Mar 16, 2018

మీడియా పాయింట్ – 16.03.2018- శుక్రవారం



మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ప్రసంగంలోని ముఖ్య అంశాలు
·        సినిమాలో ఇంటర్వేల్ వరకు హీరోలా ఉండి.. ఆ తర్వాత భిన్నమైన రోల్ పోషించినట్టుగా పవన్
·వ్యవహరిస్తున్నారు.
·        జగన్ తరహాలోనే పవన్ కూడా మిస్డ్ కాల్ పార్టీల జాబితాలో చేరారా..? వాళ్లను అనుసరిస్తున్నారా..?
·        వైసీపీ కూడా మిస్డ్ కాల్ ఇస్తే సభ్యత్వం ఇచ్చేస్తోంది.. జనసేన కూడా అలాగే చేస్తోంది.
·        పవన్ తన మనస్సు ఎవరి మీద అయినా పారేసుకుంటాడు.. ఆ తర్వాత మూడు నాలుగేళ్లకు ఆరేసుకుంటాడు.
·        చిరంజీవి ప్రజారాజ్యం పార్టీపై మనసు పారేసుకున్నాడు.. ఆ తర్వాత ఆరేసుకున్నాడు.
·        మోడీకి వ్యతిరేకంగా పోరాడతానని.. ఒక్కసారిగా పన్నీరు సెల్వంలా మారిపోయారో అర్ధం కావడం లేదు.
·        నిన్నటి వరకు వామపక్ష భావజాలంతో ఉన్న పవన్ పక్షపాత భావజాలానికి చేరుకున్నారు.
·        ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ, మైనారిటీ రిజర్వేషన్లను పెంచుతామన్న కేసీఆర్ ను పొగుడుతున్న పవన్.. కాపు రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న చంద్రబాబును విమర్శిస్తారా..?
·        ఎన్సీఏఈఆర్ నివేదిక ప్రకారం ఏపీ 19వ స్థానంలో ఉంది.
·       ఇదే నివేదిక ప్రకారం గతంలో ఏపీ ఒకటో స్థానంలో ఉంది.
·        ఆవేశంలో జరిగిన ఒకటి రెండు సందర్భాలను ప్రస్తావిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు దాడులు  చేస్తున్నారంటూ విమర్శలు చేయడం సరికాదు.
·        ఒక వార్తా పత్రికలో కథనం వస్తే ఆ కార్యాలయం మీద దౌర్జన్యానికి ప్రయత్నించారు.
·        తమ దాకా పరిస్థితి వస్తే ఎలా  ఉంటారో పవన్ ఆలోచించుకోవాలి.
·        మంగళగిరిలో పవన్ ఇంటి నిర్మాణం జరిగే చోట  నేనూ ఇల్లు తీసుకుందామంటే ఆరేడు కోట్లు రూపాయలు ఖర్చు అవుతందన్నారు.. కానీ పవనుకు రూ. 40 లక్షలకే ఇచ్చేశారు. సినిమా హీరో మీద మోజుతో తక్కువ రేటుకు ఇచ్చారేమో..?
·        కాపుల విషయంలో మీరేమన్నా అధ్యయనం చేశారా..? కాపు రిజర్వేషన్లు వద్దని చెప్పడమేనా మీ అధ్యయనం..?
·        చంద్రబాబు, లోకేష్ ను విమర్శించడానికేనా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ..?
·        వైసీపీ విమర్శలను.. ఆరోపణలను పవన్ దత్తత తీసుకున్నారా..?
---------------------------------------------------------
ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి  ప్రసంగంలోని ముఖ్య అంశాలు
§   పవన్ కళ్యాణ్ గారు రెండు రోజుల క్రితం మాట్లాడిన మాటలకు మా తెలుగుదేశం పార్టీ ఇంతగా రియాక్ట్ కావలసిన అవసరం లేదు.
§   వాక్కు స్వాతంత్ర్యం ఉంది కాబట్టి మాట్లాడాడు.
§   వాస్తవంగా అది ఒక సినిమా అని, పవన్ కళ్యాణ్ నటించాడు అని నేను భావిస్తున్నాను.
§  కళాకారులు రకరకాల సినిమాలు చేస్తారు.
§   పవన్ కళ్యాణ్ కు నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ ప్లే ముగ్గురు శక్తులు ఎవరు అనే విషయం ప్రజలకు తెలుసు.
§  ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండి ప్రస్తుతం ఖాళీగా ఉన్న వ్యక్తి స్క్రీన్ ప్లే వ్రాస్తే, ప్రస్తుతం
§నడుచుకుంటూ పోతున్న వ్యక్తి డైరెక్షన్ చేశాడు. నిర్మాత ఎవరో అందరికీ తెలుసు అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్, జగన్, బీజేపీ లను ఉద్దేశించి మాట్లాడారు.
------------------------------------------------------------------
మంత్రి కొల్లు రవీంద్ర ప్రసంగంలోని ముఖ్య అంశాలు.
తెలుగు వారి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం.
కేంద్రం రాష్ట్రానికి చేసిన అన్యాయం పై దశల వారీగా పోరాటం చేస్తున్నాం.
హోదా ఇవ్వడం కుదరని జైట్లీ చెప్పినప్పటి నుండి పోరాటం చేస్తున్నా పట్టించుకోనందున, మంత్రులు రాజీనామా చేసినారు. ఈరోజు NDA నుండి బయటకు వచ్చాము. కేంద్రం పై అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నాం.
BJP పతనం ప్రారంభమైనది.
TDP తో వైరం పెట్టుకున్న పార్టీలన్నీ నాసనమైపోయాయి.
ఆంద్రప్రదేశ్ కు న్యాయం చేయమని కోరుతున్నాం.
వార్ బిగిన్ అయింది. ఎంతవరకు పోతుందో తెలియదు.
ప్రధాని కార్యాలయం లో విజయసాయిరెడ్డి దొంగనాటకాలు ప్రజలు గమనిస్తున్నారు.
YCP అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కావలసిన 50 మంది MP లను కూడగట్టుకోలేని పరిస్థితి లో ఉంది.
జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయగల దమ్మున్న పార్టీ తెలుగుదేశం పార్టీ.
----------------------------------------------------------------------------
కదిరి ఎమ్మెల్యే  అత్తారు చాంద్ బాషా ప్రసంగంలోని ముఖ్య అంశాలు
5 కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం ముఖ్యమంత్రి 29 సార్లు ఢిల్లీ వెళ్లారు. ఎన్నో అవమానాలు భరించారు.
13 ఏళ్లు  ముఖ్యమంత్రిగా, 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వలేదు.
మోడీ కంటే ముందే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన కంటే ఎక్కువ కాలం పనిచేశారు.
BJP మ్యానిఫెస్టోలో ఉన్న హామీలని నెరవేర్చలేదు.
రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వలేదు.
బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామన్నారు, ఇవ్వలేదు.
రాష్ట్ర ప్రయోజనాలకోసం కేంద్రం తో సఖ్యత గా ఉన్నాం.
హోదా కోసం మంత్రులు రాజీనామా చేశారు, MP లు పార్లమెంట్ ను స్తంభింప చేశారు.
కేంద్రం పై ఎంత వత్తిడి పెంచినా ప్రయోజనం లేక NDA నుండి బయటకు వచ్చాం.
TDP ని దెబ్బ తీయడానికి కుట్ర జరుగుతోంది.
పవన్ సభలో జనసేన అజెండా చదవకుండా జగన్ స్క్రిప్ చదివినారు.
హైదరాబాద్, విశాఖ, ఇక్కడ సభలు పెడితే సరిపోయిందా.
పవన్ కు రాజకీయ అవగాహన లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.
పవన్, జగన్ BJP  తో లాలూచీ పడ్డారు.
13 జిల్లాల్లో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
రాష్ట్ర ప్రయోజనాల కోసం పదవులు వదులుకున్నాము.
రాష్ట్ర ప్రజలు, మైనారిటీలు చంద్రబాబు వెంట ఉన్నారు.
BJP కి ముస్లిం మైనారిటీలు తగిన బుద్ధి చెబుతారు.
మేము పెట్టె అవిశ్వానికి ముఖ్యమంత్రి పై నమ్మకంతో కాంగ్రెస్, AIADMK, తృణమూల్, వామపక్షాలు మద్దతు పలుకుతున్నాయి.
పవన్ కళ్యాణ్ ఇంటి కోసం కొన్న స్థలం రూ.20 లక్షలకు ఎలా ఇచ్చారు.
--------------------------------------------------
 బీజేపీ ఎమ్మెల్సీ  మాధవ్  ప్రసంగంలోని ముఖ్య అంశాలు
TDP, BJP సంబంధాలు తెగతెంపులు అయ్యాయి. అందుకు మాకు సంతోషంగా ఉంది.
ప్రభుత్వ వైఫల్యాలు బయట పడకుండా టీడీపీ వ్యూహాత్మక ముగా NdA నుండి బయటకు వస్తుంది.
గతంలో TDA గెలిచినపుడల్లా BJP మద్దతు ఉంది.
1984 సంక్షోభం సమయంలో BJP NTR కి మద్దతు ఇచ్చింది.
1989 లో TDP ఓడిపోయి, బాధ్యత తీసుకోకుండా, BJP పై నెట్టి బయటకు వెళ్ళారు.
1998 లో వాజపేయి హయాంలో లో మాకు 19 శాతం ఓటు బ్యాంకు రావడంతో TDP మాతో కలసింది.
