Mar 1, 2018

ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఆర్టీజీ


Ø రాష్ట్రంలోని వేల ప్రాంతాలను లైవ్ లోచూసే అవకాశం
Ø ఆసియాలోనే అతిపెద్ద కమాండ్ కంట్రోల్ కేంద్రం
Ø ఒకేసారి లక్ష మందితో మాట్లాడే అవకాశం
Ø 50 వేల సీసీ కెమోరాల ఏర్పాటు లక్ష్యం
Ø ప్రజలకు భద్రత, మెరుగైన జీవనం
Ø ఆప్టికల్ ఫైబర్ ఏర్పాటులో ప్రపంచ రికార్డ్


 

 

రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా భావించి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రారంభించిన రియల్ టైమ్ గవర్నెన్స్(ఆర్టీజీ) వ్యవస్థని సమర్థవంతంగా నిర్వహిస్తోంది.  పరిపాలనలో సాంకేతికతని వినియోగించుకోవడంలో ఏపీ  ప్రభుత్వం అపార అనుభవం ఘడించింది. దేశంలో మరే ఇతర  రాష్ట్రంలో చేయనివిధంగా ఆర్టీజీని అమలు చేస్తోంది. అలాగే పరిష్కార వేదిక ద్వారా ప్రజా ఫిర్యాదులకు స్పందించడం, పీపుల్స్ హబ్, ఈ-ప్రగతి, అవసరమైన చోట ఇళ్లకు కూడా పోలీస్ కెమెరాల ఏర్పాటు వంటి అంశాల్లో రాష్ట్రం ముందుంది.  రాజధాని అమరావతి సచివాలయంలోని ఆర్టీజీ ప్రధాన కార్యాలయం నుంచి  రాష్ట్రంలో ఎక్కడ  ఏం జరుగుతుందో లైవ్ లో చూడవచ్చు. గ్రామాలలో, పట్టణాలలో, పోలవరం వంటి ప్రాజెక్టుల వద్ద ఏర్పాటు చేసిన సర్వైలెన్స్ కెమెరాల ద్వారా అక్కడి తాజా పరిస్థితిని ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించవచ్చు. అంతేకాకుండా ఒకేసారి వందల ప్రాంతాల్లో జరిగే పనులను, పరిస్థితిని వీక్షించే అవకాశం ఉంది.  ఆసియాలోనే అతిపెద్దదైన రియల్ టైమ్  కమాండ్ కంట్రోల్ కేంద్రం ఇది. పాలికాంవీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా ఒకేసారి వేల మందితో ఆర్టీజీ కేంద్రం నుంచి ముఖాముఖీ మాట్లాడవచ్చు.
      భారత  రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ ఈ కేంద్రాన్ని సందర్శించిన సమయంలో ఆసియాలోనే అతి పెద్దదైన 66 అడుగుల పొడవైన వీడియో  తెరపై వందల పట్టణాలు, గ్రామాలలోని తాజా పరిస్థితులను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించారు. అలాగే డ్రోన్ కెమెరాల ద్వారా పోలవరం ప్రాజెక్ట్ పనులను,  రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలలో ట్రాఫిక్ ని  లైవ్ లో చూపించారు. ఇక్కడి సాంకేతికమైన ఏర్పాట్లను చూసి రాష్ట్రపతి మంత్రముగ్దులయ్యారు. ఏపీ ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే తీరును, ఇక్కడివారి సాంకేతిక నైపుణ్యం చూసి ఆయన ప్రశంసించారు. అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఆర్టీజీ ద్వారా  24/7 ప్రపంచంతో అనుసంధానమై అమరావతి ముందుందన్నారు. ఏపీ ఆర్టీజీ ఆసియాలోనే అతిపెద్ద టెక్నాలజీ ప్రాజెక్ట్ గా ఆయన  పేర్కొన్నారు. ఆ తరువాత నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజివ్ కుమార్ కూడా ఈ కేంద్రాన్ని సందర్శించి, ఇక్కడి పనితీరును గమనించి అబ్బురపడ్డారు. రాష్ట్రప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని ప్రశంసించారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ని ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా వినియోగించుకుంటోంది. రాష్ట్రంలో 20 వేలకు పైగా సర్వైలెన్స్ కెమెరాలను అమర్చారు. వీటిని ఇంకా పెంచుతారు. రాష్ట్ర వ్యాప్తంగా  లా అండ్ ఆర్డర్ట్రాఫిక్సివిల్ వ్యవహారాలను ఈ కెమెరాలు పర్యవేక్షిస్తుంటాయి. పార్కింగ్ ప్లేస్ కాని చోట వాహనాలను పార్క్ చేస్తే ఆ కెమెరాలు ఆటోమేటిక్ గా రికార్డ్ చేసినెంబర్ ప్లేట్ ని ఫొటో తీసి చలానాలను ఆ వాహనం యజమాని మెయిల్ కు పంపుతాయి. రౌడీషీటర్ల ముఖాలను గుర్తించి పోలీస్ శాఖను అలర్ట్ చేసే టెక్నాలజీ కూడా ఆ సీసీ కెమెరాలలో ఉంది. రాష్ట్రంలోని 37 వేల పాఠశాలల్లో వర్చువల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  మొదటి దశలో 4 వేల క్లాస్ రూమ్స్ ని ప్రారంభిస్తారు.

ఆప్టికల్ ఫైబర్ ఏర్పాటులో ప్రపంచ రికార్డ్
          9 నెలల్లో 24 వేల కి.మీ. ఆప్టికల్ ఫైబర్ లైన్ ఏర్పాటు చేసి దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో రికార్డు సృష్టించారు. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.4700 కోట్లు కాగా,  3 లక్షలకు పైగా విద్యుత్ పోల్స్ ని వినియోగించుకొని రూ.333 కోట్లతో పూర్తి చేశారు. ఏపీఎస్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌(ఏపీఎస్ఎఫ్ఎల్) ఆధ్వర్యంలోఈ ఫైబర్ గ్రిడ్ పనులు జరిగాయి. వైర్ లెస్ టెక్నాలజీతో మారుమూల గిరిజన ప్రాంతాలకు కూడా నెట్ అందుబాటులోకి తేవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం రూ. 149 రూపాయలకు ఇంటర్ నెట్టెలీఫోన్ తోపాటు 250 ఛానల్స్ తో కేబుల్ టీవీ అందిస్తున్నారు. ఇంత భారీ నెట్ వర్క్ ద్వారా రూ.149 రూపాయలకు ఇంటర్ నెట్టీవీటెలిఫోన్ సౌకర్యం కల్పిస్తున్న  దేశంలో మొదటి రాష్ట్రం ఏపీ. ఈ విధంగా ఏపీ ఇతర రాష్ట్రాలకు మోడల్ గా నిలిచింది. 2018 డిసెంబర్ నాటికి కేంద్రం మంజూరు చేసే రూ.860 కోట్లతో ప్రతి మున్సిపాలిటీకీ,ప్రతి పంచాయతీకి వైఫై కనెక్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి జిల్లాలో కమాండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 13 జిల్లాలతోపాటు ఒక రాష్ట్ర స్థాయి సెంటర్3 పోలీస్ కమిషనరేట్ స్థాయి సెంటర్లు మొత్తం 17 ఏర్పాటు చేస్తారు. అన్ని రకాల సమాచారం ఈ కేంద్రాలకు చేరేవిధంగా ఏర్పాట్లు చేస్తారు.  జిల్లా స్థాయిలో ఆయా జిల్లాల్లో సీసీసీ ఏర్పాటు చేయడానికి మూడు వేల చదరపు అడుగుల ప్రభుత్వం భవనం సమకూరుస్తారు. విజయవాడవిశాఖపట్నంతిరుపతిలలో కమిషనరేట్ స్థాయిలో సీసీసీలు ఏర్పాటు చేయడానికి అదనంగా మరో 3వేల చదరపు అడుగుల ప్రభుత్వం భవనాలు కేటాయిస్తారు. రాష్ట్ర స్థాయి సీసీసీ ఏర్పాటుకు అమరావతిలో 8 వేల నుంచి పది వేల చదరపు అడుగుల భవనం సమకూరుస్తారు. ప్రతి సీసీసీకి అత్యాధునిక కంప్యూటర్లుసర్వర్లునిఘా కెమేరాలు వంటి వాటిని సమకూరుస్తారు. జిల్లా సీసీసీలు  రాజధాని సీసీసీకి అనుసంధానంగా పని చేస్తుంటాయి. సమాచారం విషయంలో  భవిష్యత్ లో వీటిని విస్తృత స్థాయిలో ఉపయోగించుకునే అవకాశం ఉంది.
అమరావతివిశాఖలలో డేటా సెంటర్లు
      రాజధాని అమరావతితోపాటు విశాఖపట్నంలో రెండు డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతిని ప్రపంచ ప్రఖ్యాత నగరంగా తీర్చిదిద్దే క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో  రాజధానిలో డేటా సెంటర్ ను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది.  వీటితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా 9,500 ప్రాంతాలలో దాదాపు 50 వేల సీసీ కెమెరాలు అమర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం.  ప్రజలు ముందుగా తెలియజేస్తే తాళం వేసిన ఇళ్ల వద్ద పోలీసులు సర్వైలెన్స్ కెమెరాలను అమర్చుతారు. వాటి ద్వారా దొంగతనాలను, ఇతర నేరాలు అరికడుతున్నారు. అంతేకాకుండా ఈకెమెరాల ద్వారా ప్రజల జీవన విధానం మెరుగుపరచడానికిఅవకాశం ఉంది. క్లౌడ్ ప్రాతిపదికన వీసీఎస్(విర్చువల్ క్లాస్ రూమ్ సిస్టమ్)ప్రవేశ పెట్టడానికి 4వేల తరగతి గదులను ఎంపిక చేశారు. దాదాపు 5 వేల పాఠశాలలకు ఫైబర్‌నెట్‌ సేవలు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.   ఈ విధంగా ఫైబర్‌నెట్‌ సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా  ఇ-ప్రగతిలో రాష్ట్రం అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అవకాశం ఉంది.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆర్టీజీఎస్ నేతృత్వంలో పనిచేసే పరిష్కార వేదిక 1100 కాల్ సెంటర్ కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ 750 మంది సిబ్బంది 24 గంటలూ ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరిస్తారు. నిర్ణీత గడువు లోపల ఆ సమస్యలు పరిష్కారం అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటారు. ఈ కాల్ సెంటర్ నుంచి రోజుకు 15 లక్షల కాల్స్ మాట్లాడవచ్చు. ఇక్కడ రోజుకు 5వేల గంటల సంభాషణలు రికార్డు చేస్తారు. ఈ కేంద్రం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒకేసారి లక్ష మందితో మాట్లాడే అవకాశం ఉంది.  ప్రజలకు సుపరిపాలన అందించడంలో ఏపీ ప్రభుత్వం టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకుంటోంది. ఏపీలో ఏర్పాటు చేసిన తరహాలో ఆర్టీజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని దేశంలోని పలు రాష్ట్రాలు ఆసక్తికనపరుస్తున్నాయి. కేంద్రం కూడా ఏపీ తరహాలో ఫైబర్ నెట్ ఏర్పాటు చేసుకోవాలని ఇతర రాష్ట్రాలకు చూసించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సమర్థవంతమైన పాలనా నిర్వహణకు గుర్తింపుగా రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీకీ ప్రతిష్టాత్మక కలాం ఇన్నొవేషన్ అవార్డ్ ని ప్రకటించారు.  న్యూఢిల్లీలో ఈ అవార్డుని ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ ఎండి, ఆర్టీజీఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఓ) అహ్మద్ బాబు అందుకున్నారు.

-         శిరందాసు నాగార్జున, డెవలప్ మెంట్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...