Mar 7, 2018

మా డిమాండ్ ప్రత్యేక హోదా



ఎమ్మెల్యే అప్పలనాయుడు
             సచివాలయం, మార్చి 7: రాష్ట్రానికి ప్రత్యేక హాదా ఇవ్వాలన్నదే తమ డిమాండ్ అని గజపతినగరం శాసనసభ్యుడు డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు స్పష్టం చేశారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద బుధవారం ఉదయం ఆయన మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధిని దృష్టిలోపెట్టుకొని గతంలోనే తాము శాసనసభలో ప్రత్యేక హోదాపై తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్లు తెలిపారు. 70 ఏళ్ల వయసులో కూడా ముఖ్యమంత్ర చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని, 29 సార్లు ఢిల్లీ వెళ్లి విభజన హామీలు అమలు చేయమని కోరినా కేంద్రం పట్టించుకోలేదన్నారుతమ ప్రధాన డిమాండ్ ప్రత్యేక హోదా అని, తమ ఎంపీలు పార్లమెంట్ లో దీనికోసమే పోరాటం చేస్తున్నారని డాక్టర్ అప్పలనాయుడు చెప్పారు.

No comments:

Post a Comment

గోలి మధు కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ!

‘ఎదురీత’ పుస్తక సమీక్ష ఎవరు  ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే  అద్భుతమైన  కవిత్వం రాయగల దిట్ట  ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత...