Jan 5, 2020

మూడు రాజధానులు

     17.12.2019 ‌: శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి :  దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులున్నాయి. మనకూ మూడు ఉంటే తప్పేంటి.? మన ఆలోచనలు మారాలి.  అమరావతిలో చట్టసభలు, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయవచ్చు అని చెప్పారు.
 నారా చంద్రబాబు నాయుడు: అమరావతిని చంపేయాలని చూస్తున్నారు. మూడు రాజధానులకు డబ్బెక్కడిది.? కమిటీ నివేదిక రాకముందే రాజధానిపై ప్రకటన ఎవరికోసం.? అడ్మినిస్ట్రేషన్‍ను వివిధ ప్రాంతాల్లో పెడితే అభివృద్ధి జరగదు. విజయవాడలో రాజధాని పెడితే అభ్యంతరం లేదని జగన్ అన్నాడు. బంగారు బాతులాంటి రాజధాని అమరావతిపై సీఎం జగన్‌ యూటర్న్. అమరావతి విధ్వంసానికి కుట్ర సాగుతోంది. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి గానీ పరిపాలన వికేంద్రీకరణ సరికాదు. వైసీపీకి 151 సీట్లు వచ్చాయని సీఎం జగన్‌కు ఒళ్లంతా గర్వం.
v యనమల రామకృష్ణుడు: ఏ దేశానికైనా, రాష్ట్రానికైనా రాజధాని ఒక్కటే ఉంటుంది. సౌతాఫ్రికాకు మూడు రాజధానులు వద్దని నెల్సన్ మండేలా చెప్పారు. టీడీపీ సింగపూర్‌ను ఆదర్శంగా తీసుకుంటే.. జగన్ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుంటున్నారు. 
v నారా లోకేశ్:  రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి జగన్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిపై ఒక మాట.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట. ఎంతైనా వారిది మాట మార్చే, మడప తిప్పే వంశం కదా!
v పంచుమర్తి అనురాధ     : సీఎం జగన్ పిచ్చి పీక్‍కు వెళ్లింది. ఆరు నెలలుగా విశాఖలో ఇన్‍సైడ్ ట్రేడింగ్ జరుగుతోంది.

18.12.2019 : సీఎం 3 రాజధానుల వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం చెలరేగింది. నిరసన ప్రకంపనలు వెల్లువెత్తాయి. రాజధాని రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాజధానిని ఇక్కడ నుంచి తరలిస్తే ఊరుకోం అని చెప్పారు. కోర్టుకు వెళతామన్నారు. ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం అన్నారు.
v  19.12.2019 : బంద్ నిర్వహించి,  రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు.  అప్పుడు రాజధాని కోసం కదిలిన వారంతా.. ఇప్పుడు రాజధాని బంద్‌ను విజయవంతం చేసేందుకు కుటుంబాలతో సహా ఆరేళ్ల బుడతడి నుంచి ఆరు పదులు దాటిన వృద్ధుడి దాకా అందరూ రోడ్డెక్కి కదం తొక్కారు. మండే ఎండలో ఎక్కడికక్కడ రోడ్లకు అడ్డంగా బైఠాయించారు. పురుగుమందు డబ్బాలను చేతపట్టుకొని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలుగుదేశం, సీపీఐ, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు.
 ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని- పరిపాలనను కాదు... అభివృద్ధిని వికేంద్రీకరించాలి
మూడు రాజధానుల మాటఉపసంహరించుకోవాలి.
ప్రాణాలైనా అర్పిస్తాం. అమరావతిని కాపాడుకుంటాం
     మా త్యాగాలకు విలువ లేదా?
 మేం భూములు ఇచ్చింది ప్రభుత్వానికే గానీ పార్టీలకు కాదు
 పార్టీలతో మాకు సంబంధం లేదు. మాది  రాజధాని పార్టీ మాత్రమే.

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి వైపు తీసుకెళ్లే ఉద్దేశంతోనే రాజధానుల ఏర్పాటుపై సీఎం జగన్‌ తన మనసులో మాట చెప్పారు. మూడు రాజధానులు అనేది ఓ ఐడియా.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి :  అమరావతిలో రైతుల భూములను వెనక్కి ఇచ్చేస్తాం. రాజధానిలో భూములు వెనక్కి ఇస్తామని ఎన్నికల ముందే జగన్‌ చెప్పారు.  విశాఖలో ఇప్పటికే భూముల ధరలు పెరిగాయి. మూడు కాకపోతే 33 రాజధానులు పెట్టుకుంటాం.  రాజధానులకు కేంద్రం అనుమతులు, నిధులు అవసరం లేదు.
మంత్రి అవంతి శ్రీనివాస్: అమరావతికీ ఏ ఇబ్బంది ఉండదు.  అమరావతి కూడా రాజధానిగా కొనసాగుతుంది. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటైతే మరింత అభివృద్ధి జరుగుతుంది. మూడు రాజధానులు వలన రాష్ట్రం అంతా ఒకే సారి అభివృద్ధి చెందుతుంది.
పేర్ని నాని:        విశాఖ, అమరావతి, కర్నూలులో మూడు రాజధానులు ఉండొచ్చని మాత్రమే జగన్ అన్నారు.  ఉండొచ్చు అనే మాటకు.. ఉంటుంది అనే దానికి తేడా ఉంది.
ఐవైఆర్‌ కృష్ణారావు : విశాఖనే పూర్తిస్థాయి రాజధాని. హైకోర్టు కర్నూలులో ఉంటుంది.  రాజధాని విషయంలో సీఎం జగన్ ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. శాసనసభ రాజధానిగా అమరావతి అనే తాయిలం చూపి పరిపాలనా రాజధానిని విశాఖకు మార్చడం, ఆపై అమరావతిలో అసెంబ్లీ సమావేశాలను కుదించడం లాంటివి క్రమంగా జరుగుతాయి.
కాంగ్రెస్ – తులసి రెడ్డి: హైకోర్టు కర్నూలులో పెడితే మంచిదే. సచివాలయం, అసెంబ్లీ మాత్రం అమరాతిలోనే కొనసాగాలి.
జనసేన – శివశంకర్ : శాసనసభ, సచివాలయం రెండిటిని విడదీయవద్దు. అవి అమరావతిలోనే ఉండాలి. రాజధాని రైతులకు అండగా ఉంటాం. కమిటి నివేదికని ఆమోదించన తరువాత ఒక నిర్ణయం తీసుకుంటాం.
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు : రాజధానిని అమరావతి నుంచి మార్చడం సాధ్యం కాదు.
సీపీఎం నేత సీహెచ్‌.బాబురావు: నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వకముందే అసెంబ్లీలో సీఎం ప్రకటించడం సరైందికాదు.
సీపీఐ – రామకృష్ణ : రాజధాని అమరావతిలోనే కొనసాగాలి.
విజయవాడ బార్ అసోసియేషన్: ఏపీ రాజధాని, హైకోర్టు అమరావతిలోనే కొనసాగాలి.

20.12.2019: ఏపీ రాజధానిపై అసెంబ్లీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అమరావతి ప్రాంత గ్రామాల్లో వరుసగా మూడోరోజు తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మందడం గ్రామంలో రైతులు మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు మిగతా గ్రామాల్లోని రైతులు తరలివస్తున్నారు. మరోవైపు తుళ్లూరులో మహిళలు వంటావార్పు కార్యక్రమం చేపట్టారు.
మందడం గ్రామంలో జరిగిన మహాధర్నాలో జనసేన పార్టీ నేతలు నాగబాబు, నాదెండ్ల మనోహర్, శివశంకర్ పాల్గొన్నారు.
23.12.2019: రాజధాని గ్రామాల్లో ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. తుళ్లూరులో మహాధర్నా నిర్వహించారు. 5 రోజులుగా 29 గ్రామాలకు చెందిన పెద్దలు, పిల్లలు, మహిళలు అందరూ ఆందోళనలో పాల్గొన్నారు. గ్రామ సచివాలయాలకు నల్ల రంగులు వేశారు. రిలే దీక్షలో పాల్గొన్నారు. మందడం, తుళ్లూరు, వెలగపూడి గ్రామాల్లో రోడ్లపై బైఠాయించి, రోడ్లపైనే వంటా వార్పు చేసి, అక్కడే భోజనాలు చేసి రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపారు. రాజకీయ పార్టీలకు అతీతంగా విద్యార్థులు, వివిధ ప్రజా సంఘాల వారు రైతులకు మద్దతు తెలపడంతోపాటు ధర్నాలో పాల్గొంటున్నారు. 29 గ్రామాల ముఖద్వారాల్లో పోలీసులు ఉండి ఆధార్ కార్డు ఉంటేనే లోపలకు వెళ్లాలి అంటున్నారు.  వెంకటపాలెం వద్ద రైతులు అలాగే ఆపారు. సీడ్ కేపిటల్ యాక్సె స్ రోడ్డులో శాంతియుతంగా ధర్నా చేయబోతుంటే అడ్డుకున్నారు. వందల సంఖ్యలో పోలీసులు మోహరించి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.
23.12.2019 : 25 సంఘాలతో అమరావతి పరిరక్షణ సమితి ఏర్పాటు. అమరావతి రాజధానిగా కొనసాగాలని పోరాటం.

25.12.2019 : రాజధానిలో 9వ రోజు ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. రోజుకో రకంగా వారు నిరసన తెలుపుతున్నారు. మహిళలలో స్పందన తీవ్ర స్థాయిలో ఉంది. ఒక్క వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీల వారు వారిని కలిసి మద్దతు తెలుపుతున్నారు. సీపీఐ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు అమరావతి రాజధానికి మద్దతు పలికారు. సీపీఎం పార్టీ కూడా తెలుపుతోంది. వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు సచివాలయం అమరావతిలో ఉండాలన్న అభిప్రాయం వ్యక్తం చేశాయి. హైకోర్టు కర్నూలులో ఉండాలని బీజేపీ, కాంగ్రెస్ చెబుతున్నాయి.
26.12.2019: 13 జిల్లాల్లో ఐకాసలు ఏర్పడ్డాయి, వారంతా ఉద్యమాలు చేస్తున్నారు -
అప్రకటిత ఎమర్జెన్సీ: కేబినెట్ మీటింగ్ పేరుతో 29 గ్రామాల్లో అప్రకటిత ఎమర్జెన్సీ రాజధాని గ్రామాల్లో వేలాది మంది పోలీసుల మోహరింపు. రాజధాని రైతులు బయటకు రాకుండా పోలీసులు కాపలా-
హైకోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరణ:  అమరావతిలోనే హైకోర్టును కొనసాగించాలని లాయర్లు నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.  అభివృద్ధి వికేంద్రీకరణకు కాదని.. పాలనా వికేంద్రీకరణకు మేం వ్యతిరేకం. రాజధానిలోనే హైకోర్టు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్స్ ఉండాలి. న్యాయపోరాటానికి మేం సిద్ధం.
రాజధాని రైతులు: పోరాట పటిమ చూపించి అమరావతిని నిలబెట్టుకుంటాం. దక్షిణాఫ్రికాని మోడల్‌గా సీఎం జగన్‌ చూపిస్తున్నారు. అక్కడ నిత్యం ఎంత నర మేధం జరుగుతుందో కూడా చెప్పాలి. రైతు కన్నీరు రాష్ట్రానికి అరిష్టం. మా ఉసురు పోసుకోకుండా రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలి.
టీడీపీ నేతల గృహ నిర్బంధం: టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ  బుద్దా వెంకన్న తదితరుల గృహ నిర్బంధం.
గవర్నర్‌ను కలిసిన రాజధాని రైతులు: అమరావతి రైతులు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని వారు వినతిపత్రం సమర్పించారు. తొమ్మిది రోజులుగా రాజధానిలో జరుగుతున్న పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. 175 మంది ఎమ్మెల్యేల సమక్షంలో ఆనాడు అమరావతిని రాజధానిగా అంగీకరించారు.


గుంటూరు, కృష్ణా వైసీపీ ఎమ్మెల్యేల సమావేశం:  అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయాలనేది సీఎం జగన్ లక్ష్యం - ఉపాధి అవకాశాలు కలిపించేందుకు కృషి. తాత్కాలిక నిర్మాణాలకే రూ.5,800 కోట్లు ఖర్చు.  మరో లక్షా 15 వేల కోట్లు ఖర్చు చేయాలి. తక్కువ ఖర్చుతో ఏపీని అభివృద్ధి చేయాలనేది మా ప్రభుత్వ నిర్ణయం. అమరావతిలో నిర్మాణాలన్నీ పూర్తిచేయాలంటే బడ్జెట్ సరిపోదు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. ఆర్థిక వనరులు అడుగంటాయి. రాజధాని కోసం నగరం నిర్మించడం లేదు. వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగదు. విద్యా, వైద్యం, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత. నగరంలోనే రాజధాని. గుంటూరు, కృష్ణా జిల్లాలు అభివృద్ధి పథంలో నడవబోతున్నాయి.
-         పార్థసారథి, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, మల్లాది విష్ణు
మైసూరా రెడ్డి: రాయలసీమ ప్రజలు రాజధాని కోరుకుంటున్నారు. రాజధానిని కోరుకున్న వారికి ఎంగిలి మెతుకులా?  రాజధానిని ముక్కలు చేయాలనుకుంటే రాయలసీమకు న్యాయంగా ఇవ్వాల్సిన వాటా ఇవ్వాలి - మూడు ప్రాంతాలకు సమాన న్యాయం జరగాలి - రాయలసీమకు హైకోర్టు ఇవ్వడం సమానమైన భాగం కాదు - అడగని వాళ్లకు క్యాపిటల్ ఇస్తున్నారు - డబ్బులు లేవనేది అసమర్థ పాలనకు నిదర్శనం -
27.12.2019 : మంత్రి మండలి సమావేశం సందర్బంగా అమరావతి గ్రామాల్లో నిరసన జ్వాలలు. భారీ ఎత్తున ప్రజల నిరసన. 144 సెక్షన్ అమలు. భారీ పోలీస్ బందోబస్తు, పోలీస్ పికెటింగులు, టియర్ గ్యాస్, వాటర్ క్యాన్, అగ్నిమాపక దళాలు – కంచెలు – తీగలను రక్షణగా  అడ్డుపెట్టుకొని మంత్రి మండలి సమావేశం.  మందడం ఉద్రిక్తత నెలకొంది. రైతులను ఇళ్ల మధ్య నుంచి పోలీసులు నెట్టేశారు. మహిళలు కంటనీరు పెట్టుకున్నారు.   ఉద్యమం ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది. తిరుపతి, శ్రీకాకుళం జిల్లాలలో కూడా అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆందోళన చేశారు.
 అమరావతి కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో ఓ గంటపాటు మౌన దీక్ష చేశారు. కన్నా మౌన దీక్షకు పలువురు బీజేపీ నేతలు మద్దతుగా నిలిచారు.
  మంత్రి మండలి సమావేశం: రాజధానిపై అధ్యయనానికి హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (జీసీజీ)ల నివేదికలను ఈ హైపవర్ కమిటీ అధ్యయనం చేస్తుంది. హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చిన తరువాతే రాజధానిపై ప్రకటన. సీఆర్డీఏ పరిధిలోని అవినీతిపై విచారణకు న్యాయనిపుణుల సలహాలు తీసుకుని సమగ్రమైన దర్యాప్తు. రాజధాని ప్రకటనకు ముందు చంద్రబాబు, మాజీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిన భూములపై విచారణ చేయించాలని నిర్ణయం. లోకాయుక్త లేదా సీబీఐ లేదా సీఐడీతో విచారణ–– చంద్రబాబు ప్రభుత్వం నిపుణుడైన శివరామకృష్ణ కమిటీ నివేదికను కాదని..నారాయణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ నే పరిగణనలోకి తీసుకుంది.  

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...