Mar 20, 2018

24 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు



సచాలయం, మార్చి 20: ఈ నెల 24 నుంచి 27 వరకు విజయవాడలోని  ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో శాసనసభ, శాసనమండలి సభ్యుల  క్రీడల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అమరావతిలోని శాసనసభ స్పీకర్ ఛాంబర్ లో మంగళవారం ఉదయం స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 24వ తేదీ నుంచి 26 తేదీ వరకు ఆటల పోటీలు నిర్వహిస్తారు. క్రికెట్, బాడ్మింటన్, టెన్నీస్, టగ్ ఆఫ్ వార్, టెన్నికాయిట్, కబాడీ, వాలీబాల్, మ్యూజికల్ చైర్, ఈత, త్రోబాల్ మొత్తం 10 విభాగాల్లో ఆటల పోటీలు నిర్వహిస్తారు.  27న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సభ్యులు ఎవరికి ఏ క్రీడలో ప్రావీణ్యం ఉంటే అందులో పాల్గొనే అవకాశం ఉంటుంది. సమావేశంలో  మండలి ఉప సభాపతి రెడ్డి సుబ్రహ్మణ్యం, మంత్రులు యనమల రామకృష్ణుడు, కాల్వ శ్రీనివాసులు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, కొల్లు రవీంద్ర, చీఫ్ విప్ పల్లె రఘునాథ రెడ్డి, విప్ కూన రవికుమార్, ఇన్ చార్జ్  సెక్రటరీ విజయరాజు తదితరులు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...