Mar 5, 2018

విభజన చట్టంపై చర్చ జరగాలి



బిజేపీ ఎమ్మెల్సీ మాధవ్
          సచివాలయం, మార్చి 5: రాష్ట్ర విభజన చట్టంపై విస్తృత స్థాయిలో చర్చ జరగాలని, అది ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడుతుందని శాసనమండలిలో బీజేపీ సభ్యుడు పివీఎన్ మాధవ్ అన్నారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద సోమవారం ఉదయం ఆయన మాట్లాడారు. శాసనసభలో జరిగే చర్చలలో ఈ అంశాన్ని చేర్చమని  శాసనసభా వ్యవహారాల కమిటీ(బీఏసీ) సమావేశంలో తాము కోరామని, దానిని చేర్చడానికి అంగీకరిచినట్లు తెలిపారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, వ్యవసాయం వంటి అంశాలపై నాలుగు రోజులు చర్చలు జరుగుతాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వద్దకు విలేకరుల బృందాన్ని తీసుకువెళ్లే ఆలోచన ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆయనతోపాటు మరో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా ఉన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...