Mar 22, 2018

21.03.2018 బుధవారం – శాసనసభ మీడియా పాయింట్


ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి కామెంట్స్

·       జగన్ కి కానీ, పవన్ కి కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే ఉద్దేశ్యం లేదు.
·        ఈ రోజు సాక్షి పేపర్ మొదటి పేజీని చంద్రబాబు ని విమర్శించడానికే కేటాయించారు.
·        కేంద్రాన్ని కానీ, మోడీని కాని విమర్శించలేదు.
·        లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేయడం అధర్మం.
·        దేశంలో ఆస్తులు ప్రకటించిన సి.యం చంద్రబాబు ఒక్కరే.
·        2013 లో ఆంధ్రప్రదేశ్ అవినీతి లో మొదటి స్థానం లో ఉంది. కానీ ఇప్పుడు 19వ స్థానంలో ఉంది.
·        చంద్రబాబు ఆధ్వర్యంలో అవినీతి రహిత రాష్ట్రం ఏర్పడనుంది.
·        జగన్ మాదిరి తండ్రిని అడ్డం పెట్టుకొని లోకేష్ లక్షలు కోట్లు గడించలేదు.
·        ఢిల్లీ కి మించిన రాజధాని నిర్మిస్తామని మోడీ తిరుపతి లో హామీ ఇచ్చారు.
·        రాజధానికి డబ్బులు ఇచ్చామంటున్నారు. ఇచ్చింది 1500 కోట్లు.
·        గుజరాత్ లో ఒక నగరం నిర్మాణానికి 70,000 కోట్లు ఖర్చు అయింది.
·        అమరావతిలో 10,000 కోట్ల ఖర్చుతో రోడ్ల నిర్మాణం జరుగుతోంది.
·        కొండవీటి వాగు సమస్య పరిష్కారం అయింది.
·        ఒక పక్క అసెంబ్లీ, మరో పక్క ఉన్నతాధికారులకు ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టబోతున్నారు.
·        భారతంలో 100 మంది కౌరవులు.. 5 పాండవులు ఉంటారు. వారి మీదకి ఎవరైనా దండెత్తితే మేము 105 మంది అని చెప్తారు. అలాగే ఇప్పుడు మన 5 కోట్ల మంది ఆంధ్రుల అందరి కోరిక ప్రత్యేక హోదా. అందరూ ఓకేమాట మీద పోవాలి. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే చరిత్రహీనులవుతారు.
·        మేము 4 ఏళ్ళు వేచిచూశాం.  మాకు ఓపిక నశించింది.. మొదట మా మంత్రులు రాజీనామా చేశారు.. తర్వాత ఎన్డీఏ నుంచి తప్పుకున్నాము..
·        అంతేకానీ జగన్ మాదిరి ఉత్తరకుమార ప్రగల్భాలు పలకలేదు..
·        కేసుల మాఫీ కోసం ఆస్తుల రక్షణ కోసం జగన్ ప్రథాని ముందు మొకరిల్లారు...
---------------------------------------------------
TDP MLA GV ఆంజనేయులు..
కేంద్రం పై పెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా అడ్డుకోవడం బాధాకరం.
AIADMK  పార్టీని  శిఖండిలా అడ్డుపెట్టుకుని అవిశ్వాస తీర్మానం అడ్డుకుంటున్నారు.
MP లు పార్లమెంట్ లో పోరాడుతుంటే వారిని అడ్డుకొంటున్నవారి గురించి మాట్లాడకుండా, జగన్ ముఖ్యమంత్రి గారి గురించి విమర్శిస్తూ మాట్లాడుతున్నారు.
మోడీని ఒక్క మాటైనా సూటిగా ప్రశ్నించే దమ్ము జగన్ కు ఉందా?
చంద్రబాబు ఆశ రాష్ట్ర అభివృద్ధి పైన, జగన్ ఆశ కేసుల మాఫీ పైన ఉంది.
మోడీ డైరెక్షన్ లో జగన్ మాట్లాడుతున్నారు.
జగన్ విజయసాయిరెడ్డి ని తన ఏజెంట్ గా రాజ్యసభ కు పంపినాడు, బ్రోకర్ గా సక్సెస్ అయ్యాడు. విజయసాయిరెడ్డి కేసుల మాఫీ కోసం ప్రధాని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు.
YCP వాళ్ళు మోడీతో కుమ్మక్కు అయ్యారు, అవిశ్వాసం పై వారికి చిత్త శుద్ధి లేదు. మోడీ కాళ్ళ వద్ద మోకరిల్లారు.
BJP వాళ్లు A2 ని ప్రక్కనంపెట్టుకొని AP కి అన్యాయం చేసారు.
మేము మా హక్కులు అడగడం తప్పా?
మోడీపై చంద్రబాబుకు గానీ, TDP కి గాని ఏవిధమైన వ్యక్తిగత కక్షలేదు. మోడీ విధానాలపైనే మా విమర్శ.
విభజన చట్టంలోని 18 హామీలని నెరవేర్చడంలో మోసం, దగా చేశారు.
నిధులు అడిగితే నిందలు మోపారు.
అవిశ్వాసం కోసం, మా హక్కుల కోసం పోరాడతాం.
మోడీ డిగిరావాల్సిందే, AP హక్కులు సాధిస్తాము.
---------------------------------------
TDP MLC బుద్దా వెంకన్న మీడియాతో చిట్ చాట్....
తమిళనాడు లో పలని స్వామి, పన్నీరు సెల్వం లు BJP తొత్తులుగా మారారు. సభను అడ్డుకొంటున్నారు.
వారు తమిళనాడు లో కూడా తెలుగు వాళ్ళు అధికంగా ఉన్నారని గుర్తించాలి.
అన్నదమ్ములు గా విడిపోయాం, అన్నకో, తమ్ముడికో ఇబ్బంది వచ్చినపుడు ఇద్దరూ కలిసి పోరాడాలి. అలాగే TRS వాళ్ళు కూడా మాకు సహకరించాలి.
  మార్కులు వేయాల్సి వస్తే చంద్రబాబు కు వందకు వంద, మోడీ కి ఒక సున్నా, జగన్ కు రెండు సున్నాలు, పవన్ కు మూడు సున్నాలు వేయాలి.
వెళ్లకు రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు, రాజకీయం కావాలి.
మోడీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు కూడా హోదాకు మద్దతు పలుకుతుంటే, పవన్ మాత్రం మోడీ చెప్పినట్లుగా మాట్లాడుతున్నాడు.
----------------------------------------------------
PDF MLC కత్తి నరసింహ రెడ్డి.
జాతి భవిష్యత్తు తరగతి గది నుండి ప్రారంభమౌతుంది.అటువంటి తరగతి గదుల నిర్మాణం నాణ్యంగా ఉండాలి.
రాష్ట్రంలో8400 భవనాలు ఉన్నాయి, వాటిని నాణ్యతతో నిర్మించాలని, 50 ఏళ్ల వరకుంపతిష్టంగా ఉండేలా పటిష్టంగా నిర్మించాలని సభలో కోరగా సంబంధిత మంత్రి సానుకూలంగా స్పందించారు.
ఏదైనా పాఠశాల భవనం 50 సం,, వరకు చెక్కుచెదరకుండా ఉండేలా నిర్మించాలి.
ఉపాధ్యాయులను వేసవి సెలవుల్లో మాత్రమే బదిలీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
తమిళనాడు లో ఉపాధ్యాయులు ఎవరైనా అకడమిక్ ఇయర్ మధ్యలో రిటైర్మెంట్ అయితే, విద్యార్థుల బోధనకు ఇబ్బంది కలుగకుండా వారిని ఆ ఏడాది చివరివరకు కొనసాగిస్తారు. మన రాష్ట్రంలో కూడా అదేవిధంగా కొనసాగించమని కోరినాను.
డిగ్రీ కేజీ అధ్యాపకులకు కెరియర్ అడ్వాన్సుమెంట్ స్కీం GO ఉంది కానీ అమలుకావడం లేదు. దానిని అమలు చేయవలసిందిగా కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు.
GAD (General Administration Department) జారీ చేసిన నిబంధనల ప్రకారం స్థానిక స్థానిక సంస్థలలో ఖాళీలని మాత్రమే కారుణ్య నియామకాలకు భర్తీ చేయాలి. ఇతర శాఖలలో భర్తీ చేయుటకు వీలులేదు. అయితే గతంలో కలెక్టర్ అధ్యక్షతన కమిటీ నిర్ణయించిన ప్రకారము అన్ని శాఖలలో నియమించేవారు. ఇప్పుడు కూడా అదేవిధంగా నియమించమని కొరినాను.
కేంద్రం విభజన హామీలు అమలు చేయాలి.
పార్లమెంటు లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే గందరగోళం సృష్టిస్తున్నారు.
రాష్ట్రం విభజించినపుడు కూడా ఇంతకంటే గందరగోళ పరిస్థితి ఉంది.
పార్టీలతో సంబందం లేకుండా అందరూ ఒకే మాట మీద నిలబడి కేంద్రం పై ఒత్తిడి పెంచాలి.
-------------------------------------------------------
BJP MLC Madhav చిట్ చాట్
మామీద జరిగే దాడిని తప్పకుండా త్రిప్పికొట్టాలి అని అమిత్ షా గారు మాకు చెప్పినారు.
4 సం,, లో లేనిది ఈ 10 రోజులలో ఎలా మారిపోయింది?
నేను అడిగినంతా ఇవ్వాలి, లేకపోతే ఇలాగే చేస్తాం అన్నట్లుగా మాట్లాడుతున్నారు.
దక్షిణ భారతదేశం ను చిన్న చూపు చూస్తున్నామని ప్రాంతీయ విభేదాలు తెచ్చే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది.
అనేక అవినీతికి సంబంధించిన అంశాలు ఉన్నాయి, వాటిని బయటకు తీసుకురావాల్సిన అవసరం మాకు ఉంది.
తెలుగుదేశం నాయకులు చెప్పిందే చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రజలకి వాస్తవాలు తెలియచెప్పే ప్రయత్నం మేము చేస్తాము.
4 సార్లు తెలుగుదేశం అధికారంలోకి వస్తే 3 సార్లు BJP తో కలసి ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ యూ టర్న్ తీసుకోవడం మాకు అవకాశం గా భవిస్తున్నాము. అవకాశాన్ని వినియోగించుకుంటాము.
చంద్రబాబు పాదయాత్ర లో 1500 వాగ్ధానాలు చేసారు, వాటిలో ఎన్ని నెరవేర్చారు.
ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికి రిజర్వేషన్లు కల్పిస్తాము, నావద్ద ఒక ఫార్ములా ఉంది అని చెప్పి అందరికీ ఇష్టం వచ్చినట్లు వాగ్ధానాలు చేశారు.
ఇప్పుడేమో రిజర్వేషన్లు కు సంబంధించిన అంశాలన్నీ కేంద్రం కేంద్రం కోర్టులో పడవేశాము, కేంద్రం రిజర్వేషన్లు పెంచితే ఇస్తాము అంటూ ప్రజలను ప్రక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
రైతు రుణమాఫీ మాయాగా చేశారు. ఈ బడ్జెట్ లో కేటాయించిన వాటితో మొత్తం15000 కోట్లు మాత్రమే కేటాయించారు, 87000 కోట్లు మాఫీ ఎలా చేస్తారు.
వడ్డి కూడా మాఫీ చేస్తామని చెప్పినారు, 40 వేలకోట్ల వడ్డీ ఎవరు కడతారు.
నిరుద్యోగ భృతి ఎండమావి, అందని ద్రాక్ష గా మారింది.
సుమారు 40 లక్షలు ఉన్న నిరుద్యోగులకు రూ,, 1000 చొప్పున ఇస్తే ఎంత అవుతుంది. అసలు ఈ 4 సం,, ఏమి చేశారు.
ముఖ్యమంత్రి మంత్రి గారు సభలో భావోద్యోగానికి లోనైన తీరు
-------------------------------------------------------
ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు :-
Ø రాష్ట్రం కష్టాల్లో ఉంటే కొంతమంది ప్యాకేజీల గురించి మాట్లాడుతున్నారు..
Ø  మరికొంతమంది కేసుల మాఫీ కోసం ప్రయత్నిస్తున్నారు.. ఇది చాలా దుర్మార్గం..
Ø  పార్లమెంట్లో లో టి.డి.పి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే దాని మీద చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారు..
Ø  మోడీ కి భయం పట్టుకుంది.. రాజకీయాల్లో 40 ఏళ్ళ అనుభవం కలిగిన సీఎం నిధుల కోసం హక్కుల కోసం పోరాడుతుంటే జగన్ కేంద్రం తో లాలూచీ పడ్డారు..
Ø   మేము ప్రధాని పదవి అడగడం లేదు.. కేవలం హోదా మాత్రమే అడుగుతున్నాం..
Ø    మోడీ కేరాఫ్ మోసం.. అమిత్ షా అవివేకి.. తమిళనాడు లో రాజకీయ పార్టీల ను విచ్చిన్నం చేసిన విధంగా రాష్ట్రంలో చేయాలని చూస్తున్నారు..
Ø   సీఎం 29 సార్లు ఢిల్లీ వెళ్లి నిధులు కోరితే పట్టించుకోలేదు..
Ø   ప్రాంతీయ పార్టీలు అసలు ఉండకూడదని మోడీ అమిత్ షాల ఉద్దేశ్యం. భారత ప్రజలు వారు ఉండకూడదని కోరుకుంటున్నారు.. 
Ø   రాష్ట్రానికి మేలు చేస్తారని మేము వారితో కలిస్తే నాలుగేళ్లు తిరక్కుండా మోసం చేశారు..
Ø  బెంగుళూరు, ముంబై, గుజరాత్ లలో మెట్రో రైళ్లకు నిధులు కేటాయించారు.. ఆంధ్రప్రదేశ్ లో విశాఖ రైల్వే జోన్ ఇవ్వలేదు..
Ø   .పి భారత్ లో ఉందా?? పాక్ లో ఉందా?? తెలుగుజాతి క్షమించదు... బిజెపి వారు తెలుగుజాతి ద్రోహులుగా మిగలకూడదు...

***************************

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...