Mar 20, 2018

20.03.2018 మంగళవారం – శాసనసభ మీడియా పాయింట్



తెలుగుదేశం పార్టీ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
ప్రత్యేక ప్యాకేజి పాచిపోయిన లడ్డు అన్న పవన్, ఇప్పుడు మళ్లీ ప్యాకేజీ అడుగుతున్నాడు.
స్క్రిప్ట్ BJP ది, యాక్షన్ పవన్ ది.
అవిశ్వానికి మద్దతు కూడగడతాను అన్నాడు, ఇప్పుడు తప్పించుకుంటున్నాడు.
TDP ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంది.
పోలవరం అవినీతిని గురించి 4 సం,, నుండి ఎందుకు మాట్లాడలేదు.
దమ్ముంటే అవినీతి నిరూపించండి, చర్యలు తీసుకుంటాము.
మోడీ పన్నిన కుట్రలో పావులు కావద్దు.
నిధులు ఇవ్వమంటే BJP వాళ్ళు మామీద దాడులు చేస్తున్నారు.
BJP కుట్రలు, విద్రోహాలకు పాల్పడుతుంది.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం నంబర్ 1 లో ఉంటే ఇప్పుడు 19 వ స్థానంలో ఉంది.
జగన్ ఆత్మ అయిన విజయసాయిరెడ్డి ప్రధాని, ప్రధాని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు.
A1, A2 లను తన చుట్టూ త్రిప్పుకోవడంలో లాలూచి ఏమిటి?
ఒక ప్రక్క NDA, BJP లపై అవిశ్వాసం పెడతానంటూ, ప్రధాని కార్యాలయం చుట్టూ తిరగడం ప్రజలను మోసం చేయడం కదా?
వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.
5 కోట్ల ప్రజలు చంద్రబాబు వెంటే ఉన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం అలసి పోకుండా పోరాటం చేస్తున్నాం.
ప్రశాంత్ కిశోరె ఇక్కడ జగన్ కు అక్కడ BJP కి సలహాలు ఇస్తున్నారు.
అక్కడ జరిగేది ఇక్కడ జగన్ కు చేరవేస్తున్నాడు.
PK (ప్రశాంత్ కిషోర్) ఎన్ని సలహాలు ఇచ్చినా పీకేది ఏమి లేదు.
----------------------------------------------------------
20.03.2018  మంగళవారం మీడియా పాయింట్
పాలకొల్లు MLA డాక్టర్ నిమ్మల రామానాయుడు

పవన్ కళ్యాణ్ మాటలు చూస్తుంటే, 5 కోట్ల మంది ప్రజలది ఒక తీరు, పవన్ ది ఒక తీరు లాగా ఉన్నది.
పవన్ కు అవగాహన, నిలకడ లేదు.
2017 మార్చి తరువాత ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమి అని చెప్పి, 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా పొడిగించారు.
పోలవరం ప్రాజెక్ట్ పై విచారణ చేయమని పవన్ అడుగుతున్నారు.
గోదావరి జలాలతి రాష్ట్రాన్ని కరువు రహితంగా చేయడానికి చంద్రబాబు గారు ప్రతి సోమవారం ను పొలవారం గా మార్చుకున్నారు.
2019 నాటికి పోలవరం పూర్తి చేయాలని చంద్రబాబు పట్టుదల తో ఉన్నారు.
పవన్ మాటలు రైతులకు నష్టం కలిగిస్తాయి.
ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలనే ఉద్దేశంతో, నీతి ఆయోగ్ సిఫారసు మేరకు ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.
ఈ విషయాన్ని పవన్ గ్రహించాలి.
దేశంలో 24 జాతీయ ప్రాజెక్టుల నిర్మాణం నత్తనడకన సాగుతోంది.
పశ్చిమ బెంగాల్ లో తీస్తా అను ప్రాజెక్టును ప్రారంభించి 20 సం,, అయినది. కానీ ఇప్పటికీ పూర్తి కాలేదు.
లక్ష కోట్లు తిన్న A1 ముద్దాయి జగన్, A2 విజయసాయిరెడ్డి ల గురించి పవన్ మాట్లాడారు.
జగన్ కేసులపై ఒక్క మాట కూడా మాట్లాడరు.
ఈ వయస్సులో రాష్ట్రం కోసం చంద్రబాబు ఎంతో కాస్త పడుతున్నారు.
34 సం,, వయస్సులో లోకేష్ కుటుంబాన్ని వదలి తండ్రితో కలసి శ్రమిస్తున్నారు.
పవన్ ద్వంద వైఖరి అవలంభిస్తున్నారు.
పవన్ KCR కు 6 మార్కులు, చంద్రబాబు కు 2 1/2మార్కులు వేశారు.
16 వేలకోట్ల రెవిన్యూ లోటు ఉన్నా కనబడనీయకుండా పరిపాలన సాగిస్తున్నారు, అటువంటి చంద్రబాబు కు రెండు మార్కులు ఎలా వేస్తారు.
26 వేల కోట్ల రైతు రుణాల, 10 వేళా కోట్ల డ్వాక్రా రుణాలు ఫింఛన్ల పెంపు, నిరంతర విద్యుత్తు చంద్రన్న భీమా వంటి పథకాలతో అద్భుత పరిపాలన చేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం, రెండంకెల వృద్ది తో ముందుకు పోతున్నారు.
పవన్ వాస్తవాలు మాట్లాడాలి, అలా కాకపోతే 5 కోట్ల మంది ఆంధ్రులకు, 15 కోట్ల మంది తెలుగు వారికి దూరమవుతారు.
---------------------------------------------------------
20.03.2018  మంగళవారం మీడియా పాయింట్
PDF  MLC కత్తి నరసింహ రెడ్డి

రాష్ట్రంలో 250 గ్రామీణ పశువైద్య శాలలను అప్ గ్రేడ్ చేయమని, 1200 పశు వైద్య విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, ఈ విషయమై సభలో వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టాము. సంబంధిత మంత్రి సానుకూలంగా స్పందించారు, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
01.09.2004 తరువాత ఎయిడెడ్ కాలేజీలు, పాఠశాలల సిబ్బందికి పాత, కొత్త పెన్షన్ విధానంలోని ఏ విధానంలోనూ పెన్షన్ వర్తింపచేయడం లేదు. వారికి కూడా పెన్షన్ వర్తింప చేయాలి.
ఈ నెల 22 న విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున జాతీయ రహదారుల దిగ్భంధనం కార్యక్రమం చేపట్టారు.
పార్లమెంట్ సాక్షిగా ఆ నాడు మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
తెలుగుదేశం పార్టీ కూడా సహకరించి ఇందులో పాల్గొనాలని కోరుతున్నాం.
తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర నటులు, నటీమణులు కూడా ఆందోళన కార్యక్రమమునకు మద్దతు ఇవ్వాలి.
తమిళనాడు లో జల్లికట్టు సమస్యపై తమిళ సినీ ప్రముఖులు మాట్లాడి కేంద్రం పై వత్తిడి తెచ్చారు.
ఇప్పుడు మన సినీ పరిశ్రమ కూడా ముందుకు రావాలి.
--------------------------------------------------------
20.03.2018  మంగళవారం మీడియా పాయింట్
దక్షిణ విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్

బీజేపీ కి అవిశ్వాసం అంటే భయం ఎందుకో తెలియటం లేదు.
ప్రజల్లో బీజేపీ పై అవిశ్వాసం వచ్చింది...
ప్రతి విషయం లో డివైడ్ అండ్ రూల్ పాలసీ లో బీజేపీ ఉంది.
ఔట్ డేటెడ్ జగన్ ని పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేసి  బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేయాలని చూస్తున్నారు..
పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ని ప్రశ్నించండి..
కష్టపడి పని చేస్తున్న చంద్రబాబు గారిని కాదు..
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని కృషి చేస్తున్న సీఎం ని అనటం సరికాదు..
పవన్ కళ్యాణ్ బీజేపీ ని నమ్మితే ప్రజలు నమ్మే పరిస్థితి లో లేరు..
స్వతంత్ర ఉద్యమంలో BJP పాత్ర ఏమి లేదు.
స్వాతంత్ర్య ఉద్యమం సమయంలో RSS కూడా రెండు దేశాలు కావాలని చెప్పారు, దానిని గాంధీ గారు వ్యతిరేకించారు. అటువంటి BJP  ఇప్పుడు స్వచ్ఛ భారత్ పేరుతో గాంధీ గారి  ఫోటో పెట్టుకుంటుంది.
మతతత్వం ఉన్న పెద్దలు అధికారంలో ఉంటే దేశానికి చేటు అని గాంధీజీ గారు చెప్పారు.
రాష్ట్ర పాలన గాడి తప్పించాలని కుట్ర చేస్తున్నారు.
జగన్ ను, పవన్ ను BJP వాడుకొంటుంది.
మీరు ప్రశ్నించే ప్రతి ప్రశ్నను BJP ని వేయండి.
ఇండిపెండెన్స్ డే ని బ్లాక్ డే గా జరుపుకొంది, 2017 లో మీరట్ లో జనవరి 30 గాంధీ వర్ధంతి ని డప్పులతో ఘనంగా BJP జరుపుకొంది.
-------------------------------------------------------------
20.03.2018  మంగళవారం మీడియా పాయింట్
అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల  ఆనంద రావు

10 సం,, కాంగ్రెస్ పాలనలో ప్రజలు స్కాం లతో అసహనానికి గురైనారు. ఇప్పుడు మోడీ అహంకారం వలన అసహనానికి గురిఅవుతున్నారు.
ఏ అద్వానీ గారు దేశంలో BJP బలపడడానికి కారణమయ్యారో ఆయన నమస్కారం పెడితే కూడా మోడీ పట్టించుకోకుండా వెళ్ళాడు.
కుదిరితే ప్యాకేజి ఇద్దాం, లేకపోతే బెదిరిద్దాం అన్నట్లుగా BJP ఆలోచిస్తుంది.
తమిళ తంబీలతో కావాలని BJP పార్లమెంట్ లో  ఆందోనలను చేపిస్తుంది...
హోదా మీద ప్రధానికి  అవగాహాన లేదు అని కిషన్ రెడ్డి అంటున్నారు... అవగాహన లేని ప్రధాని ఈ దేశానికి అవసరమా???..
ఆర్ ఎస్ ఎస్ దేశ వ్యాప్తంగా ఉన్న  దళితులను, ముస్లిం లను  ఇబ్బందికి గురిచేస్తున్నారు....
36 పార్టీలతో పొత్తు పెట్టుకొని, అధికారంలోకి వచ్చి, ఇప్పుడు నాగుపాము తన గుడ్లు తిన్నట్లుగా ప్రాంతీయ పార్టీలని ఎదగకుండా చేస్తుంది.
హోదా సెంటిమెంటా, మోడీ అహంకారమా. 2019 ఎన్నికలలో ఏదీ గెలుస్తుందో చూద్దాం.
BJP అంటేనే RSS ప్రభుత్వం.
TDP NDA నుండి బయటకు వచ్చిన రోజునే BJP పతనం ప్రారంభమైనది.
-------------------------------------
20.03.2018  మంగళవారం మీడియా పాయింట్
గజపతినగరం MLA   డాక్టర్ కొండపల్లి అప్పల నాయుడు 
చంద్రబాబు ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలని 3 వ సారి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడానికి సన్నాహాలు చేస్తున్నారు.
రాష్ట్ర ప్రయోజనాలకోసం ఎంపీలు పోరాడుతుంటే రాజకీయాల్లో ఓనమాలు దిద్దని పవన్ మాట్లాడుతుంటే అశ్చ్యర్యం వేస్తుంది.
ప్యాకేజి సరిపోతుంది అని పవన్ మాట్లాడటంతోనే తన చిత్తశుద్ధి ఎంటో అర్థం అవుతుంది.
పవన్ కళ్యాణ్ అవగాహన తో మాట్లాడాలి.
అవగాహన లేని మాటలతో,చర్యలతో
పోరాటాన్ని నిర్వీర్యం చేసేలా పవన్ వ్యవహరించద్దు.
రాజకీయ అవగాహన లేని పవన్ చంద్రబాబు కు మార్కులు వేస్తారా?
పవన్ ఫికెల్ మైండెడ్ ఫెల్లో అని ప్రజలు అతనికి జీరో మార్కులు వేశారు.
జగన్ కి వత్తాసు పలికే పవన్ కళ్యాణ్ అవినీతి గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వళ్ళించినట్లుంది.
------------------------------------------------
20.03.2018  మంగళవారం మీడియా పాయింట్
TDP MLC బాబు రాజేంద్రప్రసాద్.
అన్ని వర్గాల వారు ప్రత్యేక హోదా మద్దతు ఇస్తుంటే సినీ పరిశ్రమ ఎందుకు ముందుకు రావడం లేదు..
జల్లికట్టు కట్టు ఉద్యమాన్ని తమిళ సినీ పరిశ్రమ ముందుండి నడిపించింది..
తెలుగు చిత్ర పరిశ్రమకి చావ చచ్చిపోయిందా???
పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కవిత, కేటీఆర్ అందరూ మద్దతు ఇస్తుంటే మీకు ఏమి అయ్యింది...
అవార్డులు రాకపోతే లొల్లి లొల్లి చేస్తారు......
ఆంధ్ర ప్రజలకు నిధులు రావటం లేదు మీకు కనపడటం లేదా?
AC రూములలో కులుకుతూ కూర్చుంటారా?
తమిళ నటి నటులను చూసి అయినా తెలుగు సినీ పరిశ్రమ బుద్ది తెచ్చుకోవాలి.....
ఆంధ్రా గడ్డలో పుట్టిన ఒక్క హీరో అయినా రాష్ట్రం విడిపోయిన తరువాత ఈ గడ్డ మీదకి వచ్చారా....???
తెలుగు సినీ పరిశ్రమ డైరెక్టర్లు హీరోయిన్ బొడ్డులు,జగణాలు గురించి వర్ణించటానికి తప్ప దేనికి పనికి రారు...
మీరేమైనా హాలీవుడ్ నటులంతా గొప్పవాళ్ళా? అంతా ఏజ్ బార్ అయిన వాళ్లే.
తెలుగు సినీ కళాకారులను వెలివేయడానికి 5 కోట్ల ఆంధ్రులు సిద్ధంగా ఉన్నారు.
*****************************

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...