Jan 11, 2020

రాజధాని తరలిపోతుందన్న ఆవేదన

మరణాలు, ఆత్మహత్యలు

31.12.2019 : రాజధాని తరలిపోతుందన్న ఆవేదనతో కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన అక్కినేని ప్రవీణ్ (35) అనే యువకుడు గుండెపో మరణించాడు.
4.1.2020 : రాజధాని గ్రామం దొండపాడుకు చెందిన రైతు,  వైసీపీ వీరాభిమాని  కొమ్మినేని మల్లికార్జునరావు మృతి. రాజధాని అమరావతికి మద్దతుగా 17 రోజులు దీక్షలో పాల్గొన్నారు. రాజధాని మార్పు ప్రకటన వచ్చినప్పటి నుంచి ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. మల్లికార్జునరావు దొండపాడులో తనకున్న ఎకరం ఇరవై సెంట్ల భూమిని ల్యాండ్‌ పూలింగ్‌ కోసం ఇచ్చాడు. వడ్డమాను రెవెన్యూలో ఇంకో నాలుగెకరాల పొలం ఉంది. ధర్నా అనంతరం ఆ పొలం వద్దకు వెళ్లి చూసి ఇంటికి వచ్చాడు. టీవీలో వార్తలు చూస్తూ తమ పొలం ధరలు పూర్తిగా పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. పిల్లల భవిష్యత్‌ కోసం రాజధానికి భూములిచ్చాం. ఇప్పుడీ పరిస్థితి తలెత్తిందని చెప్పాడు. మనం నమ్మి ఓట్లు వేసిన జగన్‌ వలన రోడ్డున పడుతున్నామంటూ హైదరాబాద్‌లో ఉంటున్న పెద్ద కుమారుడు నాగేశ్వరరావుతో ఫోన్‌లో మాట్లాడాడు. అలా మాట్లాడుతుండగానే గుండెపోటు వచ్చింది.  వెంటనే చిన్న కుమారుడు నరేంద్ర గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు. ఆస్పత్రిలో మరోసారి తీవ్రమైన గుండెపోటు రావడంతో మృతి చెందాడు.
5.1.2020 : వెంకటపాలెంలో ఉంటున్న దొండపాడుకు  చెందిన వ్యవసాయ కూలీ ముసులూరి వెంకటేశ్వరరావు (50) గుండెపోటుతో మృతి చెందారు. మందడంలో జరిగిన మహా ధర్నాకు హాజరై మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లాడు. గుండెలో నొప్పిగా ఉందని చెప్పిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయారు. రాజధాని నిర్మాణ పనులు ఆగిపోవడంతో ఎన్టీఆర్‌ సుజల పథకం వాటర్‌ ప్లాంటులో వెంకటేశ్వరరావు పని చేసేవారు. 19 రోజులుగా దీక్షల్లో పాల్గొంటున్న వెంకటేశ్వరరావు రాజధాని తరలిపోతుందన్న మనోవేదనతోనే మృతి చెందాడని భార్య తెలిపింది.
07-01-2020 : తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన గాండ్ల హనుమంతరావు (62), వెలగపూడికి చెందిన కారుమంచి గోపాలరావు(70) గుండెపోటుతో చనిపోయారు. ఈ ఇద్దరూ రాజధాని పరిరక్షణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నవారే. గాండ్ల హనుమంతరావు చివరిసారిగా 5వ తేదీ  తాడికొండ రహదారిపై జరిగిన రిలే దీక్షకు హాజరయ్యారు. రాత్రి భోజనం చేసి పడుకున్న హనుమంతరావు నిద్రలోనే గుండెపోటుకు గురయి చనిపోయారు. కొన్నిరోజులుగా రాజధాని మారుతుందన్న ఆందోళనతో ఆయన ఉన్నట్లుగా ఉద్యమ సహచరులు, కుటుంబ సభ్యులు తెలిపారు.
 వెలగపూడి గ్రామానికి చెందిన కారుమంచి గోపాలరావు(70) అనే రైతు మనవడు ఫణిని 4వ తేదిన  పోలీసులు ఈ కేసులో ఎత్తుకెళ్లారు. ఈ వార్త తెలియగానే గోపాలరావు తీవ్రంగా కలత చెందారు. ఈ క్రమంలోనే గుండెపోటుకు గురయి మరణించారు. ‘‘ఉన్నది మొత్తం ప్రభుత్వానికి ఇచ్చాం. ఇప్పుడేమో ఇలా అయింది’’ అంటూ మథనపడేవాడని, ఇప్పుడు పోలీసుల చర్యతో మరింత కుంగిపోయాడని కుటుంబసభ్యులు వాపోయారు. మన కుటుంబాలు ఎప్పుడైనా పోలీసు స్టేషన్‌ చూసిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఏంటి ఇలాంటి పరిస్థితులు వచ్చాయిఅంటూ రాత్రి ఏడుగంటల ప్రాంతంలో కుప్పకూలిపోయారు.  ఆ తరువాత కొద్దిసేపటికే ప్రాణం పోయింది.
08.01.2020: తాడికొండ మండలం ఐనవోలు గ్రామానికి చెందిన పాలకాయల మాధవ రాజధాని తరలిపోతుందన్న ఆవేదనతో గుండెపోటుతో మృతి చెందారు. ల్యాండ్ పూలింగ్ కు అర ఎకరం పొలం ఇచ్చారు.
09.01.2020: రాజధాని తరలింపుపై మనస్తాపం చెంది  మందడంలో రైతుకూలీ వేమూరి గోపి (20)  ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

--------------------------------------------------------------
ఆత్మహత్యాయత్నం
27-12-2019 : మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ  తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో బొప్పన రమేశ్‌ అనే రైతు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్య యత్నించాడు.  రమేష్‌ రాజధాని కోసం నాలుగు ఎకరాలు పూలింగ్‌కు ఇచ్చారు.
10-01-2020:   రాజధాని తరలింపు వార్తలతో తన భూమికి రేట్లు పడిపోయాయన్న బాధతో తుళ్లూరు రైతు పురుగు మంది తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.  కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన రైతు యలమంచిలి శివ.. రాజధాని ల్యాండ్‌ పూలింగ్‌ సమయంలో భార్య, కుమారుడితో తుళ్లూరు వచ్చి స్థిరపడ్డాడు. రాజధానిలో భవిష్యత్‌ బాగుంటుందన్న ఉద్దేశంతో.. మైలవరంలో కొంత భూమిని అమ్మేసి ప్రభుత్వం రైతులకిచ్చిన ఫ్లాట్లను కొనుగోలు చేశాడు.  సీఎం జగన్‌ మూడు రాజధానుల ప్రకటనతో ఇక్కడ ఫ్లాట్ల ధరలు దారుణంగా పడిపోయాయి. దీంతో  తాను మానసిక క్షోభను భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతికి ఫోన్‌ చేసి చెప్పాడు. ఏబీఎన్‌ సిబ్బంది హుటాహుటిన అతని ఇంటికి వెళ్లే సరికి అప్పటికే శివ అపస్మారక స్థితిలో పడిఉన్నాడు. వెంటనే వారు తమ వాహనంలో ఆయనను తుళ్లూరులోని ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...