Mar 6, 2018

ప్రధానిని కించపరిచే ఉద్దేశంలేదు



ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్
        సచివాలయం, మార్చి 6: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కించపరిచే ఉద్దేశం తమకు లేదని, నిరసనలో భాగంగానే విశాఖపట్నంలో ఆందోళన చేసినట్లు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తెలిపారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఉదయం ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో తప్పుని చూపించే బాధ్యత అందరిపై ఉంటుందన్నారు. మిత్రపక్షమైనా ప్రజల పక్షం నిలవాలన్నారు. విశాఖ రైల్ జోన్ ప్రజల సెంటిమెంట్ అని, అది ప్రజల ఆకాంక్ష అని, దానిని తీర్చవలసిన బాధ్యత కేంద్రంపై ఉందని పేర్కొన్నారు. తుది శ్వాస వరకు తాను ప్రజల కోసం పోరాడతానని చెప్పారు. ఈ ఏడాది చివరినాటికి హామీలన్నీ కేంద్రం నెరవేర్చవలసి ఉందన్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోగలగాలని, అలాంటివాడే నిజమైన నాయకుడని చెప్పారు. నాలుగేళ్ల నుంచి కేంద్రాన్ని నమ్ముతున్నామని, ఇంకా నమ్మితే ప్రజలు ఛీకొడతారన్నారు. నాలుగుసార్లు కార్పోరేటర్ గా గెలిచిన ముత్యాల నాయుడుపై ఎటువంటి కేసులు లేవని ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు వంగలపూడి అనిత, ఐతాబత్తుల ఆనందరావు కూడా ఉన్నారు.

No comments:

Post a Comment

గోలి మధు కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ!

‘ఎదురీత’ పుస్తక సమీక్ష ఎవరు  ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే  అద్భుతమైన  కవిత్వం రాయగల దిట్ట  ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత...