Jul 28, 2017

బీసీలకు నష్టంలేకుండా త్వరలో కాపులకు రిజర్వేషన్

కాపు కార్పోరేషన్ చైర్మన్ రామానుజయ
సచివాలయం, జూలై 28: వెనుకబడిన తరగతుల(బీసీ)కు నష్టంలేకుండా తమ ప్రభుత్వం త్వరలో కాపులకు రిజర్వేషన్ కల్పిస్తుందని కాపు సంక్షేమ, అభివృద్ధి సంస్థ (కాపు కార్పోరేషన్) చైర్మన్ చలమలశెట్టి రామానుజయ చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో శుక్రవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. కాపులకు విద్య, ఉద్యోగపరంగా రిజర్వేషన్ కల్పిస్తామని, బీసీలకు అన్యాయం జరుగకుండా తమిళనాడు తరహాలో అదనంగా రిజర్వేషన్లు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు తెలిపారు. విదేశీ చదువుల కోసం ఒక్కో పేద కాపు  విద్యార్థికి ప్రభుత్వం పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయంతోపాటు విమాన, ఇతర ఖర్చుల కింద రూ.70 నుంచి రూ.90 వేల వరకు అందజేస్తున్నట్లు వివరించారు. విదేశీ విద్యా సహాయం కోసం దరకాస్తు చేసుకున్న 220 మంది విద్యార్థులను గురువారం ఇంటర్వ్యూ చేసినట్లు, ఆ సమయంలో ఆ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఎంతో ఆనందం కనిపించినట్లు తెలిపారు. సివిల్ సర్వీస్ తోపాటు అనేక పోటీ పరీక్షలకు ప్రభుత్వం శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. సివిల్స్ ప్రిలిమ్స్  ఉత్తీర్ణులైనవారికి నెలకు రూ.10వేలు స్టైఫండ్ ఇస్తూ 9 నెలల పాటు శిక్షణ ఇప్పిస్తున్నట్లు చెప్పారు.  వివిధ రకాల ఉత్పత్తులకు, పరిశ్రమలకు ప్రభుత్వం కాపులకు సబ్సిడీతో అందించే ఆర్థిక సహాయం ద్వారా వారితోపాటు మరో పదిమందికి ఉపాధి కల్పిస్తున్నారని చెప్పారు. కాపు కార్పోరేషన్ అందించే ఆర్థిక సహాయం ద్వారా రాష్ట్రంలో 4.16 లక్షల మంది లబ్డిపొందినట్లు తెలిపారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే సాధ్యమవుతున్నట్లు చెప్పారు. అన్ని రకాలుగా మేలు చేస్తున్న బాబువైపే కాపులు ఉన్నారని, రిజర్వేషన్ కూడా త్వరలో కల్పిస్తారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభం పాదయాత్ర ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.  ప్రతిపక్షంవారు ఒక పక్క రాజధానిని నిర్మాణానికి అడ్డుతగులుతూ, మరో పక్క రాష్ట్రానికి పెట్టుబడిదారులు రాకుండా, వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. అటువంటివారి కొమ్ముకాయడం ముద్రగడకు తగదని రామానుజయ హితవుపలికారు. ప్రతిపక్షం వద్ద తాయిలాలు తీసుకున్న ముద్రగడపై  తమ డిమాండ్లు అమలు చేయాలన్న వత్తిడి పెరగడంతో పాదయాత్రకు పూనుకున్నట్లుగా ఆయన ఆరోపించారు. అన్ని విషయాలు అర్ధం చేసుకొని పాదయాత్ర విషయంలో సయమనం పాటించిన కాపు యువతకు అభినందనలు తెలుపుతూ, పరిస్థితులను అదుపులో ఉంచడానికి చర్యలు తీసుకున్న ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి చినరాజప్పకు, డీజీపీ నండూరి సాంబశివరావుకు ఆయన కృతజ్ఙతలు తెలిపారు.

Jul 27, 2017

4.16 లక్షల మంది కాపులకు లబ్ది


కాపు కార్పోరేషన్ చైర్మన్ రామానుజయ
సచివాలయం, జూలై 26: గతంలో ఏ ప్రభుత్వం చేకూర్చనివిధంగా 4.16 లక్షల మంది కాపులకు తమ ప్రభుత్వం లబ్ది చేకూర్చిందని కాపు సంక్షేమ, అభివృద్ధి సంస్థ (కాపు కార్పోరేషన్) చైర్మన్ చలమలశెట్టి రామానుజయ చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. నదుల అనుసంధానం, రైతులకు రుణ మాఫీ వంటి కార్యక్రమాల వల్ల అనేక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం కాపు కార్పోరేషన్ కు రూ.2500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కార్పోరేషన్ ద్వారా కాపు, బలిజ, ఒంటరి, తెలగ నాలుగు కులాలకు చెందినవారు లక్షల మంది వ్యక్తిగతంగా లబ్దిపొందినట్లు చెప్పారుస్వయం ఉపాధి, విదేశీ విద్య, స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ద్వారా ఉపాధి, పోటీ పరీక్షలకు శిక్షణ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సాయం, మహిళలకు ఉపాధి శిక్షణ వంటి వాటి వల్ల కాపులకు ప్రయోజన చేకూరినట్లు వివరించారు.
కాపులకు చట్టబద్దంగా రిజర్వేషన్ కల్పించడం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంజునాథన్ కమిషన్ ను నియమించినట్లు ఆయన తెలిపారు. బీసీలకు అన్యాయం జరుగకుండా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పారు. కాపులకు రాజకీయ రిజర్వేషన్లు అవసరంలేదన్నారుకాపులు, బీసీలు తమ ప్రభుత్వానికి రెండు కళ్లని చెప్పారు. ఈ ఏడాది చివరికి కాపులకు రిజర్వేషన్ లభిస్తుందన్నది తన అభిప్రాయం అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీడ్ కు ఎవరూ తట్టుకోలేకపోతున్నారన్నారు. రాష్ట్రంలో 80 శాతం ప్రజలు చంద్రబాబు పాలనను రామరాజ్యంగా భావిస్తున్నరని చెప్పారు. ప్రతిపక్షంవారు మంచిపనులకు అడ్డుతగులుతున్నారని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి మంచి సూచనలు, సలహాలు ఇవ్వడం మంచిదన్నారు. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించడానికే ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేస్తున్నారన్నారు. చంద్రబాబుని యాగి చేయడం కోసమే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారుకాపుల కోసం పని చేసేవారైతే మంజునాథన్ కమిటీ ముందు హాజరై కాపు సమస్యలు వివరించి ఉంటే బాగుండేదన్నారు.

శాసన మండలి సభ్యులుగా రామసుబ్బారెడ్డి, ఫరూక్ ప్రమాణ స్వీకారం

సచివాలయం, జూలై 26: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులుగా రామ సుబ్బారెడ్డి, ఎన్ఎండీ ఫరూక్ శాసన మండలి సమావేశ మందిరంలో బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. మండలి ఇన్ చార్జి చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం వారిద్దరిచేత ప్రమాణం చేయించారు. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన రామసుబ్బారెడ్డి, కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఫరూక్ లు గవర్నర్ కోటాలో మండలి సభ్యులుగా నియమితులైన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో విద్యుత్ శక్తి శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ చైర్మన్ ఎం.లింగారెడ్డి, ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్, ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ ఇరిగేషన్ కార్పోరేషన్ డైరెక్టర్ పురుషోత్తమ రెడ్డి, ఏపీ శాసనసభ స్పెషల్ సెక్రటరీ పీపీకె రామాచార్యులు, పూర్వ కార్యదర్శి కె.సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.

Jul 26, 2017

కాపుల పట్ల చిత్తశుద్ధితో ఉన్న ప్రభుత్వం

మంత్రి నారాయణ
సచివాలయం, జూలై 25: పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం కాపులను బీసీలో చేర్చే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజాయితీతో పని చేస్తున్నారన్నారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి, వారి సంక్షేమం కోసం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు. అలాగే కాపులను బీసీల్లో చేర్చడానికి కమిషన్ ఏర్పాటు చేశారని, కమిషన్ నివేదిక రాగానే శాసనసభలో ఆమోదించి, దానిని పార్లమెంటుకు పంపుతామని, అక్కడ కూడా ఆమోదింపజేస్తామని చెప్పారు. ఈ విషయంలో ఎటువంటి అపోహలకూ తావులేదన్నారు.
నివేదిక త్వరగా అందజేయాలని జ్యుడిషియల్ కమిషన్ ను మనం ఆదేశించే అధికారం లేదన్నారు. వారు తగినంత సమయం తీసుకుని నివేదిక ఇస్తారని చెప్పారు. త్వరలోనే నివేదిక వస్తుందని ఆశిస్తున్నామన్నారు.  
మరోసారి తుని లాంటి ఘటన జరగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పారు. ఇంటిలిజెన్స్ అందజేసిన సమాచారం ప్రకారం అరాచక శక్తులు అల్లర్లు సృష్టించడానికి సిద్ధంగా వున్నట్టు తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని, ముందస్తు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, పోలీసులు తమ విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. కాపులను బీసీల్లో చేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ క్రమంలో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో కొంతమంది పనిగట్టుకొని కాపులను రెచ్చగొడుతున్నారన్నారు. అలాంటి వారిపట్ల కాపులు అప్రమత్తంగా వుండాలని మంత్రి నారాయణ కోరారుతమ ప్రభుత్వంలోనే కాపులకు న్యాయం జరుగుతుందన్నారు. కాపు పెద్దలతో చర్చించి ముద్రగడ పద్మనాభం పాదయాత్ర విరమించుకోవడమం మంచిదని ఆయన హితవు పలికారు. 35 ఏళ్లుగా ఎదురు చూసినవారు కొద్ది నెలలు ఆగలేరా అని ప్రశ్నించారు. కాపులంటే అరాచక శక్తులనే ముద్రవేయవద్దని కోరారు. కాపులను తమ ప్రభుత్వం బీసీల్లో చేర్చడం ఖాయమన్నారు. దీనివల్ల సీఎం చంద్రబాబునాయుడికి కాపుల్లో ఇమేజ్ పెరుగుతుందనే భయంతోనే ముద్రగడ పాదయాత్ర చేపడుతున్నారని మంత్రి నారాయణ దుయ్యబట్టారు.

Jul 25, 2017

మహిళాసాధికారితకు ప్రాధాన్యత



మహిళాసాధికారితకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అత్యధిక మంది మహిళలు తమ కుటుంబాలను చక్కదిద్దుకోవడంతోపాటు వివిధ రంగాల్లో వారు చూపే చొరవను, వారి సామర్ధ్యాన్ని గుర్తించింది. స్వశక్తితో ఎదగడానికి ప్రభుత్వం అన్నివిధాల ప్రోత్సహిస్తోంది. స్వయం సహాయక బృందాల ద్వారా అతి తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తూ వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సహాయపడుతోంది. రాష్ట్రంలోని 7 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలలోని 70.91 లక్షల మంది సభ్యులే ఒక సైన్యంగా ప్రభుత్వం వివిధ కార్యక్రమాల అమలును చేపట్టింది. పరోక్షంగా వారికి ఉపాధి కల్పించడంతో పాటు, వారి ఆదాయ మార్గాలను రెట్టింపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఆర్ధికసాయం, రుణాలపై వడ్డీని మాఫీ చేస్తోంది. ఈ ఏడాది బడ్జెట్లో డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం రూ.1,600 కోట్లు, మహిళా సాధికార సంస్థకు రూ. 400 కోట్లు కేటాయించిందిమహిళల ఆత్మగౌరవంతో పాటు ఆరోగ్యంపైనా దృష్టిపెట్టిన ప్రభుత్వం దీపం పథకం కింద 100 శాతం గ్యాస్‌ కనెక్షన్ల లక్ష్యాన్ని త్వరలో చేరుకోనుంది. గ్రామాల్లో ఎల్పీజీ కనెక్షన్లకు ప్రభుత్వం రూ.350 కోట్లు కేటాయించిందిఅన్న అమృత హస్తం పథకాన్ని ప్రస్తుతం 104 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో అమలు చేస్తున్నారుదీని ద్వారా  2.80 లక్షల గర్భిణీ మహిళలు లబ్దిపొందుతున్నారు. దీనిని మరో 157 ఐసీడీఎస్ ప్రాజెక్టులకు విస్తరించి 4.59 లక్షల మంది గర్భిణీలకు పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. 13 జిల్లాల్లోనూ మహిళల కోసం సఖి పేరుతో ఒక ఉద్యోగి సెంటర్లు ఏర్పాటు చేసింది. మహిళలకు ప్రత్యేకంగా 181 హెల్ప్ లైన్ నెంబర్ అందుబాటులో ఉంచింది.
మహిళను శక్తి స్వరూపిణిగా భావించే ప్రభుత్వం కృష్ణా-గోదావరి నదుల పవిత్ర సంగమం దగ్గర మూడు రోజుల పాటు నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్సదస్సు నిర్వహించి దేశం దృష్టి విజయావాడవైపు చూసేలా చేసిందిమహిళల రాజకీయ-సామాజిక సమస్యలు చర్చించి, భవిష్యత్ వైపు అడుగులు వేయడానికి అనువుగా అంతర్జాతీయ స్థాయిలో అమరావతి ప్రకటన విడుదల చేయనుందిజాతీయ మహిళాపార్లమెంట్ లో పాల్గొన్న రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి మహిళలు, యువతులు, విద్యార్థుల అనుభవాల సారంతో జరిగిన ఉపన్యాసాలు, చర్చలు, సిఫారసులు, తీర్మానాలకు సంక్షిప్త రూపమే అమరావతి ప్రకటన. గ్రామీణ స్థాయి పేద మహిళలు మొదలుకొని  పట్టణ స్థాయి పేద మహిళలు, అసంఘటిత కార్మిక మహిళలు, ఒంటరి మహిళలు, గర్భిణీ స్త్రీలు, పసిపిల్లల స్థితిగతులపై ప్రతి అంశాన్ని చర్చించారు. పాఠశాల స్థాయిలో విద్యార్థినులకు సౌకర్యాలు, ఉపాధిపై అవగాహన, స్వీయరక్షణ, మహిళల న్యాయపరమైన హక్కులు, వ్యభిచార కూపంలోకి నెట్టబడే బాలికలు, మహిళల సమస్యలు, మహిళలకు వృత్తి విద్య, గ్రామీణ పరిశ్రమలు, డ్రైవింగ్ లో శిక్షణ, మహిళా పారిశ్రామికవేత్తలకు రుణ సౌకర్యం కల్పించడం, పన్నుల మినహాయింపు, ప్రత్యేక మహిళా పారిశ్రామిక జోన్ల ఏర్పాటు, సైబర్ సెక్యూరిటీ, సినిమా, టీవీ, మీడియా నుంచి రక్షణ, అన్ని రంగాల్లో సమాన అవకాశాలు తదితర అనేక అంశాలను చర్చించి ప్రకటనలకు తుది రూపం ఇచ్చారుస్త్రీ విద్య, మహిళల న్యాయపరమైన హక్కులు, మహిళల ఆరోగ్యం, సమతుల ఆహారం, పారిశ్రామిక రంగంలో, పరిశోధన, నూతన ఆవిష్కరణల్లో, రాజకీయాల్లో మహిళలు, వారి సమాజిక భద్రత, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో వారి పాత్రసామాజికాభివృద్ధి, మహిళల డిజిటల్ విద్య తదితర అనేక  అంశాలతో దీనిని రూపొందించారు. త్వరలో దానిని విడుదల చేస్తారు.

         వివిధ పథకాల ద్వారా పేదలకు ఇళ్లు నిర్మించడమే కాకుండా ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి తప్పనిసరిగా వుండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందిమహిళల ఆత్మగౌరవం కాపాడేందుకు ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మిస్తూ ఓడీఎఫ్ రాష్ట్రం కోసం కృషిచేస్తోంది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద గ్రామాల్లో బహిరంగ మలవిసర్జన లేకుండా చూసేందుకు ఇంకా 7.50 లక్షల మరుగుదొడ్లు నిర్మించాల్సి వుండగా, ఇందుకోసం ఈ ఏడాది రూ.100 కోట్ల నిధులు వినియోగించాలని నిర్ణయించింది. అదేవిధంగా ప్రజారోగ్యానికి కూడా ప్రభుత్వం  పెద్దపీట వేసింది. ఎన్టీఆర్ వైద్య పరీక్ష, ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్య రక్ష, చంద్రన్న సంచార చికిత్స, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, ముఖ్యమంత్రి పట్టణ వైద్య కేంద్రాలు, 108 సర్వీసు, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, బసవతారకం మదర్ కిట్స్, ఎన్టీఆర్ బేబీ కిట్స్, అన్న అమృత హస్తం, బాలామృతం, గోరు ముద్దలు, గిరి గోరుముద్దలు, ప్రభుత్వాసుపత్రుల్లో పరిశుభ్రత, ఉచిత డయాలసిస్, మహిళలకు మాస్టర్ హెల్త్ చెకప్‌లతో అందరికీ ఆరోగ్య భద్రత కల్పిస్తోంది. చిన్నారులకు పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 38.50 లక్షల మంది విద్యార్ధులకు మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తోందిప్రభుత్వ పాఠాశాలలలో విద్యార్ధులకు పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తోంది. రాష్ట్రంలోని 1,641 పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో 31,596 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వగా, 4005 మంది విద్యార్ధులకు ప్రతిభ అవార్డులు ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది. తొమ్మిదో తరగతి చదువుకునే విద్యార్ధినులకు సైకిళ్లను పంపిణీ చేసింది. ఈ ఏడాది నుంచి 8, 9 తరగతుల విద్యార్థులకు కూడా సైకిల్స్ పంపిణీ చేస్తున్నారు. 18 నుంచి 70 సంవత్సరాల వయసు కలిగిన అసంఘటితరంగ కార్మికులకు చంద్రన్న బీమాతో ఆపన్నహస్తం అందిస్తోంది. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల వరకు పరిహారం, సహజ మరణానికి రూ. 30 వేలు, ప్రమాదంలో అంగవైకల్యం ఏర్పడితే రూ. 3,62,500 ఇచ్చి ఆదుకుంటోంది. చంద్రన్న బీమా కింద 2.13 కోట్ల మంది రక్షణ పొందుతున్నారు. బీమాదారుని మరణ సమాచారం తెలిసిన 48 గంటలలోపు మండలాల్లోని బీమామిత్ర ద్వారా అంత్యక్రియలకు రూ.5,000 అందించడమే కాకుండా క్లెయిమ్‌కు కావలసిన పత్రాల జారీచేయడంలో కూడా బీమామిత్రఉద్యోగులు పర్యవేక్షిస్తారు. చంద్రన్న బీమా పాలసీదారులు  ప్రమాదంలో మరణిస్తే వారి పరిహారానికి అవసరమైన ప్రాథమిక నివేదిక, దర్యాప్తు, శవ పంచనామా, మరణ ధృవీకరణ పత్రం నిర్ణీత గడువులోగా వెబ్‌సైట్‌లో ఉంచుతారు. ఈ ధృవపత్రాల జారీలో జాప్యం కారణంగా పరిహారం అందడంలో ఆలస్యం జరుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందిఇప్పటివరకు సుమారు 30వేల పైచిలుకు క్లయిములకు పరిహారం అందింది. చంద్రన్న బీమా కోసం ప్రస్తుతం పోర్టల్ వుండగా, త్వరలో ఒక ప్రత్యేక యాప్‌ను కూడా ప్రభుత్వం తీసుకురానుంది.

-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్.

Jul 22, 2017

నిర్మాణ రంగంలో భారీ వృద్ధి రేటు


జీఎస్డీపీ సమీక్షా సమావేశంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు

Ø మొదటి త్రైమాసికం పారిశ్రామిక రంగంలో 11-12 శాతం వృద్ధిరేటుకు అవకాశం
Ø ఎంఎస్ఎంఈ రంగంపై అధ్యయనం
Ø వందకు పైగా కొత్త పరిశ్రమల స్థాపన
Ø టెక్స్ టైల్ రంగంలో స్థానికులకే ఉద్యోగావకాశాలు
Ø సంతృప్తికరంగా వర్షపాతం
Ø తోళ్ల పరిశ్రమ విస్తరణపై చర్చ

సచివాలయం, జూలై 21: ఈ ఏడాది నిర్మాణ రంగంలో భారీ వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. సచివాలయం 2వ బ్లాక్ లోని తన చాంబర్ లో ద్వితీయ రంగమైన పరిశ్రమలు, దాని అనుబంధ రంగాల్లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్ డీపీ)ని శుక్రవారం ఉదయం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా రాజధాని అమరావతిలో ప్రభుత్వ రంగంతోపాటు ప్రైవేట్ రంగంలో కూడా అనేక నిర్మాణాలు జరుగుతాయని చెప్పారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రభుత్వ గృహ నిర్మాణాలతోపాటు ప్రైవేటు రంగంలో గృహ, ఇతర నిర్మాణాలు బాగా జరిగే అవకాశం ఉందన్నారు. ఆ విధంగా ఈ రంగంలో భారీ వృద్ధిరేటు నమోదవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గ్రామీణ గృహనిర్మాణ పథకం పనులు చురుకుగా సాగుతున్నట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు నెలల్లో 52 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి అయినట్లు తెలిపారు.   ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక రంగం క్షీణదశలో ఉందని, జాతీయ స్థాయిలో కూడా వృద్ధి రేటు అంత ఎక్కువగా లేదని, అయితే రాష్ట్రంలో వ్యాపార అనుకూల విధానాలు అనుసరిస్తుండటం, భాగస్వామ్య సదస్సులు నిర్వహిస్తుండటం వల్ల పారిశ్రామిక పెట్టుబడులు ఆశాజనకంగా ఉన్నట్లు చెప్పారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో పారిశ్రామిక వృద్ధి రేటు 11 నుంచి 12 శాతం వరకు ఉండే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఆశాజనకంగా ఉన్నట్లు తెలిపారు. వర్షాలు బాగా పడి, పంటలు బాగా పండాయని, ధరలు కూడా రైతులకు లాభాలు చేకూర్చేవిధంగా ఉన్నాయన్నారు. విధానపరమైన ప్రభుత్వ విధానాల ద్వారా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించాలన్నారు. మైనింగ్ అండ్ మినరల్స్ కు సంబంధించి కొత్త పాలసీని రూపొందించమని సంబంధింత అధికారులను ఆదేశించారు. తద్వారా ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని చెప్పారు. సూక్ష, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఇ-మైక్రో,స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్) రంగంలో ప్రోత్సహకాలు ఆపకుండా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ రంగంలో ఉత్పత్తులు, ఉత్పత్తి పరిమాణం, వాటి విలువ, ఉద్యోగ కల్పన, నూతన పెట్టుబడులు తదితర అంశాలను అధ్యయనం చేయమని అధికారులను ఆదేశించారు. కొత్త పరిశ్రమలు, ఏఏ ఉత్పత్తులు ఎంత పరిమాణంలో జరుగుతున్నాయో, ఒక వేళ మూతపడితే ఏ ఉత్పత్తుల పరిశ్రమలు ఎందుకు మూతపడుతున్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా గంణాంక శాఖవారు డేటాను అన్ని అంశాలలో సమగ్రంగా, ఖచ్చితంగా సేకరించాలని మంత్రి ఆదేశించారు. స్థానిక పరిశ్రమలకు అనుగుణంగా ఐటిఐ ఇన్ స్టిట్యూషన్స్ లో సిలబస్ లో మార్పులు చేయవలసిన అవసరం ఉందని మంత్రి యనమల అభిప్రాయపడ్డారు.

టెక్స్ టైల్ రంగంలో 100 శాతం స్థానికులకే ఉద్యోగాలు
రాష్ట్ర వ్యాప్తంగా టౌన్ షిప్ లను అభివృద్ధి చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు చెప్పారు.  టెక్స్ టైల్ రంగంలో 100 శాతం  ఉద్యోగావకాశాలు స్థానికులకే అభిస్తున్నట్లు తెలిపారు. వంద మందికి పైగా ఉద్యోగులున్న కొత్త పరిశ్రమలు ఈ ఏడాది వందకుపైగా ప్రారంభమైనట్లు చెప్పారు. ఇటువంటి పరిశ్రమలు 2016-17లో 729 ఉండగా, ప్రస్తుతం 836 ఉన్నట్లు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎక్కవ పరిశ్రమలు నెలకొల్పుతున్నట్లు చెప్పారు. గార్మెంట్ పరిశ్రమ ఈ ఏడాది కొత్తగా  11 వేల మందికి ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు. పరిశ్రమల తనిఖీ, పరిశీలన సమయంలో అధికారులు ఎప్పటికప్పుడు వివరాలను అధికారులు మొబైల్స్ ద్వారా ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తున్నట్లు తెలిపారు.

ఎంఎస్ఎంఈ పరిశ్రమలను ప్రోత్సహించే క్రమంలో వ్యాట్ ని 5 ఏళ్ల వరకు పూర్తిగా రీయింబర్స్ చేసే విధానం అనుసరించారు. ఇప్పడు జీఎస్టీ వచ్చినందుకు రీయింబర్స్ మెంట్ ఎలా ఇవ్వాలన్నదానిపై చర్చించారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడా దీనిపై ఒక నిర్ణయం తీసుకోలేదని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఫర్నీచర్ తయారీ రంగం, తోళ్ల పరిశ్రమ విస్తరణ తదితర అంశాలను చర్చించారు. కేంద్ర ప్రభుత్వ రంగంలో రూ.125 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో ఒక తోళ్ల  పరిశ్రమను స్థాపించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి సాలమన్ అరోకియా రాజ్, ఆర్థిక, గణాంక శాఖ డైరెక్టర్ డాక్టర్ డి.దక్షిణామూర్తి, ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈఓ సంజయ్ గుప్త పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కల్పన శాఖ, గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు.

సంతృప్తికరంగా వర్షపాతం
అనంతరం ఆర్థిక,గణాంకాలపై జరిగిన సమీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం సంతృప్తికరంగా ఉన్నట్లు  మంత్రి తెలిపారు. అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో మాత్రం సాదారణ స్థాయికంటే తక్కువగా పడినట్లు చెప్పారు.  రాష్ట్రంలో ద్రవ్యోల్బణం తగ్గినట్లు అథికారులు తెలిపారు. గణాంకాల సేకరణ మెరుగుపడినట్లు చెప్పారు.

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...