Jan 5, 2020

అమరావతిలోని పేదలకు ఇళ్లు


రాజధానిలోని 29 గ్రామాలలో ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల నిర్మాణం.
45 ఎకరాలు – 8 ప్రాంతాలు – 5,024 ఫ్లాట్లుపీఎంఏవై పథకం కింద  ఏపీ టిడ్కో (Andhra Pradesh Township And Infrastructure Development Corporation). నిర్మాణం. 
అనంతవరం, దొండపాడు, తుళ్లూరు, మందడం, ఐనవోలు, పెనుమాక, నవులూరు, నిడమర్రు గ్రామాల్లో  నాలుగు అంతస్తులలో మొత్తం 5024 ఇళ్ల నిర్మించారు. ఒక్కొ ప్లాట్విలువ రూ.6.60 లక్షలు. రూ.3 లక్షలు సబ్సిడీ. రూ.3 లక్షల వరకూ బ్యాంకు రుణం.
సీఆర్డీఏ సర్వేలో 7,876  కుటుంబాలకు ఇళ్లు లేవని తేలగా, ఇళ్ల కోసం మొత్తం 9 వేల దరఖాస్తులు వచ్చాయి. మిగతా వారికి రెండో విడత ఇళ్ల నిర్మాణం చేపడతామని సిఆర్డిఏ అధికారులు చెప్పారు. 300 .అడుగులు, 365 .అడుగులు, 430 . అడుగుల విస్తీర్ణంలో వీటిని నిర్మించారు.  31 బ్లాకుల్లో 800 చదరపు అడుగుల ఫ్లాట్లు 992, 48 బ్లాకుల్లో 365 చదరపు అడుగుల ఫ్లాట్లు 1536, 78 బ్లాకుల్లో 430 చదరపు అడుగుల ఫ్లాట్లు 2496 నిర్మించారు. జీ+3 భవన సముదాయంలో ఒక్కో అంతస్తుకు 8 ఫ్లాట్ల వంతున ఒక్కొక్క భవన సముదాయానికి 32 ఫ్లాట్లు వస్తాయి.
కాంట్రాక్టర్స్: కెఎంవీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్.

2014 డిసెంబరు 8వ తేదీ నాటికి ఆ గ్రామంలో నివాసం ఉండి, సొంత నివాసగృహం, స్థలం లేకుండా దారిద్యరేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్కార్డు కలిగిన కుటుంబాల వారికి ఈ ఇళ్లు కేటాయిస్తారు.
ఈ ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి అయింది. 2400 ఫ్లాట్లు కూడా లబ్దిదారులకు కేటాయించారు.
రెండోదశ కింద ఉండవల్లి, మందడం, నవులూరు గ్రామాల్లో మరో 2,852 గృహాలను నిర్మించాలన్నది  సీఆర్డీఏ ప్రతిపాదన.  మందడం, నవులూరు గ్రామాల్లో ఎక్కువ దరఖాస్తులు రావడంతో ఆ రెండు గ్రామాల్లో అదనపు గృహాలను మంజూరు చేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది.


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...