Jan 5, 2020

ప్రజా రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్


స్వయం ఆధారిత అభివృద్ధి ప్రాజెక్ట్
v

·       2019 ఫిబ్రవరిలో విడుదలైన జీఓ 50 ప్రకారం అమరావతి నిర్మాణ వ్యయం రూ.55,343 కోట్లు.
·       ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. రాష్ట్ర ప్రభుత్వం 8 ఏళ్ళలో ఖర్చు పెట్టేది కేవలం 6,629 కోట్లు మాత్రమే.
·       సీఆర్డీఏ అప్పుగా 5,971 కోట్లు ఇస్తుంది.
·       వివిధ బ్యాంకుల నుంచి వచ్చే రుణాల అంచనా 37,112 కోట్లు.
·       అమరావతి ప్రాజెక్ట్ మొత్తం ఖర్చు 51, 687కోట్లు మాత్రమే.

 అమరావతిలో ప్రభుత్వ భవిష్యత్ అవసరాల కోసం ఉంచిన భూమి 5,020 ఎకరాలు
v నగరాభివృద్ధికి కేటాయించిన భూమి 3,019 ఎకరాలు
v సింగపూర్ కన్సార్టియంకు కేటాయించిన 1,600 ఎకరాలు
v మొత్తం 8,039 +1600  = 9,639 ఎకరాలు
v ఈ భూమి విలువ లక్షల కోట్ల పైగా పెరుగుతుంది. రాజధాని నిర్మాణాలు పూర్తిగా రాజధాని భూముల డబ్బుతోనే నిర్మించే విధంగా ప్లాన్ చేయబడింది.
v 9,639  ఎకరాలు  కొద్ది కొద్దిగా అమ్మితే ఖర్చంతా తిరిగొస్తుంది
v  ప్రభుత్వ నిధులు రాజధానిలో ఖర్చు చేస్తున్నారనేది వైసీపీ దుష్ప్రచారం మాత్రమే.
v అమరావతి మహానగరంలో అంతర్భాగంగా ప్రభుత్వ పరిపాలన నగరం, న్యాయ నగరం, ఆర్థిక నగరం, విజ్ఞాన నగరం, ఎలక్ట్రానిక్స్ నగరం, ఆరోగ్య నగరం, ఆటల నగరం, మీడియా నగరం, పర్యాటక నగరం మొత్తం 9 నగరాలు అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం.
v అమరావతి ఆర్థిక నగరంగా అభివృద్ధి చెంది ప్రభుత్వానికి ఆదాయ మార్గాలను ఏర్పాటు చేస్తుంది. 13 జిల్లాల యువతకు ఉద్యోగాలు కల్పించగలుగుతుంది.
v ఇక్కడ నుండి వచ్చే ఆదాయం రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధికి ఉపయోగించవచ్చు. రాజధాని వల్ల వికేంద్రీకరణ దెబ్బతింటుందనేది కూడా అబద్దమే. ఆదాయం సమకూర్చే రాజధాని లేకుంటే నిధులు లేక వికేంద్రీకరణ దెబ్బతింటుంది.
v  రాష్ట్ర బడ్జెట్ లో కోల్‌కతా ఆదాయం 76 శాతం,  హైదరాబాద్ ఆదాయం 60 శాతం, ముంబై ఆదాయం 57 శాతం, భువనేశ్వర్ ఆదాయం 56 శాతం, బెంగుళూరు ఆదాయం 40 శాతం, చెన్నై ఆదాయం 39 శాతం ఉంది.
v హైదరాబాద్ ఆదాయంతోనే తెలంగాణ జిల్లాల అభివృద్ధి జరగడం మనం చూస్తూనే ఉన్నాం. వికేంద్రీకరణ పేరుతో వైసీపీ వికేంద్రీకరణకు నిధులు లేకుండా చేస్తోంది.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...