Mar 5, 2018

వ్యవసాయ రంగంలో దూసుకుపోతున్న ఏపీ



వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
            సచివాలయం, మార్చి 5: వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దూసుకుపోతోందని వినుకొండ శాసనసభ్యుడు జీవీ ఆంజనేయులు చెప్పారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద సోమవారం ఉదయం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వర్షపాతం గత రెండేళ్ల నుంచి తక్కువగా ఉన్నా చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యల వల్ల వ్యవసాయం రంగంలో అభివృద్ధి సాధించినట్లు తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అధికంగా వ్యవసాయ దిగుబడులు వచ్చినట్లు చెప్పారు.  సాగునీటి ప్రాజెక్టుల కోసం తమ ప్రభుత్వం రూ.48,474 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.  నీటివనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం వల్ల గడచిన అర్థ సంవత్సరంలో వ్యవసాయరంగంలో 25.6 శాతం అభివృద్ధి సాధించినట్లు చెప్పారు. అక్వా కల్చర్ లో 42.7 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపారు. రెండేళ్లుగా సాయిల్ కార్డుల పంపిణీలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు.

No comments:

Post a Comment

గోలి మధు కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ!

‘ఎదురీత’ పుస్తక సమీక్ష ఎవరు  ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే  అద్భుతమైన  కవిత్వం రాయగల దిట్ట  ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత...