Mar 24, 2018

24.03.2018 శనివారం - మీడియా పాయింట్



 పెందుర్తి టిడిపీ MLA బండారు సత్యనారాయణ.
విజయసాయిరెడ్డి తరచు ప్రధాని ని కలిస్తే తప్పేంటి అని BJP నేతలు అంటున్నారు.
ప్రధానిని ఎవరైనా కలవ వచ్చు, కానీ విజయసాయిరెడ్డి ఆర్థిక నేరస్థుడు. 11 కేసులలో A2 గా ఉన్న వ్యక్తి.
విజయసాయిరెడ్డి కి బెయిల్ ఇచ్చే సందర్భంగా బయటకు వస్తే  ప్రభావితం చేసే అవకాశం ఉందని CBI ఆరోపించింది.
CBI కేసులు, ED అటాచ్మెంట్లు ఉన్నపుడు ప్రధాని అపాయింట్మెంట్ ఎలా ఇస్తారు.
ఇటువంటి ఆర్ధిక నేరస్థుడు తరచు ప్రధానిని కలిస్తే CBI, ED వంటి సంస్థలు స్వేచ్ఛగా ఎలా పనిచేస్తాయి.
విజయసాయిరెడ్డి ప్రధానిని కలసిన తరువాతే ED అటాచ్మెంట్ చేసిన 2 ఆస్తులు రిలీజ్ చేశారు.
బెయిల్ ఆఫ్ కండిషన్ అతిక్రమించి ఇన్ఫ్లుయన్స్ చేస్తున్నారు.
బెయిల్ రద్దు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
ఈ విషయం కోర్టుకు అప్పీల్ చేయాలని CBI ని డిమాండ్ చేస్తున్నాం.
జగన్ జీరో అయిపోయాడు.
మోసాలు, లూటీలు, స్కామ్ లు చేసే వ్యక్తి అయినందున విజయసాయిరెడ్డి కి భయపడుతున్న మాట నిజమే.
మళ్ళీ ఏ స్కాం చేస్తాడో, ఏ క్విడ్ ప్రో కో చేస్తాడో అని భయం.
విజయసాయి రెడ్డి కి పాస్ పోర్టు ఇచ్చి ఎక్కడ విదేశాలకు పంపేస్తారేమోనని అనుమానంగా ఉన్నది.
-------------------------------------------------------
 టీడీపీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర

Ø  పట్టిసీమ గురించి మండలిలో చర్చ కు వస్తే పారిపోయిన వ్యక్తి సోమి వీర్రాజు..
Ø   ఆరు నెలల కాలం లో 100 ఎకరాలకు నీళ్లు ఇచ్చిన చరిత్ర టీడీపీ ది....
Ø   కేంద్రం నుండి నిధులు రాకుండా చేస్తున్న వ్యక్తి సోము వీర్రాజు
Ø  సిగ్గుంటే ఎమ్మెల్సీ పదవికి సోము రాజీనామా చెయ్యాలి..
Ø   బీజేపీ కి ఉరి వేయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు..
Ø   రైల్వే జోన్ ఇవ్వంటం కుదరదు  అని కేంద్రం అంటే నోరు విప్పని వ్యక్తి సోము..
Ø  ఏపీ కి సాయం చెయ్యండి అని కేంద్రాన్ని అడగలేని దద్దమ్మలు మీరు....
Ø   మోడీ హయాంలో జరిగిన కుంభకోణాల మీద కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలతో విచారణకు మీరు సిద్ధమా.
----------------------------------------------------
టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న

v సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వం పైన రాష్ట్రంలో అవినీతి జరుగుతుందని ఆరోపిస్తున్నారు
v   పట్టిసీమ ప్రాజెక్ట్ లో ఎల్ అండ్ టి కన్నా తక్కువ కోట్ చేసిన మెగా కంపెనీ వారికి ఇచ్చారు
v   పాముకి పలు ఇస్తే విషం కక్కినట్టు మేము ఎమ్మెల్సీ ని చేస్తే మా పైనే విషం కక్కుతున్నాడు
v  పట్టిసీమ పై మాట్లాడే అర్హత నీకు ఎక్కడ ఉంది
v   సముద్రానికి వృధాగా వెళ్తున్న నీటిని మళ్లించి నదుల అనుసంధానం ద్వారా కృష్టా డెల్టాకు నీరు ఇచ్చిన ఘనత చంద్రబాబు ది 
v   పదమూడు జిల్లాలకు తిరిగి ఆ జిల్లాలో ప్రాజెక్ట్ లలో అవినీతి జరిగిందని  కాంట్రాక్టర్ లను బ్లాక్ మొయిల్ చేయటం లేదా?
v   ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కు ఎమ్మెల్యే సిటు నువ్వు ఎంతకి అమ్ముకున్నావు
v    నువ్వు పార్లమెంట్ కు బిజెపి నుండి పోటీచేస్తే పదిలక్షల ఓటర్లలో 7250 ఓట్లు పొందిన నువ్వు మాట్లాడుతున్నవా?
v    నువ్వే ఒక అవినీతి చక్రవర్తి వి
v   కాంట్రాక్టర్లను బ్లాక్ మొయిల్ చేస్తున్నారని చాలామంది కాంట్రాక్టర్లు కంప్లైంట్ చేస్తున్నారు
v  మా సహకారం లేకుండా మీకు బిల్లులు రావు, మీ నిధులు ఆపుతాము, మా సహకారం లేకుండా మీరు ఎలా పనులు చేస్తారు అని బెదిరించి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారు
v   మా ఎమ్మెల్యేలు ఎక్కడైనా అవినీతి చేస్తే అక్కడకి వెళ్లి అడిగితే మా ఎమ్మెల్యేలు సమాధానం చెబుతారు
v    ఆధారాలు లేని ఆరోపణలు చేసి టిడిపి కి మరక అంటించాలని చూస్తే చూస్తూ ఉరుకోము
v  మమ్మల్ని అవినీతి ఎమ్మెల్యేలు అంటున్నావు, అలా అయితే అవినీతి ఎమ్మెల్యేలతో గెలిచిన నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చెయ్యి..
v   నీకు దమ్ముంటే ఏ రోజే రాజీనామా చేయాలి, లేకపోతే నీకు ప్రజలే బుద్ది చెబుతారు
v    పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ను ఏ విధంగా ప్రాజెక్ట్ ల కోసం ప్రశ్నించి బెదిరింపులకు పాల్పడుతారు
--------------------------------------------
 MLC కత్తి నరసింహ రెడ్డి

రాష్ట్రంలోని 59 పురపాలక, నగర పాలక సంఘాలలో పనో చేసే ఉపాధ్యాయులకి PF సౌకర్యం లేదు.
ఉపాధ్యాయులకు GPF ఖాతాలు లేవు, వారికి PF ఖాతాలకు అవకాశం కల్పించాలని కోరాం.
ఈ ఏడాది ఏప్రిల్ నుండి ట్రెజరీ ల ఆధ్వర్యంలో వారికి PF ఖాతాలు తెరుస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.
అనంతపురం కార్పొషన్ లో 2009 కి ముందు టీచర్ల కు సంబంధించిన సొమ్ము 36 లక్షలు గోల్ మాల్ అయినది. ఆ డబ్బును ఇప్పటికి టీచర్ల ఖాతాలలో జమ చేయలేదు.
ఆ డబ్బు వారికి జమ చేయమని కోరాం.
గత 18 సం,, నుండి మున్సిపల్ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ ద్వారా మున్సిపాలిటీ నుండి మరో మూసిపాలిటీ కి  బదిలీలు చేయమని కోరుతున్నా అమలు కావడం లేదు.
పాఠశాల విద్యార్థులకు సంబంధించి మండల, జోనల్ స్థాయి క్రీడా పోటీలకు నిధులునివ్వడం లేదు. వారి ఆటల పోటీలకు 10 కోట్లు నిధులు ఇవ్వాలని కోరాము.
వ్యాయామ ఉపాధ్యాయులు లేని స్కూళ్లలో  GO 29 ప్రకారాం వ్యాయామ ఉపాధ్యాయులని నియమించాలి. అన్ని ఖాళీలను భర్తీ చేయాలి.
ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 27 న అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం.
పార్లమెంటు పై విశ్వాసం ఉంటే హామీలను అమలు చేసి 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలకు న్యాయం చేయాలి.
-------------------------------------------
అమలాపురం టీడీపీ MLA ఐతాబత్తుల ఆనందరావు.

మేము ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నాం.
కేంద్ర నిధులను 2011 జనాభా లెక్కల ప్రకారం కేటాయించాలని 15 ఆర్థిక సంఘానికి కేంద్రం సిఫార్సు చేసింది.
ఇలా చేస్తే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్ట పోతాయి.
దక్షిణాది రాష్ట్రాల జనాభా కుటుంబ నియంత్రణ పాటిస్తుంది. అందువలన జనాభా తక్కువగా ఉంటుంది. ఉత్తరాది రాష్ట్రాల జనాభా ఎక్కువ.
గతంలో మాదిరిగా 1971 జనాభా లెక్కల ప్రకారం నిధులు కేటాయిస్తే దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరుగుతుంది.
ఈ అంశం పై ఏప్రిల్ నెలలో దక్షిణాది రాష్ట్రాలు సమావేలం కానున్నాయి.
కేరళ నుండి 9.5 శాతం పన్నులు కేంద్రానికి వెళితే, అందులో 4.5 శాతం మంది నిధులు మాత్రమే ఆ రాష్ట్రానికి కేంద్రం ఇషయందని కేరళ ఆర్ధిక మంత్రి తెలిపారు.
దక్షిణాది నుండి పన్నుల రూపంలో వచ్చే నిధులను ఈ విధంగా ఉత్తరాధికి మల్లిస్తున్నారు.
విభజన హామీలు అమలు చేయకుండా ఆంద్రప్రదేశ్ కు అన్యాయం చేయలేదని మోడీ, అమిత్ షా చెబుతున్నారు.
5 కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్ష మేరకు ప్రత్యేక హోదా  కోసం, రైల్వే జోన్ కోసం పోరాటం చేస్తున్నాము.
BJP MLA లు రాష్ట్రంలో అవినీతి గురించి మాట్లాడుతున్నారు. గత 4సం,, నుండి వారికి అవినీతి కనబడ లేదా?
తెలుగు వారిని హేళన చేసి పండుగ చేసుకుంటున్నారు.
ఈ రోజు BJP MLA సభలో మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి 3500 కోట్లు చాలు అన్నారు.
జగన్ వంటి రాజకీయ నాయకులు ఇండ్లు కట్టుకోవడానికి 100 కోట్లు కావాలి.
పెద్ద రాజధాని నిర్మించుకోవడం. వారికి ఇష్టం లేదు.
అమరావతి నగరం గొప్పగా ఉండాలని ప్రపంచంలోని తెలుగువారంతా కోరుకుంటున్నారు.
ఉత్తరాది వారు హిందీ లో మాట్లాడితే నిధులు ఇస్తారా? మేము తెలుగులో అసిగితే నిధులివ్వరా?
BJP పాలిత రాష్ట్రాలకు CAG ఎంత గడ్డి పెట్టిందో మీకు తెలుసా?
తెలుగు వారిని హేళనగా మాట్లాడవద్దు.
ప్రొమో.కి వెళ్ళడానికి మంత్రులకు అవకాశం లేదు.
రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎలా వెళతారు. ఆయన అక్కడ బలమైన లాబీయింగ్ చేస్తున్నారు.
ఆయన ఇచ్చే తాయిలాలకు లొంగిపోయే వారు ఉన్నారు.
BJP MLA లు ఆంధ్ర, రాయలసీమ వేరు అని మాట్లాడుతున్నారు. విభజించడం వారి నైజం.
రాయలసీమ ను విడగొట్టాలని చూస్తున్నారు.
పొలవరం పనులను కేంద్ర మంత్రులు, అధికారులు పరిశీలించి శభాష్ అన్నారు.
అమరావతి కి అన్యాయం చేయవద్దు.
--------------------------------------------------------
వినుకొండ టీడీపీ  MLA GV ఆంజనేయులు

లక్ష కోట్ల అవినీతి పరులైన A1, A2 లు సభా హక్కుల నోటీసు ఇస్తామని అనడం హాస్యాస్పదం గా ఉన్నది.
పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ఒక్క రోజు ముందు PMO. లో చీకటి ఒప్పందాలు చేసుకున్నారు.
ఇటువంటి నేరగాళ్లను PMO. లోకి ఎలా అనుమతి ఇస్తున్నారు.
ఈ విషయాన్ని BJP ఖండించలేదు. ఏమిటి వీరి లాలూచి.
BJP వాళ్ళు మిత్ర ధర్మానికి ద్రోహం చేశారు.
కేంద్రానికి ఈశాన్య రాష్ట్రాలపై ఎందుకు అంత ప్రేమ.
ఈశాన్య రాష్ట్రాలకు 3000 కోట్లనిచ్చి ఆంద్రప్రదేశ్ కు ఎందుకు ఇవ్వరు.
35 సం,, చరిత్ర కలిగిన TDP నాడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడింది. నేడు BJP పై పోరాడేందుకు సిద్ధంగా ఉంది.
పోలవరం ప్రాజెక్టును 1400 కోట్లు ఇచ్చి, 300 కోట్లు ఎందుకు వెనక్కు తీసుకున్నారు.
PMO అపవిత్ర మైనది, అవినీతి పరులకు అడ్డాగా మారింది.
దక్షిణ భారతదేశంలో జాతీయ పార్టీలు కనుమరుగు అయ్యే పరిస్థితి ఏర్పడింది.
ప్రజారాజ్యం పార్టీ నాయకుడు ఆ పార్టీని కాంగ్రెస్ కు తాకట్టు పెట్టాడు.
ఇప్పుడు BJP పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించింది.
పవన్ కళ్యాణ్ BjP ఉచ్చులో ఇరుక్కోవడం దురదృష్టకరం.
రేపు జనసేన ను BJP లో అంతర్భాగం చేస్తారు.
సోము వీర్రాజు తీసేసిన తహసీల్దార్, అసత్య ఆరోపణలు చేస్తున్నారు
-------------------------------------------------------
BJP  MLC మాధవ్.
§   NdA నుండి బయటకు వెళ్లిపోతున్న వైనం పై ముఖ్యమంత్రి చంద్రబాబు వ్రాసిన లేఖకు సమాధానంగా మా BjP అధ్యక్షుడు అమిత్ షా 9 పేజీలు లేఖ వ్రాసారు.
§   అన్ని రాష్ట్రాలకి అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని అన్నారు.
§   అభివృద్ధి తరహా మంత్రంగా తీసుకుని ముందుకు సాగుతున్నామని అన్నారు.
§   ఆంధ్రప్రదేశ్ పట్ల, తెలిగు ప్రజల పట్ల ఎటువంటి వివక్ష చూపలేదని అన్నారు.
§    గతంలో కంటే 2014 నిండి 18 మధ్య 107 శాతం ఎక్కువ నిధులు ఇచ్చామని చెప్పారు.
§   ఇంత భారీ మొత్తంలో నిధులు ఇస్తున్నా కేంద్రం వివక్ష చూపుతుంది అనడం సరికాదు.
§   విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 11 కేంద్ర సంస్థలను నెలకొల్పుతాము.
§   8 మౌలిక వసతుల కల్పన సంస్థలకు గానూ ఐదింటిని ఇప్పటికే స్థాపించాము. దశల వారీగా నిధులు ఇస్తాము.
§   దుగరాజపట్నం లో పోర్టు సాధ్యం కాదని నిపుణులు కమిటీ చెప్పింది. మీరు ఇక్కడ చెబితే అక్కడ పోర్టు నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాము.
§   కడపలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించడానికి సిద్ధంగా ఉన్నామని అమిత్ షా లేఖలో పేర్కొన్నారు.
§   రైల్వే జోన్ పై సానుకూల నిర్ణయం తీసుకుంటాము.
§   రాజధాని నిర్మాణానికి కావలసిన నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పటివరకు ఇచ్చిన నిధులతో 8 శాతం మాత్రమే ఖర్చు చేశారు. మిగిలినవి ఏమైనాయో తెలియదు.
§   ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ నుండి అమరావతి, అమరావతి నుండి అనంతపురం రహదారుల అనుసంధానికి కట్టుబడి ఉన్నాము.
§   స్పెషల్ ప్యాకేజీ క్రింద నిధులు ఇవ్వడాన్నిKఈ సిద్ధంగా ఉన్న ఎందుకు వినియోగించుకోవడం లేదు, దీనికి రాష్ట్రం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
§   EAP నిధులు తీసుకోకపోవడానికి కారణం ఏమిటి?
§   విభజన చట్టంలో పేర్కొన్న అంశాలతో పాటుగా, పేర్కొనని వాటికి కూడా నిధులు ఇస్తున్నమ్.
§   ఆంద్రప్రదేశ్ ను అభివృద్ధి తరహా  నమూనాగా గుర్తించి, అభివృద్ధి కి నిధులు ఇస్తున్నాము.
§   అమిత్ షా లేఖ రాష్ట్రానికి చెంప పెట్టు లాంటిది.
§   కేంద్రం పై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదు.
§   అమిత్ షా లేఖతో తమకు నూతన ఉత్సాహం వచ్చిందని, BJP చేసిన అభివృద్ధి పనులపై ప్రజలలో కి తీసుకెళ్తాము.
§   ఆంద్రప్రదేశ్ సర్వేతో ముఖాభివృద్ధికి BJP కట్టుబడి ఉంది.
§   A2 నిందితుడు విజయసాయిరెడ్డి PmO లో తిరుగుతున్నాడు అనడం సరికాదు. ఆయనపై ఇంకా ఆరోపణలు రుజువు కాలేదు.
§   విజయసాయిరెడ్డి Accused మాత్రమే, convict కాదు.
§   రాజ్యసభ సభ్యులు, లోకసభ లోనికి ప్రధాని అపాయింట్మెంట్ లేకపోయినా PMO లోనికి వచ్చే అధికారం ఉన్నది.
§   UC లు JFC కి ఇచ్చింది కానీ మాకు ఇవ్వలేదు. మాకు కూడా ఇస్తే కేంద్రం దృష్టికి తీసుకెళ్తాము.
---------------------------------------------



No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...