Mar 6, 2018

చంద్రబాబుకు బాధ్యత అప్పగించండి



రాజకీయ పార్టీలకు ఎమ్మెల్సీ డొక్కా పిలుపు
          సచివాలయం, మార్చి 6: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం  రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ కలసి అత్యంత అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధం కావాలని శాసనమండలి సభ్యుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ పిలుపు ఇచ్చారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఉదయం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అందరికంటే సీనియర్ రాజకీయవేత్త చంద్రబాబు అని, 5 కోట్ల మంది ఆంధ్రప్రజల గురించి ఆలోచించేవారు మరొకరు ఉండరని, అటువంటి నాయకుని నాయకత్వంలో ప్రత్యేక హోదాకోసం పని చేస్తామని అన్ని రాజకీయ పార్టీలు లేఖ రాయాలని కోరారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం, రాష్ట్రాభివృద్ధి కోసం రాజకీయాలు వదిలి కలసికట్టుగా పని చేయాలన్నారు. కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నామన్నారు. వాటిని సాధిస్తామని డొక్కా ధీమా వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment

గోలి మధు కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ!

‘ఎదురీత’ పుస్తక సమీక్ష ఎవరు  ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే  అద్భుతమైన  కవిత్వం రాయగల దిట్ట  ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత...