§   లక్షల కోట్లు దోచుకున్న జగన్ గురించి మాట్లాడరు.. బ్యాంకు లని మోసం చేసిన నీరవ్ మోడీ లాంటి వారి గురించి మాట్లాడరు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రశ్నిస్తున్న చంద్రబాబు ని బ్లాక్మెయిల్ చేస్తారా ?? రాష్ట్రాన్ని బెదిరిస్తారా???
§   దేశంలో స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తామనే బీజేపీ ఈ రోజు పార్లమెంట్ లో సమాధానాలు చెప్పుకోలేక అక్కడ ఏ.ఐ.ఏ.డి.ఎం.కె , తెరాస పార్టీలతో రాష్ట్రంలో జగన్, పవన్ లతో కలిసి డ్రామాలాడుతోంది.
§   ముఖ్యమంత్రి గారికి ఏ హాని చేసినా రాష్ట్ర ప్రజాలందరికి హాని చేసినట్టే...
*********************************

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...