Mar 8, 2018

కేంద్ర మంత్రి మాటలు బాధ కలిగించాయి



మంత్రి నక్కా ఆనందబాబు

             సచివాలయం, మార్చి 8: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిన్న మాట్లాడిన మాటలు తమకు బాధ కలిగించాయని సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద గురువారం ఉదయం ఆయన మాట్లాడారు. అరుణ్ జైట్లీ ఎప్పుడు ఇంత కటువుగా మాట్లాడలేదన్నారు. తప్పసరి పరిస్థితుల్లో కేంద్రంలోని తమ మంత్రులు బయటకు వస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరితో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలు తమపై విశ్వాసం, నమ్మకం ఉంచి అధికారం కట్టబెట్టారన్నారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయం అని, ప్రత్యేక రాష్ట్రం కోసం తాము పోరాడతామని, ప్రతిపక్షం కూడా కలసిరావాలని కోరుతున్నామని ఆనందబాబు చెప్పారు.

రాజకీయ ప్రయోజనాలకన్నా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం: మంత్రి జవహర్

                రాజకీయ ప్రయోజనాలకన్నా తమకు  రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్ర మంత్రి మండలి నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. పార్లమెంటులోనైనా, ఎక్కడైనా పోరాడే శక్తి టీడీపీకి ఉందన్నారు. ఆంధ్ర ప్రజల మనోభావాలు ముఖ్యమైని, పార్లమెంటు సాక్షిగా విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక హోదా, ఇతర హామీలు నెరవేర్చమని కోరుతున్నట్లు తెలిపారు. తమకు రావలసిన నిధులు మాత్రమే తాము అడిగామన్నారు. అయితే ప్రధాన మంత్రి మోదీ సైన్యానికి కేటాయించిన నిధులు ఇవ్వాలా? అని వెటకారంగా మాట్లాడటం బాధ కలిగించిందని తెలిపారు.  నాలుగేళ్లు ఎదురు చూసి, విసిగిపోయి బయటకు వస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక హోదా అంశం కేంద్రం పునరాలోచించాలని కోరారు. ప్రత్యేక హోదా పేరే తప్ప అన్ని ఇస్తామన్నారని, మోసం జరిగిందని అన్నారు. ఇక ముందు తాము వ్వ్యూహాత్మకంగా ముందుకు వెళతామని మంత్రి  జవహర్ చెప్పారు. 

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...