Mar 8, 2018

5 కోట్ల ఆంధ్రుల ఆశలు నీరుగార్చారు



ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

సచివాలయం, మార్చి 8: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 5 కోట్ల మంది ఆంధ్రుల ఆశలు నీరుగార్చారని వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద గురువారం ఉదయం ఆయన మాట్లాడారు. రూ.16వేల కోట్ల రెవెన్యూ లోటుతోపాటు కట్టుబట్టలతో రాష్ట్రాన్ని విడగొట్టారని, రాష్ట్రాభివృద్ధి కోసం బీజేపీతో కలసి పోటీచేశామని, కేంద్ర మంత్రి మండలిలో చేరామన్నారు. 4 ఏళ్లు ఆశగా ఎదురు చూశామని, ఫలితం లేకపోవడంతో కేంద్ర మంత్రి మండలిలో ఉండటం పద్దతికాదనిపించిందన్నారు. లక్ష్యాలు నెరవేరనందుకు బయటకు రావాలనుకున్నట్లు తెలిపారు. మంత్రి మండలి నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తప్పుకోవడానికి సిద్ధపడిన మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తామన్నారు. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ప్రయోజనం కోసం పోరాటం చేస్తుందని చెప్పారు. ఆదుకుంటారన్న ఉద్దేశంతోనే నిరసన తెలియజేసినట్లు ఆంజనేయులు చెప్పారు. ఆయన వెంట ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఉన్నారు.

No comments:

Post a Comment

గోలి మధు కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ!

‘ఎదురీత’ పుస్తక సమీక్ష ఎవరు  ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే  అద్భుతమైన  కవిత్వం రాయగల దిట్ట  ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత...