Mar 6, 2018

విభజన హామీలు సాధించడమే లక్ష్యం



వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

            సచివాలయం,మార్చి 6: విభజన చట్టంలోని హామీలు, కేంద్రం ఇచ్చిన హామీలు  అన్నిటినీ సాధించడమే తమ లక్ష్యం అని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చెప్పారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఉదయం ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాజీలేని పోరాటం చేస్తామన్నారు. తమ ఎంపీలు పార్లమెంటులోనూ, బయట అవిశ్రాంతంగా పోరాటం చేస్తూనే ఉన్నారని తెలిపారు. విభజన హామీల అమలుకు సీఎం గత మూడున్నరేళ్లుగా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారని, ఇప్పుడు ఆ ఒత్తిడి తీవ్రతను పెంచుతామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల మద్దతు కూడగట్టపోతున్నట్లు తెలిపారు. రాష్ట్ర సమస్యలను, నెరవేర్చవలసిన అంశాలను సవివరంగా తెలియజేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సీఎం ఒక లేఖ రాయనున్నట్లు చెప్పారు. తమకు మద్దతు కోరుతూ  ఆ లేఖ ప్రతులను అందరు పార్లమెంటు సభ్యులకు, దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులకు అందజేస్తామన్నారు. అందుకు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ వైసీపీ కూడా సిద్ధం కావాలని జీవీ కోరారు. బీజేపీ నేతలు కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.  రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

No comments:

Post a Comment

గోలి మధు కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ!

‘ఎదురీత’ పుస్తక సమీక్ష ఎవరు  ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే  అద్భుతమైన  కవిత్వం రాయగల దిట్ట  ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత...