Aug 19, 2020

రూపాయి ఫీజుతో అమ‌రావ‌తి రైతులకు అండ‌గా ప‌రాశ‌రన్!

 బాబ్రీ-రామ మందిరం వివాదంపై సుప్రీం కోర్టులో వాదించిన  ప్రముఖ నాయవాది, ప‌రాశ‌ర‌న్ ఒక్క రూపాయి ఫీజుతో అమ‌రావ‌తి రైతుల త‌ర‌పున సుప్రీం కోర్టులో వాదించడానికి తన సంసిద్ధత వ్యక్తం చేశారు. మూడు రాజధానులు, అమ‌రావ‌తి భూములు వివాదంపై సుప్రీం కోర్టులో వాదించేందుకు వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌ముఖ న్యాయ‌వాది హ‌రీష్ సాల్వేను నియ‌మించుకుంది. హ‌రీష్ సాల్వే స్థాయిలో త‌మ త‌ర‌పున వాదించే లాయ‌ర్ కోసం రైతులు  ఢిల్లీలో వెతికారు. ఎంత మందిని అడిగినా ఫీజు అధికంగా అడ‌గారు. చివ‌రకు పరాశ‌రన్‌ను ఆశ్ర‌యించారు. రైతుల బాధ‌లు విని చ‌లించిపోయిన ప‌రాశ‌ర‌న్ ఒక్క రూపాయి ఫీజుతో వారి త‌ర‌పున వాదించేందుకు అంగీక‌రించారు.

 

Aug 18, 2020

సంతోషంగా ఉండటమే ఐశ్వర్యం

ఐస్క్రీమ్ తిన్నా కరిగిపోద్ది, తినకపోయినా కరిగిపోద్ది.

జీవితం కూడా అంతే...

ఏంజాయ్ చేసినా కరిగిపోద్ది, చేయకపోయినా కరిగిపోద్ది.

• అదేదో ఏంజాయ్ చేసిపోతే, ఆ జీవితానికి ఓ పరమార్థం వుంటుంది.

• తర్వాత నరకం, స్వర్గం అంటారా?!?! ఉన్నాయో, లేవో కూడా ఎవడికి తెలియదు, నువ్వు మళ్ళీ పుడతావో లేదో కూడా తెలియదు.

• తాగినోడు ఎదవ కాదు, తాగలేనోడు మహానుభావుడు కాదు.

• పోని తాగలేనోడు నూరేళ్ళు బ్రతుకుతాడా అంటే, ఆ గ్యారంటీ లేదు.

• ఎవడిపాయింట్ ఆఫ్ వ్యూ వాడిది, ఎవడి జీవితం వాడిది. 

ఫైనల్ గా చెప్పదేంటంటే...

టైం టు టైం తినండి, పడుకొండి, ఎక్కువ ఆలోచించకండి, ఆరోగ్యాలు జాగ్రత్త. 

• ఎక్కడ పోతుందో అని లాకర్లలో భయంతో దాచుకునే సంపద ఐశ్వర్యమా?

• లేక ఎప్పుడు మనతోనే ఉంటుంది అనే ధైర్యం ఐశ్వర్యమా!.

• ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు, లాకర్స్ లోని తులాల బంగారాలు కాదు?!?!?!

• ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జల చప్పుడు ఐశ్వర్యం.

• ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం. 

• ఎంత ఎదిగినా, నాన్న తిట్టే తిట్లు ఐశ్వర్యం. 

• అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం. 

• భార్య చూసే ఓర చూపు ఐశ్వర్యం. 

• పచ్చటి చెట్టు, పంటపొలాలు ఐశ్వర్యం. 

• వెచ్చటి సూర్యుడు ఐశ్వర్యం. 

• పౌర్ణమి నాడు జాబిల్లి ఐశ్వర్యం. 

• మనచుట్టూ ఉన్న పంచభూతాలు ఐశ్వర్యం. 

• పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు ఐశ్వర్యం. 

• ప్రకృతి అందం ఐశ్వర్యం.  

• పెదాలు పండించే నవ్వు ఐశ్వర్యం. 

• అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితుడు ఐశ్వర్యం. 

• బుద్ధికలిగిన బిడ్డలు ఐశ్వర్యం. 

• బిడ్డలకొచ్చే చదువు  ఐశ్వర్యం. 

• భగవంతుడిచ్చిన ఆరోగ్యం  ఐశ్వర్యం. 

• చాలామందికన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి ఐశ్వర్యం. 

• పరులకు సాయంచేసే మనసు మన ఐశ్వర్యం.

• ఐశ్వర్యం అంటే చేతులు లేక్కేట్టే కాసులు కాదు. 

• కళ్ళు చూపెట్టే ప్రపంచం ఐశ్వర్యం. 

• మనసు పొందే సంతోషం ఐశ్వర్యం ధన్యవాదాలు

- అపరిచితుడు

Aug 17, 2020

విశిష్ట దేవాలయాలు

సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు: 

1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం. 

2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం. 

3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం. 

4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం. 

5. మొగిలీశ్వర్.

6. కోదండరామ దేవాలయం,  కడప జిల్లా.


నిరంతరం జలము ప్రవహించే  దేవాలయాలు: 

1. మహానంది

2. జంబుకేశ్వర్ 

3. బుగ్గరామలింగేశ్వర్

4. కర్ణాటక కమండల గణపతి.

5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.

6. బెంగళూర్ మల్లేశ్వర్ 

7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం

8. సిద్ధగంగా


నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు. 

1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి. 

2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్,  

3. మంజునాథ్.

శ్వాస తీసుకునే కాళహస్తీశ్వర్

సముద్రమే వెనక్కివెళ్లే 

1. గుజరాత్ నిష్కళంక మహాదేవ్, 

2. 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.

స్త్రీవలె నెలసరి అయ్యే 

1. అస్సాం కామాఖ్యా అమ్మవారు,  

2. కేరళ దుర్గామాత.

రంగులు మారే ఆలయం. 

1. ఉత్తరాయణం,  దక్షిణాయనం లో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.

2. పౌర్ణమికి తెల్లగా,  అమావాస్యకు నల్లగా రంగుమారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయం.

పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.


నిరంతరం పెరుగుతూన్న విగ్రహాలు 

 1. కాణిపాకం,  

2. యాగంటి బసవన్న,  

3. కాశీ తిలభండేశ్వర్,  

4. బెంగుళూరు బసవేశ్వర్

5. బిక్కవోలు లక్ష్మీగణపతి


స్వయంభువుగా 

సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాధ్.

ఆరునెలలకు ఒకసారి తెరిచే 

1. బదరీనాథ్,  

2. కేదారనాథ్ (ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది)

3. గుహ్యకాళీమందిరం. 


సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు 

హాసంబా దేవాలయం,  హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.


12 ఏళ్లకు ఒకసారి

పిడుగుపడే తిరిగి అతుక్కునే బిజిలి మహాదేవ్,  హిమాచల్ ప్రదేశ్.


స్వయంగా ప్రసాదం 

1. తినే కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.

2. బృందావనం రాధాకృష్ణ శయనమందిరం


ఒంటి స్తంభంతో

యుగాంతానికి గుర్తుగా  ఉండే పూణే కేధారేశ్వర్,  ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.


రూపాలు మారే

ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే దారిదేవి.


నీటితో దీపం వెలిగించే ఘడియ ఘాట్ మాతాజీ మందిర్,  మధ్యప్రదేశ్. అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇక నుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది,  ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.

మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు 

1. హేమాచల నరసింహ స్వామి.

2. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి


మనిషి వలె గుటకలు  వేస్తూ పానకం త్రాగే  మంగళగిరిలోని పానకాల నరసింహ స్వామీ.


అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి. 


ఛాయా విశేషం 

1. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.

2. హంపి విరూపాక్షేశ్వర్,  గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.

3. బృహదీశ్వరాలయం


నీటిలో తేలే విష్ణువు (వేల టన్నుల బరువుంటుంది ),  నేపాల్


ఇంకా... 

తిరుమల వెంకటేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి, రామేశ్వర్,  కంచి, 

చిలుకూరి బాలాజీ,  పండరినాథ్, భద్రాచలం,  అన్నవరం etc


పూరీ 

పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి,  దేవునికి సమర్పించగానే ఘుమ ఘుమలాడే  పూరి ప్రసాదం.


Aug 15, 2020

జనరిక్ మందులు

ఒక కొత్త మందును కనుగొనడానికి ఫార్మా  కంపెనీలు అనేక పరిశోధనలు, పరీక్షలు చేసి మందును మా‌ర్కెట్ లోకి తీసుకొస్తాయి. అందుకు ప్రతిఫలంగా ఆ మందు తయారీ పై ఆ కంపెనీకి కొంత కాలం పాటు ( 20 సం.లు) పేటెంట్ హక్కులు ఉంటాయి. అలా తయారు చేసిన మందులను బ్రాండెడ్ డ్రగ్స్ లేదా స్టాండర్డ్ డ్రగ్స్ అంటారు. ఆ మందు యొక్క ఫార్ములా తెలిసినా ఏ ఫార్మా కంపెనీ అయినా సరే, దానిని పేటెంట్ ఉన్న కాలంలో పెటెంట్ పొందిన కంపెనీ అనుమతి లేకుండా ఆ మందు తయారు చేయకూడదు. అలా పేటెంట్ లో ఉన్న మందులను ఇతరులు ఎవరైనా తయారు చేసి అమ్మితే వారు శిక్షార్హులౌతారు. అంటే ఆ మందుపై, మొట్ట మొదట తయారు చేసిన కంపెనీకే  20 సంవత్సరాల పాటు గుత్తాది పత్యం ఉంటుంది. నిజానికి ఆ మందును తయారు చేయడానికి అయ్యే ఖర్చుకూ, ఆ మందుపై కంపెనీ వసూలు చేసే అమ్మకపు ధరకు   ఏ మాత్రం పొంతన ఉండదు. తయారీ ఖర్చు కంటే మందు యొక్క అమ్మకపు ధర అనేక రెట్లు అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఆ మందు తయారీ కోసం "పరిశోధనలు మరియు క్షేత్ర స్థాయి పరీక్షల (Clinical Trials)" నిమిత్తం మాకు చాలా డబ్బు ఖర్చైందని సదరు కంపెనీ వాదిస్తుంది..

కాబట్టి ఓ 20 సంవత్సరాల పాటు ఆ మందుపై దానిని తయారు చేసిన కంపెనీకి పేటెంట్ హక్కులు కల్పించి, పెట్టుబడి సొమ్మును రాబట్టుకోడానికి, ఆ మందును మొట్టమొదట తయారు చేసిన కంపెనీకి అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. మందు పై మొట్టమొదటి తయారు చేసిన  కంపెనీ యొక్క పేటెంట్ కాలం ముగిసిన తర్వాత, అవే కెమికల్స్ ను ఉపయోగించి, అదే ఫార్ములాతో, అదే మందును ఏ కంపనీ అయినా తయారు చేసి, మార్కెట్ లోకి విడుదల చేయొచ్చు. అలా తయారు చేసిన మందులను " జనరిక్ డ్రగ్స్" అంటారు. జనరిక్ డ్రగ్స్ తయారు చేయటానికి ఫార్మా కంపెనీలు ఎటువంటి పరిశోధనలు కాని క్లినికల్ ట్రయల్స్ గాని జరపవలసిన అవసరం లేదు. అందువలన జనరిక్ డ్రగ్స్ ధరలు, బ్రాండెడ్ డ్రగ్స్ ధరలతో పోలిస్తే 30 నుండి 80 శాతం తక్కువ ధరలలో లభిస్తాయి. వీటిపై ముద్రించబడే యం.ఆర్.పీ కంటే చాలా తక్కువ రేటుకే వాటిని మనకు అమ్ముతారు. తక్కువ ధరకు లభిస్తున్నాయి కాబట్టి నకిలీ మందులు అని, సరిగా పని చేస్తాయో చేయవో  అని భయపడవలసిన అవసరం లేదు. బ్రాండెడ్ మందుల తయారీలో పాటించాల్సిన ప్రమాణాలన్నీ జనరిక్ మందుల తయారీలోను పాటిస్తారు. బ్రాండెడ్ మందులెలా పనిచేస్తాయో, జనరిక్ మందులు కూడా ఖచ్చితంగా అలానే పనిచేస్తాయి. కాని ప్రజలు జనరిక్ మందులకు అలవాటు పడితే ఫార్మాస్యూటికల్స్ కంపెనీలకూ, ఫార్మా ఏజెన్సీలకూ, మందుల షాపులకూ, అందరికీ నష్టమే కదా.  అందుకనే జనరిక్ మందులపై, అవి బ్రాండెడ్ మందుల్లా పనిచేయవన్న పుకార్లు లేవదీస్తున్నారు.. అది నిజం కాదు జనరిక్ మందులు బ్రాండెడ్ మందులతో సమానంగా పని చేస్తాయి. బ్రాండెడ్ మందులు తయారు చేసే ఫార్మా కంపెనీలు మెడికల్ రిప్రజెంటేటివ్స్ ద్వారా డాక్టర్లకు తమ బ్రాండెడ్ ఔషధాల గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వాటిని సూచించమని కోరుతుంటాయి. డాక్టర్ ఎంతమేర రాస్తే అంతమేర ప్రతిఫలాలను ముట్టజెబుతాయి. ఈ ఫలాలు ఉచిత విదేశీ పర్యటనలు, చెక్, బహుమతులు ఇలా పలు రూపాలుగా ఉంటాయి. అందుకే బ్రాండెడ్ ఔషధాలు చాలా ఖరీదుగా ఉంటాయి. కొంత మంది వైద్యులు జనరిక్ మందులను సూచిస్తుంటారు. అవి వారి ఆస్పత్రి ప్రాంగణంలోనే లభిస్తాయి. వాటి ధర వాస్తవానికి చాలా తక్కువగా ఉన్నప్పటికీ వాటి మీద ముద్రించబడిన ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కస్టమర్ అడిగితే ఒక 10 శాతం తగ్గిస్తారు. దాంతో కస్టమర్ సంతోషిస్తాడు. కాని ముద్రిత ధర కంటే 50 నుంచి 80 శాతం వరకు తక్కువ ధర ఉంటుంది. ఉదాహరణకు జ్వరానికి సాధారణంగా డాక్టర్ వద్దకు వెళ్లకుండానే చాలా మంది వాడే మందు "డోలో 650" (పారసెటమాల్ 650 మి గ్రా.) దీని ధర 15 టాబ్లెట్లకు 29 /- రూపాయలు. ఇదే టాబ్లెట్ ను సిప్లా కంపని "పారాసిప్ 650" పేరుతో తయారు చేసి అమ్ముతుంది , దాని ధర 10 టాబ్లెట్ లకు 18/- రూపాయలు. నిజానికి జనరిక్ మెడికల్ షాపులలో పారసెటమాల్ 650 మి గ్రా. రూ. 4.50 /- లకు పది టాబ్లెట్ లభిస్తాయి.నొప్పి నివారణకు వాడే డైక్లో ఫెనాక్ సోడియం ఎస్.ఆర్ బ్రాండెడ్ (వోవిరాన్)10 టాబ్లెట్ ల ధర రూ.51.91. కానీ ఇదే ఔషధం 10 మందుల జనరిక్ ధర జనఔషధి స్టోర్ లో రూ. 3.35 మాత్రమే. 100 ఎం.ఎల్ కాఫ్ సిరప్ బ్రాండెడ్ వి అయితే 33 రూపాయలు పైనే. జనరిక్ దగ్గు మందు జనఔషధి స్టోర్ లో 13 రూపాయలకే లభిస్తుంది. జ్వరం తగ్గడానికి వాడే ప్యారాసిటమాల్ 500 మి గ్రా. 10 మాత్రల ధర బ్రాండెడ్ అయితే 13 రూపాయలు. జనరిక్ అయితే 2.45 రూపాయలే. సూక్ష్మంగా చెప్పాలంటే బేసిక్ ఫార్ములా ప్రకారం తయారైన మందును జనరిక్ మందు అంటారు. ఇదే సూత్రంతో కార్పొరేట్ కంపెనీలు పేరు మార్చి మందులు ఉత్పత్తి చేస్తున్నాయి. ధరలో తేడా తప్పితే మందు పనిచేయడంలో ఎలాంటి వ్యత్యాసం ఉండదు. మందు పరిమాణం, రసాయనిక నామం, నాణ్యత ఒక్కటే గానీ.. లేబుల్, దానిపై బ్రాండ్ పేరు మారుతుంది.

 

 

Aug 6, 2020

భారత రాజ్యాంగంలోని అధికరణాలు

రాజ్యాంగ పీఠిక

భారత ప్రజలమైన మేము, భారత దేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక,  ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి, పౌరులందరికీ:

సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని;
ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనల స్వాతంత్ర్యాన్ని ;
అంతస్తుల్లోనూ,  అవకాశాల్లోనూ, సమానత్వాన్ని చేకూర్చడానికి;, వారందరిలో
వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి;
మన ఈ రాజ్యాంగ పరిషత్ లో 1949, నవంబర్ 26ను ఎంపిక చేసుకొని, శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము.

 ఆర్టికల్ 1 - యూనియన్ పేరు, భూభాగం

ఆర్టికల్ 2 - కొత్త రాష్ట్రాల ప్రవేశం లేదా స్థాపన
ఆర్టికల్ 3 - రాష్ట్రం యొక్క సృష్టి,  సరిహద్దులు లేదా పేర్ల మార్పు
ఆర్టికల్ 4 - మొదటి షెడ్యూల్, నాల్గవ షెడ్యూల్ సవరణలు, రెండు, మూడు కింద చేసిన శాసనాలు
ఆర్టికల్ 5 - రాజ్యాంగం ప్రారంభంలో పౌరులు
ఆర్టికల్ 6 - పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వస్తున్న కొంత మంది వ్యక్తుల పౌరసత్వ హక్కులు
ఆర్టికల్ 7 - భారతదేశం నుంచి పాకిస్తాన్ వెళ్లేవారికి  కొంతమంది వ్యక్తుల పౌరసత్వ హక్కులు
ఆర్టికల్ 8 - భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తుల పౌరసత్వ హక్కులు
ఆర్టికల్ 9 - స్వచ్ఛందంగా విదేశీ రాష్ట్ర పౌరసత్వం తీసుకుంటే భారత పౌరుడు కాదు
ఆర్టికల్ 10 - పౌరసత్వ హక్కుల నిలకడ
ఆర్టికల్ 11 - పౌరసత్వం కోసం చట్టాన్ని పార్లమెంట్ నియంత్రిస్తుంది
ఆర్టికల్ 12 - రాష్ట్ర నిర్వచనం
ఆర్టికల్ 13 - ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే లేదా అవమానించే చట్టాలు
ఆర్టికల్ 14 - చట్టం ముందు సమానత్వం
ఆర్టికల్ 15 - మతం, కులం, లింగం, సంతతి లేదా పుట్టిన ప్రదేశం ఆధారంగా వివక్షను నిషేధించడం
ఆర్టికల్ 16 - ప్రజా ప్రణాళికలో అవకాశాల సమానత్వం
ఆర్టికల్ 17 - అంటరానితనం యొక్క ముగింపు
ఆర్టికల్ 18 - శీర్షికల ముగింపు
ఆర్టికల్ 19 - వాక్ స్వేచ్ఛ
ఆర్టికల్ 20 - నేరాల శిక్షకు సంబంధించి రక్షణ
ఆర్టికల్ 21 - జీవిత రక్షణ మరియు వ్యక్తిగత స్వేచ్ఛ
ఆర్టికల్ 21 ఎ - 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు విద్య హక్కు
ఆర్టికల్ 22 - కొన్ని సందర్భాల్లో అరెస్ట్ నుండి రక్షణ
ఆర్టికల్ 23 - మానవ అక్రమ రవాణా మరియు పిల్లల ఆశ్రమం
ఆర్టికల్ 24 - కర్మాగారాల్లో పిల్లలకు ఉపాధిని నిషేధించడం
ఆర్టికల్ 25 - మనస్సాక్షికి స్వేచ్ఛ మరియు ప్రవర్తన మరియు మతం యొక్క ప్రచారం
ఆర్టికల్ 26 - మతపరమైన వ్యవహారాల నిర్వహణకు స్వేచ్ఛ
ఆర్టికల్ 29 - మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ
ఆర్టికల్ 30 - విద్యా సంస్థలను స్థాపించడానికి మరియు నిర్వహించడానికి మైనారిటీ విభాగాల హక్కు
ఆర్టికల్ 31 - ఆస్తి హక్కు (44 వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించబడింది.)
ఆర్టికల్ 32 - హక్కుల అమలుకు నివారణలు
ఆర్టికల్ 36 - రాష్ట్ర నిర్వచనం
ఆర్టికల్ 38 - ప్రజా సంక్షేమం ప్రోత్సాహానికి రాష్ట్రం సామాజిక వ్యవస్థను రూపొందిస్తుంది.
ఆర్టికల్ 39 - స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం
ఆర్టికల్ 39 ఎ - సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం
ఆర్టికల్ 40 - గ్రామ పంచాయతీల సంస్థ
ఆర్టికల్ 41 - పని విద్య మరియు ప్రజల సహాయం పొందే హక్కు
ఆర్టికల్ 43 - కర్మ కార్లకు జీవనాధార వేతనాల ప్రయత్నం
ఆర్టికల్ 43 ఎ - పరిశ్రమల నిర్వహణలో కార్మికుల భాగస్వామ్యం
ఆర్టికల్ 44 - పౌరులకు ఏకరీతి సివిల్ కోడ్
ఆర్టికల్ 45 - 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు బాల్య సంరక్షణ మరియు విద్య కోసం రాష్ట్ర కేటాయింపు
ఆర్టికల్ 48 - వ్యవసాయ మరియు పశుసంవర్ధక సంస్థ
ఆర్టికల్ 48 ఎ - పర్యావరణం, అడవులు మరియు వన్యప్రాణుల రక్షణ
ఆర్టికల్ 49- జాతీయ స్మారక స్థలాలు మరియు వస్తువుల రక్షణ
ఆర్టికల్ 50 - ఎగ్జిక్యూటివ్ నుండి న్యాయవ్యవస్థ యొక్క వ్యక్తీకరణ
ఆర్టికల్ 51 - అంతర్జాతీయ శాంతి మరియు భద్రత
ఆర్టికల్ 51 ఎ - ప్రాథమిక విధులు
ఆర్టికల్ 52 - భారత రాష్ట్రపతి
ఆర్టికల్ 53 - యూనియన్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్
ఆర్టికల్ 54 - రాష్ట్రపతి ఎన్నిక
ఆర్టికల్ 55 - రాష్ట్రపతి ఎన్నిక విధానం
ఆర్టికల్ 56 - రాష్ట్రపతి పదవీకాలం
ఆర్టికల్ 57 - తిరిగి ఎన్నికలకు అర్హత
ఆర్టికల్ 58 - అధ్యక్షుడిగా ఎన్నుకోబడటం
ఆర్టికల్ 59 - రాష్ట్రపతి నిబంధనలు
ఆర్టికల్ 60 - రాష్ట్రపతి ప్రమాణం
ఆర్టికల్ 61 - రాష్ట్రపతి అభిశంసనకు సంబంధించిన విధానం
ఆర్టికల్ 62 - అధ్యక్ష పదవిలో ఒక వ్యక్తిని నింపడానికి ఎన్నికల సమయం మరియు విధానం
ఆర్టికల్ 63 - భారత ఉపాధ్యక్షుడు
ఆర్టికల్ 64 - ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఎక్స్-అఫిషియో చైర్మన్
ఆర్టికల్ 65 - రాష్ట్రపతి పదవి ఖాళీపై ఉపరాష్ట్రపతి పని
ఆర్టికల్ 66 - ఉపరాష్ట్రపతి ఎన్నిక
ఆర్టికల్ 67 - ఉపరాష్ట్రపతి పదవీకాలం
ఆర్టికల్ 68 - ఉపాధ్యక్ష పదవిని భర్తీ చేయడానికి ఎన్నికలు
ఆర్టికల్ 69 - ఉపరాష్ట్రపతి ప్రమాణం
ఆర్టికల్ 70 - ఇతర ఆకస్మిక పరిస్థితులలో రాష్ట్రపతి విధులను నిర్వర్తించడం
ఆర్టికల్ 71. - అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షుల ఎన్నికలకు సంబంధించిన విషయాలు
ఆర్టికల్ 72 - క్షమాపణ యొక్క శక్తి
ఆర్టికల్ 73 - యూనియన్ యొక్క కార్యనిర్వాహక శక్తిని విస్తరించడం
ఆర్టికల్ 74 - రాష్ట్రపతికి సలహా ఇవ్వడానికి మంత్రుల మండలి
ఆర్టికల్ 75 - మంత్రులకు సంబంధించిన నిబంధనలు
ఆర్టికల్ 76 - అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా
ఆర్టికల్ 77 - భారత ప్రభుత్వ వ్యాపారం యొక్క ప్రవర్తన
ఆర్టికల్ 78 - రాష్ట్రపతికి సమాచారం ఇవ్వడం ప్రధానమంత్రి విధి
ఆర్టికల్ 79 - పార్లమెంట్ రాజ్యాంగం
ఆర్టికల్ 80 - రాజ్యసభ నిర్మాణం

ఆర్టికల్ 81 - లోక్సభ నిర్మాణం
ఆర్టికల్ 83 - పార్లమెంట్ ఉభయ కాలం
ఆర్టికల్ 84 - పార్లమెంటు సభ్యులకు అర్హత
ఆర్టికల్ 85 - పార్లమెంట్ ప్రోగ్రెషన్ మరియు రద్దు యొక్క సెషన్
ఆర్టికల్ 87 - రాష్ట్రపతి ప్రత్యేక చిరునామా
ఆర్టికల్ 88 - ఇళ్లకు సంబంధించి మంత్రులు మరియు అటార్నీ జనరల్ హక్కులు
ఆర్టికల్ 89 - రాజ్యసభ ఛైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్
ఆర్టికల్ 90 - డిప్యూటీ చైర్మన్ పదవిని ఖాళీ చేయడం లేదా తొలగించడం
ఆర్టికల్ 91 - ఛైర్మన్ యొక్క విధులు మరియు అధికారాలు
ఆర్టికల్ 92 - ఛైర్మన్ లేదా డిప్యూటీ ఛైర్మన్లను తొలగించే తీర్మానం పరిశీలనలో ఉంటే అతని అధ్యక్ష పదవి
ఆర్టికల్ 93 - లోక్సభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్
ఆర్టికల్ 94 - అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్ష పదవి ఖాళీగా ఉంది
ఆర్టికల్ 95 - స్పీకర్‌లో విధులు మరియు అధికారాలు
ఆర్టికల్ 96 - ఉపరాష్ట్రపతిని పదవి నుంచి తొలగించే తీర్మానం ఉంటే స్పీకర్ అధ్యక్షత వహించరు
ఆర్టికల్ 97 - ఛైర్మన్, డిప్యూటీ చైర్మన్ మరియు ఛైర్మన్, వైస్ చైర్మన్ యొక్క జీతం మరియు భత్యాలు
ఆర్టికల్ 98 - పార్లమెంట్
ఆర్టికల్ 99 - సభ్యుడి ప్రమాణం లేదా ధృవీకరణ
ఆర్టికల్ 100 - వనరులలో ఓటింగ్ ఖాళీలు ఉన్నప్పటికీ, ఇళ్ల పనితీరుకు శక్తి మరియు కోరం
ఆర్టికల్ 143 - సుప్రీంకోర్టును సంప్రదించడానికి రాష్ట్రపతికి అధికారం
ఆర్టికల్ 144 - సివిల్ మరియు జ్యుడిషియల్ అధికారులచే సుప్రీంకోర్టుకు సహాయం
ఆర్టికల్ 148 - కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా
ఆర్టికల్ 149 - కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ యొక్క విధి అధికారాలు
ఆర్టికల్ 150 - యూనియన్ రాష్ట్రాల రచన యొక్క ఆకృతి
ఆర్టికల్ 153 - రాష్ట్రాల గవర్నర్
ఆర్టికల్ 154 - రాష్ట్ర కార్యనిర్వాహక శక్తి
ఆర్టికల్ 155 - గవర్నర్ నియామకం
ఆర్టికల్ 156 - గవర్నర్ పదవీకాలం
ఆర్టికల్ 157 - గవర్నర్‌గా నియమించాల్సిన అర్హతలు
ఆర్టికల్ 158 - గవర్నర్ పదవికి షరతులు
ఆర్టికల్ 159 - గవర్నర్ ప్రమాణం లేదా ధృవీకరణ
ఆర్టికల్ 163 - గవర్నర్‌కు సలహా ఇవ్వడానికి మంత్రుల మండలి
ఆర్టికల్ 164 - మంత్రుల గురించి ఇతర నిబంధనలు
ఆర్టికల్ 165 - రాష్ట్ర అడ్వకేట్ జనరల్
ఆర్టికల్ 166 - రాష్ట్ర ప్రభుత్వ ఆపరేషన్
ఆర్టికల్ 167 - గవర్నర్‌కు సమాచారం ఇవ్వడానికి సంబంధించి ముఖ్యమంత్రి విధులు
ఆర్టికల్ 168 - రాష్ట్ర శాసనసభ యొక్క రాజ్యాంగం
ఆర్టికల్ 170 - సమావేశాల నిర్మాణం
ఆర్టికల్ 171 - శాసనమండలి కూర్పు
ఆర్టికల్ 172 - రాష్ట్రాల శాసనసభ వ్యవధి
ఆర్టికల్ 173 - రాష్ట్రాల శాసనసభ సభ్యత్వానికి అర్హతలు
ఆర్టికల్ 174 - రాష్ట్రాల శాసనసభ యొక్క సెషన్ ప్రోగ్రెషన్ మరియు రద్దు
ఆర్టికల్ 176 - గవర్నర్ ప్రత్యేక చిరునామా
ఆర్టికల్ 177 - ఇళ్లకు సంబంధించి మంత్రులు మరియు అడ్వకేట్ జనరల్ హక్కులు
ఆర్టికల్ 178 - శాసనసభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్
ఆర్టికల్ 179 - ఛైర్మన్ మరియు డిప్యూటీ స్పీకర్ పదవి యొక్క సెలవు లేదా తొలగింపు
ఆర్టికల్ 180 - ఛైర్మన్ పదవుల పని మరియు అధికారం
ఆర్టికల్ 143 - సుప్రీంకోర్టును సంప్రదించడానికి రాష్ట్రపతికి అధికారం
ఆర్టికల్ 144 - సివిల్ మరియు జ్యుడిషియల్ అధికారులచే సుప్రీంకోర్టుకు సహాయం
ఆర్టికల్ 148 - కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా
ఆర్టికల్ 149 - కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ యొక్క విధి అధికారాలు
ఆర్టికల్ 150 - యూనియన్ రాష్ట్రాల రచన యొక్క ఆకృతి
ఆర్టికల్ 153 - రాష్ట్రాల గవర్నర్
ఆర్టికల్ 154 - రాష్ట్ర కార్యనిర్వాహక శక్తి
ఆర్టికల్ 155 - గవర్నర్ నియామకం
ఆర్టికల్ 156 - గవర్నర్ పదవీకాలం
ఆర్టికల్ 157 - గవర్నర్‌గా నియమించాల్సిన అర్హతలు
ఆర్టికల్ 158 - గవర్నర్ పదవికి షరతులు
ఆర్టికల్ 159 - గవర్నర్ ప్రమాణం లేదా ధృవీకరణ
ఆర్టికల్ 163 - గవర్నర్‌కు సలహా ఇవ్వడానికి మంత్రుల మండలి
ఆర్టికల్ 164 - మంత్రుల గురించి ఇతర నిబంధనలు
ఆర్టికల్ 165 - రాష్ట్ర అడ్వకేట్ జనరల్
ఆర్టికల్ 166 - రాష్ట్ర ప్రభుత్వ ఆపరేషన్
ఆర్టికల్ 167 - గవర్నర్‌కు సమాచారం ఇవ్వడానికి సంబంధించి ముఖ్యమంత్రి విధులు
ఆర్టికల్ 168 - రాష్ట్ర శాసనసభ యొక్క రాజ్యాంగం
ఆర్టికల్ 170 - సమావేశాల నిర్మాణం
ఆర్టికల్ 171 - శాసనమండలి కూర్పు
ఆర్టికల్ 172 - రాష్ట్రాల శాసనసభ వ్యవధి
ఆర్టికల్ 173 - రాష్ట్రాల శాసనసభ సభ్యత్వానికి అర్హతలు
ఆర్టికల్ 174 - రాష్ట్రాల శాసనసభ యొక్క సెషన్ ప్రోగ్రెషన్ మరియు రద్దు
ఆర్టికల్ 176 - గవర్నర్ ప్రత్యేక చిరునామా
ఆర్టికల్ 177 - ఇళ్లకు సంబంధించి మంత్రులు మరియు అడ్వకేట్ జనరల్ హక్కులు
ఆర్టికల్ 178 - శాసనసభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్
ఆర్టికల్ 179 - ఛైర్మన్ మరియు డిప్యూటీ స్పీకర్ పదవి యొక్క సెలవు లేదా తొలగింపు
ఆర్టికల్ 180 - ఛైర్మన్ పదవుల పని మరియు అధికారం

ఆర్టికల్ 181 - వైస్ చైర్మన్ పదవి నుండి తొలగించడానికి తీర్మానం లేదు
ఆర్టికల్ 182 - లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్
ఆర్టికల్ 183 - చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ కార్యాలయం నుండి సెలవు లేదా తొలగింపు
ఆర్టికల్ 184 - ఛైర్మన్ పదవి యొక్క విధులు మరియు అధికారాలు
ఆర్టికల్ (185) - సావరిన్ డిప్యూటీ పదవిని తొలగించే తీర్మానం అధ్యక్షత వహించకపోతే
ఆర్టికల్ 186 - ఛైర్మన్, వైస్ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ జీతం మరియు భత్యాలు
ఆర్టికల్ 187 - రాష్ట్ర శాసనసభ సచివాలయం
ఆర్టికల్ 188 - సభ్యుల ప్రమాణం లేదా ధృవీకరణ
ఆర్టికల్ 189 - ఇళ్లలో ఓటింగ్ ఖాళీలు ఉన్నప్పటికీ సాధనాలు మరియు కోరం పనిచేసే అధికారం
ఆర్టికల్ 199 - విదేశాలలో సంపద యొక్క నిర్వచనం
ఆర్టికల్ 200 - ఎమ్మెల్యేలపై అనుమతి
ఆర్టికల్ 202 - వార్షిక ఆర్థిక ప్రకటన
ఆర్టికల్ 213 - శాసనసభలో ఆర్డినెన్స్ ధృవీకరించడానికి గవర్నర్ యొక్క అధికారం
ఆర్టికల్ 214 - రాష్ట్రాలకు హైకోర్టు
ఆర్టికల్ 215 - హైకోర్టుల రికార్డు కోర్టు
ఆర్టికల్ 216 - హైకోర్టు రాజ్యాంగం
ఆర్టికల్ 217 - హైకోర్టు న్యాయమూర్తి నియామక విధాన పరిస్థితులు
ఆర్టికల్ 219 - ప్రమాణం మరియు ధృవీకరణ
ఆర్టికల్ 221 - న్యాయమూర్తుల జీతం
ఆర్టికల్ 222 - న్యాయమూర్తులను ఒక కోర్టు నుండి మరొక కోర్టుకు బదిలీ చేయడం
ఆర్టికల్ 223 - ఎగ్జిక్యూటివ్ చీఫ్ జస్టిస్ మూర్తి నియామకం
ఆర్టికల్ 224 - ఇతర న్యాయమూర్తుల నియామకం
ఆర్టికల్ 226 - కొన్ని రిట్‌లను తొలగించడానికి హైకోర్టు యొక్క అధికారం
ఆర్టికల్ 231 - రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకే హైకోర్టు ఏర్పాటు
ఆర్టికల్ 233 - జిల్లా న్యాయమూర్తుల నియామకం
ఆర్టికల్ 241 - కేంద్రపాలిత ప్రాంతాలకు హైకోర్టు
ఆర్టికల్ 243 - పంచాయతీ మునిసిపాలిటీలు మరియు సహకార సంఘాలు
ఆర్టికల్ 244 - షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు గిరిజన ప్రాంతాల పరిపాలన
ఆర్టికల్ 248 - అవశేష శాసన అధికారాలు
ఆర్టికల్ 249 - జాతీయ ప్రయోజనంలో రాష్ట్ర జాబితా విషయానికి సంబంధించి శాసనసభకు పార్లమెంటు అధికారం
ఆర్టికల్ 252 - రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు సమ్మతితో చట్టాలు చేయడానికి పార్లమెంటు అధికారం
ఆర్టికల్ 254 - పార్లమెంట్ రూపొందించిన చట్టాలు మరియు రాష్ట్రాల శాసనసభ చేసిన చట్టాల మధ్య అస్థిరత
ఆర్టికల్ 256 - రాష్ట్రాలు మరియు యూనియన్ యొక్క బాధ్యత
ఆర్టికల్ 257 - కొన్ని సందర్భాల్లో రాష్ట్రాలపై యూనియన్ నియంత్రణ
ఆర్టికల్ 262 - అంతర్రాష్ట్ర నదులు లేదా నది లోయలకు సంబంధించిన నీటి వివాదాల తీర్పు
ఆర్టికల్ 263 - అంతర్-రాష్ట్ర అభివృద్ధి మండలి యొక్క రాజ్యాంగం
ఆర్టికల్ 266 - కన్సాలిడేటెడ్ ఫండ్
ఆర్టికల్ 267 - ఆకస్మిక నిధి
ఆర్టికల్ 269 - పన్నులు వసూలు చేసి యూనియన్ వసూలు చేసినప్పటికీ రాష్ట్రాలకు అప్పగించారు
ఆర్టికల్ 270 - పన్నులు యూనియన్ సేకరించి యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయబడతాయి
ఆర్టికల్ 280 - ఫైనాన్స్ కమిషన్
ఆర్టికల్ 281 ​​- ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు
ఆర్టికల్ 292 - భారత ప్రభుత్వం రుణాలు తీసుకోవడం
ఆర్టికల్ 293 - రాష్ట్రం ద్వారా రుణాలు తీసుకోవడం
ఆర్టికల్ 300 ఎ - ఆస్తి హక్కు
ఆర్టికల్ 301 - వాణిజ్య వాణిజ్యం మరియు సంభోగం యొక్క స్వేచ్ఛ
ఆర్టికల్ 309 - రాష్ట్రానికి సేవలందించే వ్యక్తుల నియామకం మరియు సేవా పరిస్థితులు
ఆర్టికల్ 310 - యూనియన్ లేదా రాష్ట్రానికి సేవలందించే వ్యక్తుల పదవీకాలం
ఆర్టికల్ 312 - ఆల్ ఇండియా సర్వీసెస్
ఆర్టికల్ 313 - ట్రాన్సిషన్ కార్పెట్ కేటాయింపులు
ఆర్టికల్ 315 - యూనియన్ స్టేట్ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్
ఆర్టికల్ 316 - సభ్యుల నియామకం మరియు పదవీకాలం
ఆర్టికల్ 317 - పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిని తొలగించడం లేదా సస్పెండ్ చేయడం
ఆర్టికల్ 320 - పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టాలు
ఆర్టికల్ 323 ఎ - అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్
ఆర్టికల్ 323 బి - ఇతర విషయాలకు ట్రిబ్యునల్
ఆర్టికల్ 323 బి - ఇతర విషయాలకు ట్రిబ్యునల్
ఆర్టికల్ 324 - ఎన్నికలను నిర్దేశించడం మరియు నియంత్రించడం ఎన్నికల సంఘంలో ఉంది
ఆర్టికల్ 329 - ఎన్నికల విషయాలలో కోర్టు జోక్యం యొక్క వివరణ
ఆర్టికల్ 330 - లోక్సభలో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల సీట్ల మూసివేత
ఆర్టికల్ 331 - లోక్సభలో ఆంగ్లో-ఇండియన్ సమాజానికి ప్రాతినిధ్యం
ఆర్టికల్ 332 - రాష్ట్ర శాసనసభలో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల సీట్ల రిజర్వేషన్
ఆర్టికల్ 333 - రాష్ట్ర అసెంబ్లీలో ఆంగ్లో-ఇండియన్ సమాజానికి ప్రాతినిధ్యం
ఆర్టికల్ 338 - షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్
ఆర్టికల్ 338 (ఎ) - షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్
ఆర్టికల్ 343 - యూనియన్ యొక్క నిర్వచనం
ఆర్టికల్ 344 - అధికారిక భాషపై పార్లమెంటు కమిషన్ మరియు కమిటీ
ఆర్టికల్ 350 ఎ - ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో విద్య యొక్క సౌకర్యాలు
ఆర్టికల్ 351 - హిందీ భాష అభివృద్ధికి సూచనలు
ఆర్టికల్ 352 - అత్యవసర ప్రకటన ప్రభావం
ఆర్టికల్ 356 - రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాలు విఫలమైతే నిబంధనలు
ఆర్టికల్ 360 - ఆర్థిక అత్యవసర పరిస్థితులకు సంబంధించిన నిబంధనలు
ఆర్టికల్ 368 - రాజ్యాంగ సవరణకు పార్లమెంటుకు అధికారం, ఆ విధానం
ఆర్టికల్ 377 - కంట్రోలర్ అండ్  ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన నిబంధనలు
ఆర్టికల్ 378 - పబ్లిక్ కమిషన్స్

Aug 3, 2020

తెలుగులో విక్టోరియా మహారాణి బంగారు పతకం



ఇది కర్నూలు జిల్లా కోయిలకుంట్లకు చెందిన బుడ్డా వెంగళరెడ్డి గారికి విక్టోరియా మహారాణి ఇంగ్లాండులో చేయించి పంపిన బంగారు తెలుగు పతకం. దీనికి వెనుకవైపు తెలుగు అక్షరాలు, తెలుగు అంకెలున్నాయి. ఈ అక్షరాలు చాలా స్పష్టంగా చక్కగా చదవటానికి రాశారు. "1866 (౧౮౬౬) సంవత్సరములో సంభవించిన క్షామకాలమందు నిరాధారముగా వుండిన తన స్వదేశస్థుల పట్ల జరిగించిన వుత్కృష్టమయిన ఔదార్యమునకు గాను హర్ మెజస్టీ రాణి గారి వల్ల చేయబడిన శ్రేష్ఠమయిన గణ్యతకు ఆనవాలుగా బుడ్డావెంగళరెడ్డి గారికి బహుమానము ఇయ్యబడ్డది."అని ఉంది. తెలుగు అక్షరాలతో బంగారు పతకం లండన్ లో చేయించి ఆంగ్ల పాలకులు ఇవ్వటం అద్భుతమే.
పతకం మన పూర్ణకుంభాన్ని పోలి ఉంది. మన రాజులు ఏర్పరచుకున్న రాజముద్రలు, పూర్ణకుంభాల రూపాలను కూడా బ్రిటీష్ పాలకులు అంత్యంత నిశితంగా గమనించి ఆయా ప్రాంతాల ప్రజల భాషలతోపాటు సంస్కృతీ చిహ్నాలను కూడా స్వీకరించి వాటి రూపాలలోనే పతకాలు కూడా ప్రదానం చేశారు.  పాలనలో తెలుగు అమలు చేసిన విషయంలో మన వాళ్ళకంటే బ్రిటీష్ పాలకులే కొంత నయమనిపించారు.




అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...