1994 లో ముందస్తు ఎన్నికలలో BJP తో కలసి, ఓడిపోయిన తరువాత BJP పై తోసినారు.
1999 లో లెఫ్ట్ పార్టీలతో కలిసి ఓడిపోయారు.
2014 లో మోడీ గారిని చూసి BJP తో కలసివచ్చి అధికారంలోకి వచ్చారు.
రాష్ట్రంలో అన్నిచోట్లా అవినీతి బాగా పెరిగిపోయింది.
రాష్ట్రానికి నిధులు కేటాయింపులు లేవని మంత్రులు రాజీనామా చేశారు.
YSRCP తో TDP అక్రమ సంబంధం పెట్టుకుంది.
సభలో అవిశ్వాసం పెడితే, కాంగ్రెస్ వారికి చర్చకు ఎక్కువ అవకాశం వస్తుంది. ఆ విధంగా కాంగ్రెస్ కు జవసత్వాలు ఇవ్వనున్నారు.
ఎన్నికలకు ఏడాది ముందే విడిపోయి మా నెత్తిన పాలుపోశారు.
ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటాం.
13 జిల్లాల్లో కేంద్రం52 సంస్థలు ఏర్పాటు చేసింది.
--------------------------------------------------------------------
వినుకొండ ఎమ్మెల్సీ జీవీ ఆంజనేయులు ప్రసంగంలోని ముఖ్య అంశాలు
హోదా హామీలు అమలు చేయనందున NDA కు మద్దతు ఉపసంహరించుకున్నాం.
రాష్ట్రంలో, దేశంలో మాకు అనేక మంది మద్దతు ఉంది.
కేంద్రం పై అవిశ్వాసం పెడతామని YCP ముందుకు వచ్చిన ప్రజలకు దానిపై విశ్వాసం లేదు.
BJP పవన్ తో, జగన్ తో కలిసింది.
BJP తో విలీనానికి YCP సిద్ధం.
MP విజయసాయిరెడ్డి నెలరోజుల నుండి ఢిల్లీ లో జరిపిన మంతనాలు విజయవంతం అయినాయి.
YCP MP శివ ప్రసాద్ జనసేన మాతో ఉంది అని చెప్పారు.
వీళ్ళంతా చంద్రబాబునంపై కక్ష కట్టారు.
BJP కి ప్రజలు గుణపాఠం చెబుతారు
BJP దాని మిత్ర పక్షాలు పతనమై పోతాయి.
కేసుల మాఫీకోసం YcP ప్రయత్నస్తుంది.
పవన్ తో నిరాహారదీక్ష చేయించి, ఆతరువాత కొన్ని హామీలు ఇచ్చి పవన్ ను హీరోని చేస్తారు.
కురుక్షేత్రం లో పాండవులు విజయం సాధించినట్లు TDP విజయం సాధిస్తుంది.
చంద్రబాబు వెనుక6 కోట్ల మంది ప్రజలు ఉన్నారు.
విజయసాయిరెడ్డి బ్రోకర్ లాగా వ్యవహరిస్తున్నాడు.
ప్రజలు క్షమించరు.
-----------------------------------------------------------------
అమలాపురం MLA ఆనందరావు ప్రసంగంలోని ముఖ్య అంశాలు.
వాజపేయి కాలంలో NDA ఏర్పడింది.
దానిపై ప్రజలకు నమ్మకం ఉందేది.ఇప్పుడది National Duplicate Agency గా మారింది..
దానిలో నుండి ఒక్కొక్క పార్టీ వెళ్లిపోతున్నాయి.
శివసేన, అకాలిదళ్, ఇప్పుడు TDP.
బీజేపీ వాళ్ళు దక్షిణాది రాష్ట్రాలను దెబ్బతీస్తుంది.
తిరుపతిలో వేంకటేశ్వరుని సాక్షిగా హామీలుబిచ్చి నెరవేర్చలేదు.
ఓట్లు అడగటానికి BJP ఎలా వస్తుంది.
రాష్ట్రాల హక్కులను హరించి, మిత్రులకు వెన్నుపోటు పొడిచి BjP ని ప్రజలు త్రిప్పికొడతారు.
TDP లేకుండా BJP అధికారంలోకి రాలేదు.
బీజేపీ లేకుండా TDP అధికారంలోకి వస్తుంది.
AP కి ద్రోహం చేసిన BjP ఎన్నడూ కాంగ్రెస్ తో కలవని వారు AP ని విడదీయడానికి కాంగ్రెస్ తో కలిశారు.
BJP సమక్షంలో పార్లమెంటు తలుపులు మూసి రాష్టాన్ని విడదీశారు.
లింగు లింగు మంటూ 5 సీట్ల తో YCP ఎలా అవిశ్వాసం పెడుతుంది.
-----------------------------------------------



No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...