Jul 10, 2023

‘వెనక్కితిరిగి చూడకు’ పోస్టర్ విడుదల

 

గుంటూరు : హ‌ర్ర‌ర్‌, థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ‘వెనక్కితిరిగి చూడకు’ సినిమా పోస్టర్ ని గుంటూరులోని బృందావ‌న్ గార్డెన్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం సాయంత్రం  విడుదల చేశారు. స‌ముద్ర తీరప్రాంతంలో జ‌రిగే హ‌ర్ర‌ర్ బ్యాక్ డ్రాప్ లో క‌థ జ‌రుగుతుంద‌ని డైరెక్ట‌ర్ గోడి శివ‌ప్ర‌సాద్ చెప్పారు. ప్ర‌తి స‌న్నివేశం ఉత్కంఠ భ‌రితంగా ఉంటుంద‌ని,ప్రేక్ష‌కుల్ని థ్రిల్లింగ్ కు గురిచేస్తుంద‌న్నారు. 90 శాతం ఔట్ డోర్ లోనే ఘూటింగ్ చేశామ‌ని చిత్ర నిర్మాత తిరుమ‌లేశ్వర్రావు చెప్పారు. చీరాల‌, గుంటూరు, విజ‌య‌వాడ‌లోని అంద‌మైన లోకేష‌న్స్ లో షూటింగ్ జ‌రిగింద‌న్నారు. చీరాల పొట్టి స‌బ్బుయ్య‌పాలెంలోని దట్టమైన అట‌వీ ప్రాంతాల్లో షూటింగ్ చేసినట్లు తెలిపారు. అక్క‌డ షూట్ చేస్తున్నంత‌సేపు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింద‌న్నారు. ఈ విష‌యంలో యాక్ట‌ర్స్ కు, కెమేరా టీమ్ కు ప్ర‌త్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. వాడ‌రేవు ద‌గ్గ‌ర స‌ముద్రంలో కాలువ క‌లిసే ప్రాంతంలో అమావాస్య రోజు షూటింగ్ చేశామ‌న్నారు. తాము ప‌డ్డ క‌ష్ట‌మంతా ప్ర‌తి ఫ్రేమ్ లో క‌నిపిస్తుంద‌ని, ప్రేక్ష‌కుల‌ను పూర్తిగా అల‌రిస్తుంద‌నే ధీమా వ్య‌క్తం చేశారు. 

ఈ మూవీలో రెండు పాట‌లు ఉంటాయ‌న్నారు. ఇంట‌ర్వేల్ బ్లాక్‌, క్లైమాక్స్ సినిమాకు బిగ్ అస్సెట్ అన్నారు. చీరాల బీచ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో చిత్రీకరించిన  ఈ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంద‌ని చిత్ర యూనిట్ వెల్ల‌డించింది. ఆగ‌స్టు చివ‌ర్లో గానీ, సెప్టెంబ‌ర్  లో గానీ ఈ మూవీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ‘వెనక్కితిరిగి చూడకు’ పోస్టర్ ని విడుదల చేసినవారిలో రామరాజు ఫౌండేషన్ అధ్యక్షులు రామరాజు, ప్రముఖ రచయిత కావూరి సత్యనారాయణ, సీనియర్ నటులు నడింపల్లి వెంకటేశ్వరరావు, నిర్మాత డి.తిరుమలేశ్వరరావు, దర్శకుడు శివప్రసాద్, హీరో పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. 


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...