Mar 12, 2018

ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన రాయితీలు మాకూ ఇవ్వండి



కేంద్రాన్ని డిమాండ్ చేసిన ప్రభుత్వ విప్ పల్లె రఘునాథ రెడ్డి
              సచివాలయం, మార్చి 12: ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన మాదిరిగా రాయితీలు తమ రాష్ట్రనికి ఇవ్వాలని   ప్రభుత్వ విప్ పల్లె రఘునాథ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద సోమవారం ఉదయం ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు పరచాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని తెలిపారు. తమ ప్రభుత్వం పైసా అప్పు చేస్తే పది పైసలు ఆదాయం వచ్చేవిధంగా చూస్తుందన్నారు. తాము ప్రజా అవసరాల కోసమే అప్పు చేసినట్లు తెలిపారు.  రూ.2 లక్షల కోట్లు అప్పు చేస్తే, 2.5 లక్షల కోట్లని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తమకు రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని పల్లె అన్నారు.

No comments:

Post a Comment

గోలి మధు కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ!

‘ఎదురీత’ పుస్తక సమీక్ష ఎవరు  ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే  అద్భుతమైన  కవిత్వం రాయగల దిట్ట  ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత...