Mar 15, 2018

మీడియా పాయింట్ - 15.03.2018 గురువారం



చీఫ్ విప్ పల్లె రఘునాడ్ రెడ్డి ప్రసంగంలోని ముఖ్య అంశాలు.

Ø  పవన్ కళ్యాణ్ మా నాయకుల మీద చేసిన ఆరోపణలు  ఖండిస్తున్నాం.
Ø  పవన్ కళ్యాణ్ వెనుక బీజేపీ హస్తం ఉన్నట్టు అనుమానం ఉంది.
Ø  పవన్ కళ్యాణ్ ని బీజేపీ ఒక పావులా వాడుకుంది.
Ø  కేంద్రం నుండి రావాల్సిన నిధులు కోసం పవన్ పోరాటం చెయ్యాలి కానీ మా మీద దాడి సరైనది కాదు.
Ø  తండ్రికి అపకీర్తి వచ్చేలా లోకేష్ ఏ నాడు చెయ్యాలేదు.
Ø  ఆధారం లేని వ్యాఖ్యలు సరైనవి కావు పవన్ .
Ø  ఆవేశంతో మాట్లాడాడే తప్ప  ఆలోచన లేదు.
Ø  అధికారం దుర్వినియోగం చెయ్యని నాయకుడు ఉన్నాడు అంటే అది ఒక్క చంద్రబాబే.
Ø  మన బంగారం మంచిది అయితే అని ముఖ్యమంత్రిని కించపరిచేలా పవన్ మాట్లాడటం కరెక్ట్  కాదు.
Ø  అభివృద్ధి ఒక్క రాజధాని ప్రాంతంలోనేనా అని అవగాహన లేకుండా పవన్ మాట్లాడాడు.
Ø  కులాల మధ్య చిచ్చు పెట్టేలా పవన్ మాట్లాడాడు. మాకు మద్దతు ఇచ్చినప్పుడు మా మేనిఫెస్టో పవన్ చూడలేదా?
Ø  ప్రజల కోసమే ఇన్ని ఏళ్ళు ఎదురు చూశాంతప్ప వ్యక్తి గత  ప్రయోజనం కోసం కాదు.
-----------------------------------------------------------
15.03.2018  గురువారం మీడియా పాయింట్
టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ప్రసంగంలోని ముఖ్య అంశాలు.

·        పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎప్పుడూ విమర్శలు చేయకుండా, 4 సంవత్సరాలుగా మౌనంగా ఉండి, ఒక్కసారిగా ప్రభుత్వం చేసే
·కార్యక్రమాలపై విమర్శలు చేశారు. కానీ అందుకు గల కారణాలు ఎక్కడా ప్రస్తావించలేదు.
·        టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రి పదవులకు రాజీనామాలు చేసి, BJP మీద, కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేసే సందర్భంలో ఈ విధంగా మాట్లాడడం దురదృష్టకరం.
·        కష్ట కాలంలో ఉన్న రాష్ట్రానికి సహాయ సహకారాలు ఇవ్వకపోగా, ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్నీ బలహీన పరచే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు.
·        ఇది BJP రాష్ట్రంలో అస్థిరత్వం సృష్టించే విధంగా చేసున్నట్లుగా భావిస్తున్నాం.
·        తమిళనాడులో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరచి తన గుప్పిట్లో తెచ్చుకోవాలని చూశారు. కానీ తమిళులు గట్టిగా బుద్ధి చెప్పారు. మన రాష్ట్రంలో కూడా అదే జరగబోతోంది.
·        పవన్ కళ్యాణ్ గారు BJP కి అనుకూలంగా మాట్లాడుతున్నారని అనుమానంగా ఉంది. ప్రధానిని ఒక్క మాట కూడా విమర్శించలేదు.
·        21 న అవిశ్వాసం పెడతామన్న సందర్భంలో అన్ని పార్టీలతో మాట్లాడతానని చెప్పారు కానీ మన MP లు పార్లమెంట్ లో చేస్తున్నం పోరాటం గురించి మాట్లాడలేదు.
·        కేంద్రంపై మన వాళ్ళు చేస్తున్న పోరాట తీవ్రత తగ్గించే కార్యక్రమంలా ఉన్నది.
·        చంద్రబాబును నమ్మి మద్దతు ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు యూటర్న్ ఎందుకు తీసుకున్నారు.
·        ఇసుక మాఫియా, ఎర్రచందనంలో అవినీతి అని మాట్లాడారు కానీ ప్రభుత్వం ఇసుకపై పన్ను కూడా
·లేకుండా ఉచితంగా ఇస్తుంది.
·        ముఖ్యమంత్రి గారికి 40 సం,, అనుభవం ఉండికూడా  పవన్ కల్యాణ్ గారు చేసే సూచనలకు గౌరవం ఇచ్చారు.
·        తాను మద్దతు ఇవ్వడం వలననే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినదని అనుకుంటున్నారేమో, ఒక సారి 2014 కు
·ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు వచ్చిన ఓట్లు, 2014 ఎన్నికలలో వచ్చిన ఓట్లు ఒకసారి గమనించండి.
·        రాష్ట్రంలో రాజకీయ అనిచ్చితి తీసుకురావాలి అనే కుట్రలో పవన్ భాగస్వామి అయినట్లున్నారు.
·        లోకేష్ గారు తన శాఖల పనితీరులో మంచి ప్రతిభ కనపరుస్తుంటే ఆయనపై అనేక ఆరోపణలు చేశారు. తమిళనాడులో శేఖర్ రెడ్డికి సంబంధాలు అంతగడుతున్నారు.

-------------------------------------------------------------

15.03.2018  గురువారం మీడియా పాయింట్
టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మణిక్య వరప్రసాద్  ప్రసంగంలోని ముఖ్య అంశాలు.

పవన్ కళ్యాణ్ నిన్న 5 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మాట్లాడలేదు. అపరిపక్వతగా మాట్లాడుతున్నారు.
ప్రత్యేక హోదా ఏ విధంగా సాధించాలనే దానిమీద జనసేన ఉద్దేశం ఆయన చెప్పలేదు.
ఒక మనిషి మీద ఆరోపణలు చేసేటప్పుడు,  ఒక విధానం తో మాట్లాడాలి కానీ, ఆవేశంగా మాట్లాడటం సరికాదు.
పవన్ కళ్యాణ్ లోకేష్ గారికి క్షమాపణ చెప్పాలి.
గబ్బర్ సింగ్ గురి తప్పేడు.
---------------------------------------------------------------------------
15.03.2018  గురువారం మీడియా పాయింట్
టీడీపీ ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు ప్రసంగంలోని ముఖ్య అంశాలు.

o    పవన్ కళ్యాణ్ గారు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు.
o    రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి మద్దతు కోరారు, అనుభవం కల
oముఖ్యమంత్రి కనుక ఆయన మద్దతు ఇచ్చారు.
o    20 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న పార్టీలని విమర్శించను, ప్రశ్నిస్తాను అన్నారు కానీ
oనిన్న సభలో నిరాధార ఆరోపణలు చేశారు.
o    పంది బురదలో దూరి ఆ బురద అందరికి చల్లినట్లుగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారు.
o    అందరూ కలసి పోరాడాల్సిన సమయంలో ఈ విధంగా మాట్లాడడం సరికాదు.
o    పవన్ కళ్యాణ్ గారు అడిగిన ప్రతిదానికి సమాధానం చెప్పడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది
------------------------------------------------------------------
15.03.2018  గురువారం మీడియా పాయింట్
విజయవాడ తూర్పు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ప్రసంగంలోని ముఖ్య అంశాలు.

*    పవన్ కళ్యాణ్ గారు నిన్న దుర్గగుడి పార్కింగ్ లో జరిగిన అవినీతి లో MLA ప్రమేయం ఉంది అని మాట్లాడినారు. అసలు అక్కడ పార్కింగ్ లేదు. ఆ విషయంలో నా ప్రమేయం ఉంటే రాజకీయాల నుండి తప్పుకుంటాను. మీరు కూడా రాజకీయాల నుండి తప్పుకుంటారా? సవాల్ విసురుతున్నాను.
*    చిన్న వయసులోనే లోకేష్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక ఆయనపై , ముఖ్యమంత్రి గారిపై ఆధారాలుంలేని ఆరోపణలు చేసున్నారు. లోకేష్ అవినీతి పై నీ వద్ద ఆధారాలు ఉంటే నిరూపించు.
*    కేంద్రం నుండి పవన్ కళ్యాణ్ ఎన్ని ముడుపులు తీసుకున్నారో తెలియదు కానీ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు.
*    మీ కుటుంబంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు కాపులు మిమ్ములను నమ్మి వస్తే వారిని మోసం చేశారు.
*    తెలుగు వారంతా కలసి కేంద్రంపై పోరాడవలసి ఉండగా, కరువు రాష్టాన్ని కూడా అభివృద్ధి పధంలో నడుపుతున్న ముఖ్యమంత్రి పై ఆరోపణలు చేస్తున్నారు.
*    NTR గారి మనవడు లోకేష్ అంటూ మాట్లాడినారు, అలా మాట్లాడడానికి NTR గోటికి కూడా మీరు సరిపోరు.
*    మీరు రాష్ట్రంలో 13 శాతం ఉన్న మైనారిటీలను అవమాన పరచే విధంగా, రాష్ర్టంలోని ఒక మైనారిటీ MLA అయిన నా గురించి మాట్లాడినారు.
*    ఒకసారి రాజధానికి వచ్చి చూడండి. అడవిలా ఉండే ప్రాంతంలో బ్రహ్మండంగా రాజధాని కడుతుంటే మీకు కనబడటం లేదా?
*    స్థాయికి మించిన మాటలు మాట్లాడుతున్నారు.
*    జగన్ కు CM అవ్వడం తప్ప వేరే ఆలోచన లేదు.
*    అనేక సార్లు చంద్రబాబు ను విమర్శించారు గానీ మోడీ గురించి ఒక్క మాట మాట్లాడలేదు.
*    MPలు అందరూ మోడీ పై అసహనంతో ఉన్నారు.
*    కేంద్రంలో BJP అధికారంలోకి వస్తుందని 2014 లో బీజేపీతో కలశాం. 2014 ముందు జరిగిన ఎన్నికలలో, 2014 ఎన్నికలలో మా ఓటు శాతం గమనించండి.
*    నిన్న ఉత్తేరప్రదేశ్ ఎన్నిక ఫలితాలు చూసైనా BJP వాళ్ళు బుద్ధి తెచ్చుకోండి.
*    పవన్ కళ్యాణ్ గారు నాపై చేసిన ఆరోపణలపై వెనక్కు తీసుకోవాలి.
*     మీరు చదివిన స్క్రిప్టు వ్రాసినది ఎవరు? 30 సం,,, నుండి రాజకీయాలలో ఉన్నాను, మీ ఎత్తులు చిత్తులు నాకు తెలుసు
-----------------------------------------------------------------------
15.03.2018  గురువారం మీడియా పాయింట్
స్వతంత్ర (పీడీఎఫ్) ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ప్రసంగంలోని ముఖ్య అంశాలు.

ఉద్యోగులకి క్యాష్ లెస్ హెల్త్ కార్డులు సరిగా అమలు కావడంలేదని మండలిలో మాట్లాడాను.
హైదరాబాద్ లో 20 హాస్పిటల్స్, బెంగళూరు వైదేహి హాస్పిటల్, వెల్లూరు హాస్పిటల్ లలో ఈ కార్డులను అనుమతించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి చెప్పినారు.
GO No. 159 ని సవరించి, కడప, కర్నూలు జిల్లా వారికి హెల్త్ కార్డులు ఉపయోగించుకొనే అవకాశం కల్పించమని కొరినాను, అందుకు  మంత్రి సానుకూలంగా స్పందించారు.
హెల్త్ కార్డు రెండవ దశలో ఎయిడెడ్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా వర్తింప చేయమని కొరినాను.
హెల్త్ కార్డు పెండింగ్ బిల్లులు చెల్లించమని ఆడిగినాను.
రాష్ట్రంలో డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేశారు కానీ సిబ్బందిని నియమించలేదు.
కంప్యూటర్ సిబ్బందిని నియమించమని కోరాను.
క్లాస్ 4 ఖాళీలను భర్తీ చేయమని కోరాను.
---------------------------------------------------------
15.03.2018  గురువారం మీడియా పాయింట్
అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రసంగంలోని ముఖ్య అంశాలు.

మీడియాలో ప్రభుత్వం, తెలుగుదేశం నాయకుల పై వస్తున్న ఆరోపణలు ఖండిస్తున్నాము.
ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోర్టు ఏమి లేకుండా చేసిన కేంద్రం పై పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి గారిని బలహీన పరచాలని చేస్తున్నట్లుగా ఉన్నది.
తెలుగు దేశాన్ని బలహీన పరచడం అంటే తెలుగు ప్రజలను బలహీన పరచడమే.
ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, తరువాత కాంగ్రెస్, ఇప్పుడు BJP వాళ్ళు దక్షిణాది రాష్ట్రాలను బలహీన పరుస్తున్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం BjP కి వ్యతిరేకంగా పోరాడే పార్టీ తెలుగుదేశం ఒక్కటే.
తెలుగు జాతి మొత్తం ఐక్యంగా పోరాటం చేయాలి.
పరిపాలనా ధక్షుడు, పోరాట యోధుడు చంద్రబాబు ను విమర్శించడం తగదు.
లోకేష్ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారు.
14 కేసులలో ముద్దాయి అయిన జగన్ పెరు ఎత్తలేదు.
ప్రస్తుత పరిస్థితుల్లో విమర్శలు రాష్ట్రానికి చెడు చేస్తాయి.
చంద్రబాబు నాయకత్వం మాత్రమే రాష్ట్రాన్ని కాపాడగలదు.
రాష్ట్రాన్ని దెబ్బతీయటానికి జాతీయ పార్టీలు కుతత్రం చేస్తున్నాయి.
---------------------------------------------------------------

15.03.2018  గురువారం మీడియా పాయింట్
చింతలపూడి శాసనసభ్యురాలు, మాజీ మంత్రి పీతల సుజాత ప్రసంగంలోని ముఖ్య అంశాలు.

రాజ్యసభ సభ్యుడుగా ఉన్న చిరంజీవి ప్రత్యేక హోదాపై ఏమి మాట్లాడారు? ఆయన గురించి పవన్ ఎందుకు మాట్లాడరు?
ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎంతో మంది జీవితాల్ని నాశనం చేశారు.
ప్రజలు మీ కాలర్ పట్టుకొని ప్రశ్నించే రోజు వస్తుంది.
ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అనే పవన్ కళ్యాణ్ ఒక్కరోజు తనను తానే ప్రశ్నించుకోవాలి.
ఒక మహా నటుడి మనవడు, ముఖ్యమంత్రి కుమారుడు, మరో ప్రముఖ నటుడి అల్లుడు వ్యాపారాలు చేసుకొని ఉండక ప్రజా సేవకై ముందుకు వచ్చారు.
రాజధానికి రెండు వేల ఎకరాలు చాలు అంటున్నావు, మరి నీ ఒక్కడి ఇంటికి రెండు ఎకరాలు ఎందుకు?
చంద్రబాబు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ నీకు చాలా విలువ ఇచ్చానారు, కానీ మీరు నిలుపుకోలేక పోయారు.
ఇక విమర్శలు ఆపి ముఖ్యమంత్రి గారికి, లోకేష్ కు క్షమాపణ చెప్పండి.
------------------------------------------------------
15.03.2018  గురువారం మీడియా పాయింట్
మంత్రి, జమ్మలమడుగు శాసనసభ్యుడు సీహెచ్.ఆదినారాయణ రెడ్డి ప్రసంగంలోని ముఖ్య అంశాలు.

పవన్ రోజుకో మాట మాట్లాడుతున్నాడు. ఆయనకు రాజకీయం అంటే సరదాగా ఉంది.
రైతులు ఉన్నతమైన ఆలోచనలతో, పరిపక్వతతో 33000 ఎకరాలు ఇస్తే వారిని కించపరుస్తున్నారు.
రాజకీయాలు సినిమాలు అనుకుంటే సరిపోదు.
రోజుకు 18 గం,, చంద్రబాబు రాష్ట్రం కోసం ఓపిక తో కృషి చేస్తున్నారు.
జగన్ మాదిరిగా ఈయన కూడా CM కావాలని అనుకుంటున్నట్లున్నారు. అందరిమీద రాయి వేసుకుంటూ పోతున్నాడు.
మిత్ర పక్షంగా నాలుగేళ్ళనుండి మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారు.
ప్యాకేజీ ఇస్తామంటే మిత్ర పక్షం కాబట్టి నమ్మవలసిన అవసరం ఉంది. నమ్మినాము.
NDA లో కొంతకాలం వేచి చూడాలి అనుకుంటున్నాము.
సినిమాల్లో మాట్లాడినట్లు మాట్లాడితే కుదరదు.
ఆయనకు ఏ అత్తారింటికి  దారేదో  ఆయనకే తెలియదు.
లోకేష్ నాలుగు శాఖలు సమర్ధవంతముగా నిర్వహిస్తున్నారు.
శేఖర్ రెడ్డి కి లోకేష్ కి ఏమి సంబంధం.
పవన్ తన ఆలోచనా విధానాన్ని, దృక్పదాన్ని మార్చుకోవాలి.
------------------------------------------------
15.03.2018  గురువారం మీడియా పాయింట్
టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకటేశ్వర రావు( బుద్దా వెంకన్న) ప్రసంగంలోని ముఖ్య అంశాలు.

పవనం కమలం వైపు మళ్లింది.
ప్రత్యేక హోదా ఇవ్వవలసిన కేంద్రాన్ని ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
మోడీ ఒక భుజాన పవన్ ను, మరో భుజాన జగన్ ను ఎక్కించుకున్నట్లు ఉన్నారు.
నిన్నటి సభ గబ్బర్ సింగ్ లా హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ అజ్ఞాతవాసి లా ప్లాప్ అయింది.
పవన్ నిన్ను నువ్వు ప్రశ్నించుకో.
కేంద్రం వద్దకు వెళ్ళి ముఖ్యమంత్రి ని విమర్శించడంతో నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయినది.
తెలుగుదేశంని నువ్వు కాదు గెలిపించింది, ప్రజలు గెలిపించారు.
పవన్ మాటలకు అర్ధం లేదు, మోడీ స్క్రిప్ట్ చదివాడు.
రాష్ట్రాన్ని, ముఖ్యమంత్రి ని దెబ్బతీయటానికి మోడీ పవన్, జగన్ ప్రయత్నిస్తున్నారు, అలా చేస్తే మీకు మీరే భస్మాసుర హస్తం పెట్టుకున్నట్లు
అవుతుంది.
వ్యక్తిగత విమర్శలకు దిగితే మేము చూస్తూ ఊరుకొము.
-------------------------------------------------------------
15.03.2018  గురువారం మీడియా పాయింట్
టీడీపీ పాయకరావు పేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ప్రసంగంలోని ముఖ్య అంశాలు.

v  జనసేన ఆవిర్భావ సభలో ప్రజల కోసం పవన్ ఏమి చెప్తారా అని రాష్ట్ర అంతా వేచి
vచూసింది. కానీ పవన్ ఒక్క రాత్రి లో జ్ఞానోదయం అయినట్టు మాట్లాడాడు.
v  సభలో కనీసం  జెఫ్ సి నివేదిక  గురించి మాట్లాడకపోవటం విడ్డురంగా ఉంది.
v  ప్రతి మాటలో చంద్రబాబు ని తిట్టటమే పనిలా మాట్లాడాడు.
v  ఇన్ని ఏళ్లలో ఎక్కడ మాట్లాడలేని పవన్ నిన్న మాట్లాడటం వెనుక ఉద్దేశ్యం ఏమిటి.
v  కేంద్ర  మరియు వైసీపీ చేతుల్లో పవన్ కీలు బొమ్మలా మారాడు.
v  వెనుక నుండి పవన్ ని ఎవరో అడిస్తున్నారు.
v   పవన్ గారు ఒకసారి పునరాలోచించి మాట్లాడాలి                             
--------------------------------------------------------------------------
15.03.2018  గురువారం మీడియా పాయింట్
టీడీపీ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రసంగంలోని ముఖ్య అంశాలు.

5 కోట్లమంది ఆంధ్రుల హక్కుల కోసం ముఖ్యమంత్రి పోరాడుతున్నారు.
మా కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు.
MP లు నిరసన తెలుపుతూ పార్లమెంటును స్తంభింప చేశారు.
దేశంలో పలు పార్టీలు మద్దతు పలికాయి.
ఆంధ్రుల ఆశీస్సులు చంద్రబాబు కు ఉన్నాయి.
చంద్రబాబు పోరాటం విజయవంతం కావాలి
జనసేన సభలో పవన్ ఎదో చెబుతారని ప్రజలు ఆశించారు కానీ నిరాశ పరిచారు.
మోడీ ని నిలదీయలేదు.
చంద్రబాబు,  ఆయన కుటుంబము పై నిరాధార ఆరోపణలు చేశారు.
చంద్రబాబు పోరాటానికి తూట్లు పొడుస్తున్నారు.
BJP దర్శకత్వంలో నటిస్తున్నారా?
AP ప్రజల పోరాటానికి మద్దతు ఇవ్వమని కోరుతున్నాము.
ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టించి వేల కోట్ల ఆస్తులకు రక్షణ కల్పించాము.
అవినీతి లో గతంలో AP నంబర్1 స్థానంలో ఉంటే దానిని 13 స్థానంలో కి వెళ్లేలా చేసాం.
వనజాక్షి సంఘటన జరిగి 3 సం,, అయితే అప్పుడు ఎందుకు మాట్లాడలేదు.
శేఖర్ రెద్దు ఘటన జరిగి ఏడాదిన్నర అయింది. అప్పుడు ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంది.
అవినీతి పై నాలుగేళ్లలో సీఎంకు ఒక్క లేఖ కూడా వ్రాయలేదు.
BJP కి పావులా వ్యవహరిస్తూ, రాష్ట్ర ప్రయోజనాలకు తూట్లు పొడుస్తున్నారు.
70 సం,, లలో 3009.కి.మీ. CC రోడ్లు వేస్తే, ఈ నాలుగేళ్లలో 15000 CC రోడ్లు వేసి చరిత్ర సృష్టించాం.
పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి12 దేశాలు తిరిగారు.
3.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 5.35 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి.
విభజన హామీలు నెరవేర్చాలి, ప్రజా రాజధాని కి నిధిలివ్వాలి, BJP కళ్ళు తెరవాలి.
మా పోరాటం లో పవన్ భాగస్వామి కావాలి.
ఎటువైపు ఉండాలో పవన్ తేల్చుకోవాలి.
----------------------------------------------------------
15.03.2018  గురువారం మీడియా పాయింట్
టీడీపీ తిరుపతి ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ ప్రసంగంలోని ముఖ్య అంశాలు.

నిన్నటి పవన్ సభ బాధ కలిగించింది.
5 కోట్ల మంది ఆంధ్రుల అజండా ప్రత్యేక హోదా.
కాంగ్రెస్ పార్టీ తల్లిని చంపి బిడ్డని బ్రతికించిందని తిరుపతి సభలో BJP ఆరోపించింది.
నిధుల కోసం ముఖ్యమంత్రి 29 న సార్లు ఢిల్లీ వెళ్లారు.
ప్రత్యేక హోదా సెంటిమెంట్ అంటున్నారు, తెలంగాణ కూడా సెంటిమెంట్ తోనే ఇచ్చారు కదా.
విభజన చట్టం హామీలు, హోదా ఇవ్వాలి.
AP ప్రజలు పోరాడాల్సిన అవసరం ఉంది.
నాలుగేళ్ల లో ఎన్నడూలేని విధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి ని, లోకేష్ ను టార్గెట్ చేశారు.
మనలో మనం విమర్శించుకుంటూ ఉంటే రాష్ట్రానికి ఎలా మేలు జరుగుతుంది.
పోరాటానికి కలసి రావాలని పవన్ కోరుతున్నాం.
పరిణితి చెందిన ముఖ్యమంత్రి వైపు అందరూ చూస్తున్నారు.
-----------------------------------------------------------------
15.03.2018  గురువారం మీడియా పాయింట్
టీడీపీ విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత ప్రసంగంలోని ముఖ్య అంశాలు.

జనసేన సభ ద్వారా ప్రత్యేక ఉద్యమానికి మంచి మద్దతు వస్తుంది అనుకుంటే, పవన్ మాటలు ఆందోళన కలిగించాయి.
తెలుగుదేశం కేంద్ర మంత్రులు కూడా రాజీనామా చేసి పార్లమెంట్ లో నిరసన తెలుపుతూ, ఉద్యమం ఉధృతం అవుతున్న పరిస్థితులలో టాపిక్ డైవర్ట్ చేసే విధంగా పవన్ మాట్లాడుతున్నారు.
లోకేష్ ఆధ్వర్యంలో గ్రామాలలో అభివృద్ధి జరిగింది, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి.
పవన్ కు స్థిరమైన అభిప్రాయాలు లేవు,
పవన్ స్టాండ్ ఏమిటో చెప్పాలి.
*************************

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...